హదియ్
హదియ్ అనగా జంతు బలి అని అర్థం, హాజీ ఏదైతే హజ్ లో బహుమానం(యహ్దీహి) కుర్భానీ ఇచ్చేదానిని హదియ్ అంటారు. అల్ –అన్’ ఆమ్చెప్పబడిన జంతువులు అనగా గొర్రె, ఒంటె లను ఇహ్రామ్ ధరించక ముందే తెచ్చుకోవాలి. హజ్ ఏ తమత్తు మరియు హజ్ ఏ కిరాన్ చేసే వారికి గల మధ్య తేడా హజ్ ఏ కిరాన్ చేసేవారికి ఏమిటంటే, హజ్ ఏ కిరాన్ చేసేవారు ఉమ్రా చేసిన తర్వాత ఇహ్రం ను తీసివేయకూడదు, ఆ విధంగా ఈ ఇహ్రామ్ జుల్ హజ్జా ఎనిమిదవ తేదీ వరకు ఉండాలి, ఈ రోజే హాజీలు హాజ్జ్ చేయడానికి నిశ్చయించుకుంటారు.
హజ్ చేయని వారు ఈద్ ఉల్ అద్ హారోజున కుర్భానీ ఇవ్వాలి, ఇదిజుల్ హజ్ లోని పదవ తేదీ, ఈ రోజును ఉదియహ్ అని అంటారు.
ఏ హజ్ యాత్రికుడు కూడా కుర్బానీనీ తన దేశంలో ఇస్తానని నిశ్చయించుకోకూడదు, ఎందుకనగా కుర్భానీ హజ్ లోని ఒక ఒక మూలస్థంభం, కాబట్టి కుర్భానీ మక్కాలోనే ఇవ్వాలి. ఒకవేళ హాజీ ఏదైనా చేసినందుకు దాని బదులుగా హజ్ లో కుర్భానీ ఇవ్వాలనుకోవడానికి కూడా అనుమతిలేదు, అలాగే తన దేశంలో కూడా ఇవ్వడానికి అనుమతి లేదు, కాబట్టి కేవలం కుర్భానీ మినా లేదా మక్కా లోనే ఇవ్వాలి.
అబ్దుల్అజీం ఆబాది ఇలా చెప్పారు: మక్కాలోనీ హరం దగ్గర ఏ ప్రదేశంలోనైనా జంతు కుర్భానీ ఇవ్వవచ్చు. విద్వాంసుల దృష్టిలో మినాలో కుర్భానీ ఇవ్వడాన్ని ఉత్తమంగా పరిగణించారు.
హజ్;ఉమ్రా;జుల్ హిజ్జా;యవమ్ ఉన్ నహర్;ఇహ్రామ్;మస్జిద్ ఏ హారం;మక్కా
0 coment�rios: