Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన చివరి ప్రసంగం 623 C.E వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలో...

దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన చివరి ప్రసంగం

 దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన చివరి ప్రసంగం

623 C.E వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలోని భాగం

అల్లాహ్ ను ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపిన తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సంబోధించారు (ప్రపంచం నలుమూల నుండి వచ్చిన దాదాపు లక్షన్నర స్త్రీ పురుషుల సమూహానికి చేసిన ఉపదేశం):

"ఓ ప్రజలారా ! శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పుగా అప్పగించండి, ఎందుకంటే నేను ఈ సంవత్సరం తర్వాత మీ మధ్యన జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి, నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి మరియు ఈ పదాలను (సందేశాన్ని) నేడు ఇక్కడ హాజరు కాలేకపోయిన వారికి కూడా చేర్చండి


ధన ప్రాణాలు చాలా విలువైనవి

ఓ ప్రజలారా ! మీరు ఈ నెలను, ఈ దినమును పవిత్రమైనదిగా పరిగణించినట్లే, ప్రతి ముస్లిం జీవితాన్ని (ప్రాణాన్ని) మరియు సంపదను(ఆస్తిని) పవిత్రమైన విశ్వాస నిక్షేపంగా (నమ్మికగా) పరిగణించవలెను. మీ వద్ద నమ్మకంతో ఉంచిన వస్తువుల్ని, వాటి అసలైన యజమానులకు తిరిగి వాపసు చెయ్యవలెను. మీరు ఎవ్వరికీ హాని కలిగించ కూడదు, దాని వలన మీకెవ్వరూ హాని కలిగించరు. ‘నిశ్చయంగా మీరు మీ రబ్ (ప్రభువు) ను కలుసుకోబోతున్నారు మరియు ఆయన నిశ్చయంగా మీ కర్మల లెక్క తీసుకోబోతున్నాడు’ అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలెను. 


వడ్డీ నిషేధించబడింది

మీరు వడ్డీ తీసుకోవటాన్ని అల్లాహ్ నిషేధించాడు; కాబట్టి ఇక మీదట వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ, హక్కులన్నీ రద్దు చేయబడినవి. మీ యొక్క అసలు మూలధనం మాత్రం మీరు తీసుకోవచ్చును. మీరు అసమానత్వాన్ని (హెచ్చుతగ్గులను, భేదాలను, వైషమ్యాలను) బలవంతంగా రుద్దకూడదు మరియు సహించకూడదు. వడ్డీ నిషేధించబడినదని అల్లాహ్ తీర్పునిచ్చినాడు మరియు అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ కు చెల్లించ వలసి ఉన్న మొత్తం వడ్డీ ఇక మీదట రద్దు చేయబడినది.


షైతాన్ మీ శత్రువు

షైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా (జాగ్రత్తగా) ఉండవలెను. అతడు పెద్ద పెద్ద విషయాలలో మిమ్ముల్ని తప్పు దారి పట్టించే శక్తి తనకు ఏ మాత్రం లేదని తెలుసుకుని,తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా అతడిని అనుసరించకుండా అప్రమత్తంగా ఉండవలెను.


స్త్రీల హక్కులు

ఓ ప్రజలారా ! మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నమాట వాస్తవమే కాని వారికి కూడా మీ పై హక్కులు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం అల్లాహ్ పై ఉన్న విశ్వాసం ఆధారంగానే మరియు అల్లాహ్ యొక్క అనుమతి మూలంగానే మీరు వారిని తమ తమ భార్యలుగా చేసుకున్నారు.

మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు శ్రద్ధాభక్తులతో, సేవానిరతితో సహాయ సహకారాలందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తిచేస్తున్నట్లయితే, మీ నుండి దయతో ఆహారం (అన్నపానీయాలు) మరియు దుస్తులు పొందే హక్కు వారి స్వంతమవుతుంది. ఇంకా మీరు అనుమతించని (ఇష్టపడని) వారితో, వారు స్నేహంగా మెలగకూడదనేది మరియు తమ శీలాన్ని అస్సలు కోల్పోకూడదనేది (వ్యభిచరించకూడదు, తుంటరిగా ప్రవర్తించకూడదు) వారిపై మీకున్న హక్కు.


ఇస్లాం మూల స్తంభాలు

ఓ ప్రజలారా ! అత్యావశ్యకంగా నా మాట వినండి. కేవలం అల్లాహ్ నే ఆరాధించండి, ప్రతి దినపు ఐదు తప్పని సరి నమాజులను పూర్తిచేయండి, రమజాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరియు తప్పనిసరి అయిన విధిదానం (జకాత్) పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ మీకు తగిన శక్తిసామర్ధ్యాలు ఉన్నట్లయితే, హజ్ యాత్ర పూర్తిచేయండి. 


న్యాయం, రుజుమార్గం

మొత్తం మానవజాతి ఆదం (అలైహిస్సలాం) సంతతి యే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు మరియు ఇతరులకు అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు; అలాగే నల్లవారి పై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారి పై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు, కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప.


సోదరభావం

ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క ఇతర ముస్లింకు సోదరుడని మరియు ముస్లింలు సోదర భావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించవలెను. తోటి ముస్లింలకు చెందిన వాటిపై, మీకు ఎటువంటి అధీనం (వారసత్వం) లేదు, కాని స్వతంత్రంగా మరియు మనస్పూర్తిగా వారు ఇష్టపడి మీకిస్తే తప్ప. కాబట్టి, ఈ విధంగా మీకు మీరే (ఇతరుల హక్కును గౌరవించకుండా) అన్యాయం చేసుకోవద్దు.


సత్య మార్గాన్ని వీడకూడదు 

జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరోజు మీరు అల్లాహ్ ముందు హాజరవబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి ఆచరణకు ఆ రోజున సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త ! నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్యమార్గానికి దూరం కావద్దు. 


ధర్మం మరియు ప్రవక్తల పరంపర పూర్తిచేయబడింది

ఓ ప్రజలారా ! నా తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహరుడు రాడు, ఏ క్రొత్త ధర్మమూ పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించండి.


ఖుర్ఆన్ మరియు సున్నత్

ఓ ప్రజలారా ! ఇంకా, నేను మీకు తెలియజేస్తున్న ఈ పదాలను మంచిగా అర్థం చేసుకోవలెను – నేను నా వెనుక (నా తర్వాత) రెండు విషయాలను వదిలి వెళ్ళుతున్నాను, ఒకటి దివ్యఖుర్ఆన్ మరియు రెండోది నా నిదర్శనం (దృష్టాంతం, ఉదాహరణ (సున్నత్)మరియు మీరు ఈ రెండింటినీ గనుక అనుసరిస్తే, ఎట్టి పరిస్థితిలోను నశించిపోరు.


ఇస్లాం సందేశాన్ని ఇతరులకు తెలియజేయండి

నా వాక్కులు వింటున్నమీరందరూ, వీటిని ఇతరులకు చేర్చవలెను, ఇంకా ఆ ఇతరులు వేరే ఇతరులకు చేర్చవలెను. అలా విన్నవారిలో చిట్టచివరి తరం వారు, ఇప్పుడు నా నుండి ప్రత్యక్షంగా వింటున్న మీకంటే ఇంకా మంచిగా అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉన్నది.


ఓ అల్లాహ్ (ఏకైక దైవారాధకుడు)నేను నా కివ్వబడిన దివ్యసందేశాన్ని నీ ప్రజలకు అందజేసానని దీనికి సాక్ష్యం నీవే.

0 coment�rios:

Popular Posts