Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  అత్యాచారాల పెరుగుదల-దాని నివారణలు అత్యాచారం గురించి విన్న ప్రతిసారి ప్రజలు బాధితురాలు గురించి చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. దోషిని శిక్షించ...

 

అత్యాచారాల పెరుగుదల-దాని నివారణలు


అత్యాచారం గురించి విన్న ప్రతిసారి ప్రజలు బాధితురాలు గురించి చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. దోషిని శిక్షించాలని నినాదాలు చేస్తారు.కాని కొన్ని రోజుల తరువాత వేరే వార్త రాగానే, దీన్ని అందరూ మర్చిపోతారు. అత్యాచారం(రేప్) ఘోరమైన, నీచమైన అపరాధం. ఇది రోజురోజుకీ పెరుగుతూ పోతుంది. సంఘ సంస్కర్తలు దీన్ని తగ్గించాలని చాలా దీర్ఘంగా ఉపాయాలు అన్వేషిస్తున్నారు. కాని ఎలాంటి పరివర్తన కలగడం లేదు.

 

ఏదైనా నేరాన్ని ఆపడానికి దాని మూలాధారం ఏమిటో కనుక్కోవడం అవసరం. అది తెలుసుకుని దాన్ని నివారించటానికి నిజాయితిగా ప్రయత్నించాలి.

 

దీన్ని పరిష్కరించేటప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకూడదు. అలా చేసినచో దీని పరిష్కారం ఎన్నటికీ లభించదు. పరిష్కారాన్ని అన్వేషించడంలో ఎంత ఎక్కువ సమయం  తీసుకోబడుతుందో, అది అంతే పెరుగుతూ పోతుంది.

 

గణాంకాలు 

భారతీయ ప్రభుత్వం ద్వారా తాజాగా వెలువడిన గణాంకం ప్రకారం, ప్రతి 20 నిమిషాలకు భారత దేశంలో ఒక అత్యాచారం (మానభంగం) జరుగుతుంది. మానభంగం జరిగిన ప్రతి ముగ్గురిలో ఒక పిల్ల ఉంటుంది అని 2011లో NCRB(data from the National Crime Records Bureau)గణాంకం తెలియజేస్తుంది.U.S. Department of Justice's National Crime Victimization Survey– ప్రకారం ప్రతి సంవత్సరం అమెరికాలో  దాదాపు 207,754 మానభంగాలు (12 లేదా కాస్త ఎక్కువ వయసుగలవారిపై) జరుగుతున్నాయి.అమెరికాలోప్రతి రెండు నిమిషాలకు ఒక మానభంగం జరుగుతుంది.[2]

 

అమెరికాలో 6 స్త్రీలలో ఒక స్త్రీ పై మానభంగా ప్రయత్నమో లేదా మానభంగమో జరుగుతుంది. (14.8% మానభంగాలు, 2.8% మానభంగ ప్రయత్నాలు). (U.S. Department of Justice. National Crime Victimization Survey. 2006-2010). [3]

 

స్త్రీల రక్షణ గురించి ఖుర్ఆన్ లో

“ఓ ప్రవక్తా! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్‌ క్షమించేవాడు, కనికరించేవాడు.” (ఖుర్ఆన్,సూరా అహజాబ్ 33:59)

 

“....దాగివున్న తమ  అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్‌ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (ఖుర్ఆన్, సూరా నూర్ 24:31)

 

“మీరు (అల్లాహ్‌కు) భయపడేవారే అయితే సుతిమెత్తని శైలిలో మాట్లాడకండి. దాని వల్ల  హృదయంలో (దురాలోచనా) రోగం  ఉన్నవాడు  అత్యాశకు పోవచ్చు. కనుక మాట్లాడితే  ఉత్తమ రీతిలోనే మాట్లాడండి.” (ఖుర్ఆన్, సూరా అహజాబ్ 33:32)

 

“ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా ఎదురుగా వారి   కాళ్లు చేతులు ఖండించబడాలి.   లేదా  వారిని దేశం నుంచి  బహిష్కరించాలి. ఇది  ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం.  పరలోకంలో వారికి  విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:33)

 

హదీస్

వాయిల్ ఇబ్న్ హుజ్ర్ ఉల్లేఖనం ప్రకారం: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం కాలంలో ఒక స్త్రీ నమాజ్ కోసం బయటవెళ్లినప్పుడు, ఒకతను ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ తరువాత ఆమె అరుపులకు అతను పారిపోయాడు. కొద్ది సేపటికి ఒక మనిషి అటు వచ్చాడు. అత్యాచారానికి గురి అయిన స్త్రీ అతనితో జరిగినదంతా చెప్పింది.ఆ తరువాత కొందరు వలస దారులు అటు వచ్చారు. బాధితురాలు వారితో కూడా జరిగింది చెప్పింది. ఆ వలసదారులు అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఆమె వద్దకు తీసుకువచ్చారు.

 

ఆమె ఇతనే అని అతన్ని గుర్తుపట్టింది. అప్పుడు అతన్ని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం దగ్గరికి తీసుకువచ్చారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం తన తీర్పును వెల్లడించబోతుండగా, ఆ వ్యక్తి ‘ఔను, ఆమెపై అత్యాచారం చేసింది నేనే’ అని ఒప్పుకున్నాడు.

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆ బాధితురాలితో ఇలా అన్నారు: “నువ్వు వెళ్ళిపో. అల్లాహ్ నిన్ను క్షమించాడు.” దాని తరువాత ఆ అత్యాచారి గురించి ఇలా అన్నారు: “అతణ్ణి రాళ్ళతో కొట్టి చంపేయండి.” ఇంకా ఇలా అన్నారు, “అతను నిజాయితిగా తన తప్పును ఒప్పుకుని, క్షమాపణ వేడుకున్నాడు. ఒకవేళ ఇదే విధంగా మదీనా వాసులు కూడా క్షమాపణ కోరి ఉంటే, వారి క్షమాపణ మన్నించబడేది.” (సునన్ అబూ దావూద్ 4366) (అరబిక్ 4379)

 

ప్రస్తుత స్థితి

ప్రస్తుత స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుదాం. ఈ విధంగా మన స్త్రీలను– సమాజపు ఆణిముత్యాలను- గౌరవిద్దాం.

 

  1. వాతావరణం: ప్రస్తుత వాతావరణంలో స్త్రీ పురుషులు చాలా కలిసిమెలిసి ఉంటున్నారు. ఒకరికి ఇంకొకరి రహస్యాలు సయితం తెలిసిపోతున్నాయి. ఇంత దగ్గరవడం పాపాలకు దారి తీస్తుంది. ప్రస్తుత సమాజంలో ఆడ-మగ స్నేహాలు సర్వసామాన్యమైపోయాయి.ప్రకృతి పరంగా పురుషునికి లైంగిక వాంఛ స్త్రీ కన్నా ఎక్కువ ఉంటుంది. పురుషుడు స్త్రీ వైపు తొందరగా ఆకర్షితుడవుతాడు. దీని వల్ల నేరం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మనకు కీడు కలుగజేసే విషయాలకు మనము దూరంగా ఉండాలి.
     
  2. విద్య: మన విద్యా విధానం చాల అధ్వాన్నంగా ఉంది. ఇందులో మహిళ నిరాడంబరంగా, సచ్చీలంగా ఉండాలన్నా కుదరదు. స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వివక్షత లేదు. అత్యాచారాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
     
  3. ప్రవర్తన: ఇలాంటి నేరాలు సమాజంలో సర్వసామాన్యమై పోవడం వల్ల, దీని పట్ల ఉండాల్సిన విరక్తి, భయం ప్రజల్లో సన్నగిల్లింది.
     
  4. వయసు మీరాక వివాహాలు చేయడం: ఈ రోజుల్లో స్వేచ్ఛ పేరుతో పెళ్ళిళ్ళు వయసు దాటాక చేయడం ఓ రివాజు అయిపొయింది. ఇలాంటి పరిస్థితిలో స్త్రీలైనా, పురుషులైనా తమ మనోవాంఛలను అణచుకోలేక, ఈ తప్పుడు కార్యానికి పాల్పడుతున్నారు.

     
  5. అశ్లీల చిత్రాలు: ఇలాంటి వాటి వల్ల యువకుల్లోని సామర్ధ్యత దెబ్బతింటుంది. ఇది ఎంత సాధారణమై పోయిందంటే, ఓ విద్యార్ధి/విద్యార్థిని తన జ్ఞానాన్ని పెంపొందించుకునే నిమిత్తం గూగుల్ పై పరిశోధన చేయడానికి వెళితే, అశ్లీల చిత్రాల వెబ్ సైట్ లు అనేకం కనిపిస్తాయి. ఇలా ఈ వెబ్ సైట్ లు నడిపేవారు, యువతను చాలా తేలిగ్గా తమ వైపుకు మరల్చుకుంటున్నారు. ఇలాంటి వెబ్ సైట్ లను మూసివేయడం, నిషేధించడం ఒకటే దీనికి పరిష్కారం.
     
  6. వస్త్రధారణ: నేటి వస్త్రధారణ, ప్రత్యేకంగా స్త్రీలది చాలా ఘోరంగా తయారయింది. ఒక్కోసారి శరీరపు సగభాగం, అందులోనూ మర్మాంగాలు ఇతరులకు కనిపించేలా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో పురుషులు స్త్రీల వైపుకు ఆకర్షితులవడంలో ఆశ్చర్యం లేదు. దీనివల్ల మానభంగాలు పెరుగుతూ పోతాయి.
     
  7. శిక్ష: నేరానితో పోలిస్తే, ఈ నేరానికి ఇవ్వబడే శిక్ష చాలా చిన్నది. మన చట్టంలో ఉన్న లోపాల వల్ల, తీర్పువెలువడి ముద్దాయి శిక్షించబడే వరకు సంవత్సరాలు గడచిపోతాయి. అంతవరకూ నేరస్థుడు సమాజంలో ఎలాంటి భయం లేకుండా తిరుగుతూ ఉంటాడు. పాశ్చాత్య దేశాల్లో నేరస్థునికి ఇవ్వబడే శిక్ష చాలా స్వల్పం. దీనివల్ల అతడు మళ్ళి మానభంగానికి పాల్పడడానికి భయపడడు.
     
  8. నిబంధనలు/ ప్రమాణములు: ప్రజలు నైతిక విలువలను మరచిపోయారు. వారికి మంచి చెడుల బేధం కూడా తెలియడం లేదు. నేటి పిల్లలు అర్ధరాత్రి దాకా విందుల్లో, వినోదాల్లో గడుపుతున్నారు.అయిననూ వారి తల్లిదండ్రులు వారిని వారించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మానభంగాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నేటి సమాజంలో ప్రమాణాలు, నైతిక విలువలు పడిపోయాయి. చెడును చెడుగా భావించటం లేదు.[4]

 

ఇస్లాంలో అత్యాచారం ఘోరమైన నేరం

“అరబీ పదం ‘ఇఘ్ తిసాబ్’ అంటే, ఎవరినైనా బలవంతంగా తీసుకోవడం. నేటి సమాజంలో ప్రత్యేకంగా స్త్రీపై జరిగే అత్యాచారానికి ఈ పదాన్ని వాడుతున్నారు.

 

ఇస్లాం మానభంగాన్ని హరాం (నిషేధించింది) చేసింది. దీనికి కఠినాతి కఠినమైన శిక్ష సూచించింది. ఇస్లామీయ చట్టం మహిళను పూర్తిగా రక్షిస్తుంది. ఇస్లాం స్త్రీలకు నీతిబాహ్యమైన వస్త్రధారణను నిషేధించింది. స్త్రీ మహరం (పెళ్లి చేసుకోలేని వ్యక్తి)లేకుండా ప్రయాణించడాన్ని కూడా నిషేధించింది.మహరం కాని వ్యక్తితో చేయి కలపడాన్ని కూడా నిషేధించింది. ఇస్లాం యువతీ యువకులను తొందరగా పెళ్లి చేసుకోమని ప్రోత్సహిస్తుంది. ఇస్లాంలోని ఈ నిబంధనల వల్ల మానభంగానికి దారి తీసేదారులన్నీ మూసుకుపోతాయి. అందుకే ఇస్లామీయ దేశాలలో మానభంగాలు చాలా తక్కువగా, అదీ ఎప్పుడో ఒకసారి జరుగుతాయి. ఇస్లాం మానభంగానికి మరియు వ్యభిచారానికి ఒకే శిక్ష విధిస్తుంది. అదేమిటంటే, పెళ్లి అయిన వారికి రాళ్ళతో కొట్టి చంపాలి, పెళ్లి కాని వారికి వంద కొరడా దెబ్బలు కొట్టి, ఒక సంవత్సరం పాటు బహిష్కరించాలి.

 

సూచన: శిక్షను విధించేవాడు ఆ ప్రదేశానికి చెందిన నిర్ణయాధికారి అయిఉండాలి లేదా అక్కడి చట్టం ప్రకారం అమలు జరగాలి. ఎవరంటే వారు చట్టాన్ని తమ చేతుల్లో తీసుకోరాదు.

 

ఖుర్ఆన్ ప్రకారం అత్యాచారానికి పాల్పడిన వానికి మరణశిక్ష

إِنَّمَا جَزَاءُ الَّذِينَ يُحَارِبُونَ اللَّهَ وَرَسُولَهُ وَيَسْعَوْنَ فِي الْأَرْضِ فَسَادًا أَن يُقَتَّلُوا أَوْ يُصَلَّبُوا أَوْ تُقَطَّعَ أَيْدِيهِمْ وَأَرْجُلُهُم مِّنْ خِلَافٍ أَوْ يُنفَوْا مِنَ الْأَرْضِ ۚذَٰلِكَ لَهُمْ خِزْيٌ فِي الدُّنْيَا ۖوَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ

 

“ఎవరు అల్లాహ్‌తోనూ, ఆయన ప్రవక్తతోనూ పోరాడుతారో, భూమిలో కల్లోలాన్ని రేకెత్తిస్తూ తిరుగుతుంటారో వారు వధించబడాలి. లేదా ఉరి కంబం ఎక్కించబడాలి. లేదా వ్యతిరేకంగా వారి   కాళ్లు చేతులు నరికించబడాలి.లేదా వారిని దేశం నుంచి బహిష్కరించాలి. ఇది ఇహలోకంలో వారికి కలగవలసిన పరాభవం. పరలోకంలో వారికి విధించబడే శిక్ష (ఇంతకన్నా) ఘోరంగా ఉంటుంది.” (ఖుర్ఆన్, సూరా అహజాబ్5:33)

 

అత్యాచారంపై ముస్లిమేతరుల వీక్షణ

మాటలు కాదు, చేతల ద్వారా నిరూపించే సమయం వచ్చేసింది అని కాంగ్రేస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలని కూడా ఆమె అన్నారు.

http://zeenews.india.com/news/nation/delhi-rape-case-as-it-happened_843357.html

  

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మరణ శిక్ష విధించాలని BJP డిమాండు చేసింది. లోక్ సభా అధ్యక్షురాలు సుష్మా స్వరాజ్ కూడా మరణ శిక్ష విధించాలని అన్నారు. చిన్న పిల్లల్ని మానభంగం చేసిన వారికి ఉరి శిక్ష విధించాలని రాజ్య సభ సభ్యులు కోరారు.

http://articles.timesofindia.indiatimes.com/2013-04-23/india/38761893_1_child-rapists-capital-punishment-death-penalty

http://news.in.msn.com/national/delhi-gang-rape-sushma-swaraj-demands-capital-punishment-for-rapists

http://www.dnaindia.com/india/1778880/report-delhi-gang-rape-sushma-swaraj-demands-capital-punishment-for-rapists

 

ది నేషనల్ కమిషన్ ఫర్ వుమెన్ తొమ్మిది విభాగాల్లో సమీక్ష అవసరం అని గుర్తించింది. అవి

అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి మరణ శిక్ష విధించాలి.

http://www.legalindia.in/rape-laws-in-india

 

కఠినాతి కఠినమైన శిక్ష విధించాలనే బిల్లును భారతదేశ పార్లమెంట్ లో జారీ చేసింది. (కరుణా నంది, సుప్రిమ్ కోర్ట్

లాయర్)

http://www.bbc.co.uk/news/world-asia-india-21950197

  న్యూ ఇయర్ – లైఫ్ టైమ్ కౌంట్ డౌన్ మనిషికి లభించే ప్రతీ నిమిషం న్యూ ఇయరే! మనిషికి సంబంధించిన రెండే రెండు ముఖ్య ఘట్టాలు ఒకటి పుట్టటమైతే.. రెం...


 న్యూ ఇయర్ – లైఫ్ టైమ్ కౌంట్ డౌన్

మనిషికి లభించే ప్రతీ నిమిషం న్యూ ఇయరే! మనిషికి సంబంధించిన రెండే రెండు ముఖ్య ఘట్టాలు ఒకటి పుట్టటమైతే.. రెండు మరణించటం. మనిషి పుట్టిన క్షణం నుండే అతని మరణానికి కౌంట్ డౌన్ మొదలైపోతుంది. ఆ కౌంట్ డౌన్ ఎప్పుడైనా పూర్తైపోవొచ్చు. అది పూర్తయిన క్షణమే ఈ భూమిపై అతని చివరి క్షణం అవుతుంది. కాబట్టి న్యూ ఇయర్ లోకి అడుగు పెట్టటం అంటే.. లైఫ్ టైమ్ తాలూకు కౌంట్ డౌన్ పూర్తవటానికి ముందుకు సాగుతున్నట్టే లెక్క.
డిసెంబర్ 31 st నుండి జనవరి 1 కి క్యాలండర్ మారినంత మాత్రానా లైఫ్ లో అంతా మంచి జరిగిపోదని.. ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్నంత మాత్రానా మనిషి విధి వ్రాత మారిపోదన్న విషయం 31 st నైట్ సంబరాలు జరుపుకునేవారికీ.. కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునే వారికీ.. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునేవారందరికీ బాగా తెలిసిన విషయమే.
వాస్తవం ఇదైనప్పుడు న్యూ ఇయర్ సంబరాలు జరుపుకోటంలో లాజిక్ ఏమిటో ఎప్పటికీ అర్థం కాని విషయమే!
వ్యక్తుల జీవితాలలో, సమాజంలో మార్పు అన్నది క్యాలండర్ డేటు మారటాన్ని బట్టో కొత్త సంవత్సరాల్లో అడుగుపెట్టటాన్ని బట్టో ఏమీ సాధ్యం కాదు.
కాలాలు మారినంత మాత్రానా మనిషి విధి వ్రాత మారటం అంటూ ఏమీ జరగదు మనిషిపై వచ్చి పడే నష్టాలూ తప్పిపోవు.. కేవలం అతని వ్యక్తిగత ప్రవర్తన మార్చుకోనంత వరకూ.. సామాజిక సంస్కరణ చెయ్యనంత వరకూ.
ఇదే విషయం ఈ క్రింది విధంగా చెప్పబడింది..
{"కాలం సాక్షిగా నిస్సందేహంగా మానవుడు పెద్ద నష్టానికి గురై ఉన్నాడు. విశ్వసించి సత్కార్యాలు చేస్తూ ఉండేవారు, ఒకరికొకరు సత్యోపదేశం, సహాన బోధ చేసుకునేవారు తప్ప" - 103: 1-3}

  దైవవిధిపై విశ్వాసం ఇది విశ్వాసపు మూలస్తంభాలలో ఒకటి. అల్లాహ్ కు తెలియకుండా ఏ ఒక్క పనీ జరగదని ప్రతి ముస్లిం విశ్వసించాలి .   విధివ్రాత   ఇస్...

 

దైవవిధిపై విశ్వాసం


ఇది విశ్వాసపు మూలస్తంభాలలో ఒకటి. అల్లాహ్ కు తెలియకుండా ఏ ఒక్క పనీ జరగదని ప్రతి ముస్లిం విశ్వసించాలి .

 


విధివ్రాత 

ఇస్లాంలో విధివ్రాతకు చాల ప్రాముఖ్యత ఉంది.  అల్లాహ్ కు తెలియకుండా ఏ ఒక్క పనీ జరగదని విశ్వసించాలి . మానవుడు చేసినదీ, చేస్తున్నదీ, చేయబోయేది అన్నీ అల్లాహ్ కు తెలుసు. మన చేష్టల గురించీ వాటి పర్యవసానాల గురించీ అన్నీ అల్లాహ్ కు తెలుసు. విధివ్రాత అంతా అల్లాహ్ చేతుల్లో ఉంది కాని మానవుడు కుడా తన కార్యకలాపాలతో విథివ్రాత కు కట్టుబడి ఉన్నాడు. మంచి ఉద్దేశం దురుద్దేశం కుడా మనిషి క్రియ కర్తల్లోనే వస్తుంది.

 

అల్లాహ్ ఆజ్ఞ

విదివ్రాతపై విశ్వసించడం ముస్లిం జీవితాన్ని సార్ధకం చేస్తుంది. ఒక ముస్లిం జీవితంలో(మంచి,చెడు) ఏది జరిగినా అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే జరిగిందని విశ్వసిస్తాడు.కాని చెడు జరిగినంత మాత్రాన అల్లాహ్ పై నింద వేయకూడదు, మనిషి తో ఏదైనా చెడు జరిగితే దాన్ని అధిగమించడానికి అల్లాహ్ ను ఇంకా ఎక్కువగా ఆరాధిస్తాడు, తన చేష్టల ద్వారా అల్లాహ్ ను సంతోషపరిచే ప్రయత్నం చేస్తాడు మరియు అల్లాహ్ చేయమన్న వాటిని చేస్తూ, వదలమన్న వాటిని  వదలడానికి ప్రయత్నిస్తాడు.దైవాజ్ఞలను శిరసావహిస్తూ పుణ్యకర్యాలు చేస్తూ జీవిస్తాడు ప్రతీ దానికి స్వాభావిక అభిప్రాయాలకు లోనై వివిథ వాదాలకు గురికాడు  దీనినే దైవవిధిపై  ఈమాన్ (విశ్వాసం)అంటారు.  

  అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.   అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ...

 

అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి


ఇది అంతిమ దినమని ఎందుకు పిలవబడిందంటే, దీని తర్వాత ఇక మరే దినమూ ఉండదు.

 


అంతిమ దినాన్ని మనం ఏ విధంగా నమ్మాలి? 

అంతిమదినాన్ని విశ్వసించడమంటే మానవజాతి మరలా ప్రాణాలతో లేపబడుతుందని మరియు వారి కర్మలకు ప్రతిఫలం ప్రసాదించబడుతుందని విశ్వసించడం. అంతిమ దినం గురించి ఖుర్ఆన్ లో మరియు సున్నతులలో తెలుపబడిన ప్రతి దాన్నీ మనం విశ్వసించడం.

 

అంతిమదినం గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ చాలా విపులంగా వివరించాడు, ఉదాహరణకు – “ఓ మానవులారా! మీ ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, ఆ అంతిమ ఘడియ యొక్క భూకంపం ఎంతో భయంకరమైనది. ఆ రోజు ఆవరించినపుడు, పాలిచ్చే ప్రతి స్త్రీ తన చంటి బిడ్డను సైతం మరచిపోవడాన్ని, ప్రతి గర్భవతి తన గర్భాన్ని కోల్పోవటాన్ని నీవు చూస్తావు. మరియు మానవులందరినీ ఏదో మైకంలో ఉన్నట్లు నీవు చూస్తావు, కానీ (నిజానికి) వారు (మద్యం) త్రాగి ఉండరు. కానీ అల్లాహ్ శిక్షయే అంత తీవ్రంగా ఉంటుంది.”ఖుర్ఆన్ సూరా హజ్ 221-2

 

సమాధి అవస్థ

మరణం తర్వాతి మొదటి మజిలీయే సమాధి అవస్థ. మృతదేహం భూమిలో సమాధి చేయబడిందా లేక సముద్రంలో విసిరి వేయబడిందా లేక సింహం తిన్నదా లేక గాలిలో కలిపి వేయబడిందా అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనబోయే కఠిన పరీక్ష ఇది. ప్రతి ఒక్కరూ ఈ అవస్థను ఎదుర్కొనవలసి ఉంటుంది మరియు ప్రతి ఒక్కరూ మూడు విషయాల గురించి ప్రశ్నించబడతారు;

 

1.    నీ ప్రభువు ఎవరు ?

2.    నీ ధర్మం ఏది ?

3.    నీ ప్రవక్త ఎవరు ?

 

విశ్వాసి ఇలా జవాబిస్తాడు, ‘నా ప్రభువు అల్లాహ్, నా ధర్మం ఇస్లాం మరియు నా ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)’. అప్పుడు ‘ఈ దాసుడు సత్యం పలికాడు’అని ఒక దివ్యవాణి ఆకాశాలలో నుండి ధృవీకరిస్తుంది.

 

అపుడు అతని కంటిచూపు చూడ గలిగేయంత వరకు అతని సమాధి విశాలం అవుతుంది, స్వర్గాలంకరణలు అమర్చబడతాయి. స్వర్గంలోనికి ఒక ద్వారం తెరవబడి,సువాసనలు మరియు శుభాలు స్వర్గం నుండి అక్కడికి వస్తుంటాయి. ఈ స్థితి నిస్సందేహంగా అతని ప్రాపంచిక స్థితి కంటే ఎంతో మేలైనది.

 

అతని ప్రభువు గురించి, ధర్మం గురించి మరియు ప్రవక్త గురించి ప్రశ్నించ బడినపుడు, అవిశ్వాసి మరియు కపట విశ్వాసి ఇలా జవాబిస్తాడు, ‘ఓహ్, ఓహ్, నాకు తెలీదు. ప్రజలు ఏదో అనడం విన్నాను మరియు నేను కూడా అలాగే అన్నాను.’

 

అపుడు ఒక పెద్ద ఇనుప సుత్తితో కొట్టటం జరుగుతుంది అప్పుడు ఆ అవిశ్వాసి బాధపడగా, అతడు పెద్దగా అరిచే అరుపు, జిన్నాతులు మరియు మానవులు తప్ప ప్రతిదీ వింటుంది – ఎందుకంటే ఒకవేళ వారే గనుక వినగలిగితే, వారు చెవిటి వాళ్ళుగా మారిపోతారు. ఆ ఇనుప సుత్తి ఎంత పెద్దగా ఉంటుందంటే ప్రజలందరూ కలిసి ఎత్తడానికి ప్రయత్నించినా, వారు దానిని పైకెత్తలేరు.

 

సమాధి అవస్థను విశ్వసించడం తప్పని సరి. ఎందుకంటే దానిని విశ్వసించడమనేది అంతిమ దినంపై విశ్వాసంలోని ఒక భాగం.

 

నమాజులో మనం ఇలా అర్థిస్తాము,

నరకాగ్ని యాతన నుండి మరియు సమాధి యాతన నుండి మేము అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాము.

 

కాబట్టి, ఖుర్ఆన్ మరియు సున్నతుల నుండి సమాధి యాతన ఋజువు చేయబడింది. దానిని విశ్వసించడమనేది అంతిమ దినాన్ని విశ్వసించడంలోని ఒక భాగం.

 

పునరుత్థానం

మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుదినమున మన శరీరాలను నగ్నపాదాలతో, నగ్నంగా మరియు సున్తి చేయబడని స్థితిలో లేపుతాడు.

 

నగ్నపాదాలతో:ఎలాంటి చెప్పులు, బూట్లు లేకుండా అంటే పాదాలపై పాదరక్షల వంటి ఎలాంటి ఆచ్ఛాదనా లేకుండా.

 

నగ్నంగా:ఎలాంటి దుస్తులూ లేకుండా

 

సున్తి చేయబడని స్థితిలో:అంటే ఒడుగులు చేయబడకుండా

 

కొన్ని హదీథులలో ‘బుహ్మాన్’అని పేర్కొనబడింది – అంటే ఎలాంటి సంపద లేకుండా. అక్కడ ప్రతి ఒక్కరూ తమ కర్మలను మాత్రమే కలిగి ఉంటారు.

 

పునరుత్థానం అంటే తిరిగి లేపబడటం, అంతేగాని కొత్తగా మరలా సృష్టించబడటం కాదు. దీని గురించి ఖుర్ఆన్ లోని అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “వారికి చెప్పు: ‘వాటిని తొలిసారి సృష్టించినవాడే (తిరిగి) బ్రతికిస్తాడు. ఆయన అన్ని రకాల సృష్టి ప్రక్రియను గురించి క్షుణ్ణంగా తెలిసినవాడు’”ఖుర్ఆన్, సూరా యాసీన్36:79

 

ప్రజల కర్మల పత్రం

అల్లాహ్ అంతిమ దినాన్ని ‘యౌముల్ హిసాబ్’అంటే లెక్క చూడబడే దినం అనే పేరుతో పిలిచినాడు. ఎందుకంటే, అది మానవజాతి కర్మల లెక్కలు చూడబడే దినం.

 

అవిశ్వాసులు తమ పాపకార్యాలను ఒప్పుకుంటారు. వారి కర్మల ఫలితంగా వారు అవమానానికి గురి చేయబడతారు. అపుడు సాక్షులు ఇలా సాక్ష్యమిస్తారు, “తమ ప్రభువుపై అసత్యాలను కల్పించిన వారు వీళ్ళే”ఖుర్ఆన్, సూరా హూద్11:18.

 

కాబట్టి, లెక్క తీసుకోవడంలో విశ్వాసి మరియు అవిశ్వాసికి మధ్య చూపబడే ఈ భేదాన్ని చూడండి. 

 

త్రాసు

“ఆ రోజు బరువు (తూకం) కూడా సత్యమే.”ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్  7:8

 

“మేము ప్రళయదినాన న్యాయంగా తూచే త్రాసులను నెలకొల్పుతాం”ఖుర్ఆన్, సూరా అంబియా21:47

 

“కనుక ఎవడు అణువంత మాత్రం సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణువంత మాత్రం దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.”ఖుర్ఆన్, సూరా జిల్ జాల్ 99:7-8

 

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు, “రెండు వచనాలు అల్లాహ్ కు చాలా ఇష్టమైనవి, నాలుకపై తేలికగా పలుకబడతాయి, కానీ త్రాసులో చాలా బరువుగా ఉంటాయి,

 

సుబ్ హానల్లాహి వబి హమ్దిహి, సుబ్ హానల్లాహిల్ అజీమ్.”(సహీహ్ బుఖారీ)

 

మరియు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హదీసులోని, “త్రాసు పై బరువుగా ఉంటాయి.” సహీహ్ బుఖారీ

 

కర్మ పత్రాల పంపిణీ

కర్మల పత్రాలు ప్రజలకు ఇవ్వబడతాయి మరియు అవి ఇవ్వబడే పద్ధతిలో భేదం ఉంటుంది. కొందరికి అవి వారి కుడిచేతులలో ఇవ్వబడతాయి మరియు మరికొందరికి అవి వారి ఎడమ చేతులలో ఇవ్వబడతాయి. ఖుర్ఆన్ లోని సూరతుల్ హాఖ్ఖహ్ లో అల్లాహ్ దీని గురించి ఇలా తెలుపుతున్నాడు,

 

ఇక ఎవరి కర్మల చిట్టా అతని ఎడమ చేతికి ఇవ్వబడుతుందో, అతను ఇలా అంటాడు: ‘అయ్యో, నా కర్మల పత్రం నాకివ్వబడకుండా ఉంటే ఎంత బావుండేది. అయ్యో, నా చావే (నా వ్యవహారాన్ని) తేల్చేసి ఉంటే బాగుండేదే. నా ధనం నాకే మాత్రం అక్కరకు రాలేదు. నా అధికారం నా నుండి చేజారి పోయిందే’. (అని బాధపడతాడు) ఖుర్ఆన్,  సూరా అల్ హాఖ్ఖహ్ 69: 25-29

 

అల్ హౌద్ (ప్రత్యేక సరస్సు)

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సరస్సు చాలా విశాలమైంది – ఓ అల్లాహ్!దానిలో నుండి త్రాగే వారిలో మమ్మల్ని కూడా చేర్చు గాక. దాని పొడవు మరియు వెడల్పు ఒక నెల ప్రయాణానికి సమానమైన దూరంలో ఉంటుంది. దాని నీరు పాల కంటే ఎక్కువ తెల్లగా, తేనె కంటే ఎక్కువ తియ్యగా మరియు కస్తూరి సువాసన కంటే ఎక్కువ సువాసనతో ఉంటాయి. ఎవరైతే ఈ సరస్సు నుండి త్రాగుతారో, వారికి ఇక ఎన్నడూ దాహం వేయదు. ఈ సరస్సు యొక్క నీరు అల్ కౌసర్ నుండి వస్తుంది. అల్ కౌసర్ అనేది స్వర్గంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇవ్వబడే ఒక నది. దీని యొక్క రెండు పాయలు అల్ హౌద్ సరస్సులోనికి వస్తాయి. అల్ హౌద్ ఎల్లప్పుడూ నిండుగా ఉంటుంది. విశ్వాసులు దాని వద్దకు వస్తుంటారు మరియు దాని నీరు త్రాగుతూ ఉంటారు. తీర్పు దినం నాడు వేడి మరియు అలసట వలన ప్రజలు బాధపడుతూ ఉండే సమయంలో, ఈ హౌద్ ప్రజలు సమావేశపరచబడే చోట ఉంటుంది. అల్లాహ్ అనుమతించిన వారు ఇందులో నుండి త్రాగుతారు మరియు ఇక ఎన్నడూ వారికి దాహం వేయదు.

 

షఫా (విముక్తి, మోక్షం)

షఫా రెండు రకాలు:

మొదటిది – కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు మాత్రమే ప్రత్యేకించబడింది.

 

రెండోది – మొత్తం ప్రవక్తలు, సిద్ధీఖులు, షహీదులు మరియు సజ్జనులందరి కొరకు ప్రత్యేకించబడిన సాధారణ షఫా.

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ప్రత్యేకించబడిన షఫా – ‘అష్షఫా అతుల్ ఉధమా’. అది లెక్క ప్రారంభించేందుకు ఉద్దేశించబడింది. తీర్పుదినం నాడు, తమ తలలపై సూర్యుడు ఒక ‘మీలు’దూరమంత దగ్గరలో ఉండటం, అలా 50,000 యేళ్ళ నుండి నిలుచొని ఉండటం వలన ప్రజలను అవస్త, వేదన మరియు బాధలు చుట్టుముట్టి ఉంటాయి. వారిలో కొందరు చెమటలో మునిగి ఉంటారు.

 

అపుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ వద్ద తీర్పుదినాన్ని ప్రారంభించిమని అల్లహ్ నేర్పే ప్రార్థనతో అర్థిస్తారు. ఆయన అర్థింపును స్వీకరించి, అల్లాహ్ తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి దిగుతాడు. ఈ విధమైన సిఫారసును ‘అష్షఫా అతుల్ ఉధమా’(గొప్ప సిఫారసు) అంటారు. ఇంతటి గొప్ప సిఫారసు చేసే హక్కే అల్లాహ్ తెలిపిన క్రింది వచనాలలోని ‘అల్ మఖామ్ అల్ మహ్మూద్’, “త్వరలోనే నీ ప్రభువు నిన్నుమఖామె మహ్మూద్ (ప్రశంసాత్మక స్థానానికి) చేరుస్తాడు”ఖుర్ఆన్, సూరా బనీ ఇస్రాయీల్17:79

 

ఆ విధంగా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేస్తారు మరియు తన దాసుల మధ్య తీర్పు చెప్పడానికి అల్లాహ్ దిగి వస్తాడు మరియు వారిని (ఎంతో కాలంగా) నిలబడి ఉండిన బాధ నుండి అల్లాహ్ విముక్తి కల్పిస్తాడు.

 

 “... ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగల వాడెవడు ...”ఖుర్ఆన్, సూరా బఖర 2:255

 

పుల్ సిరాత్ (వంతెన)

పుల్ సిరాత్ అనేది నరకాగ్ని పై నిర్మించబడిన ఒక వంతెన. తమ కర్మలను అనుసరించి ప్రజలు దానిని దాటుతారు;కొందరు రెప్పపాటు కాలంలో చాలా వేగంగా దాటుతారు, కొందరు కాంతి వేగంతో దాటుతారు, మరికొందరు గాలివేగంతో దాటుతారు. ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఎలాంటి ఆలస్యం చేయలేదో, అలాంటి వారు సిరాత్ ను త్వరత్వరగా దాటుతారు మరియు ఎవరైతే సత్యాన్ని స్వీకరించడంలో మరియు దానిని ఆచరించడంలో ఆలస్యం చేస్తారో, అలాంటి వారు సిరాత్ ను చాలా నిదానంగా దాటుతారు. కేవలం విశ్వాసులు మాత్రమే సిరాత్ వంతెనను దాట గలుగుతారు, నరకవాసులు కావటం వలన అవిశ్వాసులు దానిని దాటలేరు – నరకం నుండి కాపాడమని మనం అల్లాహ్ శరణు వేడుకుందాము – దాహంతో బాధ పడుతూ వారు నరకంలోనికి చేరుకుంటారు.

 

స్వర్గం లేక నరకంలోనికి ప్రవేశం

స్వర్గవాసులు స్వర్గంలోనికి మరియు నరకవాసులు నరకంలోనికి చేరుకునే అంతిమ దశ ఇది.

 

దీని గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “నరకాగ్నికి భయపడండి, అది అవిశ్వాసుల కొరకు తయారుచేయబడింది”ఖుర్ఆన్, అలి ఇమ్రాన్  3:131. ఇక్కడ తయారుచేయబడింది అంటే తయారుగా ఉందని అర్థం.

 

స్వర్గం గురించి అల్లాహ్ పలుకులు ఇలా ఉన్నాయి, “మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. దాని వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది”ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్3:133. ఇక్కడ తయారు చేయబడింది అంటే తయారుగా ఉంది అని అర్థం.

 

అంతేగాక నరకంలో శిక్ష అనుభవిస్తున్న ఒక స్త్రీని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తారు. ఆమె కట్టడిలో ఉన్న ఒక పిల్లికి తిండి పెట్టక పోవడమే గాక, కనీసం భూమి నుండి లభ్యమయ్యే వాటిని కూడా తినకుండా నిర్భందించడం వలన అది ఆకలితో చనిపోయింది. (బుఖారీ &ముస్లిం)

 

“అవిశ్వాసులై, అన్యాయానికి పాల్పడిన వారిని అల్లాహ్ ఎట్టి పరిస్థితిలోనూ క్షమించటం గానీ, ఏదైనా మార్గం చూపటం గానీ చేయడు. వారికి నరకమార్గం చూపటం తప్ప. వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా సులువు” ఖుర్ఆన్ సూరా నిసా  4:168-169.

  దైవదూతలపై విశ్వాసం దైవదూతలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. దైవదూతలు ఉన్నారని విశ్వసించాలి. దైవదూతలు ఎల్లప్పుడూ అల్లాహ్ విధేయతలో...

 

దైవదూతలపై విశ్వాసం


దైవదూతలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. దైవదూతలు ఉన్నారని విశ్వసించాలి. దైవదూతలు ఎల్లప్పుడూ అల్లాహ్ విధేయతలో ఉంటారు. కావున మనము వారిని ప్రేమించాలి. వారు కూడా నిజమైన విశ్వాసులను ప్రేమిస్తారు, కాబట్టి వారి కోసం అల్లాహ్ యందు దుఆ చేస్తారు.

 

ఖుర్ఆన్ వెలుగులో 

“తీసుకోవలసిన ఇద్దరు (దూతలు) తీసుకోవటానికి వెళ్ళినప్పుడు (వారిలో) ఒకతను కుడి ప్రక్కన, మరొకతను ఎడమ ప్రక్కన కూర్చొని ఉంటాడు.(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు.” (ఖుర్ఆన్ సూరా ఖాఫ్ 50:17-18)

 

దైవదూతలు

ఈ భూమిపై తమతో పాటు కనిపించని ఇతర రకాల జీవులలో దైవదూతలూ ఉన్నారని ముస్లిములు విశ్వసిస్తారు. దైవదూతలు అల్లాహ్ తో సమానం లేదా భాగస్వాములు కానేకారు. వారు కేవలం అల్లాహ్ చేత సృష్టించబడినవారు.

 

 

ఆజ్ఞలను పాటించేవారు

వారు కూడా ఒక్కడైన ఆ అల్లాహ్ నే ఆరాధిస్తూ ఆయన ఆజ్ఞల్ని తుచ తప్పకుండ పాటిస్తారు.వారు మానవులతో సమానం కారు. వారి ప్రపంచమే వేరు. ముస్లింలు కూడ వారిని  వేడుకోరు. వారికి అల్లాహ్ కొన్ని కార్యాలను నిర్దేశించాడు. జిబ్రఈల్ (అలైహిస్సలాం) వారిలో అత్యుత్తములు.

 

  దైవగ్రంథాలపై విశ్వాసం దైవగ్రంథాలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. అల్లాహ్ తన దయ వల్ల తన దాసులకు రుజుమార్గం చూపించటానికి మరియు ఇహ...

 

దైవగ్రంథాలపై విశ్వాసం


దైవగ్రంథాలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. అల్లాహ్ తన దయ వల్ల తన దాసులకు రుజుమార్గం చూపించటానికి మరియు ఇహ పర లోకాలలో సాఫల్యం పొందటానికి దైవగ్రంథాలను అవతరింపజేశాడు.

 


ఖుర్ఆన్ వెలుగులో 

“ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది.” (ఖుర్ఆన్ సూరా మాయిదా 5:48)

 

“మేమే ఈ ఖుర్‌ఆన్‌ను అవతరింపజేశాము.  మరి మేమే దీనిని రక్షిస్తాము.” (ఖుర్ఆన్ సూరా హిజ్ర్ 15:9)

 

పూర్వపు గ్రంథాలలో మార్పులు చేర్పులు

దివ్య ఖుర్ఆన్ కు ముందు అవతరించిన అన్ని దైవగ్రంథాలలో మార్పులు చేయబడ్డాయి.

 

చిట్టచివరి దైవ గ్రంథం

ప్రపంచంలో ఇప్పటి వరకూ ఎలాంటి మార్పు జరగకుండా ఉన్న ఏకైక దైవగ్రంథం దివ్య ఖుర్ఆన్ ఒక్కటే. ఇందులోని ఒక్కొక్క పదం అల్లాహ్ అవతరి౦పజేసినదే అని నమ్మడం, అల్లాహ్ ఉనికిని విశ్వసించడమే. ఖుర్ఆన్ ద్వారానే  ఇస్లాం స్థాపించబడింది. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం అల్లాహ్ అవతరింపజేసినదే.

 

ధర్మ సందేశం

అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా అవతరింపజేసిన ధర్మం ఇస్లాం. ఆ ప్రవక్తల్లో మూసా (అలైహిస్సలాం) ద్వారా తౌరాత్,  దావూద్  (అలైహిస్సలాం)  ద్వారా జబూర్, ఈసా (అలైహిస్సలాం) ద్వారా ఇంజీల్  అవతరిoపజేయబడ్డాయి. అంతిమ దైవప్రవక్త ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లమ్) ద్వారా పంపబడిన అంతిమ దైవగ్రంథం ఖుర్ఆన్, అంతకు ముందు పంపబడిన దైవగ్రంథాలలో చివరిది,మరియు ప్రళయదినం వరకు సమస్త మానవాళికి మార్గదర్శకత్వం చేసేది.

  దైవప్రవక్తలపై విశ్వాసం దైవప్రవక్తలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. అల్లాహ్ తన  దాసుల్లో నుంచి తాను ఎంచుకున్న వారిని దైవప్రవక్తల...

 

దైవప్రవక్తలపై విశ్వాసం


దైవప్రవక్తలను విశ్వసించడం విశ్వాసపు మూలస్థంభాలలో ఒకటి. అల్లాహ్ తన

 దాసుల్లో నుంచి తాను ఎంచుకున్న వారిని దైవప్రవక్తలుగా నియమించాడు. 

వారిని ప్రతి జాతిలో, ప్రతి సమాజంలో పంపించాడు. వారు తమ జాతి 

ప్రజలను రుజుమార్గం వైపు దర్శకత్వం వహించేవారు. ప్రవక్తల పరంపరలో చిట్ట 

చివరి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం.

 


ఖుర్ఆన్ వెలుగులో
 

“(ప్రజలారా!) ముహమ్మద్‌ (సఅసం)  మీ  మగవారిలో ఎవరికీ తండ్రికాడు. 

అయితే   ఆయన అల్లాహ్‌ యొక్క సందేశహరుడు.   ప్రవక్తల పరంపరను 

పరిసమాప్తం చేసే (చివరి) వాడు. అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.”

 (ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:40)

 

“అల్లాహ్‌యే దైవదూతలలో నుంచి, మానవులలో నుంచి తన సందేశహరులను 

ఎంపిక చేసుకుంటాడు.నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వింటాడు, అన్నీ చూస్తాడు.” 

(ఖుర్ఆన్ సూరా హజ్ 22:75)

 

దైవ ప్రవక్తలు

అల్లాహ్ తన గురించి ప్రజలకు తెలియజేయడానికి, వారిని సరియైన

 దారిలో నడిపించడానికి  ప్రతి యుగంలో దైవప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు.  

దైవ ప్రవక్తలపై, వారిచే అల్లాహ్ ద్వారా పంపించబడిన ఆదేశాలపై విశ్వసించడం

ఇస్లామీయ విశ్వాసానికి మూలాధారం.

 

అంతిమ దైవప్రవక్త

అంతిమ దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లమ్) ద్వారా పూర్తి

 మానవాళికి పంపించబడిన చిట్టచివరి దైవగ్రంథం ఖుర్ఆన్. 

“ఎవరైతే  దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహుఅలైహివసల్లమ్) కు విధేయత 

చూపుతారో వాస్తవంగా వారు అల్లాహ్ కు విధేయత చూపినట్లే”అని 

దివ్య ఖుర్ఆన్ లోని సూరా నిసా 4:80లో తెలుపబడినది.  

  అల్లాహ్ పై  విశ్వాసం అల్లాహ్ ఔన్నత్యాన్ని తెలిపే మూడు అంశాలు – అల్లాహ్ అధికారాల్లో ఏకత్వం అల్లాహ్ పేర్లు, లక్షణాల్లో ఏకత్వం అల్లాహ్ ఆరాధనల...

 

అల్లాహ్ పై  విశ్వాసం


అల్లాహ్ ఔన్నత్యాన్ని తెలిపే మూడు అంశాలు –

  • అల్లాహ్ అధికారాల్లో ఏకత్వం
  • అల్లాహ్ పేర్లు, లక్షణాల్లో ఏకత్వం
  • అల్లాహ్ ఆరాధనల్లో ఏకత్వం.

 

ప్రతి ముస్లిం అల్లాహ్ ఒక్కడే అని, ఈ సృష్టిలో ఆయన భాగస్వాములు ఎవ్వరూ లేరని, ఆయన  పేర్లు మరియు లక్షణాల్లో ఎవ్వరూ సాటిలేరని విశ్వసిస్తాడు. అల్లాహ్ ఒక్కడే పూజించదగినవాడు అని తన చేష్టల ద్వారా చాటుతాడు.

 


అల్లాహ్ పై ఈమాన్ నిర్వచనం 

‘అల్లాహ్ పై విశ్వాసం’ అంటే- అల్లాహ్ ఉనికిని, అల్లాహ్ దైవత్వాన్ని,అల్లాహ్ శుభనామాలను మరియు అల్లాహ్ దివ్య లక్షణాలను దృఢంగా విశ్వసించడం.

 

అల్లాహ్ పై ఈమాన్ షరతులు

అల్లాహ్ పై విశ్వాసంలో నాలుగు విషయాలు ఇమిడి ఉన్నాయి. ఎవరైతే వీటిని విశ్వసిస్తారో, వారు నిజమైన విశ్వాసులు.

 

1. అల్లాహ్ ఉనికిని విశ్వసించడం

‘అల్లాహ్ ఉనికి’ హేతుబద్ధంగా, మానవ స్వభావసిద్ధంగా ధృవీకరించబడిన ఒక వాస్తవ విషయం.అల్లాహ్ ఉనికి గురించి షరిఅహ్ లో తెలుపబడిన అనేక వాస్తవాలు క్రింద తెలుపబడ్డాయి.

 

           i.అల్లాహ్ ఉనికిని నిరూపించే మానవ స్వాభావిక ఋజువు:

తన సృష్టికర్తను విశ్వసించే స్వాభావిక విశ్వాసంతో ప్రతి మానవుడు సృష్టించబడతాడు. దీని గురించి అతడు ముందుగా ఆలోచించవలసిన అవసరంగాని లేక నేర్చుకోవలసిన అవసరంగాని లేదు. మార్గభ్రష్టత్వంలో పడిపోయిన వారు తప్ప, మరెవ్వరూ ఈ సహజసిద్ధమైన దైవవిశ్వాసం నుండి మరలిపోరు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధించారు: “ఫిత్రా (మానవుడి స్వాభావిక ఏకదైవ విశ్వాస) స్థితిలో కాకుండా ఏ బిడ్డా జన్మించడు. అయితే అతని తల్లిదండ్రులు అతడిని యూదుడిగానో, క్రైస్తవుడిగానో లేక అగ్నిపూజారిగానో మార్చి వేస్తారు.”  [సహీహ్ బుఖారీ హాదీస్ నం: 4775సహీహ్ ముస్లిం హాదీస్ నం: 2658.]

 

         ii. అల్లాహ్ ఉనికిని నిరూపించే హేతుబద్ధమైన ఋజువు:

భూత, భవిష్య వర్తమాన కాలాలలోని ఈ సృష్టి తనను ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్తను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఎందుకంటే సృష్టి తనకు తాను సృష్టించుకోలేదు లేదా ఏదైనా హఠాత్పరిమాణం, స్వయాన ఉనికిలో రాజాలదు.

 

సృష్టి తనకు తానుగా ఉనికిలోనికి రావటం అసాధ్యం. ఎందుకంటే ఏదైనా వస్తువు తనను తాను సృష్టించుకోలేదు: ఉనికి లోనికి రాక ముందు, అది సృష్టించబడనే లేదు. కాబట్టి, అదెలా తనను తాను సృష్టించుకోగలదు? అలాగే, ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రావడం కూడా అసంభవమైనదే. ఎందుకంటే, ఏది సంభవించినా దానికొక కారణముంటుంది. అంతేగాక, ఈ సృష్టి అత్యాద్భుతమైనదిగా, అత్యంత ఖచ్చితమైన విధంగా సృష్టించబడింది, ఇతర సృష్టితాల మధ్య ప్రతిదీ పొందికగా అమర్చబడింది. కారణానికి మరియు పర్యవసనానికి మధ్య దృఢమైన సంబంధం ఉంది. ఇవన్నీ నిరూపిస్తున్నది ఏమిటంటే ఈ సృష్టి ఏదో ఒక హఠాత్పరిమాణం వలన ఉనికిలోనికి రాలేదు. ఎందుకంటే ఏదైనా హఠాత్తుగా జరిగితే, దాని పర్యవసానం ఇంత ఖచ్ఛితంగా మరియు ఇంత పరిపూర్ణంగా ఉండదు. కాబట్టి ఇది అంత ఖచ్చితమైన సమతుల్యంలో ఎలా మిగిలి ఉంది?

 

సృష్టి తనకు తానుగా సృష్టించుకోవడం లేక ఏదైనా హఠాత్పరిమాణం వలన ఉనికి లోనికి రావడం జరగనట్లయితే, వీటిని ఉనికిలోనికి తీసుకు వచ్చిన ఒక సృష్టికర్త తప్పకుండా ఉండి తీరాలి. ఆయనే అల్లాహ్ – సకల లోకాల ప్రభువు.

 

అల్లాహ్ ఈ హేతుబద్ధమైన సాక్ష్యాన్ని మరియు తిరుగులేని ఋజువును సూరా అత్ తూర్ లో పేర్కొన్నాడు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం): “ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా?” సూరా అత్తూర్ 52:35

 

అవి సృష్టికర్త లేకుండా సృష్టించబడలేదు. వాటికవే సృష్టించుకోవడమూ జరగలేదు. కాబట్టి, మహోన్నతుడైన అల్లాహ్ యే వాటి సృష్టికర్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సూరా అత్ తూర్ పఠిస్తూ, ఈ ఆయతు వద్దకు వచ్చినపుడు, జుబైర్ ఇబ్నె ముతిమ్ దానిని విన్నారు (ఖుర్ఆన్ ఆయతు తెలుగు భావానువాదం): “ఎవరి ప్రమేయం లేకుండా అవి స్వయంగా ఉనికిలోనికి వచ్చాయా? లేదా వాటికవే సృష్టికర్తలా? లేదా భూమ్యాకాశాలను అవి సృష్టించాయా? లేదు, వారు దృఢమైన విశ్వాసం కలిగి లేరు. లేదా వారి వద్ద మీ ప్రభువు యొక్క భాండాగారాలేమైనా ఉన్నాయా? లేదా తమ ఇష్టానుసారం చేయగల అధికారం కలిగి ఉన్న నిరంకుశులా వారు? ” సూరాఅత్తూర్ 52:35-37. ఆ కాలంలో జుబైర్ అవిశ్వాసిగా జీవించేవారు. ఖుర్ఆన్ వచనాలు విన్న తర్వాత ఆయనిలా పలికినారు: “నా గుండె దాదాపు ఆగిపోయినట్లయింది. దైవవిశ్వాసం నా హృదయంలో ప్రవేశించిన మొట్టమొదటి క్షణమది.” (సహీహ్ అల్ బుఖారీ)

 

అల్లాహ్ఉనికికి ఉపమానం

అల్లాహ్ ఉనికిని నిరూపించేందుకు ఒక ఉదాహరణ.

 

ఒక అందమైన రాజభవనం, దాని చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు, వాటి మధ్య నదుల ప్రవాహం, సకల సౌకర్యాలు, అన్ని రకాల భోగభాగ్యాలతో కూడిన అలంకరణలు.ఇదంతా ఎవ్వరూ నిర్మించకుండా, హఠాత్తుగా దానికదే ఉనికిలోనికి వచ్చిందని ఒకవేళ ఎవరైనా మీతో చెబితే, వెంటనే మీరు దానిని తిరస్కరిస్తారు, నోటి మీదే అది ఒక పచ్చి అబద్ధం అని చెప్పేస్తారు. అది ఒక మూర్ఖమైన మాటగా పరిగణిస్తారు. మరిభూమ్యాకాశాలతో, నక్షత్రాలతో, అత్యద్భుతసువిశాల మరియు ఖచ్చితమైన సమతుల్యంతో కనబడుతున్న ఈ విశ్వం, దాని సృష్టికర్త ప్రమేయం లేకుండా దానికదే సృష్టించుకోవడం సాధ్యమా లేదా ఏదైనా హఠాత్పరిణామం వలన ఉనికిలోనికి రావడం సాధ్యమా?

 

ఎడారిలో నివసించే ఒక పల్లెవాసి ఈ హేతుబద్ధమైన ఋజువును గ్రహించి, ఇతరులు అడిగిన ఈ ప్రశ్నకు ఆయన చాలా స్పష్టంగా బదులిచ్చిన ఈ సంభాషణను ఒకసారి పరిశీలిద్దాం. “నీ ప్రభువు గురించి నీవు ఎలా తెలుసుకోగలవు?” ఆయన జవాబు: “ఒకవేళ ఒంటె పేడ నీకు కనబడితే, ఆ దారి గుండా ఏదో ఒక ఒంటె వెళ్ళిందని నీవు గ్రహిస్తావు. అలాగే ఒకవేళ మనిషి పాదాల గుర్తులు నీకు కనబడితే, ఆ దారి గుండా ఒక మనిషి వెళ్ళినట్లు నీవు గ్రహిస్తావు. మరి, నక్షత్రాలతో నిండిన ఈ ఆకాశం, పర్వత మార్గాలతో కూడిన ఈ భూమండలం మరియు ఎత్తైన అలలతో కూడిన ఈ సముద్రాలు – ఇవన్నీ సర్వం వినేవాడు, సర్వం చూసేవాడి ఉనికిని నిరూపించడం లేదా?”

 

2. అల్లాహ్ సార్వభౌమత్వాన్ని విశ్వసించడం.

అల్లాహ్ సార్వభౌమత్వం అంటే కేవలం అల్లాహ్ మాత్రమే ప్రభువు,ఆయనకు భాగస్వాములు గానీ, సహాయకులు గానీ ఎవ్వరూ లేరు. కానీ మానవులలో కొందరు ఈ పిలుపును తిరస్కరించి, అల్లాహ్ తో పాటు ఆరాధించడానికి, వేడుకోవడానికి, అర్థించడానికి ఇతరులను దేవుళ్ళుగా చేసుకున్నారు.

 

సృష్టించే, ఆధిపత్యం చెలాయించే మరియు నియంత్రించే శక్తి గలవాడే ప్రభువు. అల్లాహ్ తప్ప మరో సృష్టికర్త లేడు. అల్లాహ్ తప్ప మరో సార్వభౌముడు లేడు. విశ్వలోకాలను నియంత్రించే శక్తి అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ లేదు. దీని గురించి అల్లాహ్ ఖురాన్ లోసూరాఅల్ ఆరాఫ్ 7:54సూరా యూనుస్ 10:31, సూరా సజ్దహ్ 32:5, సూరా ఫాతిర్ 35:13లో ఈ విధంగా తెలియజేసాడు.

 

“నిశ్చయంగా, ఈ సృష్టి మరియు శాసనం ఆయనదే”  

 

“ప్రకటించు (ఓ ముహమ్మద్): ‘భూమ్యాకాశాల నుండి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నది ఎవరు? లేదా వినికిడి శక్తి మరియు దృష్టి ఎవరి అధీనంలో ఉన్నాయి? మరణించిన వారిని తిరిగి సజీవం చేసేది మరియు సజీవంగా ఉన్నవారిని మరణింపజేసేది ఎవరు? విశ్వవ్యవహారాలను నడిపేది ఎవరు?’ (అని ప్రశ్నిస్తే), వారు ‘అల్లాహ్’ అని బదులిస్తారు. అపుడు వారినిలా ప్రశ్నించు: ‘మరి మీకు అల్లాహ్ శిక్షల భయం లేదా (ఆయన ఆరాధనలలో భాగస్వాములను చేర్చినందుకు?’)

 

 “భూమ్యాకాశాల మధ్య ఉన్న వాటి ప్రతి వ్యవహారాన్నీ ఆయనే నియంత్రిస్తాడు మరియు ఆయనే నడిపిస్తాడు; ప్రతిదీ ఆయన వైపుకే మరలుతుంది” 

 

“ఆయనే అల్లాహ్, మీ ప్రభువు; విశ్వసామ్రాజ్యం ఆయనదే. ఆయనను వదిలి ఎవరినైతే మీరు వేడుకుంటున్నారో, పిలుస్తున్నారో, అలాంటి వారు (విగ్రహాలు, అసత్యదైవాలు) ఖర్జురపు పండు పై నుండే పల్చటి దారం పోగుకు కూడా యజమానులు కారు.” 

 

3. అల్లాహ్ ఏక దైవత్వాన్ని విశ్వసించడం

కేవలం అల్లాహ్ మాత్రమే నిజమైన ఏకైక ఆరాధ్యుడు, ఆయనకెవరూ సాటి లేరు మరియు ఆయనకెవరూ భాగస్వాములు లేరు.

 

అల్ ఇలాహ్ అర్ధాలలో ఒకటి, ప్రేమించబడేవాడు. ప్రేమ మరియు గౌరవాభిమానాలతో ఆరాధించబడేవాడు. లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటే ఆరాధింపబడే అర్హత గలవారెవ్వరూ లేరు – ఒక్క అల్లాహ్ తప్ప. దీని గురించి అల్లాహ్ దివ్యఖురాన్ లో సూరా తాహ 20:14లో ఈ విధంగా తెలియజేసాడు

‘’యదార్ధం ఏమిటంటే నేనే అల్లాహ్ ను, నాకు తప్ప వేరే ఆరాధ్య దైవం లేనేలేడు కనుక నన్నేఆరాధించు’’.

   

ఇంకా అల్లాహ్  ఆరాధ్య దైవమని సూరా ఆలె ఇమ్రాన్ 3:18లో స్వయంగా సాక్షమిస్తున్నాడు

“ఆయన తప్ప మరే ఆరాధ్యుడూ లేడు అనడానికి అల్లాహ్ సాక్ష్యంగా ఉన్నాడు, దైవదూతలు మరియు జ్ఞానం కలిగిన వారు కూడా. ఆయనే తన సృష్టిని న్యాయంగా నడుపుతున్నాడు. ఆయన తప్ప మరే ఆరాధ్యుడెవ్వడూ లేడు. మహా శక్తిమంతుడు, మహా వివేకవంతుడూను.” 

 

అల్లాహ్ ను వదిలి, ఆరాధించే ప్రతి దైవత్వం అసత్యమైనదే. దీని గురించి అల్లాహ్ సూరా అల్ హజ్  22:62లో ఇలా పలుకుతున్నాడు.

“ఎందుకంటే అల్లాహ్ మాత్రమే సత్యం. ఆయనతో పాటు (లేక ఆయనను వదిలి) వారు ఆరాధిస్తున్నవన్నీ అసత్యమైనవే. నిశ్చయంగా, అల్లాహ్ మహోన్నతుడు, ఘనమైన వాడూను.” 

 

దేవుడిగా పిలవబడినంత మాత్రాన వాటికి దైవత్వం చేకూర్చదు. దీని గురించి అల్లాహ్ సూరా అల్ నజమ్ 53:23లో ఇలా పలుకుతున్నాడు

“అవన్నీ మీరూ మరియు మీ తాతముత్తాతలు పెట్టుకున్న పేర్లు మాత్రమే. ఎలాంటి దైవత్వాన్నీ అల్లాహ్ వాటికి ప్రసాదించలేదు” 

సూరా యూసుఫ్ 12:39-40లో పూర్వపు ప్రవక్త అయిన యూసుఫ్ అలైహిస్సలాం జైలులో ఉంచబడినపుడు, అక్కడి రక్షకభటుడితో ఏకైక దేవుడైన అల్లాహ్ గురించి సంభాషిస్తూ ఇలా బోధించారు

“అనేక మంది దేవుళ్ళు ఉండటం మంచిదా లేక ఏకైకుడు మరియు తిరుగులేని వాడైన ఒక్క అల్లాహ్ మాత్రమే ఉండటం మంచిదా? ఆయనను తప్ప ఇంకెవ్వరినీ ఆరాధించవద్దు. ఆయనను వదిలి నీవూ మరియు నీ తల్లిదండ్రులు కొలుస్తున్న దేవుళ్ళ పేర్లకు అల్లాహ్ ఎలాంటి దైవత్వాన్నీ ప్రసాదించలేదు.” 

 

 అల్లాహ్ ప్రజలను ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు పిలవటానికి ఆయన పంపిన ప్రతీ ప్రవక్తకు  అల్లాహ్  తప్ప మరెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు, ఆయన హక్కులో ఎవరికీ ఎలాంటి భాగస్వామ్యమూ లేదు,ఆయనకు అతి చేరువలో ఉండే దైవదూత అయినాసరే ,అని సూరా అల్ అంబియా 21:35సూరా అన్నహల్ 16:36లో తెలియజేసాడు.

 

 “’లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే దివ్య వచనం వైపు సందేశహరుడిని తప్ప, మేము మరే సందేశహరుడినీ నీకు పూర్వం పంపలేదు. కాబట్టి నన్ను మాత్రమే ఆరాధించు” 

“నిశ్చయంగా మేము ప్రతి సమాజంలో ఒక సందేశహరుడిని (ఇలా పిలిచేందుకు) పంపాము: “అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి, తాగూత్ (అసత్యదేవుళ్ళ) లకు దూరంగా ఉండండి.” 

 

4. అల్లాహ్ దివ్యనామాలను, దివ్యలక్షణాలను విశ్వసించడం.

అల్లాహ్ తన దివ్యగ్రంథంలో మరియు తన అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచనాలలో (సున్నతులలో) స్వయంగా అల్లాహ్ ధృవీకరించిన తన దివ్యనామాలను మరియు దివ్యలక్షణాలను ఆయన ఔన్నత్యానికి సరిపోయేటట్లుగా, వాటి భావాలలో ఎలాంటి మార్పులుచేర్పులు చేయకుండా, వాటిని సృష్టితో పోల్చుతూ రకరకాల ప్రశ్నలు వేయకుండా ధృవీకరించడం.

 

“అత్యున్నతమైన నామాలు అల్లాహ్ కు మాత్రమే చెందుతాయి. కాబట్టి వాటి ద్వారా ఆయనను వేడుకోండి. ఆయన దివ్యనామాలను తిరస్కరించే వారిని, నమ్మని వారిని విడిచి పెట్టండి. వారు చేస్తున్న దానికి తగిన ప్రతిఫలం పొందుతారు.” [అల్ ఆరాఫ్ 7:180]

 

ఈ వచనం సూచిస్తున్నదేమిటంటే, అల్లాహ్ నామాలు అత్యన్నతమైన దివ్యనామాలు.పరిపూర్ణత్వపు లక్షణాలు కేవలం అల్లాహ్ కు మాత్రమే చెందునని ఈ వచనం సూచిస్తున్నది, ఎందుకంటే పరిపూర్ణత్వాన్ని సూచించే లక్షణమే “మహోన్నతమైన లక్షణం”.

 

అల్లాహ్ దివ్యనామాలలో సమతూకం

అల్లాహ్ దివ్య నామాలలో సమతూకపు విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. అది ఏమిటంటే  క్రింద ఇవ్వబడే  నాలుగు విషయాల నుండి ఏవరైతే దూరంగా ఉంటారో, అలాంటి వారు నిజంగా అల్లాహ్ ను విశ్వసించనట్లే. ఎవరైనా వీటిలో ఏ ఒక్క దానిని అనుసరించినా, అలాంటి వారు తమకు ఆదేశించబడిన దానిని శిరసావహించకుండా, అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలపై తగిన విధంగా నిజమైన విశ్వాసం పొందని వారవుతారు. వీటికి దూరంగా ఉండకుండా, ఎవరైనా సరే అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను విశ్వసించలేరు. ఉదాహరణకు

1. తహ్రీఫ్

2.తఅతీల్

3.తమ్సీల్

4. తక్ఈఫ్

 

(i) తహ్రీఫ్

తహ్రీఫ్ అంటే మార్పులు – చేర్పులు చేయడం. ఉదాహరణకు‘అత్యుత్తమమైన దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును’ అనే వాస్తవ భావార్థానికి భిన్నంగా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ఆమోదయోగ్యం కాని విధంగా ఖుర్ఆన్ ఆయతుల మరియు సున్నతు వచనాల భావార్థాలలో మార్పులు  చేర్పులు చేయడం.

 

(ii) తఅతీల్

తఅతీల్ అంటే (తిరస్కరించడం) ఉదాహరణకు అల్లాహ్ దివ్యనామాలు దివ్యలక్షణాలను తిరస్కరిస్తూ, అవన్నీ లేదా వాటిలో కొన్ని అల్లాహ్ కు చెందవని చెప్పడం.ఖుర్ఆన్ మరియు సున్నతులలో పేర్కొనబడిన అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను తిరస్కరించే ప్రతి ఒక్కరూ అల్లాహ్ దివ్యనామాలు మరియు దివ్యలక్షణాలను నిజంగా నమ్మనట్లే.

 

(iii) తమ్సీల్

తమ్సీల్ అంటే అల్లాహ్ ను ఆయన సృష్టితాలతో పోల్చడం. ఇంకా అల్లాహ్ దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడం. ఉదాహరణకు, అల్లాహ్ చేయి మానవుడి చేతి లాంటిదే అనడం, అల్లాహ్ వినికిడి శక్తి మానవుడి వినికిడి శక్తి లాంటిదే అనడం, అల్లాహ్ తన అర్ష్ పై అధిష్టించడం అంటే మానవుడు ఒక కుర్చీ పై కూర్చోవడం లాంటిదని చెప్పడం …. మొదలైనవి. నిస్సందేహంగా, అల్లాహ్ దివ్యలక్షణాలను సృష్టితాల సాధారణ లక్షణాలతో పోల్చడమనేది ఒక పచ్చి అబద్ధం. దీని గురించి సూరా షురా 42:11లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు

“ఆయనను పోలినదేదీ లేదు” 

 

(iv) తక్ఈఫ్

తక్ఈఫ్ అంటే ఎలా సంభవమని చర్చించడం.ఉదాహరణకు ఎవరైనా ఒక వ్యక్తి పరిమితమైన తన ఊహలకు లేక ఆలోచనలకు మాటల రూపాన్నిస్తూ, అల్లాహ్ దివ్యనామాలు దివ్యలక్షణాలు ఎలా సాధ్యం అనే విషయం పై చర్చించడం. ఖచ్చితంగా ఇలా చేయడం ఆమోదయోగ్యం కాదు. మానవుడికి వాటి గురించి తెలీదు. దీని గురించి సురా తాహా 20:110లో అల్లాహ్ ఈ విధంగా సెలవిస్తున్నాడు

“కానీ, ఆయన జ్ఞానంలో నుండి దేనినీ వారేనాడూ ఆవరించలేరు” 

Popular Posts