Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


తర్వియహ్ రోజు జిల్ హజ్జా 8 వ తేదీని తర్వియహ్ రోజు అంటారు. ఈ రోజు హాజీ లు అందరూ మినా కు వెళ్లి ఆ రోజు రాత్రి పూర్తిగా ఉండాలి, ఈ రోజు హజ్ యొక్...


తర్వియహ్ రోజు


జిల్ హజ్జా 8 వ తేదీని తర్వియహ్ రోజు అంటారు. ఈ రోజు హాజీ లు అందరూ మినా కు వెళ్లి ఆ రోజు రాత్రి పూర్తిగా ఉండాలి, ఈ రోజు హజ్ యొక్క మొదటి రోజు అవుతుంది.

పరిచయం

జిల్ హజ్జా 8 వ తేది హాజీ హజ్ ఏ తమత్తు చేసేవారు, వారు నివాసం ఉన్న చోటు నుండి మరల ఇహ్రాం ధరించి, ఇలా పలకాలి: “లబ్బైక అల్లాహుమ్మ హజ్జన్”.

 

మినాకు జిల్ హజ్జా 8 వ తేదిన బయలు దేరాలి. హాజీలు జుహర్, అసర్ మరియు  మఘ్రిబ్, ఇషా మరియు జిల్ హజ్జా 9వ తేది(అరఫాత్ రోజు) ఫజర్ ను మినాలోనే  చదవాలి. జుహర్, అసర్ మరియు ఇషా నమాజులను రెండు రకాతులుగా తగ్గించుకోవాలి, ఈ నమాజులను ఆయా సమయాల్లోనే చదవాలి. సహీహ్ అల్-బుఖారీ 1083. ఇక్కడ అల్లాహ్ ను ఎక్కువగా స్మరించాలి మరియ దుఆ చేసుకోవాలి, మారియు తల్బియా ను పలుకుతూనే ఉండాలి.

 

హదీస్

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: మినా రోజున  అల్లాహ్ ప్రవక్త జిల్ హజ్జా 8 వ తేదీన (యవమ్ అత్ తర్వియహ్) జుహర్ నమాజు మరియు జిల్ హజ్జా 9 వ తేదీ (యవమ్ అల్ అరఫాత్) ఫజర్ నమాజు ను చేశారు. సునన్ అబి దావూద్ : 1911

 

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ ఉల్లేఖనం ప్రకారం: అల్లాహ్ ప్రవక్త జిల్ హజ్జా 8 వ తేదీన (యవమ్ అత్ తర్వియహ్) జుహర్, అసర్, మగ్రిబ్ మరియు ఇషా మరియు జిల్ హజ్జా 9 వ తేదీ (యవమ్ అల్ అరఫాత్) ఫజర్ నమాజు ను మినాలో చదివి అరఫాత్ కు వెళ్ళిపోయారు.సునన్ ఇబ్న్ మాజాహ్3004  

 

ఇవి కూడా చూడండి

హజ్; ఉమ్రా; తవాఫ్; అరఫాత్; మినా; ఈద్ ఉల్ ఆజా; సఫా వల్ మర్వా; మక్కా

 

  ఖుర్బానీ ఉర్దూ పదం ఖుర్బానీ (బలి) అరబీ పదం ఖుర్బాన్ నుండి వచ్చింది. దీని భావానువాదం మహోన్నతుడైన అల్లాహ్ ను ఆనందపరచడం, సంతోషపెట్టడం. వాస్తవ...

 

ఖుర్బానీ


ఉర్దూ పదం ఖుర్బానీ (బలి) అరబీ పదం ఖుర్బాన్ నుండి వచ్చింది. దీని భావానువాదం మహోన్నతుడైన అల్లాహ్ ను ఆనందపరచడం, సంతోషపెట్టడం. వాస్తవంగా అల్లాహ్ సంతోషపడే అన్ని రకాల దానధర్మాలను ఖుర్బానీ అంటారు. ఇస్లామీయ పరిభాషలో అల్లాహ్ కోసం చేసే జంతు బలిని ఖుర్బానీ అంటారు

ప్రార్ధించే విధానం


జంతు బలి ప్రతి జాతిలో తమ ధర్మ శాస్త్రాల ప్రకారం గుర్తింపు పొందిన అల్లాహ్ ను ప్రార్ధించే విధానం. ప్రాచీన జాతుల్లో కూడా జంతు బలి ఇవ్వబడేది. కాని అది అల్లాహ్ కొరకు కాకుండా దైవేతరుల కొరకు ఇచ్చేవారు. ఇది ఇస్లామీయ బోధనలకు పూర్తిగా విరుద్ధమైనది.  

 

ఇస్లామీయ చట్టం ప్రకారం జంతు బలి గుర్తింపు పొందిన అల్లాహ్ ను ప్రార్ధించే విధానం. ఇది జుల్ హిజ్జా లోని 4 రోజుల్లోనే చేయాలి. ఆ రోజులు – జుల్ హిజ్జా మాసంలోని 10,11,12, మరియు 13 తేదీలు. బక్రీద్ పండుగ రోజు మరియు దాని తరువాతి మూడు తష్రీఖ్ రోజులు. అలీ ఇబ్న్ అబీ తాలిబ్ రజిఅల్లాహు అన్హు ఉల్లేఖించారు: “ఖుర్బానీ (బలి) ఇచ్చే రోజులు, (యౌమున్ నహర్) పండుగరోజు, దాని తరువాతి మూడు రోజులు.” ఈ రోజుల్లో ఉపవాసం ఉండటం నిషేధించబడింది. ఈ హదీసును అల్ అల్బాని గారు ధృవీకరించారు (అల్ సిల్సిలా అల్ సహీహా-2476).  ఆయిషా రజిఅల్లాహు అన్హా, ఇబ్న్ ఉమర్ రజిఅల్లాహు అన్హు ఇలా అన్నారు: “అల్ తష్రీఖ్ రోజుల్లో (జుల్ హిజ్జా మాసం10,11,12,13 తేదిల్లో) ఎవరికీ ఉపవాసం ఉండే అనుమతి లేదు. బలి ఇవ్వడానికి జంతువు లేని వారు తప్ప.”

 

ఇలా చేయడానికి మూల కారణం – తన సొంత కుమారున్ని అల్లాహ్ కోసం బలిఇవ్వడం  ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం  తన కలలో చూసి దాన్ని అమలు కూడా చేశారు. కాని అల్లాహ్ అతని విశ్వాసాన్ని మెచ్చుకొని అతని కుమారుని బదులు ఓ గొర్రెను పంపించాడు. సహీహ్ బుఖారీ (NE1884)

 

అల్లాహ్ కు విధేయత


ఖుర్బానీ ద్వారా మానవుడు అల్లాహ్ కు తనను తాను పూర్తిగా సమర్పిస్తాడు. అల్లాహ్ ఆజ్ఞలకు పూర్తిగా విధేయత చూపుతూ జీవితం గడుపుతాడు. ఖుర్బానీ ఇచ్చినప్పుడు అతను ఇదే చాటుతాడు. ఒకసారి అల్లాహ్ తరఫున ఒక ఆజ్ఞ వచ్చిందంటే ఇక అతడు దానికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితుల్లోను వెళ్ళడు. అల్లాహ్ ఆజ్ఞకు అతను వ్యతిరేకంగా ఆలోచించడూ. ఎందుకంటే అతనికి తెలుసు అల్లాహ్ ఆదేశం ముందు తను ఆలోచించడం ఎంత అవివేకమో.   

 

ఖుర్ఆన్ వెలుగులో


అల్లాహ్ ఖుర్ఆన్ లో అనేక చోట్ల ఏమని సెలవిచ్చాడంటే, ఏ పని చేసినను అది కేవలం అల్లాహ్ కొరకై ఉండాలి. దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “quran translation”“కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు.” ఖుర్ఆన్ సూరా కౌసర్ 108:2 

  తక్సీర్ వల్ హల్క్ తక్సీర్ వల్ హల్క్ అనగా పూర్తి వెంట్రుకలను కత్తిరించడం.హాజీ(పురుషుడు) ఉమ్రా చేసిన తర్వాత లేదా హాజ్ మూడవ రోజు తల వెంట్రుకల...

 

తక్సీర్ వల్ హల్క్


తక్సీర్ వల్ హల్క్ అనగా పూర్తి వెంట్రుకలను కత్తిరించడం.హాజీ(పురుషుడు) ఉమ్రా చేసిన తర్వాత లేదా హాజ్ మూడవ రోజు తల వెంట్రుకలను పూర్తిగా లేదా దగ్గరికి కత్తిరించుకోవాలి.లేదా పూర్తిగా హలక్(తల వెంట్రుకలను పూర్తిగాతీసివేయవచ్చు) చేయవచ్చు

పరిచయం

హాజీ(పురుషుడు) ఉమ్రా చేసిన తర్వాత లేదా హాజ్ మూడవ రోజు తల వెంట్రుకలను పూర్తిగా లేదా చిన్నగాకత్తిరించుకోవాలి. లేకపోతే పూర్తిగా హలక్(తల వెంట్రుకలను తీసివేయవచ్చు) చేయవచ్చు.అల్లాహ్ప్రవక్త()సాంప్రదాయం హల్క్ చేయించుకోమనిప్రోత్సహిస్తుంది

 

  1. పురుషులకు పూర్తిగా తల వెంట్రుకలు కత్తిరించడం  లేదా చిన్నగాకత్తిరించడం, ఈ  రెండు విషయాలలో దేనినైనా పాటించవచ్చు. స్త్రీలుతన క్రింది వెంట్రుకల నుండి కొంచెం పై భాగం వరకు కత్తిరించవచ్చు. ప్రవక్త()ఎవరైతే పూర్తిగా తల వెంట్రుకలు తీసివేస్తారో వారి కోసం మూడుసార్లు దుఆ చేశారు, అలాగే తల వెంట్రుకలను చిన్నగా కత్తిరించుకున్న వారికి ఒక సారి దుఆ చేసాడు.
     
  2. ఇప్పుడు మీరు స్నానం చేసి ఇహ్రామ్ ను తీసి వేసి సాధారణ దుస్తులను ధరించవచ్చు.
     
  3. ఆ తర్వాత మిగతా నిషేదించిన పనులన్నీ చేయవచ్చు ఒక భార్యతో సంబోగం చేయడం తప్ప. దీనినే అత్ తహ్ల్లుల్ అంటారు.

 

హదీస్

అనస్ బిన్ మాలిక్ (ర.జి) ఉల్లేఖనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త ()మినా కు వచ్చిన తర్వాత, ఆయన()జమరాహ్ దగ్గరకు వెళ్లి రాళ్ళను విసిరేవారు, ఆ తర్వాత మినా కు చేరుకున్న తర్వాత జంతువును బలి ఇచ్చారు. తర్వాతఆయన()మంగళి వాడిని పిలిచి ఆయన కుడి వైపు తిరిగి తల వెంట్రుకలను తీయమని చెప్పి అలా ఎడమ వైపు వరకు పూర్తిగాతీసివేయించారు. తర్వాత ఆయన ()తన తల వెంట్రుకలను ప్రజలకు ఇచ్చేశారు. సహీహ్ ముస్లిం 1305

 

పూర్తివెంట్రుకలనుతీసివేయడానికికల విశిష్టత (హలక్)

యహ్య బిన్ అల్-హుస్సేన్ ఉల్లేఖనం ప్రకారం వీరి తాత గారు చెప్పిన ప్రకారం . ప్రవక్త()ఎవరైతే పూర్తిగా తల వెంట్రుకలు తీసివేస్తారో వారి కోసం మూడుసార్లు దుఆ చేశారు, అలాగే తల వెంట్రుకలను చిన్నగా కత్తిరించుకున్న వారికి ఒక సారి దుఆ చేసాడు. ఇక్కడ ఉల్లేఖుడు ఏ హాజీ గురించి కూడా చెప్పలేదు. సహీహ్ ముస్లిం1303 మరియు సహీహ్ అల్-బుఖారీ 1728 
 

జిల్హజ్జా 10 వ తేదీన చేయవలసిన పనులు

  1. తక్సీర్ వల్ హల్క్ రమీ–పెద్ద జమరాహ్ పై రాళ్ళు విసరడం (జమరా ఏ అక్బా కు7రాళ్ళు విసరడం )
     
  2. హలక్ వ తక్సీర్ – వెంట్రుకలనుపూర్తిగాతీసివేయడం లేదా కత్తిరించడం
     
  3. హాది–జంతువునుబలి ఇవ్వడం
     
  4. తవాఫుల్ ఇఫాదహ్ – హజ్ తర్వాత చేసే చిట్ట చివరి తవాఫ్ 
     
  5. మఖాం ఏ ఇబ్రహీం దగ్గర 2 రకాతుల నమాజు చేయడం
     
  6. జం జం నీరు త్రాగడం
     
  7. సఫా వల్ మర్వా

 

అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ బిన్ అల్-ఆస్(ర.జి) ఉల్లేఖనం ప్రకారం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుర్భానీ ఇచ్చే రోజుప్రసంగానికి నేను సాక్ష్యంగా ఉన్నాను. ఒక వ్యక్తి లేచి ఇలా చెప్పాడు, “ నా ఆలోచన ప్రకారం ఈ పనుల ముందుగా ఈ పనులు చేసి ఉండాలి. నేను కుర్భానీ ఇవ్వకముందు పూర్తిగా వెంట్రుకలను కత్తిరింపజేశాను. (ఇంకొక వ్యక్తి ఇలా చెప్పాడు), “ నేను రమీ చేయకముందే కుర్భానీఇచ్చాను అని చెప్పాడు.”  అప్పుడు ప్రజలుఈవిషయంపైవివిధ ప్రశ్నలు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు, “ మీరుఈ పనులు తొందరగా చేయండి ఈవిదంగా చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. “ ఎవరైనాప్రవక్త()  కు దేని గురించైనా అడిగితే, ఆయన() ఇలా చెప్పేవారు, “తొందరగా చేయండి ఈవిదంగా చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు”.“ సహేహ్ అల్-బుఖారీ Vol.2.:1737 మరియు సహీహ్ అల్ – బుఖారీ విభాగం Vol.1: 124 

 

ఇవి కూడా చూడండి

హజ్;ఉమ్రా; మీకాత్; ఇహ్రం; తవాఫ్; జమరాహ్; జమ్ జమ్; సఫా వల్ మర్వా;

  అస్- సఫా వల్-మర్వాహ్ సఫా మరియు మర్వా అనేవి చిన్న పర్వతాలు ఇవి సౌదీ అరేబియాలోని మక్కాలోని కాబా దగ్గర వున్నవి. సఫా మరియు మర్వా అనేవి హజ్ మరి...

 

అస్- సఫా వల్-మర్వాహ్


సఫా మరియు మర్వా అనేవి చిన్న పర్వతాలు ఇవి సౌదీ అరేబియాలోని మక్కాలోని కాబా దగ్గర వున్నవి. సఫా మరియు మర్వా అనేవి హజ్ మరియు ఉమ్రా లోని ఒక భాగం. ప్రతి హాజీ ఈ రెండు పర్వతాల మధ్యలో ఏడు సార్లు నడవాలి. ఈ రెండు ప్రదేశాల మధ్యలో నడవాన్ని స’యీ అంటారు. (ఈ రెండు ప్రదేశాలు అల్లాహ్ సూచనలలోనివి)

 

ఖుర్ఆన్ దృష్టిలో

ఈ విషయాన్ని ఖుర్ఆన్ దృష్టిలో చూస్తే  ఇవి అల్లాహ్ చిహ్నలలోనివి . అల్లాహ్ సుబు హానహు వత ఆలా ఖుర్ఆన్ లో  ఇలా సెలవిస్తున్నాడు.  ఇన్నస్-సఫా-వల్-మర్-వత-మిన్ షఆ-ఇరిల్లాహి-ఫమన్ హజ్జల్ బైత-అవి’-తమర-ఫలా-జునాహా-అలైహి-అన్-యత్-తవ్వఫ- బిహిమా-వమన్-తతవ్వఅ-ఖైరన్-ఫ-ఇన్నాల్లాహా-షాకిరున్-అలీమున్. 

 

నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్ చిహ్నాలలోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి)హజ్ ఉమ్రాలు చేసేవారు వాటి మధ్యన ప్రదక్షిణ అందులో ఏ మాత్రం తప్పులేదు. స్వచ్చందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్ ఆదరించేవాడు, తెలుసుకునేవాడు. సూరా అల్ బఖర 2:158.

 

హాజ్ మూలస్థంభం

 ఈ రెండు ప్రసిద్ధిగాంచిన పర్వతాలు మక్కాలోని  అల్-మస్జిద్ అల్ హరాం  ప్రదేశంలో ఉన్నవి. అస్-సఫా పర్వతం అబూ ఖుబైస్ పర్వతం తో కలిసి ఉన్నది, అల్-మర్వా పర్వతం ఖు’అయ్కి’ఆన్ తో కలిసి ఉన్నది. అల్-మస్జిద్ అల్-హరాం విస్తరణ సమయంలో అస్-సఫా,అల్-మర్వా పర్వతాలు మిగతా వాటితో వేరు అయ్యాయి, అలాగే ఈ రెండు పర్వతాలు అల్-మస్జిద్ అల్-హరాం ఆవరణలోకి వచ్చాయి.

 

 అస్-సఫా,అల్-మర్వా మధ్య దూరం 400 మీటర్లు,  మస్’అ ప్రదేశం [అస్-సఫా,అల్ మర్వా మధ్యలో హాజీ లు నడిచే ప్రదేశం లో ] ఆకుపచ్చని బల్బులతో  55 మీటర్లు  దూరం వరకు ఆవరించి ఉంది.  ఈ ప్రదేశంలో హాజీలు కొంచెం వేగంగా పరిగెత్తాలి. ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం భార్య అయిన హాజిరా అలైహిస్సలాం మస్’అ ప్రదేశంలో నీటి కోసం వేగంగా పరిగెత్తుతూ వెతకసాగింది.

 

అస్-సఫా మరియు అల్-మర్వా మధ్యలో చేసే స’యీ అనేది హజ్ ,ఉమ్రా ల మూలస్థంభం. మొత్తం పూర్తిగా 7 సార్లు తిరగాలి, మొదట సఫా దగ్గర నుండి మొదలు పెట్టాలి. జాబిర్ ఉల్లేఖనం ప్రకారం సహీహ్ అల్ – బుఖారీ లో ఇలా తెల్పబడింది: ప్రవక్త ముహమ్మద్ హజ్ సమయంలో 7 సార్లు సయీ అస్-సఫా మరియు అల్-మర్వా మధ్యలో తిరగారు

 

సఫా,మర్వా మధ్యలో చేసే స’యీ

సఫా మర్వా మధ్యలో నడిచే లేదా పరిగెత్తడాన్ని స’యీ అంటారు.ప్రవక్త సఫా దగ్గర నుండి మొదలుపెట్టేవారు, అక్కడ కాబా కనబడే వరకు సఫా పర్వతం పైకి చేరి తన మొహాన్ని కాబా వైపు త్రిప్పి దుఆ చేసి తక్బీర్ ఈ క్రింది పదాలను పలికేవారు:

 

అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ – లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు – లహుల్ ముల్కు  వ లహుల్ హందు  - యుహీఉ  వ యుమీతు వ హువ అలా కుల్లి షైయిన్ ఖదీర్ - లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీకలహు – అన్జజా వ’దహూ వ నసారా’అబ్దహు వ హజామల్ ఆహ్ జాబ వహ్దహు.   

 

ఇలా మూడుసార్లు పలికిన తర్వాత దుఆ చేసేవారు. ప్రవక్త స’యీ చేయండి అల్లాహ్ మీపై స’యీ చేయడం విధిగా చేశాడు అని చెప్పారు.

 

కాబట్టి ఆయన  కుడి ఎడమల  వైపు ఆకుపచ్చని చిహ్నం వచ్చినప్పుడు త్వరగా పరిగెత్తడం మొదలెట్టారు, ఆ విధంగా రెండవ ఆకుపచ్చని చిహ్నం వరకు వెళ్లి అక్కడినుండి నెమ్మదిగా నడిచేవారు. ఈ ఆకుపచ్చని చిహ్నం ప్రవక్త ముహమ్మద్ కాలంలో ఎండిన బురుద మట్టిలో కొన్ని రాళ్ళను కలిపి ఒక చిన్న అడ్డుగోడ గా ఉండేది. ప్రవక్త ఇలా చెప్పారు : (ఈ ఎండిన బురుద మట్టినీ దాటేవరకూ వేగంగా పరిగెత్తాలి) తర్వాత ఆయన మర్వా దగ్గరకు వెళ్లి ఏదైతే సఫా దగ్గర చేశారో అలా చేయారు. అంటే ఖిబ్లా వైపు మ్రోహం త్రిప్పి, తక్బీర్ మరియు తహ్లీల్ మరియు దుఆ చేశారు. అప్పుడు సయీ లోని ఏడు భాగాలలో ఒక భాగం పూర్తి చేశారు.

 

తర్వాత అయన అస్-సఫా దగ్గరికి పైన చేసిన విధానం ప్రకారమే నడిచారు, ఎలాగైతే నడిచే ప్రదేశంలో నడిచారు మరియు పరిగెత్తే ప్రదేశంలో పరిగెత్తారు. అలాగా సయీ లోని  ఏడు భాగాలలో రెండవ భాగం పూర్తి చేశారు.  తర్వాత ఆయన మర్వా వైపు తిరిగి  వెళ్ళారు అలా పూర్తిగా ఏడు సార్లు స’యీ చేసి చివరిగా మర్వా చేరుకున్నారు.

 

సఫా మరియు మర్వా ల మధ్య పరిగెత్తడాన్ని అనుమతించబడింది, కాని ప్రవక్త  నడవడానికే ప్రోత్సాహించారు.

 

స’యీ చేసేటప్పుడు ఈ దుఆ పలకాలి: రబ్బిగ్ఫీర్ వరహం ఇన్నక అంతల్ అ’అజుల్ అక్రం    

 

ఓ అల్లాహ్ నన్ను క్షమించు మరియు నాపై దయ చూపు, వాస్తవంగా మీరు అత్యంత శక్తిమంతుడు మరియు అధికంగా దయచూపేవాడు.

 

ఎప్పుడైతే ఏడవ సారి సఫా మర్వా ల మధ్యన నడవడం పూర్తయిన తర్వాత ఆయన తల వెంట్రుకలను కత్తిరింపజేశారు, దీనితో ఉమ్రా పూర్తి చేశారు. ఇహ్రామ్ దుస్తులలో ఉన్నప్పుడు ఏవైతే నిషేదించబడిన విషయాలు అన్ని అనుమతించబడతాయి అని చెప్పారు. అలా మరల (జుల్ హజ్జా 8 వ తేదీన) యౌమ్ ఉత్ తర్వియహ్ ముందు రోజు వరకు  అనుమతించబడతాయి అని చెప్పారు, ఎందుకంటే ఆ సమయంలో ఇహ్రామ్ లో ఉండరు కాబట్టి అని చెప్పారు.

 

ఎవరైతే హజ్ చేయడానికి ముందు ఉమ్రా చేయాలని నిస్చయించుకోలేదో, అలాగే హాది (కుర్భానీ జంతువును) తీసుకు రాలేదో వారు ఇహ్రామ్ ను ధరించి ఉంటే వారు ఇహ్రామ్ ను తీసివేయాలని ప్రవక్త తెలియజేశారు, ఒకవేళ ఎవరైతే తీసివేయలేదో వారిపై కోపం వ్యక్తపరచారు, ఒకవేళ ఎవరైతే ఇహ్రామ్ స్తితిలో ఉండి కుర్భానీ జంతువును తమ వెంట తీసుకొని వచ్చారోవారు (యౌమ్–ఉన్-నహర్)(జుల్ హజ్ 10 వ తేదీన) జమరాహ్ కు రాళ్ళు రువ్విన తర్వాత ఇహ్రామ్ ను తీసివేయవచ్చు అని చెప్పారు.

 

సఫా, మర్వా దగ్గర నిలబడినపుడు చదవవలసిన దుఆలు

  

ఇన్నస్-సఫా-వల్-మర్-వత-మిన్ షఆ-ఇరిల్లాహి. అబ్దహు బిమా బాద’అల్లాహు బిహి.

 

నిజంగా సఫా,మర్వాలు అల్లాహ్ సుబు హానహు వత ఆలా చిహ్నాలలోనివి. ఏదైతే అల్లాహ్ సుబు హానహు వత ఆలా  పాటించమని చెప్పాడో నేను దానిని పాటించాను.

 

అల్లాహ్ మొదలుపెట్టాడు (అల్లాహ్ చెప్పాడు) సఫా పర్వతం పైకి చేరి కాబా ను చూసి ఖిబ్లా వైపు తన మొహాన్ని త్రిప్పి ఈ క్రింది పదాలను చదివేవారు.

 

లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్

 

అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు, అల్లాహ్ గొప్పవాడు.

 

తర్వాత ఇలా చెప్పారు

అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ – లాఇలాహ ఇల్లాల్లాహు వహ్ దహు లా షరీక లహు – లహుల్ ముల్కు  వలహుల్ హమ్ దు   - యుహీఉ  వ యుమీతు వ హువ అలా కుల్లి షైఇన్ ఖదీర్ - లా ఇలాహ ఇల్లల్లాహు వహ్ దహు లా షరీకలహు – అన్ జజ  వఅదహూ వ నసర అబ్ దహు వ హజామల్ ఆహ్ జాబ వహ్ దహు.   

 

అల్లాహ్ గొప్పవాడు అల్లాహ్ గొప్పవాడు అల్లాహ్ గొప్పవాడు - అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయనకు సరి సమానులు లేరు. రాజ్యాధికారము ఆయనదే. సర్వస్తోత్రములు ఆయనకే చెల్లును. జీవం పోసేవాడు ప్రాణాలు తీసేవాడు ఆయనే  ఆయనే అన్నింటిపై అధికారం కలవాడు.  అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, ఆయన ఒక్కడే. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. తన దాసునికి సహాయం చేశాడు, ఆయన ఒక్కడే శత్రు వర్గాలను చిత్తుగా ఓడించాడు.

 

 తర్వాత ఆయన కు ఏమి చేయాలో (అల్లాహ్ కోరినది) అల్లాహ్ ను  అడిగారు, ఇలా ఈ విధానాన్ని మూడుసార్లు చేశారు. ఆయన మర్వా పర్వతం దగ్గర కు చేరి సఫా పర్వతం దగ్గర ఏదైతే చేశారో ఇక్కడ కూడా అదే చేశారు. సహీహ్ అల్ ముస్లిం Vol 2:888

  మీఖాత్ - MEEQAT OR MIQAT మీఖాత్ అరబీ పదం. దీని భావం ‘నిర్ధారించబడిన ప్రదేశం’. ఈ ప్రదేశం నుండి హజ్ లేదా ఉమ్రా చేయదలచిన ఏ ముస్లిం అయిననూ, ఇహ...

 

మీఖాత్ - MEEQAT OR MIQAT


మీఖాత్ అరబీ పదం. దీని భావం ‘నిర్ధారించబడిన ప్రదేశం’. ఈ ప్రదేశం నుండి హజ్ లేదా ఉమ్రా చేయదలచిన ఏ ముస్లిం అయిననూ, ఇహ్రామ్ స్థితిలోకి రాకుండా మక్కాకు వెళ్ళలేడు. ఉదా – మదీనా వాసుల మీఖాత్ ప్రదేశం జుల్ హులైఫా.   

 

మీఖాత్ ప్రదేశాలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ద్వారా నిర్ధారించబడ్డాయి. ఈ స్థలంలో హజ్ లేదా ఉమ్రా కోసం సౌదీ అరబియాలోని మక్కాకు వెళ్ళేవారు ఇహ్రామ్ ధరించి, ఇహ్రామ్ స్థితిలోకి రావాలి. ఏదైనా కారణం వల్ల హజ్ లేదా ఉమ్రా చేయడానికి వెళ్ళినవారు, ఇహ్రామ్ ధరించకుండా మీఖాత్ ప్రదేశం దాటేసినచో, పరిహారంగా జంతు బలి ఇవ్వాలి.

మీఖాత్ ప్రదేశం

మీఖాత్ లు (ఇహ్రామ్ ధరించే ప్రదేశాలు) ఐదు ఉన్నాయి: జుల్ హులైఫా, అల్ జుహ్ ఫహ్, ఖర్న్ ఉల్ మనాజిల్, యలంలం, జాతు ఇర్ఖ్. ఈ ప్రదేశాల్లో నివసించేవారు మరియు ఈ ప్రదేశాలను దాటి హజ్ లేదా ఉమ్రా లకు వెళ్లేవారి కోసం ఈ ప్రదేశాలు నిర్ధారించబడ్డాయి. ఈ మీఖాత్ ప్రదేశాల కంటే మక్కాకు దగ్గరగా ఉన్నవారు, తమ ఇండ్ల నుండే ఇహ్రామ్ ధరించాలి. మక్కాలో ఉండే వాసులు మక్కా నుండే ఇహ్రామ్ ధరించాలి.  

  1. జుల్ హులైఫా మదీనా వాసుల మీఖాత్ ప్రదేశం. ఇది ఒక గ్రామం. ఇది మక్కాకు ఆరు లేదా ఏడు మైళ్ళ దూరంలో ఉంది. ఇది అన్ని మీఖాత్ ల కంటే మక్కాకు దూరమైనది. ఈ ప్రదేశం నుండి మక్కాకు అనేక దారులు గలవు అని ఇబ్నె తైమియా అన్నారు. దీన్ని (ఈ ప్రదేశాన్ని) వాది ఉల్ అఖీఖ్) మరియు దీని మస్జిద్ ను (మస్జిద్ ఉష్ షజరహ్ – చెట్టు మస్జిద్) అని అంటారు. అక్కడ ఓ ప్రదేశాన్ని ప్రజలు అజ్ఞానం కారణంగా ‘అలీ చెట్టు’ అంటారు. ఇక్కడ అలీ (రజి) ఒక జిన్నును చంపారు అని అంటారు, ఇది అబద్ధం. ఈ మీఖాత్ మదీనా నుండి దాదాపు 9 కి. మీ. దూరము, మరియు మక్కా నుండి దాదాపు 450 కి మీ గలదు. 
     
  2. అల్ జుహ్ ఫహ్ ఒక గ్రామం. ఇది మక్కా మదీనా మధ్యలో ఉంది. ఈ దారి గుండా వచ్చే మదీనా వాసులకు ఇది మీఖాత్ అవుతుంది. ఇబ్నె తైమియా ఇలా అన్నారు: “సిరియా, ఇజిప్ట్ మరియు ఇతర పడమర దేశాలకు చెందిన వారికి ఇది మీఖాత్. ప్రస్తుతం ఈ ప్రదేశం శిధిలా వస్థలో, అధ్వాన్నంగా ఉంది, కావున ఆ దారి గుండా పోయే ప్రజలు ఈ ప్రదేశానికి ముందే ‘రాబిఘ్’ అనే ప్రదేశంలో ఇహ్రామ్ ధరిస్తారు.” ఈ మీఖాత్ మక్కాకు ఉత్తర పడమర దిక్కున దాదాపు 190 కి మీ దూరంలో ఉంది. 
     
  3. ఖర్న్ ఉల్ మనాజిల్ – దీన్ని ‘ఖర్న్ ఉత్ తాలిబ్’ అని కూడా అంటారు. ఇది మక్కాకు దగ్గరలో ఉంది. ఒక రోజు ప్రయాణంలో మక్కాకు చేరవచ్చు. నజ్ద్ ప్రజలకు ఇది మీఖాత్. ఇది కొండ ప్రదేశం. ఇది మక్కాకు పశ్చిమ దిశన దాదాపు 90 కి మీ దూరంలో ఉంది.
     
  4. యలంలం ప్రదేశం మక్కా నుండి రెండు రాత్రుల దూరంలో ఉంది. ముఫ్ఫై మైళ్ళ దూరంలో ఉంది. యమన్ ప్రజలకు మరియు యమన్ వైపు నుండి వచ్చేవారికి ఇది మీఖాత్. ఇది ఒక కొండ ప్రదేశం. ఇది మక్కాకు దక్షిణ పశ్చిమ దిశలో దాదాపు 50 కి మీ దూరంలో ఉంది. సముద్రం ద్వారా హజ్ లేదా ఉమ్రాలకు చైనా, జాపాన్, ఇండియా, పాకిస్తాన్ ప్రాంతం నుండి వచ్చే ప్రజలకు ఇది మీఖాత్ అవుతుంది. 
     
  5. జాతు ఇర్ఖ్ ఎడారి ప్రదేశం. ఇది నజ్ద్ మరియు తిహామహ్ ల సరిహద్దు. ఇది మక్కా నుండి 42 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఇరాక్, ఇరాన్ మరియు అటు వైపు నుంచి వచ్చే ప్రజలకు ఇది మీఖాత్. ఇది మక్కాకు ఉత్తర పశ్చిమ దిశలో దాదాపు 85 కి మీ దూరంలో ఉంది.  

 

మీఖాత్ ప్రాధాన్యత

మక్కాకు అన్ని వైపుల నుండి వచ్చే దారుల్లో నిర్ణయించబడ్డ ప్రదేశాలను మీఖాత్ అంటారు. మీఖాత్ ప్రదేశాన్ని దాటేటప్పుడు, మనిషి తనపై వర్తించే ప్రతి నియమాన్ని గౌరవించాలి. మీఖాత్ దాటగానే మనిషి హరం (పవిత్ర స్థలం)లో ప్రవేశించినట్లు ప్రవర్తించాలి, మెలగాలి.

 

మీఖాత్ ప్రదేశం దాటేటప్పుడు, ఇహ్రామ్ స్థితిలోకి రావడం హజ్ మరియు ఉమ్రా చేసేవారికి తప్పనిసరి. 

 

  ఇహ్రామ్ - IHRAM OR EHRAM ముస్లింలు ధరించే వస్త్రాన్ని ఇహ్రామ్ అంటారు. దీన్ని ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్ళినప్పుడు ధరిస్తారు. ఇహ్...

 

ఇహ్రామ్ - IHRAM OR EHRAM


ముస్లింలు ధరించే వస్త్రాన్ని ఇహ్రామ్ అంటారు. దీన్ని ముస్లింలు హజ్ యాత్ర కోసం మక్కాకు వెళ్ళినప్పుడు ధరిస్తారు. ఇహ్రామ్ దుస్తుల్లో రెండు భాగాలుంటాయి. ఇది తెల్ల రంగులో ఉంటుంది. ఇది కుట్టబడి ఉండదు. ఒకదాన్ని తుంటిపై నుండి, మరోదాన్ని భుజాలపై నుండి వేసుకోవాలి. ఇహ్రామ్ కేవలం దుస్తులే కాదు, దీన్ని ధరించి మనిషి పవిత్ర ప్రదేశంలోకి ప్రవేశిస్తాడు.    

 

ఇహ్రామ్ మూల పదం హర్మ్. ఇస్లాంలో దీని వల్ల మనిషి పవిత్రతను పొంది, పవిత్ర స్థలమైన కాబాలోనికి హజ్ లేదా ఉమ్రా కోసం ప్రవేశిస్తాడు. హజ్ లేదా ఉమ్రా కోసం మక్కాలో ప్రవేశించే ముందు ఒక హద్దు ఉంటుంది. దాన్ని మీఖాత్ అంటారు. అది దాటే ముందు, స్నానం చేసి ఇహ్రామ్ ధరించాలి.  

 భావం

పారిభాషికంగా ఇహ్రామ్ అంటే, పవిత్ర స్థితిలోకి ప్రవేశించడం. ఇది త్రెంచకూడదు. ఇస్లామియంగా ఇహ్రామ్ అంటే, ఆ స్థితిలో కొన్ని చర్యలు నిషిద్ధం చేయబడుతాయి.

 

ఇహ్రామ్ లో ప్రవేశించే ముందు తీసుకోవలసిన చర్యలు

ఇహ్రామ్ స్థితిలో ప్రవేశించే ముందు స్నానం చేయాలి. ఇంకా ఇవి కూడా సిఫారసు చేయబడ్డాయి:

  • కాళ్ళు మరియు చేతుల గోళ్ళను కత్తిరించాలి. 
  • చంకలోని వెంట్రుకలు తీయాలి.
  • మీసాలను చిన్నగా కత్తిరించండి (గడ్డాన్ని అలాగే వదిలేయండి).
  • సువాసనను (ఇత్తర్) గడ్డానికి, తల వెంట్రుకలకు పూయండి (పురుషులు మాత్రమే), వస్త్రాలకు పూయ కూడదు. స్త్రీలు ఇహ్రామ్ స్థితిలో మరియు మహరం (పెళ్లి చేసుకునే అర్హత లేనివారు) కాని వ్యక్తి ముందు సువాసన పూసుకోరాదు.  
  • స్నానం (ఘుసల్) చేయడం లేదా వుజూ చేయడం ఉత్తమమైనది, సువాసన పూసుకోండి, రెండు కొత్త మరియు పరిశుభ్రమైన దుస్తులు ధరించండి.
నోట్: ఇహ్రామ్ ధరించాక, రెండు రకాతుల నమాజ్ చదవడం సున్నత్ ద్వారా నిరూపితం కాలేదు. కాని ఎవరైతే, హజ్ లేదా ఉమ్రా మదీనాలోని జుల్ హులైఫా మీఖాత్ నుండి ప్రారంభిస్తారో వారు నమాజ్ చేయవచ్చు.   

 

ఇహ్రామ్ వేసుకునే పద్ధతి

రెండు షరతులు లేనిచో ఇహ్రామ్ చెల్లదు. అవి: సంకల్పం పురుషులకు ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే, వారు ఇహ్రామ్ కోసం ప్రత్యేకమైన దుస్తులు ధరిస్తారు. ఇహ్రామ్ దుస్తులు కుట్టించబడనివి, తెల్ల రంగులో, పరిశుభ్రమైనవై  ఉంటాయి. అవి రెండు భాగాలలో ఉంటాయి. క్రింది భాగాన్ని ‘ఇజార్’ మరియు పై భాగాన్ని ‘రిదా’ అంటారు. కాళ్ళకు వేసుకునే పాదరక్షలు చీలమండలాన్ని కప్పివేయకూడదు.

 

స్త్రీలు తమకు తోచింది ధరించవచ్చు. కాని, అది ఇస్లామీయ చట్టానికి (షరియాకు) విరుద్ధంగా ఉండకూడదు. దుస్తుల రంగు ఏదైనా పర్లేదు. కొందరు తెల్ల రంగు లేదా ఆకు పచ్చ రంగును ప్రత్యేకంగా భావిస్తారు. కాని, సున్నత్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆచరణ లేదా బోధన) ద్వారా ఇలాంటి విషయం ఏది నిరూపితం కాలేదు.   

 

కేవలం ఇహ్రామ్ దుస్తులు ధరించిన కారణంగా ఎవరూ ఇహ్రామ్ స్థితిలోకి రారు. ఇహ్రామ్ స్థితిలో రావాలంటే, నోటి ద్వారా (నియ్యత్) సంకల్పం పలుకులు ఉచ్చరించడం తప్పనిసరి.

 

సంకల్పం తరువాత తల్బియా చదవాలి: ఇహ్రామ్ ధరించాక, హజ్ కోసం ఈ పలుకులతో సంకల్పం చేయాలి – “అల్లాహుమ్మ లబ్బైక్ హజ్జన్”

 

ఇహ్రామ్ ధరించాక, తల్బియా బిగ్గరగా చదవండి – (లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నెమత లక వల్ ముల్క్ లా షరీక లక్)  ఆ తరువాత ఈ దుఆ ఒకసారి చదవండి – (అల్లాహుమ్మ హాజిహి హజ్జతున్ లారియా ఫీహా వలా సుమాహ్) (ఓ అల్లాహ్! నేను హజ్ సంకల్పం చేస్తున్నాను. ఇది ఎవరికీ చూపించడానికి లేదా పేరు ప్రఖ్యాతలు పొందడానికి కాదు.)

 

ఓ అల్లాహ్ నేను హాజరయ్యాను! నేను హాజరయ్యాను, నేను హాజరయ్యాను (నేను సాక్ష్యమిస్తున్నాను) నీవు తప్ప ఎవ్వరు (ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరు లేరు) లేరు, నేను హాజరయ్యాను, ప్రశంసలన్నీ, దయానుగ్రహాలన్నీ అల్లాహ్ కే చెందును. సామ్రాజ్యమంతా నీదే. నీవు తప్ప దైవాలెవరూ లేరు.  

 

ఇహ్రామ్ స్థితిలో తప్పనిసరి విషయాలు

హజ్ లేదా ఉమ్రా చేసేటప్పుడు ఇహ్రామ్ స్థితిలో క్రింద ఇవ్వబడిన విషయాలు తప్పనిసరి:

  1. అల్లాహ్ తప్పనిసరి (విధి) చేసిన అన్నిటినీ విశ్వసనీయంగా ఆచరించాలి. ఉదా- రోజువారి ఐదు పూటల నమాజ్ దాని ప్రత్యేక సమయంలో చేయాలి. 
  2. అల్లాహ్ నిషేధించిన వాటికి దూరంగా ఉండాలి. ఉదా- చెడు పనులు, కొట్లాటలు, పాపాలు మొదలైనవి చేయడం.
  3. ముస్లింలకు నోటి ద్వారా గానీ, చేతల ద్వారా గానీ హాని చేకూర్చకూడదు. 
  4. ఇహ్రామ్ స్థితిలో నిషేధించబడిన వాటికి దూరంగా ఉండడం. అవి: 
  • గోళ్ళను కత్తిరించకండి, వెంట్రుకలను తీయకండి. అవి దానంతట అవే తెగితే మీపై ఎలాంటి దోషం లేదు.
  • సువాసనను (సెంట్ – ఇత్తర్) దుస్తుల మీద గానీ, శరీరం మీద గానీ, అన్నపానియాల్లో గానీ వాడకూడదు. ఇహ్రామ్ ధరించే ముందు పూసుకున్న సువాసన మిగిలి ఉంటే ఎలాంటి తప్పు లేదు.
  • ఇహ్రామ్ లో ఉన్నంత సేపు జంతువులను చంపడం, భయపెట్టడం, వేటాడడంలో సహకరించడం సరికాదు.
  • ఇహ్రామ్ స్థితిలో అల్ హరం పరిసరాల్లో చెట్లను త్రెంచడం, కూరగాయలను త్రెంచడం సరి కాదు. ఎవరైనా పోగొట్టుకున్న వస్తువును కూడా తీసుకోకూడదు. కాని, దాని యజమానికి చేరవేసే ఉద్దేశంతో తీస్తే పరవాలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు.
  • స్త్రీకు పెళ్లి ప్రతిపాదన పంపరాదు. తన కోసం గానీ, ఇతరుల కోసం గానీ ఒప్పంద వివాహం చేసుకోరాదు. భార్యతో లైంగిక సంపర్కం చేయడం లేదా కామ వాంఛతో తాకడం కూడా నిషేధం. ఈ పనులన్నీ ఇహ్రామ్ స్థితిలో నిషేధం చేయబడ్డాయి.  

ఈ నిషేధాజ్ఞలు స్త్రీలు మరియు పురుషులకు వర్తిస్తాయి.

 

ఇహ్రామ్ స్థితిలో నిషేధించబడినవి

* పురుషులు తలను దేనితో కప్పుకోరాదు. గొడుగు లేదా కారు నీడ తలపై పడితే ఎలాంటి తప్పు లేదు. తలపై ఏదైనా మోసుకొని వెళ్ళినా దోషం లేదు.

* పురుషుడు శరీరం మొత్తంపై అయినా లేదా కొంత భాగంపై అయినా షర్ట్ గానీ, ఏదైనా ఇతర కుట్టబడిన వస్త్రం గానీ – టర్బన్, చిన్న బూట్లు తొడగరాదు. కాని, శరీరం క్రింద భాగంపై తొడిగే ఇహ్రామ్ (ఇజార్) లభించని పక్షంలో పైంట్ (ట్రౌజర్) తొడగవచ్చు. అలాగే చెప్పులు లభించని పక్షంలో చిన్న బూట్లు వేసుకోవచ్చు.    

* ఇహ్రామ్ స్థితిలో స్త్రీ చేతుల తొడుగులు, ముఖంపై నిఖాబ్ లేదా బుర్ఖా వేసుకోవడం కూడా నిషేధించబడింది. కాని, పరాయి మగవాళ్ళు దగ్గరగా ఉన్నప్పుడు, బుర్ఖాతో గానీ, ఇతర వస్త్రంతో గానీ ముఖాన్ని దాచుకోవచ్చు. ఈ నిబంధనలన్నీ ఇహ్రామ్ స్థితిలో ఉన్నంత వరకే.

* ఒకవేళ ఒక మనిషి (పురుషుడు) కుట్టబడిన వస్త్రం ధరించడం గానీ, సువాసన పూసుకోవడం గానీ, వెంట్రుకలు లేదా గోళ్ళు కత్తిరించడం గానీ – మరచిపోయి లేదా తెలియక చేసినచో, అతనిపై ఫిదియా (పరిహారం) ఉండదు. అతనికి గుర్తురాగానే లేదా తెలియగానే, ఇలాంటి వాటి నుండి ఆగిపోవాలి.  

* చెప్పులు తొడగడం, ఉంగరం ధరించడం, కళ్ళద్దాలు పెట్టుకోవడం, చెవిటివారు వినడానికి ఉపయోగించే పరికరం వాడడం, చేతి గడియారం ధరించడం, నడి కట్టు లేదా బెల్టు ధరించడం (ధనాన్ని లేదా పత్రాల రక్షణ కొరకు) అనుమతించబడింది.   

* దుస్తులను మార్చుకోవడం, వాటిని ఉతుక్కోవడం అనుమతించబడింది. శరీరాన్ని కడుక్కోవడం (స్నానం చేయడం), తల వెంట్రుకలను కడగడం కూడా సమంజసమే. ఇలా చేసేటప్పుడు కొన్ని వెంట్రుకలు రాలినా ఎలాంటి దోషం లేదు.

స్త్రీ అయినా, పురుషుడు అయినా నెత్తి మీద ఏదైనా వ్యాధి వల్ల గుండు గీయిస్తే, వారు ఈ మూడింటిలో ఒకటి చేయాలి:

  1. మూడు రోజులు ఉపవాసం ఉండాలి 
  2. జంతు బలి ఇవ్వాలి (మేక లేక గొర్రె),
  3. ఆరు మందికి అన్నం తినిపించాలి (సూరా బఖర 2:196 వివరణ (తఫ్సీర్) అహసనుల్ బయాన్ ప్రకారం). “మీరు ఇచ్చే ఖుర్బానీ, ఖుర్బానీ స్థలానికి చేరనంత వరకూ శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లేదా తలలో బాధ ఉన్నవారు (శిరోముండనం చేయించుకుంటే ఫరవాలేదు. కాని వారు)  దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి.” (ఖుర్ఆన్ సూరా బఖర 2:196)  

ఇహ్రామ్ కు సంబంధించిన తప్పులు

కొందరు భక్తులు (హాజీలు) ఇహ్రామ్ లో లేని స్థితిలోనే (ఇహ్రామ్ ధరించే చోటు) మీఖాత్ ను దాటి వెళ్ళిపోతారు. ఆలా జిద్డా (లేదా ఇతర దగ్గరి స్థలం)  వరకు వెళ్లి ఇహ్రామ్ ధరిస్తారు. ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆజ్ఞకు వ్యతిరేకం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ప్రతి భక్తునికి తన దారిలో పడే మీఖాత్ (ఇహ్రామ్ ధరించే స్థలం) వద్ద ఇహ్రామ్ స్థితిలోకి వచ్చేయాలని అజ్ఞాపించారు.

 

ఎవరికైనా ఇలా జరిగినచో, అతను తిరిగి తన దారిలో పడే మీఖాత్ ప్రదేశానికి వెళ్లి ఇహ్రామ్ ధరించాలి. లేదా పరిహారంగా మక్కాలో ఒక మేకను బలి ఇచ్చి, దాని మాంసాన్ని బీదవారికి పంచిపెట్టాలి.  


ఇది మీఖాత్ ప్రదేశాన్ని విమానం ద్వారా, ఓడ ద్వారా లేదా భూమి (బస్సు, కారు) ద్వారా దాటిన ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది.  

 

ఇహ్రామ్ ధరించే చోట్లు (మీఖాత్) ఐదు ఉన్నాయి. ఆ ఐదింటిలో ఒక్క దాన్ని కూడా తాకకుండా వెళ్ళేవారు, తమ దారిలో దగ్గరగా ఉన్న మీఖాత్ ప్రదేశంలో ఇహ్రామ్ ధరించాలి.   

 

ఇహ్రామ్ ధరించే పద్ధతి

పురుషులు క్రింది భాగాన్ని నడుము పై కడతారు.

 

పై భాగాన్ని రెండు భుజాలపై నుండి వేసుకుంటారు. కేవలం మొదటి తవాఫ్ (తవాఫె ఖదూం)లో కుడి భుజంపై నుండి వస్త్రం తీసివేయాలి.

 

గమనిక: ఇహ్రామ్ కోసం పలచగా ఉన్న వస్త్రాన్ని కొనకండి. దీని వల్ల చెమటకు ఆ వస్త్రం మీ శరీరానికి అతుక్కుంటుంది. కాస్త మందపాటి వస్త్రం ఉత్తమమైనది. వీటిని తువాలులా, దుప్పటిలా వాడవచ్చు.    

 

ఒక భాగం మన నడుము చుట్టు చుట్టుకోవాలి. స్నానం చేశాక మనం తువాలును ఎలా నడుముపై చుట్టు కుంటామో అలానే చుట్టుకోవాలి. (లుంగీ ధరించే వారికి ఇది చాలా సులభం అవుతుంది).  

 

రెండో భాగాన్ని రెండు భుజాలపై నుంచి శరీరపు పై భాగాన్ని కప్పుకోవాలి. కుడి భుజంపై నుండి వస్త్రాన్ని కేవలం తవాఫె ఖుదూం (కాబా చేరాక చేసే మొదటి తవాఫ్) చేసేటప్పుడు తీయాలి. ఇతర సమయాల్లో కుడి భుజం కూడా కప్పబడి ఉండాలి, ప్రత్యేకంగా నమాజ్ చేస్తున్నప్పుడు. ఇతర భక్తుల కుడి భుజం వైపు మన చూపులు పోకూడదు.    

 

క్రింద భాగంపై ధరించే వస్త్రం జారిపోకుండా దానిపై బెల్ట్ ధరించవచ్చు.  పై భాగపు వస్త్రం పడిపోకుండా పిన్ను వాడవచ్చు.  

 

స్త్రీలకు ఇహ్రామ్ లో ఎలాంటి ప్రత్యేకమైన దుస్తులు ఉండవు. కేవలం ఇహ్రామ్ లో ఉన్నప్పుడు, స్త్రీలు తమ ముఖాన్ని మరియు చేతులను ఎలాంటి వాటితో కప్పుకోకూడదు. ఇహ్రామ్ దుస్తులను మీఖాత్ ప్రదేశానికి చేరక ముందే ధరించవచ్చు. ఇక కేవలం సంకల్పం (నియ్యత్) చేయడం మాత్రమే మిగిలి ఉంటుంది.

 

సంకల్పం (నియ్యత్) మీఖాత్ వద్ద లేదా దానికి దగ్గరగా చేయాలి. సంకల్పం దుఆ బిగ్గరగా చదవాలి. (హజ్ అయినా, ఉమ్రా అయినా) ఇహ్రామ్ స్థితిలో రావడానికి సంకల్పపు దుఆ చేయాలి. ఆ దుఆ:  

 

“లబ్బైక్ అల్లాహుమ్మ ఉమ్రతన్” (ఓ అల్లాహ్! నేను ఉమ్రా కోసం హాజరయ్యాను).

 

“లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్” (ఓ అల్లాహ్! నేను హజ్ కోసం హాజరయ్యాను).

 

గమనిక: హజ్జె ఖిరన్ లో ఉమ్రా మరియు హజ్ సంకల్పం (నియ్యాత్) చేయాలి. హజ్జె ఇఫ్రాద్ లో కేవలం హజ్ సంకల్పం చేయాలి.

 

రుతుస్రావంలో ఉన్న స్త్రీలు మరియు గర్భానంతరం రక్తస్రావం జరిగే స్త్రీలు ఇహ్రామ్ స్థితిలోకి రావాలి. వారు హజ్ లో చేయాల్సిన ఆచరణలు చేస్తూ మక్కా, మినా, అరఫా చేరాలి. ఈ స్థితిలో స్త్రీలు, కేవలం తవాఫ్ తప్ప హజ్ లోని అన్ని ఆచరణలు పాటించాలి.    

 

మీరు ఇతరుల కోసం హజ్ చేస్తున్నప్పుడు (ఉదా - మీ తల్లి, తండ్రి), కేవలం సంకల్పం (నియ్యత్) చేస్తున్నప్పుడే వారి పేరు చెప్పాలి. హజ్ లోని మిగతా ఆచరణలు అన్నీ తన స్వంతం కోసం చేసినట్లే చేయాలి.   

 

ఇతరుల కోసం హజ్ చేసినప్పుడు చేయాల్సిన సంకల్పం (నియ్యత్) :

(అతని పేరు)

“లబ్బైక్ అల్లాహుమ్మ హజ్జన్’ అన్; అతని పేరు.”  

(ఓ అల్లాహ్! నేను ....... (మనిషి పేరు) హజ్ కోసం హాజరయ్యాను).


ఆ తరువాత తల్బియా చదవడం మొదలెట్టాలి. పురుషులు ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు వీలైనంత ఎక్కువగా తల్బియాను బిగ్గరగా చదవాలి. స్త్రీలు కేవలం తన పక్కనున్న వారికి వినిపించే స్వరంతో చదివితే చాలు.  


“లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక్ లా షరీక లక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్నీమత లక వల్ ముల్క్, లా షరీక లక్”


(ఓ అల్లాహ్! నేను హాజరయ్యాను, నేను హాజరయ్యాను, నీకు భాగస్వాములెవరూ లేరు, నేను హాజరయ్యాను. నిశ్చయంగా ప్రశంసలన్నీ, దయానుగ్రహాలన్నీ, రాజ్యాధికారాలన్నీ నీవే, మరియు నీకు భాగస్వాములెవరూ లేరు).

 

ఇక మీరు ఇహ్రామ్ స్థితిలోకి వచ్చేశారు! ఇహ్రామ్ స్థితిలో ఉన్న వారిని ‘ముహ్రిం’ అంటారు.

 

ఇహ్రామ్ స్థితిలో మీరు వాడుకోదగినవి

  • చేతి గడియారం, కళ్ళజోళ్ళు, పైసలు పెట్టుకునే బెల్ట్, ఉంగరాలు, చలువ కళ్ళద్దాలు, మాటలు వినే పరికరం మొదలైనవి వాడవచ్చు.
     
  • సువాసన రాని సబ్బుతో స్నానం చేయవచ్చు, తలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇలా చేస్తున్నప్పుడు కొన్ని వెంట్రుకలు రాలినా పరవాలేదు.
     
  • ఇహ్రామ్ దుస్తులను మార్చుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఇహ్రామ్ భంగం కాదు. సంకల్పం చేసుకున్నప్పుడు మనిషి ఇహ్రామ్ స్థితిలోకి వస్తాడు మరియు తల వెంట్రుకలు కత్తిరించి దాని నుండి బయటికి వస్తాడు.
     
  • ఒకరి తలపై ఛాయ ఉండడం – అది వాహనం గానీ, గొడుగు గానీ, గుడారం గానీ, భవనం గానీ – తప్పుకాదు.
     
  • పురుషులు పడుకునేటప్పుడు తమ కాళ్ళపై ఇహ్రామ్ లేదా దుప్పటి కప్పుకోవచ్చు. తల మాత్రం కప్పుకోరాదు.

 

ఇహ్రామ్ స్థితిలో చేయకూడని పనులు

ఇహ్రామ్ ధరించిననూ, సంకల్పం (నియ్యత్) చేయనంతవరకూ మనిషి ముహ్రిం (ఇహ్రామ్ స్థితిలోకి రాలేడు) కాలేడు. సంకల్పం (నియ్యత్) చేశాక మనిషి ముహ్రిం అవుతాడు మరియు అతనిపై నిషేధాజ్ఞలు వర్తిస్తాయి. కావాలని ఏదైనా నిషేధాజ్ఞను ఉల్లంఘించినచో పరిహారం (ఫిదియా) చెల్లించాల్సి ఉంటుంది:  

 

  • పురుషులు కుట్టబడిన వస్త్రాలు ధరించరాదు. ఏ వస్త్రాల ద్వారానైతే, శరీరపు భాగాలు కనిపిస్తాయో వాటిని ధరించకూడదు, ఉదా- పాంట్లు, జాకెట్లు, షర్ట్ లు మొదలైనవి, అంటే కుట్టబడిన వస్త్రాలు (గొడుగు, చెప్పులు, చేతి గడియారం, బెల్ట్, పర్స్ లాంటివి కుట్టిన ఆకారంలో వాడవచ్చు). ఇహ్రామ్ పై భాగం కుట్టబడిన విధంగా ఉండకూడదు. పాదరక్షలు (చెప్పులైనా, బూట్లయినా) చీలమండలాన్ని కప్పకుండా ఉండాలి.
     
  • పురుషులు లోదుస్తులు గానీ, తలపై టోపీ లాంటిది గానీ ధరించకూడదు. పురుషులు తమ తలను కప్పకూడదు. ముఖం కూడా తల భాగమే, కాబట్టి దాన్ని కూడా కప్పరాదు.
     
  • స్త్రీలు ఏ దుస్తులైన ధరించవచ్చు, కాని చేతిపై తొడుగులు మరియు కేవలం కళ్ళు కనిపించేలా ముఖంపై వస్త్రం (నిఖాబ్) ధరించరాదు. మహరం (పెళ్లి చేసుకోలేని బంధం గల వ్యక్తి) కాకుండా, ఇతర పురుషుల ముందు తమ చేతులను మరియు ముఖాన్ని కప్పుకోవచ్చు.
     
  • సువాసనలు (సెంట్, ఇత్తర్) పూసుకోరాదు, సువాసన గల దుస్తులు ధరించరాదు, సువాసన గల ఎలాంటి  వస్తువులు వాడకూడదు (షాంపూ, సబ్బు మొదలైనవి). కొన్ని టిష్యూలు కూడా సువాసన కూడినవై ఉంటాయి. వాటికీ దూరంగా ఉండాలి.
     
  • ఆమె/అతడు గోళ్ళను కోయరాదు.
     
  • ఆమె/అతడు వెంట్రుకలను కత్తిరించరాదు.
     
  • పెళ్లి చేసుకోకూడదు, ఇతరుల పెళ్లి చేయరాదు, పెళ్లి ప్రతిపాదన కూడా చేయకూడదు.
     
  • లైంగిక వాంఛ కలిగే ఎలాంటి చేష్ట చేయకూడదు.
     
  • వేటాడడం, వేటలో పాల్గొనడం చేయకూడదు (చేపలు పట్టడం అనుమతించబడింది).
     
  • అల్లాహ్ కు అవిధేయత చూపే ఏ పనీ చేయరాదు (ధూమపానం చేయడం – సిగరేట్ కాల్చడం).
     
  • అనవసర మాటలకు, ఘర్షణలకు దూరంగా ఉండాలి. కొట్లాడడం, వాదించడం, దూషించడం మొదలైనవి.  

 

ఇహ్రామ్ స్థితిలో మనిషి సాధారణ ఆచరణలు

  • కేవలం ఇహ్రామ్ క్రింద భాగంతో బయట తిరగకండి.
     
  • మీ కుడి భుజాన్ని కప్పి ఉంచండి (తవాఫ్ చేసేటప్పుడు తప్ప).
     
  • మీ ఇహ్రామ్ కొసను భుజంపై వేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. లేనిచో ఇతరులకు అది తగిలి హాని కలిగే అవకాశం ఉంది.
     
  • ఇహ్రామ్ ను శుభ్రంగా ఉంచండి. దాన్ని చేతులు తుడుచుకునే వస్త్రంగా వాడకండి.
     
  • కూర్చునేటప్పుడు, ప్రత్యేకంగా మెట్లపై కూర్చునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. లోపల లోదుస్తులు ఉండవు గనక  మర్మాంగాలు కనపడే అవకాశం ఉంటుంది.

 

ఇప్పుడు మీరు “అల్లాహ్ అతిథులు”, కావున హుందాగా మెలగండి.

జుల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత జుల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు ఉపవాస...

జుల్ హజ్జ్ మాసపు పది దినాల ప్రత్యేకత

జుల్ హజ్జ్ మాసపు మొదటి పది పవిత్రదినాలలో ముస్లింలు ఆచరించటానికి ప్రయత్నించవలసిన కొన్ని మంచి పనులు

ఉపవాసం. జుల్ హజ్జ్ 9వ తేదీన ఉపవాసం ఉండటమనేది ఒక సున్నత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఆచరించి మార్గదర్శకత్వం వహించిన ఆచరణలలోనిది. ఈ శుభసమయంలో మంచి పనులు చేయవలెనని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించి ఉన్నారు. మరి, ఉపవాసమనేది పుణ్యకార్యాలలో ఒక మహోన్నతమైన పుణ్యకార్యం కదా. సహీహ్ బుఖారీ హదీస్ గ్రంథపు ఒక హదీస్ ఖుద్సీలో ఉపవాసాన్ని తను ఎన్నుకున్న ఆరాధనగా అల్లాహ్ ప్రకటించెను: “అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: ‘ఒక్క ఉపవాసం తప్ప, ఆదం సంతానపు పుణ్యకార్యాలన్నీ వారి కోసమే. అది మాత్రం నా కోసం. మరియు దాని ప్రతిఫలాన్ని నేను స్వయంగా అతనికి ప్రసాదిస్తాను. “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జుల్ హజ్జ్ మాసపు 9వ రోజున ఉపవాసం ఉండేవారు. హునైదహ్ ఇబ్నె ఖాలిద్ తన భార్య ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కొందరు భార్యలు ఇలా పలికినారని ఉల్లేఖించెను: ” ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం 9వ జుల్ హజ్జ్ దినమున, అషూరహ్ దినమున, ప్రతి నెల మూడు దినములలో మరియు ప్రతి నెల మొదటి రెండు సోమవారాలు మరియు గురువారాలు ఉపవాసం ఉండేవారు.” (అన్నిసాయి హదీస్ గ్రంథం, 4/205 మరియు అహూ దావూద్ హదీస్ గ్రంథం; సహీహ్ అబి దావుద్ గ్రంథంలో, 2/462 దీనిని సహీహ్ హదీస్ గా షేఖ్ అల్ బానీ వర్గీకరించెను.) తక్బీర్. జుల్ హజ్జ్ మాసపు మొదటి పది రోజుల్లో తక్బీర్ (“అల్లాహు అక్బర్”), తహ్మీద్ (“అల్హమ్దులిల్లాహ్”), తహ్లీల్ (“లా ఇలాహ ఇల్లల్లాహ్”) మరియు తస్బీహ్ (“సుభహానల్లాహ్”) అని బిగ్గరగా ఉచ్ఛరించవలెను. ఇది మస్జిద్ లలో, ఇంటిలో, దారిలో, ఇంకా ఆరాధనలో భాగంగా మరియు అల్లాహ్ యొక్క మహోన్నత్వాన్ని మరియు సార్వభౌమత్వాన్ని ప్రకటించటంలో భాగంగా అల్లాహ్ పేరు స్మరించటానికి మరియు బిగ్గరగా ఉచ్చరించటానికి అనుమతింపబడిన ప్రతి చోట ఉచ్చరించలెను. పురుషులు దీనిని బిగ్గరగా మరియు మహిళలు నిదానంగా ఉచ్చరించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:


“వారు తమ కొరకు అక్కడ ఉంచబడిన ప్రయోజనాలను చూసుకోవాలని, అల్లాహ్ వారికి ప్రసాదించబడిన పశువులపై కొన్ని నిర్ణీత దినాలలో ఆయన పేరును స్మరించాలి (అల్లాహ్ పేరుతో ఖుర్బాని చేయాలని) స్వయంగా తినాలి, లేమికి గురి అయిన ఆగత్యపరులకు పెట్టాలి…” [సూరహ్ అల్ హజ్జ్ 22:28]


నిర్ణీత దినాలంటే జుల్ హజ్జ్ మాసపు మొదటి పది రోజులని మెజారిటీ పండితులు అంగీకరించినారు. ఎందుకంటే ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఒక హదీస్ లోని పదాలలో “(జుల్ హజ్జ్ మాసపు) మొదటి పది రోజు లు నిర్ణీత రోజులని” ఉన్నది.


తక్బీర్ లో “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లాఇలాహ ఇల్లల్లాహ్;వల్లాహు అక్బర్ వ లిల్లాహిల్ హమ్ద్(అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ యే మహోన్నతుడు, అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడెవరూ లేరు; అల్లాహ్ యే మహోన్నతుడు మరియు సకల స్తోత్రములు అల్లాహ్ కే చెందును)” మరియు ఇలాంటి ఇతర పదాలు కూడా పలక వచ్చును.
తక్బీర్ పలకటమనేది ఒక సున్నత్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచరణా విధానం. కాని నేటి కాలంలో దీనిని ప్రజలు పూర్తిగా మరచిపోయినారు. ఈ రోజులలో చాలా అరుదుగా అతి కొద్ది మంది మాత్రమే తక్బీర్ పదాలు పలుకు తున్నారు. ఈ తక్బీర్ ను బిగ్గరగా ఉచ్చరించ వలెను. దీని ద్వారా నిర్లక్ష్యం చేయబడుతున్న ఒక సున్నత్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారాన్ని)ను తిరిగి పునరుద్ధరింపవలసిన అవసరాన్ని గుర్తు చేసినట్లవుతుంది. ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా మరియు అబు

హురైరా రదియల్లాహు అన్హు లు జుల్ హజ్జ్ మాసపు మొదటి పది రోజులలో మార్కెట్ ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ బిగ్గరగా తక్బీర్ ఉచ్చరించేవారని మరియు వారి తక్బీర్ పలుకులు వినగానే ప్రజలు కూడా బిగ్గరగా తక్బీర్ పలుకులు ఉచ్చరించే వారని స్పష్టమైన సాక్ష్యాధారాలతో నమోదు చేయబడినది. ప్రజలను తక్బీర్ పలుకలు ఉచ్చరించమని గుర్తు చేయటం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, ప్రతి ఒక్కరూ స్వయంగా తక్బీర్ ఉచ్చరించమనేగాని అందరూ కలిసి సమశ్రుతిలో ఒకేసారి తక్బీర్ ఉచ్చరించమని కాదు. ఇలా ఒకేసారి అందరూ కలిసి ఒకే గొంతులో ఉచ్చరించే విధానానికి షరిఅహ్ లో ఎటువంటి ఆధారం లభించదు.


పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన సున్నత్ ను అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచారాన్ని మరల పునరుద్ధరించటమనే చర్యకు అనేకమైన పుణ్యాలు లభించును. దీనికి ఆధారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించి ఈ హదీస్: “ఎవరైతే నా మరణం తర్వాత ప్రజలు మరచిపోయిన నా సున్నత్ ను (ఆచారాన్ని) తిరిగి పునరుద్ధిరంచారో, వారు ఆ సున్నత్ ను ఆచరిస్తున్న ప్రజల పుణ్యాలలో ఎటువంటి తగ్గింపూ లేకుండా, వారూ (పునరుద్ధరించినవారూ) అన్ని పుణ్యాలు పొందుతారు.” (అత్తిర్మిథీ హదీస్ గ్రంథం, 7/443; ఉల్లేఖకుల పరంపర ఆధారంగా ఇది హసన్ హదీస్ గా వర్గీకరింపబడినది.)
హజ్జ్ మరియు ఉమ్రా యాత్ర చేయటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరైనా చేయగలిగే ఉత్తమ శుభకార్యాలలో అల్లాహ్ యొక్క గృహాన్ని హజ్జ్ యాత్ర కోసం సందర్శించటం. ఎవరికైతే అల్లాహ్ తన పవిత్ర గృహాన్ని సందర్శించే మరియు సరైన పద్ధతిలో అన్ని ఆరాధనలు పూర్తి చేయటానికి సహాయ పడుతున్నాడో వారి ఔన్నత్యాన్ని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక హదీస్ ఇలా ప్రకటించినారు: “స్వీకరింపబడిన హజ్జ్ యాత్ర తెచ్చే పుణ్యఫలం స్వర్గం కంటే తక్కువ ఉండదు.”మంచి పనులు అధికంగా చేయటం. ఎందుకంటే అల్లాహ్ కు మంచి పనులంటే ఇష్టం మరియు అవి అల్లాహ్ నుండి అమితమైన పుణ్యాలను సంపాదించి పెట్టును. ఎవరైతే హజ్జ్ యాత్రకు వెళ్ళలేక పోయారో, వారు ఈ పవిత్ర సమయంలో అల్లాహ్ ధ్యానంలో, ప్రార్థనలలో, నమాజలలో, ఖుర్ఆన్ పఠనంలో, అల్లాహ్ ను స్మరించటంలో, దానధర్మాలలో, తల్లిదండ్రులను గౌరవించటంలో, బంధువులతో సంబంధాలు మెరుగు పరచటంలో, సమాజంలో మంచిని ప్రోత్సహించటంలో మరియు చెడును నిరోధించటంలో, ఇంకా ఇతర వివిధ రకాల మంచి పనులు, పుణ్యకార్యాలలో, ఆరాధనలలో మునిగి పోవలెను. ఖుర్బానీ సమర్పించటం. ఈ పవిత్ర పది దినాలలో ఎవరినైనా అల్లాహ్ కు దగ్గర చేర్చే శుభకార్యాలలో పశుబలి సమర్పించటం, దాని కోసం ఒక ఉత్తమమైన పశువును ఎన్నుకోవటం, దానిని బాగా మేపటం, అల్లాహ్ కోసం ఖర్చు పెట్టటం అనేవి కూడా ఉన్నాయి. చిత్తశుద్ధితో పశ్చాత్తాప పడటం మరియు క్షమాపణ వేడుకోవటం. ఈ పది పవిత్ర దినాలలో ఎవరైనా చేయగలిగే మంచి శుభకార్యాలలో ఒకటి – తాము చేసిన తప్పులకు, పాపములకు పశ్చాత్తాప పడుతూ, అల్లాహ్ ను చిత్తశుద్ధితో క్షమాపణ వేడుకోవటం. తమలోని అని అవిధేయతా పనులను, పాపపు పనులను, చెడు అలవాట్లను వదిలివేయటానికి గట్టిగా నిర్ణయించుకోవటం. పశ్చాత్తాపపడటమంటే అల్లాహ్ వైపునకు తిరిగి మరలటం మరియు అల్లాహ్ ఇష్టపడని పనులను అవి రహస్యమైనవైనా లేక బహిరంగమైనవైనా సరే వదిలివేయటం. ఏ పాపాలైతే జరిగి పోయినవో, వెంటనే వాటిని పూర్తిగా వదిలి వేసి, మరల వాటి వైపు మరలమని గట్టిగా నిశ్చయించుకుని, అల్లాహ్ ఇష్టపడే పుణ్యకార్యాలనే మనస్పూర్తిగా చేయటానికి ప్రయత్నించ వలెను.


ఒకవేళ ఎవరైనా ముస్లిం పాపం చేసినట్లయితే, ఆలస్యం చేయకుండా వెనువెంటనే పశ్చాత్తాప పడవలెను. దీనికి మొదటి కారణం చావు ఏ క్షణాన వస్తుందో ఎవరికీ తెలియక పోవటం. రెండోది ఒక పాపపు కార్యం ఇంకో పాపపు కార్యానికి దారి చూపుతుందనే వాస్తవ అనుభవం.


ప్రత్యేక సమయాలలో పశ్చాత్తాపపడటం, అల్లాహ్ ను క్షమాపణ వేడుకోవటంలో చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఎందుకంటే ఆయా శుభసమయాలలో ప్రజల ఆలోచనలు ఆరాధనల వైపునకు మరలి, మంచి పనులు చేయాలనే ఆసక్తి కలిగి, తమలోని తప్పులను, పాపాలను గుర్తించటానికి దారి చూపును. తద్వారా వారిలో గతం గురించిన పశ్చాత్తాప భావనలు కలుగును. పశ్చాత్తాప పడటమనేది అన్ని సమయాలలోనూ తప్పని సరియే. కాని, ఒక ముస్లిం అత్యంత శుభప్రదమైన దినాలలో మంచి పనులతో పాటు, ఆరాధనలతో పాటు పశ్చాత్తాపాన్ని జత పరచటమనేది అల్లాహ్ ఆమోదిస్తే (ఇన్షాఅల్లాహ్) సాఫల్యానికి చిహ్నమగును. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాని, ఎవరు ఇక్కడ పశ్చాత్తాప పడతాడో, విశ్వసించి మంచి పనులు చేస్తేడో, అతడు అక్కడ సాఫల్యం పొందే వారి మధ్య ఉండగలను అని ఆశించగలుగుతాడు.” [సూరహ్ అల్ ఖశశ్ 28:67]


సమయం త్వరత్వరగా గడిచిపోతుండటం వలన, ఈ ముఖ్యసమయాలలోని శుభాలను ముస్లింలు కోల్పోకుండా చూసుకోవలెను. తనకు అవసరమైనప్పుడు పనికి వచ్చేవి మంచి పనుల ద్వారా సంపాదించుకున్న పుణ్యాలే. ఎన్ని పుణ్యాలున్నా సరే, అక్కడి అవసరాలకు చాలవు. కాబట్టి ఇలాంటి శుభసమాయలలో అధిక పుణ్యాలు సంపాదించుకుంటూ, రాబోయే సుదీర్ఘ ప్రయాణానికి స్వయంగా తయారు కావలెను. ఏ క్షణంలో బయలుదేరటానికైనా సరే సిద్ధంగా ఉండవలెను. గమ్యస్థానం చాలా దూరంగా ఉన్నది. ఏ ఒక్కరూ తప్పించుకోలేని సుదీర్ఘ ప్రయాణము భయభ్రాంతుల్ని కలిగిస్తున్నాయి. మోసం, దగా, వంచన నలుమూలలా వ్యాపించి ఉన్నాయి. కాని, అల్లాహ్ ప్రతి క్షణాన్ని గమనిస్తున్నాడు. ఆయన వైపునకే మనము మరల వలసి ఉన్నది మరియు ఆయనకే మన కర్మలు సమర్పించవలసి ఉన్నది. దీని గురించి దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “కాబట్టి ఎవరైతే అణువంత మంచిని చేసారో, వారు దానిని చూస్తారు. మరియు ఎవరైతే అణువంత చెడును చేసారో, వారు దానిని చూస్తారు.” [సూరహ్ అజ్జల్ జలాహ్99:7-8]
కూడగట్ట వలసిన పుణ్యఫలాలు చాలా ఉన్నాయి. కాబట్టి విలువ కట్టలేని మరియు ప్రత్యామ్నాయం లేని ఈ పది శుభదినాలలో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించుకోవలెను. చావు సమీపించక ముందే, సరైన సమయంలో ప్రతిస్పందించక, మంచి అవకాశాన్ని చేజార్చుకోక ముందే, ఏ ప్రార్థనలూ స్వీకరించబడని చోటుకు చేరుకోమని ఆదేశింపబడక ముందే, ఆశించుతున్న వానికి మరియు అతను ఆశించిన వాటికి మధ్య చావు అడ్డుపడక ముందే, నీ కర్మలతో సమాధిలో చిక్కుకోక ముందే మంచి పనులు, శుభకార్యాలు చేయటానికి త్వరపడవలెను.


గాఢాంధకారంతో నిండిన హృదయం గలవాడా, నీ హృదయాన్ని వెలుగుకిరణాలతో నింపి, మెత్తపరచే సమయం ఇంకా ఆసన్నం కాలేదా? ఈ పది శుభదినాలలో మీ ప్రభువైన అల్లాహ్ తరఫు నుండి వీస్తున్న చల్లటి దీవెనల ఆహ్లాదాన్ని కోల్పోవద్దు. అల్లాహ్ తను ఇష్టపడిన వారికి ఈ చల్లటి పవనాలు తప్పక స్పర్శించేటట్లు చేస్తాడు. అటువంటి పుణ్యాత్ములు తీర్పుదినాన ఆనందంగా, సంతోషంగా ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను మరియు వారి కుటుంబాన్ని మరియు వారి సహచరులను అల్లాహ్ మరింతగా దీవించు గాక.

 

మొత్తం సంవత్సరంలోని ఇతర దినాల కంటే జుల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు ఎలా విభిన్నమైనవి

కాలాన్ని సృష్టించిన అల్లాహ్ కే సకల ప్రశంసలు చెందును. ఆయనే కొన్ని ప్రత్యేక సమయాలను ఇతర సమయాల కంటే శుభప్రదమైనవిగా మరియు కొన్ని ప్రత్యేక నెలలను, దినాలను, రాత్రులను ఇతర నెలల, దినాల, రాత్రుల కంటే శుభప్రదమైనవిగా చేసెను. ఈ శుభకాలములో తన దాసుల పై అల్లాహ్ చూపుతున్న ప్రత్యేక కారుణ్యం వలన వారి పుణ్యాలు అనేక రెట్లు గుణింపబడును. ఇది వారిని మరిన్ని పుణ్యకార్యాలు చేయటానికి ప్రోత్సహించి, అల్లాహ్ ను ఇంకా ఎక్కువగా ఆరాధించే ఆసక్తిని వారిలో కలిగించును. అలా ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి చేయవలసిన ప్రయత్నాలను ముస్లింలలో పునరుద్ధరించి, తద్వారా తన మరణాన్ని, తీర్పుదినాన్ని ఎదుర్కొనటానికి తయారుగా ఉండేటట్లు చేయును.


ఈ ఆరాధనా కాలం అనేక శుభాలను తెచ్చుచున్నది. వాటిలో కొన్ని శుభాలు – తమ తప్పులను, పాపాలను సరిదిద్దుకుని ప్రాయశ్చతం చేసుకునే అవకాశాలు, తమ ఆరాధనలలోని మరియు ధర్మాచరణలలోని కొరతలను, లోపములను భర్తీ చేసుకునే అవకాశాలు. ఈ ప్రత్యేక సమయాలు కొన్ని ప్రత్యేక ఆరాధనలను కలిగి ఉంటాయి. వీటిని మనస్పూర్తిగా, చిత్తశుద్ధితో ఆచరించటం ద్వారా దాసులు తమ ప్రభువైన అల్లాహ్ కు దగ్గరయ్యే అవకాశాన్ని పొందుతారు. ఇంకా అల్లాహ్ తన ఇష్టానుసారం ప్రసాదించే ప్రత్యేక దీవెనలను, కరుణాకటాక్షాలను కూడా పొందుతారు. ఈ ప్రత్యేక నెలలలో, దినాలలో, ఘడియలలో వీలయినన్ని ఎక్కువ ఆరాధనలు చేస్తూ, అధిక పుణ్యాలు సంపాదించటానికి మరియు తన ప్రభువైన అల్లాహ్ సారూప్యాన్ని పొందటానికి గట్టిగా ప్రయత్నిస్తున్న వ్యక్తులే ఇహపరలోకాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతారు. అల్లాహ్ ప్రత్యేక దీవెనల ప్రసరణ వలన, తాము భయంకరమైన నరకాగ్ని జ్వాలల నుండి సురక్షితంగా ఉన్నానని ఆశిస్తూ, సంతోషంతో ఉంటారు. (ఇబ్నె రజబ్, అల్ లతాయిఫ్, p.8)


ప్రతి ముస్లిం తమ జీవితపు విలువను తప్పకుండా గ్రహించవలెను. చనిపోయేలోగా అల్లాహ్ ను సాధ్యమైనంత ఎక్కువగా ఆరాధిస్తూ, అనేక పుణ్యాలు సంపాదించటానికి తీవ్రంగా ప్రయత్నించవలెను. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు:


“మరియు మీపై రూఢీ అయినది రానంత వరకు, మీ ప్రభువును ఆరాధించండి.” [సూరహ్ అల్ హిజ్ర్ 15:99] ముఫస్సిరీన్ (ఖుర్ఆన్ వ్యాఖ్యానకర్తలు) ఇలా తెలిపినారు: “రూఢీ అయినది రానంత వరకు అంటే ఖచ్చితమైన, నిస్సందేహమైన మరణము సమీపించనంత వరకు.”


ఆరాధనల కోసం ప్రత్యేకింపబడిన అటువంటి శుభసమయాలలో జుల్ హజ్జ్ మాసంలోని మొదటి పది దినాలు కూడా వస్తాయి. అల్లాహ్ వీటిని సంవత్సరంలోని మిగతా దినాల కంటే ఉత్తమమైనవిగా, ఉన్నతమైనవిగా ఎన్నుకొనెను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఉపదేశించిన ఈ హదీస్ ను వారి సహచరుడైన ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఇలా ఉల్లేఖించినారు: “మంచి పనుల (పుణ్యకార్యాల) ను అల్లాహ్ ఎక్కువగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా వేరే దినాలేమీ లేవు.” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించారు, “అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కంటేనా?” ఆయన ఇలా సమాధానమిచ్చినారు, “అల్లాహ్ కోసం ధర్మయుద్ధం చేయటం కూడా కాదు, అయితే తనను మరియు తన సంపదను అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధంలో పూర్తిగా సమర్పించుకుని, ఖాళీ చేతులతో మరలి వచ్చినతను తప్ప” (సహీహ్ బుఖారీ హదీస్ గ్రంథం, 2/457).


ఇబ్నె అబ్బాస్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఇంకో హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “బలిదానపు (ఖుర్బానీ) పది దినాలలో చేసే పుణ్యకార్యాల కంటే ఎక్కువ విలువైనదీ, ఉత్తమమైనదీ అల్లాహ్ దృష్టిలో మరేదీ లేదు.” అప్పుడు సహచరులు ఇలా ప్రశ్నించినారు, “అల్లాహ్ కోసం చేసే ధర్మయుద్ధం కంటేనా?” (దారిమి గ్రంథం, 1/357; అల్ ఇర్వావుల్ గలీల్లో తెలుపబడినట్లు దీని ఉల్లేఖకుల పరంపర హసన్ వర్గీకరణలోనికి వచ్చును, 3/398).


ఈ పవిత్ర ఉపదేశాలు మరియు ఇటువంటివే ఇతర ఉపదేశాలు సూచిస్తున్న దానిని బట్టి, ‘సంవత్సరంలోని మిగిలిన అన్ని దినాల కంటే ఈ పది దినాలు ఎంతో ఉత్తమమైనవి’ అనటానికి ఎటువంటి సందేహామూ లేదు. ఇవి రమదాన్ నెలలోని చివరి పది దినాల కంటే కూడా ఉత్తమమైనవి. కాని రమదాన్ నెలలోని చివరి పది రాత్రులు తమలో వెయ్యి నెలల కంటే ఉన్నతమమైన లైలతుల్ ఖదర్ అనే రాత్రిని కలిగి ఉండటం వలన ఎంతో ఉత్తమమైనవి. అంటే సంవత్సరం మొత్తం దినాలలో జుల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలు మిగిలిన అన్ని దినాల కంటే ఎంతో ఉత్తమమైనవి మరియు సంవత్సరం మొత్తం రాత్రులలో రమదాన్ మాసపు చివరి పది రాత్రులు మిగిలిన అన్ని రాత్రుల కంటే. ఈ విధంగా వేర్వేరు వ్యాఖ్యానాల, ఉల్లేఖనల మధ్య సమతుల్యాన్ని, పరిష్కారాన్ని సాధించవచ్చును. (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 5/412).

 

ఉద్ హియహ్ (బలిదానం – ఖుర్బానీ) ఇవ్వాలనుకునే వ్యక్తి ఈ పది దినాలలో వేటినుండి దూరంగా ఉండవలెను?

సున్నత్ (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశాల) ప్రకారం ఖుర్బాని ఇవ్వాలనుకునే వ్యక్తి తన వెంట్రుకలను, గోళ్ళను కత్తిరించడం మరియు తన చర్మం నుండి దేన్నైనా సరే తొలగించడం మొదలైనవి ఈ జుల్ హజ్జ్ పది దినాల ఆరంభం నుండి బలిదానం సమర్పించే వరకు (ఖుర్బానీ చేసే వరకు) మానివేయవలెను. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించి ఉన్నారు: “జుల్ హజ్జ్ యొక్క క్రొత్త నెలవంక చూడగానే, మీలో ఎవరైనా ఉద్ హియహ్ ఖుర్బాని సమర్పించాలనుకుంటే, అది పూర్తి చేసే వరకు (పశుబలి పూర్తి చేసే వరకు) తన వెంట్రుకలను మరియు గోళ్ళను కత్తిరించడం మానివేయవలెను.” ఇంకో ఉల్లేఖన ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినట్లు నమోదు చేయబడినది: “అతను తన వెంట్రుకలు లేక చర్మం నుండి (దానిని అంటిపెట్టుకుని ఉన్న వాటిని) దేనినీ తొలగించకూడదు.” (నలుగురు ఉల్లేఖకులతో సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథంలో నమోదు చేయబడినది, 13/146)


ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ ఆదేశాలు ఒక దానిని తప్పని సరిగా చేయమంటున్నాయి (ఖుర్బానీని). ఇంకా వారి యొక్క నిషేధాజ్ఞలు ఇంకో దానిని (వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించటాన్ని) హరామ్ (ఎట్టి పరిస్థితులలోను చేయకూడదు) అని ప్రకటిస్తున్నాయి. సరైన అభిప్రాయం ప్రకారం ఈ ఆదేశాలు మరియు నిషేధాజ్ఞలు బేషరతుగా మరియు తప్పించుకోలేనివిగా ఉన్నాయి. అయితే, ఎవరైనా వ్యక్తి ఈ నిషేధించిన వాటిని కావాలని చేసినట్లయితే, అతను వెంటనే అల్లాహ్ యొక్క క్షమాభిక్ష అర్థించవలెను. అతని ఖుర్బాని స్వీకరించబడును. అంతే కాని దానికి ప్రాయశ్చితంగా అదనపు ఖుర్బాని సమర్పించుకోవలసిన అవసరంలేదు; హాని కలిగిస్తున్న కారణంగా ఉదాహరణకు చీలిపోయిన గోరు బాధపెట్టటం, వెంట్రుకలున్నచోట గాయం కావటం మొదలైన అత్యవసర పరిస్థితుల వలన కొన్ని వెంట్రుకలు లేక గోరు తొలగించవలసి వస్తే, అటువంటి వారు వాటిని తొలగించవచ్చును. అలా చేయటంలో ఎటువంటి తప్పూ, పాపమూ లేదు. ఇహ్రాం స్థితి ఎంతో ముఖ్యమైనదప్పటికీ, వెంట్రుకలు లేక గోళ్ళు వదిలివేయటం వలన హాని కలుగుతున్నట్లయితే, వాటిని కత్తిరించటానికి అనుమతి ఇవ్వబడినది. జుల్ హజ్జ్ మాసపు మొదటి పది దినాలలో స్త్రీలు గాని, పురుషులు గాని తమ తల వెంట్రుకలను కడగటంలో ఎటువంటి తప్పూ లేదు.

ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాాహు అలైహి వసల్లం వాటిని కత్తిరించటాన్నే నిరోధించినారు గాని వాటిని కడగటాన్ని నిరోధించలేదు.

వెంట్రుకలు లేక గోళ్ళు తీయటం పై ఉన్న నిషేధం వెనుక ఉన్న వివేచన ఏమిటంటే ఖుర్బాని ఇచ్చే అతను అల్లాహ్ కు దగ్గర కావాలనుకుని చేస్తున్న ఈ పశుబలి వంటి కొన్ని ధర్మాచరణలు, హజ్జ్ లేక ఉమ్రా యాత్రలో ఇహ్రాం స్థితిలో ఉన్నవారితో సమానం. కాబట్టి వెంట్రుకలు, గోళ్ళు తీయటం వంటి కొన్ని ఇహ్రాం స్థితిలోని నిబంధనలు పశుబలి ఇస్తున్న వారికి కూడా వర్తిస్తాయి. దీనిని పాటించటం వలన అల్లాహ్ అతనిని నరకాగ్ని నుండి విముక్తి చేస్తాడని ఒక ఆశ. అల్లాహ్ యే అత్యుత్తమమైన జ్ఞానం కలిగినవాడు.


ఒకవేళ ఎవరైనా దుల్ హజ్జ్ నెలలోని మొదటి పది దినాలలో ఖుర్బాని ఇవ్వాలనే సంకల్పం లేకపోవటం వలన తన వెంట్రుకలు లేక గోళ్ళు తీసి, ఆ తర్వాత ఖుర్బాని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లయితే, ఆ క్షణం నుండి అతను వెంట్రుకలు లేక గోళ్ళు తీయకుండా ఉండవలెను.


కొందరు స్త్రీలు దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలలో తమ వెంట్రుకలను కత్తిరించుకునేందుకు వీలుగా, తమ ఖుర్బాని ఇచ్చే బాధ్యతను తమ సోదరులకు లేక కొడుకులకు అప్పగిస్తారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే, ఖుర్బాని ఇచ్చే వారికే ఈ నిబంధన వర్తిస్తుంది – అసలు ఖుర్బాని ని పూర్తి చేసే బాధ్యత ఇతరులకు అప్పగించినా, అప్పగించకపోయినా. ఎవరికైతే ఆ బాధ్యత ఇవ్వబడినదో వారికి ఈ నిబంధన వర్తించదు. స్వయంగా ఇష్టపడి ఇతరుల పశుబలి చేస్తున్నా లేక ఇతరులు తమకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేస్తున్నా, అటువంటి వారి పై ఈ నిషేధము వర్తించదు.


ఇంకా, ఈ నిబంధన ఖుర్బానీ చేస్తున్నతని పైనే ఉంటుంది గాని అతని భార్యాబిడ్డలకు వారు కూడా వేరుగా బలిదానం ఖుర్బాని చేస్తున్నట్లయితేనే తప్ప వర్తించదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ కుటుంబం తరఫున బలిదానం సమర్పించేవారు కాని వారిని తమ వెంట్రుకలు, గోళ్ళు తీయకుండా ఈ నిబంధనలు పాటించమని ఆదేశించినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవు.


ఎవరైనా ఖుర్బాని సమర్పించాలని నిశ్చయించుకుని, ఆ తర్వాత హజ్జ్ యాత్ర చేయటానికి నిర్ణయించుకున్నట్లయితే, వారు ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు వెంట్రుకలు గాని గోళ్ళు గాని తీయకూడదు. ఎందుకంటే ఇహ్రాం స్థితిలో ప్రవేశించేటప్పుడు అవసరమైనప్పుడు వెంట్రుకలు లేక గోళ్ళు తీయటమనేది సాధారణ సమయాలలో మాత్రమే పాటించే ఒక సున్నహ్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఆచారం. కాని ఒకవేళ “తమత్తు” పద్ధతి ప్రకారం హజ్జ్ చేస్తున్నట్లయితే, [ఉమ్రా పూర్తి చేసి, ఇహ్రాం స్థితి నుండి బయటకు వచ్చి, మరల హజ్జ్ కోసం క్రొత్తగా ఇహ్రాం స్థితిలో ప్రవేశించేవారు], ఉమ్రా పూర్తి చేసిన తర్వాత తన వెంట్రుకలను చిన్నగా కత్తిరించకోవలెను. ఎందుకంటే వెంట్రుకలు తీయటమనేది ఉమ్రాలోని ఒక ఆచరణ.


పైన తెలిపిన హదీస్ లో ఖుర్బాని ఇచ్చేవారికి వర్తించే నిబంధనలన్నీ తెలియజేయబడినవి. సుగంధద్రవ్యాల వాడకంలో లేక భార్యతో సంభోగం చేయటంలో లేక కుట్టబడిన దుస్తులు ధరించటంలో ఎటువంటి నిషేధాజ్ఞలు లేవు. అల్లాహ్ కే ప్రతిదీ తెలియును.


ఈ పది రోజుల్లో ఆచరించవలసిన ఆరాధనా పద్ధతులు: అల్లాహ్ తరఫు నుండి ఈ పది రోజులు తన దాసుల వైపునకు ఒక గొప్ప దీవెనగా గ్రహించవలెను. మంచి పనులలో, శుభకార్యాలలో, దానధర్మాలలో చైతన్యవంతంగా, క్రియాత్మకంగా పాల్గొనటం ద్వారా వీటికి విలువనిచ్చినట్లగును. ఈ దీవెనకు తగిన ప్రాధాన్యతనివ్వటం ముస్లింల కనీస బాధ్యత. పూర్తి ఏకాగ్రతతో, వివిధ దైవారాధనలలో ఎక్కువ సమయం గడపటానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఈ పది రోజుల్లో వీలయినన్ని ఎక్కువ పుణ్యాలు సంపాదించటానికి స్వయంగా తనకు తాను అంకితం చేసుకోవలెను. మంచి పనులు చేయటానికి మరియు వివిధ ఆరాధనలు చేయటానికి ప్రసాదించబడిన రకరకాల అవకాశాలు కూడా అల్లాహ్ తన దాసులపై అవతరింపజేసిన ప్రత్యేక దీవెనలలోనికే వస్తాయి. ఈ శుభకార్యాల ద్వారా ముస్లింలు ఎల్లప్పుడూ చైత్యవంతంగా, క్రియాత్మకంగా మరియు నిరంతరాయంగా తమ అల్లాహ్ ను ఆరాధించటానికి అవకాశం ఉన్నది.

 

ఈ పది దినాలు ప్రత్యేకమైనవి అనటానికి అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి

అల్లాహ్ ఖుర్ఆన్ లో కొన్నిచోట్ల ఆ ప్రత్యేక పది దినాలపై ప్రమాణం చేసియున్నాడు. వేటిపైనైనా ప్రమాణం చేయటమంటే అది వాటి ప్రత్యేకతను, గొప్పతనాన్ని, ప్రయోజనాల్ని సూచిస్తుంది. దివ్యఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఉషోదయాల ప్రమాణంగా; పది రాత్రుల ప్రమాణంగా” [సూరహ్ అల్ ఫజర్ 89:1-2]. ఇక్కడ ఉషోదయాలంటే దుల్ హజ్జ్ లోని మొదటి పది దినాలని ఇబ్నె అబ్బాస్, ఇబ్నె జుబేర్, ముజాహిద్, ఇంకా ముందు తరం మరియు తర్వాత తరం వారు అభిప్రాయపడినారు. “ఇదే సరైన అభిప్రాయం.” అని ఇబ్నె కథీర్ తెలిపినారు (తఫ్సీర్ ఇబ్నె కథీర్, 8/413)పైన తెలిపిన సహీహ్ హదీస్ లలో ఈ పది దినాలను ఇహపరలోకాలలో అత్యుత్తమమైన దినాలుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధృవీకరించినట్లు తెలుసుకున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఈ పది దినాల ప్రత్యేకతల మరియు హజ్ యాత్రికులు ఈ సమయంలో పవిత్ర కాబాగృహం దగ్గర చేస్తున్న ప్రత్యేక ఆరాధనల కారణంగా ఈ ఉత్తమ సమయంలో మంచి పనులు, పుణ్యకార్యాలు సాధ్యమైనంత ఎక్కువగా చేయాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ప్రోత్సహించినారు. ఈ మంచి సమయంలో తస్బీహ్ (“సుభహానల్లాహ్”), తహ్మీద్ (“అల్ హమ్దులిల్లాహ్”) మరియు తక్బీర్ (“అల్లాహ్ అక్బర్”) ఎక్కువగా ఉచ్చరించమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశించినారు. అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖించిన ఈ హదీస్ లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉపదేశించినారు: “తను పుణ్యకార్యాలను అమితంగా ఇష్టపడే దినాలలో ఈ పది దినాలు కాకుండా అల్లాహ్ దృష్టిలో వేరే దినాలేమీ లేవు. కాబట్టి ఈ సమయంలో ఎక్కువగా తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్), తక్బీర్ (అల్లాహ్ అక్బర్), తహ్మీద్ (అల్ హమ్దులిల్లాహ్) ఉచ్చరించవలెను” (అహ్మద్ హదీస్ గ్రంథం, 7/224; అహ్మద్ షాకిర్ దీనిని సహీహ్ గా వర్గీకరించెను).ఈ పది విశిష్ట దినాలలో యౌమ్ అరఫాహ్ అంటే అరఫా దినము కూడా ఉన్నది. అల్లాహ్ ఇదే దినమున తన ధర్మాన్ని సంపూర్ణం చేసినాడు. ఈ ఉత్తమ దినమున ఉండే ఉపవాసము రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేయును. ఈ ఉత్తమ దినాలలో యౌమున్నహర్ (బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినము) కూడా ఉన్నది. ఇది సంవత్సరం మొత్తం దినాలలో అత్యుత్తమమైన దినం మరియు హజ్జ్ దినాలలో అత్యుత్తమమైన దినం. ఈ దినము ఇతర అన్ని దినాల మాదిరిగా కాకుండా ఆరాధనలను ప్రత్యేక పద్ధతిలో ఒక చోటికి చేర్చును. ఈ పది దినాలలో బలిదానపు దినం అంటే ఖుర్బానీ దినం మరియు హజ్జ్ దినాలు కూడా ఉన్నాయి

Popular Posts