Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  షహాదహ్  –  సత్యధర్మ ధృవీకరణ   వచనం భావం : షహాదహ్ అంటే సత్యధర్మ ధృవీకరణ వచనం. ఈ “కలిమ”( వచనం) ఎలా ఒకవ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళ...

సత్యధర్మ ధృవీకరణ వచనం

 


షహాదహ్ – సత్యధర్మ ధృవీకరణ వచనం


భావం : షహాదహ్ అంటే సత్యధర్మ ధృవీకరణ వచనం. ఈ “కలిమ”( వచనం) ఎలా ఒకవ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవనమార్గం పై నడిపిస్తుందో, ఈ వ్యాసంలో స్పష్టంగా వివరించబడింది. ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన వ్యాసమిది.

 


మూల స్తంభం 

లా ఇలాహ ఇల్లల్లాహ్ముహమ్మదుర్రసూలుల్లాహ్ : (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడు,  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం “రసూలుల్లాహ్”, అనగా అల్లాహ్ యొక్క సందేశహరులు)

 

ఇస్లాం స్వీకరించిన అనేక మంది ప్రజలు ఇస్లాం యొక్క మొట్టమొదటి మూలస్తంభం.– “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్” యొక్క అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ మహోన్నత “కలిమ” వచనం యొక్క భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం.

 

“లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” అనే పవిత్ర వాక్యాన్ని నాల్గు భాగాలలో అర్థం చేసుకోవచ్చును:  (మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాలుగవ భాగం),

 

క్రింద తెలిపిన నాలుగు భాగాలుపై సర్వలోకాల సృష్టికర్త, ఉనికిలో ఉన్న ప్రతిదానికి ప్రభువు, ఏకైక మహోన్నతుడు మరియు తీర్పుదినాన న్యాయాధిపతి అయిన అల్లాహ్ కు మీరు వాగ్దానం చేయవలసి ఉన్నది.

 

మొదటిభాగం

అల్లాహ్ యొక్క చేతల్లో ఏకత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్“కేవలం అల్లాహ్ మాత్రమే ప్రతిదాన్ని సృష్టించిన సృష్టికర్త” అని హృదయపూర్వకంగా అంగీకరించటం. A confession with your heart that the Creator (of everything) is Allah; దీని కోసం మీరు ఇలా ధృవీకరించవలసి ఉంటుంది: “నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, స్వర్గలోకాలు, ప్రపంచానికి తెలిసిన మరియు తెలియని అన్ని రకాల జీవరాశులతో నిండి ఉన్న భూలోకం మొదలైన సకలలోకాలను సృష్టించిన, సర్వలోక సమర్థుడు కేవలం అల్లాహ్ మాత్రమే” అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే ఈ విశాల విశ్వము యొక్క  ప్రతిదానిని నడిపేవాడు మరియు ప్లానింగ్ చేసేవాడు. ఆయనే జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు, మరి కేవలం ఆయనే పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు” దీనినే “అల్లాహ్ యొక్క చేతల్లో ఏకత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్ అని అంటారు.

 

రెండవ భాగం

అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఏకత్వం” – తౌహీదుల్ఉలూహియ్యహ్: “ఇతరులెవ్వరూ ఆరాధ్యులు కారు, కాని ఒక్క అల్లాహ్ తప్ప” అని హృదయపూర్వకంగా సాక్ష్యమివ్వటం: ఇస్లామీయ భాషలో ఆరాధన అనే పదం అనేక విసృతార్థాలను ఇస్తుంది: అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కే చెందును అనే విషయాన్ని ఇది నొక్కి చెబుతున్నది. (అంటే ఇతరులెవ్వరూ – వారు దైవదూతలైనా, ప్రవక్తలైనా, సందేశహరులైనా, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా-జీసస్ అలైహిస్సలాం అయినా, ఉజైర్, ముహమ్మద్, సూర్యుడు, చంద్రుడు, విగ్రహాలు, సన్యాసులు అయినా, ఇంకావేరే ఇతర దైవాలైనా ఆరాధించటానికి అస్సలు అర్హులు కారు) కాబట్టి కేవలం అల్లాహ్ నే ఆరాధించవలెను, అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులెవ్వరినీ వేడుకోరాదు, అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరులెవ్వరి పేరు మీదా పశువులను బలివ్వరాదు, … etc, అర్థం ఏమిటంటే – ఖుర్ఆన్ లో మరియు సున్నహ్ (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశా)లలో వేటినైతే ఆచరించమని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఆదేశించారో వాటిని మనం తప్పక ఆచరించవలెను. మరియు ఏదైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయవద్దని నిషేధించారో, వాటిని మనం అస్సలు చేయకూడదు. దీనినే “అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఏకత్వం” – తౌహీదుల్ఉలూహియ్యహ్ అని అంటారు. కాబట్టి మనం అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ ను వదిలి ఇతరులెవ్వరినీ ఆరాధించరాదు.

 

మూడవ భాగం

తౌహీద్ అస్మా వ సిఫాత్ అత్యుత్తమైన నామాలుమహోన్నతమైన సుగుణాలు మరియు విశిష్ఠ లక్షణాలలో ఏకత్వం : “అత్యుత్తమైన నామాలు, మహోన్నతమైన సుగుణాలు మరియు విశిష్ఠ లక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును” అని హృదయపూర్వకంగా ధృవీకరించటం : “ఓ అల్లాహ్! నీ గ్రంథం(ఖుర్ఆన్) లో స్వయంగా నీకు నీవే పెట్టుకున్న లేక యోగ్యుడిగా ప్రకటించుకున్న అత్యుత్తమమైన పేర్లన్నీ మరియు మహోన్నతమైన సుగుణాలు, లక్షణాలన్నీ లేదా నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రకటనలలో తెలిపిన నీ యొక్క అత్యుత్తమ పేర్లు, మహోన్నతమై లక్షణాలన్నింటినీ నేను ధృవీకరిస్తున్నాను. ఇంకా అవన్నీ అసలు రూపంలో వాటి అర్థాలు లేక భావాలలో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండా, వాటిని నిర్లక్ష్యానికి గురిచేయకుండా, వేరే వాటితో పోల్చకుండా కేవలం ఆయనకే శోభిస్తాయని నేను నమ్ముతున్నాను.” ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ చూచేవాడూను” (సూరా ఆష్ షూరా 42:11)

 

సృష్టితాలతో అస్సలు పోల్చలేని ఆయన స్వరూపం, వినికిడి శక్తి మరియు దృష్టి యొక్క ప్రత్యేకతలను పై ఆయత్ ధృవీకరిస్తున్నది. అంతే కాక ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఎవరినైతే నా రెండు చేతులతో సృష్టించానో, (సూరా సాద్ 38:75)

 

మరియు ఖుర్ఆన్ లో మరో చోట అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “అల్లాహ్ చేయి, వారి చేతుల పై ఉన్నది.” (సూరా అల్ ఫతహ్  :48:10).

 

అల్లాహ్ కు రెండు చేతులు ఉన్నాయని ఈ పవిత్ర ఆయత్ లు ధృవీకరిస్తున్నాయి. కాని, ఆ చేతులను పోలిన చేతులను మానవుడి పరిమిత జ్ఞానం ఊహించలేదు.  అలాగే ఖుర్ఆన్ లో తెలిపిన “అల్లాహ్ తన సింహాసనం పై అధిష్టించి ఉన్నాడు” అనే దాన్ని మనకు తెలిసిన ప్రాపంచిక సింహాసనంతో పోల్చటం గాని, కూర్చోవటం అనే పనిని భూలోక జీవులు కూర్చునే విధంగా ఊహించటం గాని చేయకూడదు. (సూరా తాహా 20:5)

 

అల్లాహ్ సింహాసనం

అమిత దయగలవాడైన అల్లాహ్ సప్తాకాశాలపై  తన సింహాసనం పై తనకు శోభనిచ్చే విధంగా అధిష్టించినాడు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఒక బానిస స్త్రీని ‘అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రశ్నించగా, ఆవిడ ఆకాశం వైపునకు వేలెత్తి చూపినది. జిల్ హజ్ నెల 9వ తేదీన వచ్చే అరాఫాత్ దినమున మరియు ప్రతి రాత్రి మూడవ భాగములో ఆయన భూలోకానికి అతి దగ్గరలోని మొదటి ఆకాశానికి వస్తాడు. కాని ఆయన అపరిమితమైన దివ్యజ్ఞానం సర్వలోకాలలో వ్యాపించియున్నది, అనంత విశ్వాన్ని పరివేష్టించి ఉంది. అంతేకాని భౌతికంగా ఆయనే స్వయంగా లోకమంతా వ్యాపించిలేడు.  (బి-జాతిహి) అల్లాహ్ ఇక్కడ, అక్కడ, ప్రతి చోటా, ఇంకా మనుషుల హృదయాలలో వ్యాపించి ఉన్నాడనే భావన ఎంత మాత్రమూ వాస్తవం కాదు. మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తూ వున్నాడు మరియు పలికే ప్రతి పలుకును ఆయన వింటూవున్నాడు. దీనినే శుభమైన పేర్లు మరియు  విశిష్ఠ సుగుణాలు, మహోన్నత లక్షణాలు అంటారు. ఇటువంటి అల్లాహ్ యొక్క ఏకత్వాన్నే; తౌహీద్ అస్మా వ సిఫాత్:అంటారు. వీటినీ దైవవిశ్వాసులు “ఈమాన్” అంటారు, ఇంకా ఇదే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం నుండి చిట్టచివరి దైవప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకూ ధృవీకరించబడిన విశ్వాసం.

 

నాలుగవ భాగం

షహాదహ్ “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని రసూలుల్లాహ్ అంటే అల్లాహ్  యొక్క సందేశహరుడని” అర్థం. వారి పట్ల హృదయపూర్వకంగా సాక్ష్యమిచ్చుట: “ఓ అల్లాహ్! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను.” అల్లాహ్ ఆదేశం ప్రకారం అనుసరించటానికి అవసరమైన అర్హతలు, యోగ్యతలు ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ లేవు, ఎందుకంటే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు ఇంకా వారిలో చిట్టచివరి వారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ముహమ్మద్ తండ్రి కాడు ఎవ్వరికీ మీ పురుషుల్లో నుంచి. కాని ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు ఇంకా ప్రవక్తలలో చివరివాడు. మరియు అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం కలవాడు.” (సూరా అల్ అహ్జాబ్ : 33:40)

 

“మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు ఆయన మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి.” (సూరా అల్ హష్ర్ : 59:7).

 

“(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు, ‘మీకు అల్లాహ్ పట్ల (నిజంగా) ప్రేమ ఉంటే, మీరు నన్ను అనుసరించండి.(అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు మరియు అల్లాహ్ అమితమైన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత” (సూరా ఆలి ఇమ్రాన్ :3:31)

 

ఈసా అలైహిస్సలాం రాక

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లం కాకుండా ఇతరుల పలుకులను అల్లాహ్ యొక్క అంతిమ సందేశం (ఖుర్ఆన్ మరియు సున్నహ్) మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లామీయ ధర్మశాస్త్రంతో ఏకీభవిస్తున్నాయా లేదా అనే ప్రామాణికత ఆధారంగా స్వీకరించవచ్చును లేదా తిరస్కరించవచ్చును. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత దివ్యవాణి అవతరణ ఆగిపోయినది. మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా (జీసస్) అలైహిస్సలాం ఈ భూలోకానికి తిరిగి వచ్చే వరకు ఇది మరల ప్రారంభం కాదు. ఇంకా సహీహ్ బుఖారీ సంకలనపు మూడో గ్రంథంలోని 425వ హదీస్ లో తెలుపబడినట్లుగా -  ఈ ప్రపంచపు అంతిమ కాలంలో, ఈసా-జీసస్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇస్లామీయ ధర్మోపదేశాల ప్రకారం నడుచుకుంటారు.

 

సాక్ష్యం

అష్హదు అన్ – లా ఇలాహఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అనే పలుకులను తప్పనిసరిగా ఉచ్ఛరించవలెను. దీనికి ఆధారం తన పినతండ్రి అయిన అబూ తాలిబ్ మరణశయ్య పై, చివరి ఘడియలలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పలికిన పలుకులు: “ఓ బాబాయి, నీవు గనుక అష్హదు అన్ – లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్ష్యమిచ్చినట్లయితే, తీర్పు దినమున నేను అల్లాహ్ దగ్గర నీ కోసం ప్రార్థించగలను.” అలాగే, అబు జర్ గఫ్ఫారీ రజియల్లాహు అన్హు అనే అతను ఇస్లాం స్వీకరించిన తర్వాత మస్జిద్ అల్ హరాం దగ్గరకు వెళ్ళి, ఖురైషీయుల ఎదుట బిగ్గరగా షహాదా పవిత్ర వచనాన్ని ప్రకటించగా, వారు అతడిని విపరీతంగా కొట్టి, గాయపరచినారు.

 

పెదవులతో పాటు శరీరాంగములన్నీ ఆ పవిత్ర వచనానికి సాక్ష్యం పలికి, ధృవీకరించటం తప్పని సరి. దాని భావాన్ని(“అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను, ధృవీకరిస్తున్నాను”) మొత్తం శరీరాంగాలు పూర్తిగా అర్ధం చేసుకోవటం చాలా ఆవశ్యకమైన ముఖ్య విషయం. కాబట్టి దీనికి సమ్మతించిన వారెవరైనా సరే దోపిడి, దొంగతనం, హత్య, వ్యభిచారం, అక్రమసంబంధం, పంది మాంసం తినటం, మత్తుపానీయాలు సేవించటం, అక్రమ పద్ధతులలో సంపాదించటం, అనాధల ఆస్తిపాస్తులను అన్యాయంగా ఆక్రమించటం, వ్యాపార లావాదేవీలలో మోసం చేయటం, లంచాలు ఇవ్వటం, అబద్ధాలు చెప్పటం వంటివి చేయకూడదు. ఒకవేళ పవిత్ర వచనంపై సాక్ష్యం పలికీ, అటువంటి పాపపు పనులు చేసినట్లయితే, తీర్పు దినమున స్వంత శరీరావయవములే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. అంటే పవిత్ర వచనం పలకటం ద్వారా ఏదైతే అల్లాహ్ కు ప్రమాణం చేసాడో దానికి వ్యతిరేకంగా చేసేవాడని సాక్ష్యమిస్తాయి. ఒకవేళ అతడు పైన తెలిపిన పాపపు పనులలో ఏదైనా చేసినట్లయితే, అతడు  దానిని పాపపు పనిగా గ్రహించి, వెంటనే  అల్లాహ్ దగ్గర పశ్చాత్తాపపడి, మన్నింపమని వేడుకోవలెను. చేసిన పాపపు పనులకు తన స్వంత శరీరావయువాలైన చర్మం, రహస్యాంగాలు, చేతులు, నాలుక, చెవులు తీర్పుదినాన స్వయంగా తనకే వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయనే విషయం తెలుసుకోవలెను. ఎవరైనా సరే, ఈ పవిత్ర వచనాన్ని ధృవీకరించటంతోనే ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తారు. అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ విశ్వసించటం మరియు వారి మధ్య ఎటువంటి భేదాలుచూపకుండ నమ్మడం అతడి పై తప్పని సరి అయిపోతుంది. ఖుర్ఆన్  లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదిలి, నా దాసులను (అంటే దైవదూతలను, అల్లాహ్ యొక్క సందేశహరులను, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా అలైహిస్సలాం, పుణ్యపురుషులు..) తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకోగలరని భావించారా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాము.”

 

కర్మల పత్రం

“ప్రకటించు: ‘కర్మలను బట్టి అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా?’ “ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసేవన్నీ సత్కార్యాలే అని భావిస్తారో!” “వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి ఉన్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము తుది దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము. “వారి ప్రతిఫలం నరకం; ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు. “నిశ్చయంగా! ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారి ఆతిథ్యం కొరకు ఫిర్దౌస్ స్వర్గవనాలు (అత్యున్నత స్వర్గపు తోటలు) ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు. వారితో అను: “నా ప్రభువు మాటలు వ్రాయటానికి సముద్రమంతా సిరాగా మారిపోయినా – నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే – దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా అది కూడా తరిగి పోతుంది.” (ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అను: నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడినే. నాపై దివ్యజ్ఞానం అవతరింపజేయబడినది. నిశ్చయంగా మీ ఆరాథ్యుడు ఆ ఏకైక ఆరాధ్య దైవం (అల్లాహ్) మాత్రమే. కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములు (షరీక్) గా కల్పించుకోరాదు.” (సూరా అల్ కహఫ్ 18:102-110)

 

ఇస్లాం మూల స్తంభాలు

ఎవరైనా ఇస్లాం స్వీకరించాలనుకుంటే, క్లుప్తంగా పైన తెలిపిన కనీస ఇస్లాం పరిచయ విషయాలు తప్పక చదవుకోవలెను. షహాదా పవిత్ర వచనాలపై సాక్ష్యం పలికిన తర్వాత, ఇస్లామీయ పద్ధతిలో సంపూర్ణ తలస్నానం – గుసుల్ చేసి, రెండు రకాతుల నమాజు చేసి, ఆ తర్వాత ఇస్లాం యొక్క ఐదు మూల స్థంభాల ఆధారంగా జీవించటం మొదలు పెట్టవలెను.ఇంకా సహీహ్ బుఖారీ హదీస్ సంకలనంలోని మొదటి హదీస్ గ్రంథం 7వ హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  చేసిన బోధనను ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు – ఇస్లాం ఐదింటిపై ఆధారపడి ఉన్నది:

 

1) లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధించకూడదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని నేను సాక్ష్యమివ్వటం, ధృవీకరించటం.

2) నమాజు స్థాపించటం.

3) జకాతు– తప్పని సరి విధిదానం చెల్లించటం.

4) రమజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండటం.

5) హజ్ చేయటం (i.e.మక్కా యాత్ర).

 

ఈమాన్ మూల స్థంబాలు

ఇంకా అర్కాన్ అల్ ఈమాన్ అంటే విశ్వాసపు ఆరు సిద్ధాంతాలను కూడా నమ్మవలసి ఉంటుంది. అవి:

  1. అల్లాహ్ పై విశ్వాసం
     
  2. అల్లాహ్ యొక్క దైవదూతలపై విశ్వాసం
     
  3. అల్లాహ్ యొక్క సందేశహరులపై విశ్వాసం
     
  4. అల్లాహ్ యొక్క గ్రంథాలపై విశ్వాసం
     
  5. తుది దినం పై విశ్వాసం
     
  6. అల్ ఖదర్ (విధిరాత)– జీవితంలో జరగబోయే మంచిచెడులను అల్లాహ్ ముందుగానే లిఖించి ఉంచాడనే నమ్మకం పై విశ్వాసం.

 

పుణ్య స్వీకారాలు

మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యాలు క్రింద తెలిపిన రెండు షరతుల ప్రకారం ఉంటేనే అల్లాహ్ దగ్గర స్వీకరించబడతాయి.:

  1. మంచి పనులు, పుణ్యకార్యాలు కేవలం అల్లాహ్ స్వీకరణ కొరకు మాత్రమే చేస్తున్నట్లు దృఢ సంకల్పం చేసుకోవలెను. అందులో ఎటువంటి ప్రదర్శనా బుద్ధి, కీర్తి ప్రఖ్యాతల తాపత్రయం గాని, ఎవరినైనా మెప్పించటం కోసం చేసే ప్రయత్నం గాని, ఇంకా స్వార్థం వంటివి ఉండకూడదు.
     
  2. మంచి పనులు, పుణ్యకార్యాలు అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడు మరియు దాసుడు అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సున్నహ్ (ఇస్లామీయ ధర్మాదేశాల, ఆచరణల, అనుమతుల) ప్రకారం ఉండవలెను.

0 coment�rios:

Popular Posts