Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  జకాత్ (విధి దానము) నిర్ణీత సమయంలో, నిర్ణీత ధనము నుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది. జకాత్ ఆవశ్యకత ఇస్లాం మూలస్థంభాలలో జకాత్ ఒ...

జకాత్ (విధి దానము)

 

జకాత్ (విధి దానము)


నిర్ణీత సమయంలో, నిర్ణీత ధనము నుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది.

జకాత్ ఆవశ్యకత

ఇస్లాం మూలస్థంభాలలో జకాత్ ఒక ముఖ్య మూలస్థంభము. ఖుర్’ఆన్ లో చాలా చోట్ల అల్లాహ్ “సలాహ్” తో పాటు “జకాత్” ని కూడ విధిగా పేర్కొన్నాడు.

 

“సలాహ్ ను స్థాపించండి మరియు జకాత్ ను చెల్లించండి, మరియు రుకూ చేసే వారితో రుకూ చేయండి. (అల్లాహు తఆలా ముందు వంగే వారితో మీరూ వంగిపోండి)” (2:43)

 

బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బొధించారు:

“ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది

 

1). ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక్క అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సత్యమైన ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట,

 

2) సలాహ్ (నమాజ్)ని స్థాపించుట,

 

3) జకాత్ (విధి దానం) చెల్లించుట,

 

4) హజ్ చేయుట,

 

5) రమదాన్ నెల ఉపవాసములు ఉండుట.”

 

2వ హిజ్రీ సంవత్సరములో జకాత్ విధిగా చేయబడినది

ఎవరైతే జకాత్ విధిని నిరాకరించారో వారు అవిశ్వాసానికి పాల్బడినట్లు. వారు జకాత్ చెల్లించినప్పటికీ లేదా చెల్లించకపోయినా. మరియు ఎవరైతే జకాత్ విధి అని నమ్మి సాక్ష్యమిచ్చి, చెల్లించుటలో సోమరితనం ప్రవర్తించిన ఎడల అతను దుర్మార్గుడు. మరియు ఎవరైనా జకాత్ చెల్లించుట నిరాకరించిన యెడల వారికి విరుధ్ధంగా ధర్మ యుధ్ధం చేయడం జరుగును.

 

జకాత్ ప్రాముఖ్యతలు

1.     హృదయాన్ని మరియు ధర్మాన్నిశుభ్రపరచును. జకాత్ పన్నుకాదు. జకాత్ చెల్లించుటవలన ఆ ధనంలో శుభం మరియు అభివృధ్ధి కలుగును.
 

2.     తోటి మానవులపై దయ కలుగును, మరియు సమాజంలో ఏకత్వం పెంపొందును.
 
3.  ఎవరిపై అయితే జకాత్ విధిచేయబడినదో అతనికి పరీక్ష. అతను జకాత్ చెల్లించుట ద్వారా అల్లాహ్ కు సమీపమవుతాడు. మరియు అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించిన వాడవుతాడు.

 

జకాత్ ఎప్పుడు విధి అగును

 1.     ముస్లిం జకాత్ ఇవ్వడం వలన శుభ్రత మరియు శుభం   ప్రాప్తమగును. అవిశ్వాసి అశుభృడు.
 2.     స్వతంత్రుడై ఉండాలి. వేరే వారిపై ఆధారపడి ఉండరాదు.
 3.     జకాతు చెల్లించడానికి కావలసిన నిర్ణీత పరిమితి (నిసాబ్) – పూర్తి అయి ఉండాలి.
 4.     సమాజంలో శాంతిబధ్రతలు ఉండాలి మరియు ఆ ధనంలో వేరేవారి హక్కు ఉండరాదు.
5.     ఒక సంవత్సరము పూర్తి కావాలి.

0 coment�rios:

Popular Posts