Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  సాక్ష్యం షహాదహ్ అంటే అరబీ వచనమైన لا إلــه إلاالله محمد رسول الله - అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం ఏదీ లేదు, ముహమ్మద్ (పై అల్లాహ్ శాంతి కలుగుగ...

సాక్ష్యం

 సాక్ష్యం

షహాదహ్ అంటే అరబీ వచనమైన لا إلــه إلاالله محمد رسول الله - అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం ఏదీ లేదు, ముహమ్మద్ (పై అల్లాహ్ శాంతి కలుగుగాక) ఆయన దైవప్రవక్త అని సాక్షమివ్వడం.


దీనినే ఇస్లాం ధర్మ ధృవీకరణ, స్వికరణ వచనం కూడ అంటారు.


షహాదహ్ నిర్వచనం

అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్నముహమ్మదర్రసూలుల్లాహ్”అని అర్ధం.అంటే “నేను సాక్షం ఇస్తున్నాను - అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు మరియు నేను సాక్షం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరులు."


షహాదహ్ వివరణ

“అష్ హదు= నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లా ఇలాహ= (వాస్తవమైన) ఆరాధ్యుడు ఎవడూ లేడు, ఇల్లల్లాహు= కేవలం ఒక్క అల్లాహ్ తప్ప, వ= మరియు, అష్ హదు అన్న= నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మదుర్రసూలుల్లాహ్= ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లం) అల్లాహ్ యొక్క సందేశహరులు.

ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా, పెద్ద చిన్న తేడా లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, బీద గొప్ప తారతమ్యం లేకుండా, ఏ మతం,కులం లేక ఏ జాతి వారైనా సరే“ వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లం) అల్లాహ్ యొక్క సందేశహరులు” అని సాక్ష్యమిచ్చినట్లైతే వారు ఇస్లాం ధర్మం స్వీకరించినట్లు, అంటే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ కు స్వయంగా సమర్పించుకున్నట్లుగా పరిగణింపబడుతారు.

షహాదహ్ ప్రాముఖ్యత

అనేకమంది ప్రజలు ఇస్లాం మొట్టమొదటి మూలస్థంభమైన – లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ మహోన్నత వచన భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం. షహాదహ్ ఒక వ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి ఎలా మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవనమార్గంపై ఎలా నడిపిస్తుందో, ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన వచనమిది.

                                                                        

షహాదహ్ నిబంధనలు

మొదటి నిబంధన: జ్ఞానము(అల్ ఇల్మ్)

ప్రతీ ముస్లిం షహాదహ్ అంటే ఏమిటో కనీసపు ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి. షహాదహ్ ఏ విషయాన్నిధ్రువపరుస్తున్నదో, దేనిని ఖండిస్తున్నదో మరియు దేనిని నిరాకరిస్తున్నదో బాగా అర్థం చేసుకోవాలి.


రెండవనిబంధన: విశ్వాసము(అల్ యఖీన్)

ఇది“సందేహం” లేదా“లోపభూయిష్టమైన విశ్వాసం” అనే దానికి పూర్తిగా వ్యతిరేకం.


నిజానికి ఇస్లాంలోఖుర్ఆన్ మరియు సున్నతులలో అభిప్రాయ బేధాలు లేకుండా ధృవపర్చబడిన ఏ ఒక్క విషయంలోనైనా సందేహించడం“కుఫ్ర్” (దైవవిశ్వాసాన్నితిరస్కరించడం)తో సమానం. ప్రతి ముస్లిం తన మనసులో షహాదహ్ యొక్క వాస్తవం మరియు యదార్థం పట్ల, సంపూర్ణంగా, బేషరతుగా, కల్తీలేని విశ్వాసం కలిగి ఉండాలి. “అల్లాహ్ తప్ప ఆరాధనలకు వేరేవారెవ్వరు అర్హులు కారు” అని సాక్ష్యమిచ్చే విషయంలో మనసు నిలకడగా ఉండాలి. అల్లాహ్ నిజమైన విశ్వాసుల పట్ల సూరా హుజురాత్ 49:15 లో ప్రస్తావించాడు “ఎవరైతే అల్లాహ్ ను విశ్వసిస్తారో, వారి హృదయాలు ధృడంగా ఉంటాయి” అని అభివర్ణించాడు. 


మూడవనిబంధన: స్వీకారం( అల్ఖబూల్)

ఒక వ్యక్తి షహాదహ్ యొక్క పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండి, షహాదపై తన యొక్క విశ్వాసంలో నిశ్చలత్వాన్ని కలిగి ఉంటే, అటువంటి పరిపూర్ణ సుస్థిర విశ్వాసంతో అతను షహాదాను నాలుకతో ఉఛ్ఛరించి షహాద సూచించే, బోధించే ప్రతి దానిని మనస్పూర్తిగా స్వీకరించాలి. ఎవరైతే షహాదను మరియు షహాద సూచించే, బోధించే వాటన్నిటినీ స్వీకరంచడానికి నిరాకరిస్తారో, వారు షహాదహ్ యొక్క పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ షహాదహ్ యొక్క సత్యత పట్ల పరిపూర్ణ సుస్థిర విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, వారు అవిశ్వాసులు(అవిశ్వాసులుగానే పరిగణింపబడతారు). ఈ విధంగా నిరాకరించడానికి గర్వం, అహంకారం, అసూయ లాంటివి ఏవైనా కారణాలు కావచ్చు. కానీ ఎటువంటి సందేహ సంశయాలు లేకుండా నిరభ్యంతరంగా, స్వీకరించనంతవరకు షహాదహ్(ఎన్ని సార్లు ఉఛ్ఛరించినా) నిజమైన షహాదగా పరిగణించబడదు.


నాలుగవనిబంధన : విధేయత(అల్ఇన్ఖియాద్):

ఈ నాలుగవ నిబంధన, వాస్తవంగా ఒక ముస్లిం తన పనుల ద్వారా, చేతల ద్వారా తాను ఉఛ్ఛరించిన షహాద పట్ల నిర్వహించవలసిన పాత్రను సూచిస్తాడు. “ఇస్లాం” అనే పదానికి ఉన్న ముఖ్యమైన అర్థాలలో ఇది కూడా ఒకటి “అల్లాహ్ యొక్క అభీష్ఠానికి, సంకల్పానికి, ఆజ్ఞలకు, అధికారానికి తన ఇష్టాయిష్టాలను సమర్పించుకోవడం”. ఈ విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. “వ అనీబూ ఇలా రబ్బికుమ్ వ అస్లిమూలహూ” సూరా జుమర్ 39:54


ఐదవ నిబంధన : సత్యసంధత( అస్సిద్ఖ్)

సత్యసంధత అంటే “మోసం, వంచన, దగా, కపటత్వం, నిజాయితీ లేకపోవడం”అనే వాటికి వ్యతిరేకం అని అర్థం. అంటే ఒక వ్యక్తి షహాదా ఉఛ్ఛరిస్తున్నాడు అంటే, అలా ఉఛ్ఛరించడంలో వాస్తవంగా అతని నిజాయితీ, సంకల్పం, నిర్ణయం సమ్మిళితమై ఉండాలి. షహాదహ్(విశ్వాసపు ప్రకటన) ను ఉఛ్ఛరించడం సరదాకో, ఎవరినో మోసం చేయడానికో, కేవలం నటన కొరకో లేదా ఆట పట్టించడానికో కానిదై ఉండాలి.


ఆరవ నిబంధన : చిత్తశుధ్ధి (అల్ఇఖ్లాస్)

ఎవరైనా షహాదా(విశ్వాసపు ప్రకటన) ను బహిరంగంగా స్వీకరించడం లేదా ప్రకటించడం అనేది జరిగితే, అలా ప్రకటించడం యొక్క ఏకైక లక్ష్యం కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే అయి ఉండాలి. అంతేకాని వేరే ఏ కారణం కోసమో, లేక ఇంకెవరినైనా సంతోషపర్చడం కోసమో అయి ఉండకూడదు. ఈ విధంగా షహాదా కు సంబంధించినంత వరకు“పవిత్రత”లేక “స్వఛ్ఛత”అంటే షిర్క్ కు వ్యతిరేకం లేదా “అల్లాహ్ యొక్క ఏకత్వం లో మరొకరికి సాటి కల్పించడం”అనేదానికి వ్యతిరేకం అని అర్థం. ఎవరైనా ముస్లింగా మారడం, ముస్లింగానే మిగిలి పోవడం అనేది కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే. ఆయనను ఆరాధించడం, ఆయనను సేవించడం కోసం, ఆయన ఆగ్రహానికి, ఆయన విధించే శిక్షకు గురి కాకుండా ఉండడం కోసం, కేవలం ఆయన యొక్క కరుణ పొందడం కోసం, ఆయన అందజేసే బహుమతులను పొందడం కోసం మాత్రమే అయి ఉండాలి.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు “ఫ'బుదిల్లాహ ముఖ్లిసన్ లహుద్దీన్” సూరా జుమర్ 39:2


ఏడవ నిబంధన : ప్రేమ(అల్ ముహాబ్బహ్)

ప్రేమాభిమానాలు అంటే విశ్వాసి షహాదను ప్రేమిస్తున్న వాడై ఉండాలి. అతని ప్రేమ షహాదాతో సంబధ్ధత కలిగి ఉండాలి (అసంబధ్ధమైనదై ఉండకూడదు). షహాదా సూచించే, ధ్వనింపజేసే నిర్దేశాలను ప్రేమిస్తున్న వాడై ఉండాలి. అంతే కాకుండా ఎవరైతే షహాదహ్ ఉఛ్ఛరించి దాని ప్రకారం తమ జీవితాన్ని గడుపుతున్నారో, షహాదహ్ ఆధారంగా (అల్లాహ్ మార్గంలో) శ్రమిస్తున్నారో వారందరినీ ప్రేమించాలి వారందరి పట్ల స్నేహం, వాత్సల్యం, మక్కువ కలిగి ఉండాలి. ఇది షహాదా కు సంబంధిచిన అత్యవసరమైన నిబంధన. ఒక వ్యక్తి షహాదాను ఉఛ్ఛరించి కూడా, అతనిలో షహాదా పట్ల, షహాదా ప్రాతినిధ్యం వహించే విషయాల పట్ల ప్రేమ, అభిమానం, మక్కువ లేనట్లైతే, నిజానికి అతని విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసం కాజాలదు. ఒక నిజమైన విశ్వాసిలో ఉండవలసిన విశ్వాసం కాజాలదు. ఒకవేళ అతనిలో షహాదా పట్ల ప్రేమ లేనట్లయితే, ఇంకా ఒకవేళ అతనిలో షహాదా పట్ల ద్వేషభావం గానీ ఉన్నట్లైతే, అతను షహాదాను వ్యతిరేకించినట్లే.

నిజమైన విశ్వాసి తన ప్రేమలో ఎవరినీ అల్లాహ్ కు సాటిగా నిలబెట్టడు. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు “వమినన్నాసి మఁయత్తఖిజూ మిన్ దూనిల్లాహి అన్ దాదఁయుహిబ్బూనహుం కహుబ్బిల్లాహి వల్లజీన ఆమనూ అషద్దు హుబ్బల్లిల్లాహ్”సూరా బఖరా 2:165


ఎనిమిదవ నిబంధన: మిధ్యా దైవాలను నిరాకరించుట(అల్ బరాఆహ్)

షహాదహ్ ఉఛ్ఛరించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించిన వ్యక్తి అల్లాహ్ తప్ప వేరే దైవం లేడని భావించి తాను అంతవరకూ పూజిస్తూ, ఆరాధనలను అర్పిస్తూ వచ్చిన ప్రతి దేవీ దేవతా వస్తువు, ప్రతిమ, వ్యక్తి, ఆకృతి, అన్నింటినీ తిరస్కరిచాలి.

షహాదా సాక్ష్యపు వాక్యంలోనే “అల్లాహ్ తప్ప వేరే ఎవ్వరూ ఏ విధమైన ఆరాధనలకు అర్హులు కారు” అనే విషయం విశదమవుతున్నప్పటికీ,షహాదాను ఉఛ్ఛరించే చాలామందికి ఈ విషయంలో స్పష్టత లేదు అనే విషయం వాస్తవం. 

సూరా అల్ బఖరా లో అల్లాహ్ –ప్రతి ముస్లిం అత్యంత ముఖ్యమైన ఈ దృక్పథాన్ని కలిగి ఉండడాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. షహాదహ్ అంటే కేవలం “అంగీకారం” మాత్రమే కాదు


“అంగీకారం” తో పాటు “తిరస్కారం” కూడా. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

కనుక ఇక నుండి మిథ్యాదైవాలను నిరాకరించి కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించినవాడు ఎన్నటికీ ఏమాత్రం చెక్కుచెదరని దృఢమైన ఆశ్రయం పొందినట్లే. అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం తెలిసినవాడు. సూరా బఖరా 2:256


తొమ్మిదవ నిబంధన: చివరి శ్వాస వరకు షహాదహ్ను విడవక పోవడం

ప్రతి ముస్లిం తన ప్రాణం పోయేంత వరకు షహాదాపై నిలకడగా ఉండడం తీర్పుదినం నాడు సాఫల్యం పొందడానికి ఒక తప్పనిసరి అంశం. ఈ ప్రపంచంలో అతను ఎన్ని మంచి పనులు చేశాడు, ఎంతగా కీర్తిప్రతిష్టలు సంపాదించాడు అనే అంశాలు అక్కడ ప్రాధమిక స్థాయికి చెందినవి కావు. నిజానికి ప్రతి ముస్లిం తన జీవితాన్నంతా ఈ జెండా (ఈ ధ్వజం) క్రిందనే గడపడం, తన జీవితమంతా ఈ ధ్వజాన్ని మాత్రమే చెబుతూ గడపడం ముఖ్యం. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడుః “యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతుఖాతిహి –వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్” అనగా “విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా భయపడండి. అల్లాహ్ కు పూర్తిగా అంకితమై ముస్లింలుగా ఉన్న స్థితిలో తప్ప (అవిశ్వాసులుగా) మరణించకండి” సూరా ఆలి ఇమ్రాన్ 3:102


 

0 coment�rios:

Popular Posts