తర్వియహ్ రోజు
జిల్ హజ్జా 8 వ తేదీని తర్వియహ్ రోజు అంటారు. ఈ రోజు హాజీ లు అందరూ మినా కు వెళ్లి ఆ రోజు రాత్రి పూర్తిగా ఉండాలి, ఈ రోజు హజ్ యొక్క మొదటి రోజు అవుతుంది.
పరిచయం
మినాకు జిల్ హజ్జా 8 వ తేదిన బయలు దేరాలి. హాజీలు జుహర్, అసర్ మరియు మఘ్రిబ్, ఇషా మరియు జిల్ హజ్జా 9వ తేది(అరఫాత్ రోజు) ఫజర్ ను మినాలోనే చదవాలి. జుహర్, అసర్ మరియు ఇషా నమాజులను రెండు రకాతులుగా తగ్గించుకోవాలి, ఈ నమాజులను ఆయా సమయాల్లోనే చదవాలి. సహీహ్ అల్-బుఖారీ 1083. ఇక్కడ అల్లాహ్ ను ఎక్కువగా స్మరించాలి మరియ దుఆ చేసుకోవాలి, మారియు తల్బియా ను పలుకుతూనే ఉండాలి.
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: మినా రోజున అల్లాహ్ ప్రవక్త ﷺజిల్ హజ్జా 8 వ తేదీన (యవమ్ అత్ తర్వియహ్) జుహర్ నమాజు మరియు జిల్ హజ్జా 9 వ తేదీ (యవమ్ అల్ అరఫాత్) ఫజర్ నమాజు ను చేశారు. సునన్ అబి దావూద్ : 1911
అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: అల్లాహ్ ప్రవక్త ﷺజిల్ హజ్జా 8 వ తేదీన (యవమ్ అత్ తర్వియహ్) జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా మరియు జిల్ హజ్జా 9 వ తేదీ (యవమ్ అల్ అరఫాత్) ఫజర్ నమాజు ను మినాలో చదివి అరఫాత్ కు వెళ్ళిపోయారు.సునన్ ఇబ్న్ మాజాహ్3004
0 coment�rios: