Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


జుల్ హిజ్జా మాసం  జుల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను  కొంచమైనా కత్తిర...

జుల్ హిజ్జా మాసం


 జుల్ హిజ్జా మాసపు తొలి దశకంలో ఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత


ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను  కొంచమైనా కత్తిరించుకోరాదు 
 


హజ్రత్ ఉమ్మె సల్మా (రజి అల్లాహు అన్హ) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు :- ఖుర్బానీ కొరకు పశువు ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు.

 

సహీహ్ ముస్లిం 1708 [సహీహ్ ముస్లింలోని అజాహీ ప్రకరణం] 313 వ అధ్యాయం : ఖుర్బానీ చేయదలుచుకునే వారు జుల్ హిజ్జా మాసపు నెలవంక కనిపించినప్పటి నుంచి ఖుర్బానీ ఇచ్చేవరకు తమ వెంట్రుకల్ని, గోళ్ళను కొంచమైనా కత్తిరించుకోరాదు. హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లాహి అలైహి)

 

అరఫా రోజు పాటించబడే ఉపవాసం ఘనత


హజ్రత్ అబూ ఖతాదా (రజి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను అరఫా నాటి ఉపవాసం గురించి విచారించటం జరిగింది. అందుకాయన సమాధానమిస్తూ, “అది క్రితం యేడు మరియు వచ్చేయేటి పాపాలన్నిటినీ (minor sins – చిన్న పాపాలు) తుడిచి పెట్టేస్తుంది” అని వివరించారు. సహీహ్ ముస్లిం 1251. [సహీహ్ ముస్లిం లోని ఉపవాసాల ప్రకరణం]

జుల్ హిజ్జామాసపు తొమ్మిదో తేదీని ‘అరఫా రోజు’ అని పిలుస్తారు. ఆ రోజు హజ్ యాత్రికులందరూ అరఫాత్ మైదానంలో ఆగుతారు. కనుక ఆ రోజును ‘అరఫాత్ రోజు’ గా వ్యవహరిస్తారు. ఆ విధంగా అరఫాత్ మైదానంలో ఆగటమనేది హజ్ విధులన్నిటిలోనూ అత్యంత ప్రధానమైనది. దాన్ని నిర్వర్తించకపోతే హజ్ నెరవేరదు. హజ్ యాత్రికులు ఆ రోజున ప్రార్ధనలు, సంకీర్తనల్లో నిమగ్నులై ఉంటారు. ఆనాడు వారికి అదే గొప్ప ఆరాధనగా పరిగణించబడుతుంది. కనుక వారు ఆరోజు ఉపవాసం పాటించటం అభిలషణీయం కాదు. కాని హజ్ యాత్రలో పాల్గొనని వారికి మాత్రం ఆరోజు ఉపవాసం పాటిస్తే గొప్ప ప్రతిఫలం లభిస్తుంది. ఆ ఒక్క ఉపవాసం రెండేళ్ళ పాపాలను తుడిచి పెట్టేస్తుంది. 227 వ అధ్యాయం – అరఫా రోజు మరియు ముహర్రమ్ మాసపు తొమ్మిదో, పదో తేదీల్లో పాటించబడే ఉపవాసాల ఘనత హదీసు కిరణాలు (రియాజుస్సాలిహీన్) – సంకలనం : ఇమామ్ నవవీ (రహ్మతుల్లా అలై)

 

జుల్ హిజ్జా మాసపు తొలి దశకంలోఉపవాసం మరియు ఇతర సత్కార్యాల ఘనత


హజ్ నెల ప్రారంభ మైనది, మొదటి పది రోజులు ఎంతో ముఖ్యమైనవి. ఈ పది రోజులలో చేసిన మంచి పనులకు అల్లాహ్ ఎంతో గొప్పపుణ్యం ప్రసాదిస్తాడు.

 

హజ్రత్ ఇబ్నె అబ్బాస్ (రజి అల్లాహు అన్హు) కధనం ప్రకారం, దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు:- జుల్ హిజ్జామాసపు తొలి పదిరోజుల్లో చేయబడిన సత్కార్యాల కన్నా ఇతర దినాల్లో చేసిన సత్కార్యాలేవీ దేవుని దృష్టిలో అత్యంత ప్రియమైనవి కావు. అది విని సహచరులు సందేహపడుతూ, “ధైవప్రవక్తా ! అల్లాహ్ మార్గంలో చేయబడే పోరాటం కూడా (దాని కన్నా ప్రియమైనది) కాదా ? అని అడిగారు. దానికి సమాధానమిస్తూ, “అల్లాహ్ మార్గంలో చేయబడిన పోరాటం కూడా (ప్రియమైనది) కాదు. ఒకవేళ ఎవరయినా ధనప్రాణాలు సమేతంగా బయలుదేరి వాటిలో ఏదీ తిరిగి రాకపోతే (అంటే దైవమార్గంలో వీరమరణం పొందితే మాత్రం నిశ్చయంగా అతను శ్రేష్టుడే)” అని చెప్పారు.   బుఖారీ 1250 [సహీహ్ బుఖారీలోని పండుగ ప్రకరణం]

 

జుల్ హిజ్జామాసపు మొదటి పది రోజుల్లో హజ్ యాత్రికులు ప్రత్యేక ఆరాధనా కార్యకలాపాలు నిర్వర్తిస్తారు. కాని హజ్ చేయలేక  పోతున్నవారు ఆ పుణ్యానికి నోచుకోలేరు. అందుకని అలాంటివారు తమ స్వంత ప్రదేశాల్లోనే ఉండి నఫీల్ ఉపవాసాలు ఇతర ఆరాధనా  కార్యకలాపాలు చేసుకొని వీలైనంత ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోగలగాలన్నా ఉద్దేశ్యంతో జుల్ హిజ్జా మాసపు తొలి పది రోజుల్లో చేయబడే సత్కార్యాలు దేవునికి అత్యంత ప్రియమైనవని ప్రకటించడం జరిగింది. ఇస్లాం లో ‘జిహాద్’ కు చాలా ప్రాముఖ్యత ఉందన్న విషయం కూడా ఈ హదీసు ద్వారా బోధనపడుతున్నది. హదీసు కిరణాలు (Riyadus Saliheen) రెండవ సంపుటం సంకలనం: ఇమాం నవవి (రహిమతుల్లాహి అలైహి)

 

హజ్ లో – కాబా వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరిఅయితే రుతుమతికి (Menstruating woman) మినహాయింపు ఉంది


హజ్రత్ ఆయిషా (రజి అల్లాహు అన్హ) కధనం :- నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో “దైవప్రవక్తా ! సఫియా బిన్తె హుయ్యి (రజి అల్లాహు అన్హు) బహిష్టు అయి ఉంది” అని తెలిపాను. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “మనం ఆగిపోవడానికి ఈమె కారకురాలవుతుందేమో!” అని అన్నారు. ఆ తరువాత “ఆమె మీ అందరితో పాటు ఏదైనా ఒకసారి కాబా ప్రదక్షిణ చేయలేదా?” అని అడిగారు. “ఎందుకు చెయ్యలేదు, చేసింది (సందర్శనా ప్రదక్షిణ)” అన్నాను నేను. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అయితే ఇక పరవాలేదు. మనం బయలుదేరవచ్చు” అని అన్నారు. సహీహ్ బుఖారీ 836 [సహీహ్ బుఖారీ : 6 వ ప్రకరణం - హైజ్, 27 వ అధ్యాయం - అల్ మర అతు  తహీజు బాదల్ ఇఫాజా] హజ్ ప్రకరణం – 67 వ అధ్యాయం – వీడ్కోలు ప్రదక్షిణ చేయడం తప్పనిసరి, అయితే రుతుమతికి మినహాయింపు ఉంది. మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1. సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

 

ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు


హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ (రజి అల్లాహు అన్హు) కధనం :- ఒక వ్యక్తి అరఫా రోజు (Day of Arafah) వఖూఫ్ (లేచి ఉండు) స్థితిలో ఉండి హఠాత్తుగా ఒంటె మీద నుంచి జారిపడ్డాడు. అతని మెడ ఎముక విరగడంతో (అక్కడికక్కడే) చనిపోయాడు. అప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “అతని భౌతికకాయానికి రేగాకులు కలిపిన నీళ్ళతో స్నానం చేయించి రెండు వస్త్రాలతో చుట్టండి. శవానికి సువాసన పూయకండి. ముఖం (వస్త్రంతో) కప్పకుండా అలాగే బయట ఉంచండి. ఇతను ప్రళయదినాన లబ్బైక్ అంటూ లేస్తాడు” అని అన్నారు. సహీహ్ బుఖారీ 753 [సహీహ్ బుఖారీ : 23 వ ప్రకరణం - జనాయేజ్, 20 వ అధ్యాయం - అల్ కఫని ఫి సౌబైన్] హజ్ ప్రకరణం : 14 వ ప్రకరణం – ఇహ్రాం స్థితిలో యాత్రికుడు చనిపోతే ఏం చేయాలి? మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) vol-1సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్

  హదియ్ హదియ్ అనగా  జంతు బలి అని అర్థం, హాజీ ఏదైతే హజ్ లో బహుమానం(యహ్దీహి) కుర్భానీ ఇచ్చేదానిని హదియ్ అంటారు. అల్ –అన్’ ఆమ్చెప్పబడిన జంతువుల...

 

హదియ్


హదియ్ అనగా  జంతు బలి అని అర్థం, హాజీ ఏదైతే హజ్ లో బహుమానం(యహ్దీహి) కుర్భానీ ఇచ్చేదానిని హదియ్ అంటారు. అల్ –అన్’ ఆమ్చెప్పబడిన జంతువులు అనగా గొర్రె, ఒంటె లను ఇహ్రామ్ ధరించక ముందే తెచ్చుకోవాలి.  హజ్ ఏ తమత్తు మరియు హజ్ ఏ కిరాన్ చేసే వారికి గల మధ్య తేడా హజ్ ఏ కిరాన్ చేసేవారికి ఏమిటంటే, హజ్ ఏ కిరాన్ చేసేవారు ఉమ్రా చేసిన తర్వాత ఇహ్రం ను తీసివేయకూడదు,  ఆ విధంగా ఈ ఇహ్రామ్ జుల్ హజ్జా ఎనిమిదవ తేదీ వరకు ఉండాలి, ఈ రోజే హాజీలు హాజ్జ్ చేయడానికి నిశ్చయించుకుంటారు.


హజ్ చేయని వారు ఈద్ ఉల్ అద్ హారోజున కుర్భానీ ఇవ్వాలి, ఇదిజుల్ హజ్ లోని పదవ తేదీ, ఈ రోజును ఉదియహ్ అని అంటారు.

 

హదీస్ 

సాలిం ఇబ్న్ అబ్దుల్లాహ్ ఉల్లేఖనం ప్రకారం ఇబ్న్ ఉమర్ (ర.జి) ఇలా చెప్పారు: ఇబ్న్ ఉమర్ (ర.జి) వారి అంతిమ హజ్ సమయంలో, అల్లాహ్ ప్రవక్త ఉమ్రా చేసిన తర్వాత హజ్ చేశారు. అలాగే హదియ్ (కుర్భానీ ఇచ్చే జంతువును) కూడా తీసుకెళ్ళారు.  ఆ తర్వాత అయన సఫా మరియు మర్వా  దగ్గరకు వెళ్లి వాటి మధ్యలో ఏడు సార్లు పరిగెత్తారు ఆ తర్వాత ఇహ్రామ్ స్థితిలో ఉన్నప్పుడు పూర్తి హాజ్ అయ్యేవరకు మరియు(జుల్ హజ్ పదవ తేదీ) అనగా నహర్ రోజు హదీయ్ అనగా కుర్భానీ ఇచ్చేవరకు ఇహ్రామ్ స్తితిలో నిశేదించబడ్డ పనులను ప్రవక్తచేయలేదు. ఆ తర్వాత త్వరగా మక్కా వైపు వచ్చి కాబా దగ్గరికి వెళ్లి తవాఫ్ చేశారు, ఆ తర్వాత ఇహ్రామ్ స్తితిలో నిషేదించబడిన పనులు అన్నీతవాఫ్ తర్వాత అనుమతించబడ్డాయని, అని ఇబ్న్ ఉమర్(ర.జి) తెలియజేశారు. సహీహ్ అల్-బుఖారీ, 1691 మరియు సహీహ్ ముస్లిం  1227

 

ఏ హజ్ యాత్రికుడు కూడా కుర్బానీనీ తన దేశంలో ఇస్తానని నిశ్చయించుకోకూడదు, ఎందుకనగా కుర్భానీ హజ్ లోని ఒక ఒక మూలస్థంభం, కాబట్టి కుర్భానీ మక్కాలోనే ఇవ్వాలి. ఒకవేళ హాజీ ఏదైనా చేసినందుకు దాని బదులుగా హజ్ లో కుర్భానీ ఇవ్వాలనుకోవడానికి కూడా అనుమతిలేదు, అలాగే తన దేశంలో కూడా ఇవ్వడానికి అనుమతి లేదు, కాబట్టి కేవలం కుర్భానీ మినా లేదా మక్కా లోనే ఇవ్వాలి.

 

విద్వాంసుల దృష్టిలో

అబ్దుల్అజీం ఆబాది ఇలా చెప్పారు: మక్కాలోనీ హరం దగ్గర ఏ ప్రదేశంలోనైనా జంతు కుర్భానీ ఇవ్వవచ్చు. విద్వాంసుల దృష్టిలో మినాలో కుర్భానీ ఇవ్వడాన్ని ఉత్తమంగా పరిగణించారు.

 

ఇవి కూడా చూడండి

హజ్;ఉమ్రా;జుల్ హిజ్జా;యవమ్ ఉన్ నహర్;ఇహ్రామ్;మస్జిద్ ఏ హారం;మక్కా

  ముజ్దలిఫా - MUZDALIFAH ముజ్దలిఫా ఓ బహిరంగ ప్రదేశం, లోయ. ఇది సౌదీ అరబియలోని మినా మరియు అరఫా మధ్యలో ఉంది. ఇక్కడ హాజీలు హజ్ సమయంలో రాత్రి గడు...

 

ముజ్దలిఫా - MUZDALIFAH


ముజ్దలిఫా ఓ బహిరంగ ప్రదేశం, లోయ. ఇది సౌదీ అరబియలోని మినా మరియు అరఫా మధ్యలో ఉంది. ఇక్కడ హాజీలు హజ్ సమయంలో రాత్రి గడుపుతారు. మినాలోని స్థూపాలపై (షైతాన్ ను సూచించే) విసిరే రాళ్ళను ప్రజలు ఇక్కడే సేకరిస్తారు.

 

9వ జిల్ హజ్జా నాడు హాజీలు సూర్యాస్తమయం తరువాత మఘ్రిబ్ నమాజు చదవకుండా, శాంతితో హుందాగా తల్బియా చదువుతూ ముజ్దలిఫాకు బయలుదేరుతారు. (సహీహ్ ముస్లిం). ముజ్దలిఫా చేరాక మఘ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒక అజాన్, రెండు ఇఖామత్ లతో కలిపి చదువుతారు. మఘ్రిబ్ మూడు రకాతులు మరియు ఇషా రెండు రకాతులు చదువుతారు. ఆ రాత్రి ముజ్దలిఫా లో నిద్రపోతారు. 10వ జిల్ హజ్జా నాడు అక్కడే ఫజర్ నమాజ్ మొదటి సమయంలో (తొందరగా) చేస్తారు. [1]

 

ముజ్దలిఫా వెళ్ళడం 

సూర్యుడు అస్తమించగానే హాజీలు ముజ్దలిఫాకు వెళ్ళాలి. అక్కడ చేరాక మఘ్రిబ్ మరియు ఇషా నమాజులు ఒక అజాన్ రెండు ఇఖామత్ లతో కలిపి చదవాలి. అర్ధరాత్రి వరకు ముజ్దలిఫా చేరే అవకాశం లేనిచో, దారిలోనే నమాజ్ చేయాలి. ఎందుకంటే, ఇషా నమాజ్ అర్ధరాత్రి దాటక ముందే చదవాలి అని సూచించబడింది.

 

ఆ రాత్రి అతను ముజ్దలిఫాలోనే గడపాలి. మరుసటి రోజు సూర్యాస్తమయానికి ముందు, మొదటి వేళలో అజాన్, ఇఖామత్ తో ఫజర్ నమాజ్ చదివి, మష్అరుల్ హరాం (ముజ్దలిఫాలో ఉన్న మస్జిద్ పేరు) వైపు వెళ్ళాలి. వెళుతున్నప్పుడు దారిలో ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ & ‘అల్లాహు అక్బర్’ అంటూ అల్లాహ్ గొప్పదనాన్ని, ఏకత్వాన్ని చాటాలి. ఇంకా తన కోసం దుఆ కూడా చేసుకోవాలి. ఇదంతా కాస్త వెలుతురు వచ్చే వరకు చేయాలి. మష్అరుల్ హరాం కు చేరడం కష్టం అయిన పక్షంలో, అతను ఎక్కడ ఉంటే అక్కడే దుఆ చేయవచ్చు. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అక్కడే నిలబడ్డారు. ముజ్దలిఫా మొత్తంలో ఎక్కడైనా నిలబడవచ్చు. జికర్ (అల్లాహ్ నామస్మరణ) చేసేటప్పుడు, దుఆ చేసేటప్పుడు ఖిబ్లా వైపు ముఖం చేసి, చేతులు పైకెత్తాలి. [2]

 

ముజ్దలిఫాలో ఫజర్ నమాజ్ చేయాలి

హాజీలందరూ ఫజర్ నమజ్ ముజ్దలిఫాలో చేయాలి. బలహీనంగా ఉన్నవారు మరియు స్త్రీలకు మినహాయింపు ఉంది. ఎక్కువ మంది ఉండడం వల్ల తొక్కిసలాట భయం ఉంటే, వారు అర్ధరాత్రి తరువాత అక్కడి నుంచి వెళ్లిపోవచ్చు.

 

ఆ తరువాత మష్అరుల్ హరాం (ముజ్దలిఫాలోని ఒక చిన్న పర్వతం) పై ఎక్కి, ఖిబ్లా వైపు ముఖం చేసి – తహ్వీద్, తక్బీర్, తహ్లీల్ పఠిoచాలి- మరియు ఆకాశం పూర్తిగా కాంతిమయం అయ్యేవరకు, అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటుతూ, దుఆ చేయాలి.

 

ముజ్దలిఫా మొత్తం నిలబడే చోటే. కావున అందులో అన్ని చోట్ల నిలబడే అనుమతి ఉంది. ఆ తరువాత అతను శాంతంగా తల్బియా చదువుతూ సూర్యాస్తమయానికి ముందు మినా కోసం బయలుదేరాలి. అతను ముహస్సిర్ అనే నది లోయ వద్దకు వచ్చినప్పుడు, కుదిరితే వేగంగా వెళ్ళాలి. ఇది మినాలోని భాగమే. ఆ తరువాత అతను మధ్య దారి పై వెళ్ళాలి. అది అతణ్ణి జమ్రాత్ ఉల్ అఖబా కు చేర్చుతుంది.

 

ముజ్దలిఫాలో చేయాల్సిన పనులు

హజ్ లో ముజ్దలిఫాలో చేయాల్సిన ఆచారాల గురించి అనేక హజీలకు జ్ఞానం ఉండక అనేక తప్పిదాలు చేస్తారు. మేము ప్రజలకు ఆ తప్పిదాల గురించి క్రింద అవగాహన చేస్తున్నాము:

 

  1. నహర్ రోజు (జిల్ హిజ్జా 10వ తేదీ) రాత్రి ముజ్దలిఫాలో గడపడం హజ్ విధుల్లో ఒకటి. 
  2. జుల్ హిజ్జా 9వ తేదీన సూర్యాస్తమయం తరువాత హాజీలు అరఫా నుండి ముజ్దలిఫాకు బయలుదేరాలి. వారు ప్రశాంతంగా వెళ్ళాలి. దారి వెడల్పుగా ఉన్న చోట ఎవరికీ హాని కలిగించకుండా కాస్త వేగంగా వెళ్ళవచ్చు. ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గారి సున్నత్ (ఆచారం). 
  3. హాజీ మఘ్రిబ్ మరియు ఇషా నమాజు ముజ్దలిఫాలో కలిపి చదువుతాడు. కేవలం ఇషా నమాజు నాలుగు రకాతులకు బదులుగా రెండు రకాతులు చదవడం జరుగుతుంది. మఘ్రిబ్ నమాజు లో ఎలాంటి కోత ఉండదు.
  4. ఎవరైనా ఇషా నమాజుకు ముందు ముజ్దలిఫా చేరుకుంటే, అతను మఘ్రిబ్ నమాజు సమయంలో మఘ్రిబ్ నమాజ్ నెరవేర్చి, ఇషా సమయం మొదలయ్యే వరకు వేచి ఉండి, సమయం మొదలయ్యాక ఇషా నమాజు చదవాలి. [ఇది షేక్ ఇబ్న్ ఉసైమిన్ (రహి) గారి అభిప్రాయం].
  5. అలసట వల్ల, నీళ్ళు లేకపోవడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల ఎవరైనా రెండు నమాజులను కలపదలిస్తే, దీనికి అనుమతి ఉంది.
  6. అర్ధరాత్రి వరకు ముజ్దలిఫా చేరే అవకాశం లేనిచో, దారిలోనే నమాజ్ చేయాలి. ఎందుకంటే, ఇషా నమాజ్ అర్ధరాత్రి దాటక ముందే చదవాలి అని సూచించబడింది.
  7. ముజ్దలిఫాలో రాత్రి మొత్తం నమాజ్ చేస్తూ లేదా ఇతర ఆరాధనలలో గడపడం సున్నత్ కు విరుద్ధం. ఎందుకంటే దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా చేయలేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తొందరగా పడుకునేవారు. దీనివల్ల పొద్దున్న తొందరగా లేచి, నహర్ రోజు ఆచరణలను చురుకుగా చేయగలము.
  8. ఫజర్ సమయం మొదలవ్వగానే, ఒక అజాన్ మరియు ఇక ఒక అఖామాతో తొందరగా (మొదటి సమయంలో) ఫజర్ నమజ్ చేయాలి. ఆ తరువాత మష్అరుల్ హరాం కు వెళ్లి, సూర్యుడు పూర్తిగా ఉదయించక ముందు ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’, ‘అల్లాహు అక్బర్’ జపించాలి మరియు అల్లాహ్ ను వేడుకోవాలి. మష్అరుల్ హరాం కు చేరుకోలేని పక్షంలో, ఎక్కడ ఉంటే అక్కడే వేడుకోవచ్చు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “నేను ఇక్కడ నిలబడ్డాను. ముజ్దలిఫా మొత్తం నిలబడే చోటే.” (సహీహ్ ముస్లిం). దుఆ చేసేటప్పుడు ఖిబ్లా వైపు తిరిగి చేతులు పైకెత్తాలి.
  9. హాజీ తెలతెల వారుతుండగా, సూర్యోదయానికి ముందు మినాకు బయలుదేరాలి.
  10. బలహీనులైన స్త్రీ, పురుషులు ముజ్దలిఫా నుంచి రాత్రే, తెల్లవారక ముందే వెళ్లిపోవచ్చు. తెల్లవారిపోతే, ఫజర్ నమాజు వరకు అక్కడే ఉండాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా చేశారు. [3]

 

70 రాళ్ళను సేకరించాలి

ప్రజలు ఎక్కువగా ఉండడం వల్ల కొందరు అర్ధరాత్రి వరకు అక్కడ చేరలేరు. ముజ్దలిఫాలో వారు 70 రాళ్ళను ఏరుకుంటారు. అక్కడ షైతాన్ ను సూచించే మూడు స్థూపాలు ఉన్నాయి. మొదటి రోజు పెద్ద స్థూపం పై ఏడు రాళ్లు విసరాలి. మిగతా మూడు రోజులు మూడింటిపై ఏడు రాళ్ల చొప్పున విసరాలి. హాజీలు రాత్రులు ముజ్దలిఫాలోని బహిరంగ ప్రదేశంలో నిద్రపోయి గడుపుతారు. మరుసటి రోజు ఉదయం మినాకు బయలుదేరుతారు. ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఆయన కుమారులు ఇస్మాయీల్ అలైహిస్సలాం ఇక్కడే షైతాన్ పై రాళ్లు విసిరారు.

 

పవిత్ర ముజ్దలిఫాలో చదవాల్సిన దుఆ

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన ఒంటె (అల్ ఖస్వా)పై మష్అరుల్ హరాం చేరుకున్నారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ను వేడుకుంటూ, ఈ పదాలు పలికారు: అల్లాహు అక్బర్ (అల్లాహ్ చాలా గొప్పవాడు), అల్లాహు అహద్ (అల్లాహ్ ఒక్కడే), లా ఇలాహ ఇల్లల్లాహ్ (అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరు లేరు). దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తెల్లవారే దాకా అలాగే ఉండిపోయారు. సూర్యోదయానికి ముందు అక్కడి నుండి బయలుదేరారు. (సహీహ్ ముస్లిం vol 2:891)

 

విద్వాంసుల అభిప్రాయం

ఇబ్న్ ఖుదామా (రహి) ఇలా అన్నారు: ‘అల్ ముజ్దలిఫా కు మూడు పేర్లు ఉన్నాయి: ముజ్దలిఫా, జామ్, అల్ మషర్ అల్ హరాం’. కొందరు విద్వాంసులు ఇది ముజ్దలిఫా లోని ఒక పర్వతం ‘ఖుజా’ అని అంటారు. అతా (రహి) అల్ మషర్ అల్ హరాం అంటే ఖుజా, మొత్తం ముజ్దలిఫా అన్నారు. పూర్వం ముజ్దలిఫాలో ఖుజా పర్వతం ఉండేది. దాన్ని తొలగించి, దాని స్థానంలో ఇప్పుడు ఉన్న మస్జిద్ నిర్మించారు. దీని సాక్ష్యం ఏమిటంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ముజ్దలిఫాలో నిలబడి ఇలా అన్నారు: “నేను ఇక్కడ నిలబడ్డాను. ముజ్దలిఫా మొత్తం నిలబడే స్థానమే.” (అహ్మద్, అబూ దావూద్, అన్ నసాయి) [4] [5]

 

ముజ్దలిఫాలో చేసే సాధారణ తప్పిదాలు

  1. ముజ్దలిఫా హద్దుల్లో ఉండకపోవడం.
  2. నమాజ్ లో ఖిబ్లా వైపు ముఖం చేయకపోవడం.
  3. నమాజ్ కు ముందు ముజ్దలిఫాలో రాళ్లు ఏరడం. ముందుగా నమాజ్ చదవడం ఉత్తమం.
  4. మఘ్రిబ్ మరియు ఇషా నమాజులను అర్ధరాత్రి దాటాక చదవడం.
  5. ఎలాంటి కారణం లేకుండానే ముజ్దలిఫా నుండి తొందరగా వెళ్ళిపోవడం మరియు దాన్ని తేలికగా తీసుకోవడం.
  6. రాత్రి నమాజ్ చేస్తూ, అల్లాహ్ నామస్మరణ చేస్తూ లేదా ఖుర్ఆన్ చదువుతూ గడపడం (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా చేయలేదు).
  7. ఫజర్ నమాజ్ మొదటి సమయంలో చదవకపోవడం. ఫజర్ నమాజ్ దాని మొదటి సమయంలో చదవడం సున్నత్.
  8. ఫజర్ నమాజ్ తరువాత పడుకోవడం. ఆ సమయంలో అల్లాహ్ నామస్మరణ చేయడం మరియు అల్లాహ్ ను వేడుకోవడం సరిఅయినది.


ముజ్దలిఫా కు సంబంధించిన తప్పిదాలు

కొందరు హాజీలు ముజ్దలిఫా చేరగానే మఘ్రిబ్, ఇషా నమాజు చదవకుండా రాళ్లు సేకరించడం మొదలుపెడతారు. ఇలా చేయడం సరికాదు. ముజ్దలిఫాలోనే రాళ్లు సేకరించాలనేది తప్పనిసరి కాదు. 

రాళ్లు హరం (మక్కా) పరిసరాల్లో ఎక్కడి నుంచైనా సేకరించవచ్చు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం జమ్రతుల్ అఖబ కోసం రాళ్లు ముజ్దలిఫాలోనే సేకరించండని అనలేదు. ఆయన కోసం రాళ్లు ఉదయం ముజ్దలిఫా నుండి వెళ్ళాక, మినాలో ప్రవేశించేటప్పుడు సేకరించబడ్డాయి. ఆయన కోసం మిగతా రాళ్లు మినాలో సేకరించబడ్డాయి. కొందరు రాళ్ళను కడుగుతారు. కాని ఇది సరికాదు.

 

  అరఫా అరఫా అనే నల్ల రాయి పర్వతం మక్కా నగరానికి తూర్పు దిశన ఉంది. దీన్ని దయ పర్వతం (జబల్ అర్ రహ్మాహ్) అని కూడా అంటారు. దైవప్రవక్త సల్లల్లాహు...

 

అరఫా


అరఫా అనే నల్ల రాయి పర్వతం మక్కా నగరానికి తూర్పు దిశన ఉంది. దీన్ని దయ పర్వతం (జబల్ అర్ రహ్మాహ్) అని కూడా అంటారు. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం హజ్ చేసినప్పుడు, తన చివరి ప్రసంగం ఈ కొండపై నుంచే ఇచ్చారు. హజ్ చేసినప్పుడు ఇక్కడ ఆగడం చాలా ముఖ్యం. ఇది ముజ్దలిఫా తరువాత వస్తుంది.

చారిత్రక ఘటనలు

హజ్జతుల్ విదా (ఆఖరి హజ్) లోని అరఫా రోజు శుక్రవారం వచ్చింది. ఆ రోజు ఖుర్ఆన్ లోని ఈ ఆయతు (వచనం) అవతరించింది: “ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి  ఆమోదించాను.” (ఖుర్ఆన్, సూరా మాయిదా 5:3)


అల్లాహ్ ధర్మాన్ని పూర్తిగావించాడు. ఇప్పుడు ఇందులో ఎలాంటి మార్పుచేర్పులకు తావులేదు. అందువల్లే అల్లాహ్ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంతో ప్రవక్తల పరంపరను అపివేశాడు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చిట్ట చివరి ప్రవక్త. అల్లాహ్ ఇస్లాం ధర్మాన్ని ఆమోదించాడు, అనగా అల్లాహ్ కు ఇస్లాం తప్ప వేరే ఏ ఇతర ధర్మం సమ్మతం కాదు. 

హదీస్

యజీద్ ఇబ్న్ షైబాన్ రజిఅల్లాహుఅన్హు ఇలా ఉల్లేఖించారు: మేము అరఫాలో మౌఖిఫ్ (దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం నిలబడిన చోటు)కు దూరంగా నిలబడి ఉన్నాము. (అబూ దావూద్, తిర్మిజి883). ఇబ్న్ మిర్బా అల్ అన్సారీ రజిఅల్లాహుఅన్హు మా వద్దకు వచ్చి ఇలా అన్నారు: “నేను దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సందేశహరుడిని. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మీతో ఇలా అనమని చెప్పారు: ‘మీరు నిలుచుని ఉన్న చోటే నిలబడండి. మీరు మీ తండ్రి ఇబ్రాహీం అలైహిస్సలాం నిలబడిన చోట నిలబడి ఉన్నారు.’” (సహీహ్ దావూద్ 1688)


అరఫా రోజు – 9వ జిల్హిజ్జా  

  • అరఫాకు వెళ్ళడం
     
  • అరఫాలో నిలబడటం
     
  • అరఫా నుండి బయలుదేరడం

 

అరఫాకు వెళ్ళడం

9వ జిల్ హిజ్జా ను అరఫా రోజు అంటారు. ఇది హజ్ యాత్రికులకు చాలా ముఖ్యమైన దినం.

  • అరఫా రోజున సూర్యుడు ఉదయించగానే (9వ జిల్ హిజ్జా) –అరఫా (మక్కాకు దక్షిణ తూర్పు దిశన) వైపుతక్బీరె తల్బియా చదువుతూ బయలుదేరాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అనుచరులు(సహాబా) అయనతో హజ్ చేసినప్పుడుఇలా చేశారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వారిని వారించలేదు.
     
  • ఆ తరువాత నమీర దగ్గర ఆగాలి – ఇది అరఫాకు దగ్గర ఉన్న ప్రదేశం, కాని ఇది అరఫా లోనికి రాదు. సాయంత్రం వరకు అక్కడ ఉండాలి.
     
  • సూర్యుడు అత్యున్నత స్థానం నుంచి జరిగాక ఉరనహ్ ప్రదేశానికి వెళ్లి అక్కడ ఉండిపోవాలి. ఇది అరఫాకు పక్కన ఉంది. ఇక్కడ ఇమాం ప్రజలను ఉద్దేశించి మంచి ఉపన్యాసం ఇవ్వాలి.
     
  • ఆ తరువాత జుహర్, అసర్ నమాజులు కలిపి సంక్షిప్తంగా చదవాలి. ఇలా జుహర్ వేళ చేయాలి.
     
  • అజాన్ ఒక్కసారే ఇవ్వాలి, కాని ఇఖామా రెండు సార్లు చెప్పాలి.
     
  • ఈ రెండు నమాజుల మధ్యలో ఏదీ చదువకూడదు.
     
  • ఇమాంతో పాటు నమాజు చేయలేనివాడు, స్వయంగా ఇదే విధంగా నమాజు చేయాలి.

 

అరఫాలో నిలబడటం

ఆ తరువాత అరఫాకు వెళ్లి, వీలైతే ‘జబల్ అర్ రహ్మాహ్’ కొండ కింద ఉన్న రాళ్ళపై నిలబడాలి. కుదరనిచో అరఫా ప్రదేశంలో ఎక్కడైనా నిలబడవచ్చు.


ఖిబ్లా వైపు ముఖం చేసి చేతులెత్తి దుఆ చేస్తూ, తల్బియా చదువుతూ ఉండాలి.


‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ ఎక్కువగా చదవాలి. అరఫా రోజున ఇది మంచి దుఆ. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీని గురించి ఇలా అన్నారు: అరఫా రోజున సాయంత్రం నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు – లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లాషరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్.


తల్బియాలో అప్పుడప్పుడు ఇది (ఇన్నమల్ ఖైరు ఖైరుల్ ఆఖిరతి– అన్నిటిలో మంచిది పరలోకంలోని మంచిది) కూడా జోడిస్తే ధర్మసమ్మతమే.


అతను అదే స్థితిలో, అల్లాహ్ ను స్తుతిస్తూ, తల్బియా చదువుతూ, దుఆ చేస్తూ ఉండిపోతాడు. అల్లాహ్ తన దూతల ముందు తన గురించి ప్రస్తావిస్తాడని ఊహిస్తూ ఇలా చేస్తాడు. హదీసులో ఇలా ఉంది: “అరఫా రోజున అల్లాహ్ అన్ని రోజులకంటే ఎక్కువగా తన దాసులను నరకాగ్ని నుంచి విముక్తి కలిగిస్తాడు. తన దూతలతో తన దాసుల గురించి ప్రస్తావిస్తూ, ‘వారు ఏం కోరుకుంటున్నారు?’ అని అడుగుతాడు. మరో హదీసులో ఇలా అనబడింది: “అల్లాహ్ అరఫాలో ఉన్న తన దాసుల గురించి దైవదూతలతో ఇలా అంటాడు: ‘నా దాసులను చూడండి. వారు నా దగ్గరకు చిందర వందరగా, దుమ్ము ధూళితో వచ్చారు.’” సూర్యాస్తమయం వరకూ అతడు ఆ స్థితిలోనే ఉంటాడు.


ఒకవేళ హజ్ చేసేవారు అలసిపోతే, వారి సహచరులతో మంచి విషయాల గురించి మాట్లాడవచ్చు లేదా మంచి పుస్తకాలు చదవవచ్చు. అల్లాహ్ ఔన్నత్యాన్ని చాటే మంచి పుస్తకాలను చదవడం వల్ల అతనికి ఆ రోజు విశిష్టతపై విశ్వాసం పెరుగుతుంది. ఆ రోజు ఎక్కువగా అల్లాహ్ ను స్మరిస్తూ, దుఆ చేస్తూ గడపాలి. అరఫా నాటి ఆఖరి ఘడియలలో ఎక్కువగా దుఆ చేయాలి. దుఆలలో అన్నిటికంటే ఉత్తమమైనది – అరఫా రోజు చేసే దుఆ.

 

అరఫా నుండి బయలుదేరడం

సూర్యుడు అస్తమించాక అక్కడి నుంచి ముజ్దలిఫాకు వెళ్ళాలి. ఇతరులను తోసుకుంటూ వెళ్ళకుండా, నెమ్మదిగా వెళ్ళాలి. కాని సమయం దొరికినప్పుడు వేగంగా వెళ్ళవచ్చు.


ముజ్దలిఫా చేరాక, అజాన్ మరియు ఇఖామా ఇచ్చి, మూడు రకాతులు మఘ్రిబ్ నమాజ్ చేయాలి. ఆ తరువాత ఇఖామా పలికి ఇషా నమాజ్ చేయాలి. రెండిటినీ కలిపి తగ్గించి చదవాలి. ఆ రెండు నమాజులను వేరు చేసి చదివిననూ ఎలాంటి దోషం లేదు. ఆ రెండు నమాజుల మధ్య గానీ, ఇషా నమాజు తరువాత గానీ ఇతర ఏ నమాజు చేయరాదు. ఆ తరువాత ఫజర్ నమాజ్ వరకు పడుకోవాలి. ఫజర్ నమాజ్ వేళ ప్రారంభం కాగానే, మొదటి ఘడియలలో, అజాన్ మరియు ఇఖామత్ ఇచ్చి నమాజ్ చేయాలి.


సూర్యుడు ఉదయించాక, అరఫా వైపుకు వెళ్ళాలి. అక్కడ జుహర్ సమయంలో- జుహర్, అసర్ రెండు నమాజులను కలిపి రెండు రెండు రకాతులు చదవాలి. కుదిరితే, సూర్యాస్తమయం వరకు నమిరహ్ లోని మస్జిద్ లో ఉండాలి. అక్కడ అల్లాహ్ ను స్తుతిస్తూ, ఖిబ్లా వైపు ముఖం చేసి ఎక్కువగా దుఆ చేస్తూ గడపాలి.


అరఫా రోజు సూర్యుడు ఉదయించాక, మినా వదలి అరఫా వైపు వెళుతూ తక్బీర్ (అల్లాహు అక్బర్), తహ్లీల్ (లా ఇలాహ ఇల్లల్లాహ్) మరియు తల్బియా చదవాలి. అరఫా రోజు మిగతా రోజుల కన్నా ఎక్కువగా దైవదాసులను అల్లాహ్ నరకం నుంచి విముక్తి కలిగిస్తాడు. (సహీహ్ ముస్లిం)


అరఫా రోజు కావాలనుకుంటే ఉపవాసం ఉండవచ్చు లేదా వీడవచ్చు. తప్పనిసరి కాదు. ఆ రోజు ఉపవాసం ఉండకూడదు అనే ఆధారం జయీఫ్ (ధృవీకరించబడనిది). (తిర్మిజి). అరఫాలో ప్రవేశించేముందు ‘వాది ఎ నిమ్రహ్’ లో విశ్రాంతి తీసుకుని, జుహర్ సమయంలో ఇమామె హజ్ (ఖుత్బా) ప్రసంగం వినాలి. ఆ తరువాత జుహర్, అసర్ నమాజులు కలిపి ఒక అజాన్ మరియు రెండు ఇఖామాలతో చదవాలి. ఈ నమాజ్ సామూహికంగా చదవాలి. దీన్ని ఖసర్ చేయాలి (రెండు రకాతులు)అని అంటారు. (సహీహ్ ముస్లిం)


జుహర్ మరియు అసర్ నమాజ్ చదివాక, అరఫాలో ప్రవేశించి, కుదిరితే జబలె రహ్మత్ పై లేదా ఎక్కడ చోటు దొరికితే అక్కడ (వఖూఫ్) నిలబడి, చేతులు పైకెత్తి ఖుర్ఆన్ లోని దుఆలు లేదా దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చదివిన దుఆలు చేస్తూ, మధ్య మధ్యలో తక్బీర్, తహ్లీల్ మరియు తల్బియా కూడా పలకాలి. (సహీహ్ ముస్లిం). ఆ రోజు ఈ దుఆ చేయండి: లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. (తిర్మిజి). ఇది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ (ఆచారం) మరియు ఈ దుఆ ధృవీకరించబడినది. కొందరు ఆలస్యంగా అరఫా చేరుకున్నా (10వ జిల్ హిజ్జా) ఫజర్ కు ముందు, వారి అరఫా కూడా స్వీకరించబడుతుంది. (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)


సూర్యాస్తమయం తరువాత మఘ్రిబ్ నమాజ్ చదువకుండా ముజ్దలిఫాకు బయలుదేరండి. తల్బియా చదువుతూ మెల్లిగా, హుందాగా వెళ్ళండి. (సహీహ్ ముస్లిం). 8వ మరియు 9వ జిల్ హిజ్జా మధ్య రాత్రి మినాలో గడపడం తప్పనిసరి అని భావించడం సరి అయినది కాదు. (షేక్ అల్బాని గారి విద్యార్ధి మషూర్ ఆల్ సల్మాన్ గారి ఫత్వా)[1]

 

అరఫా రోజు చేసే ప్రార్ధన (దుఆ, తస్బీహ్)

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: అరఫా రోజున చేసే దుఆ అన్నిటికంటే ఉత్తమమైనది. అరఫా రోజున నేను మరియు ఇతర ప్రవక్తలు పలికిన ఉత్తమ పదాలు – లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహు లహుల్ ముల్కు వ లహుల్ హందు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. 


కేవలం ఒక్కడైన అల్లాహ్ తప్ప ఆరాధ్యానికి అర్హులు ఎవ్వరూ లేరు. అతనికి సహవర్తులూ ఎవ్వరు లేరు. రాజ్యాధినేత ఆయనే, స్తోత్రములన్నీఆయన కొరకే. అయన అన్నీ చేయగలడు. (సహీహ్ అత్ తిర్మిజి vol 3:184, సిల్సిలతుల్అహాదీస్ అస్ సహీహ 4/6)

 

హజ్ లో అరఫా చాలా ముఖ్యమైనది

హజ్ లో అరఫాలో నిలబడటం చాలా ప్రాముఖ్యమైనది. అరఫాలో నిలబడనివాడు హజ్ కోల్పోయినట్లే. అరఫా లో నిలబడితే, ఇక వేరే హజ్ ఆరాధనలను నెరవేర్చకపోయినా పరవాలేదు అని అనుకోకూడదు. విద్వాంసుల ప్రకారం, అరఫాలో నిలబడినను, మిగతా హజ్ ఆచారాలను పూర్తి చేయాల్సిందే. ఉదాహరణకు – ముజ్దలిఫాలో రాత్రి గడపడం, తవాఫ్ అల్ ఇఫాదహ్, సఫా మర్వా మధ్యలో సయీ, జమ్రాత్ ను రాళ్ళతో కొట్టడం, మినాలో రాత్రి గడపడం మొదలైనవి.[3]

 

అరఫాకు సంబంధించిన తప్పులు

  1. కొందరు అరఫా ప్రదేశానికి బయట సూర్యాస్తమయం వరకూ ఉంటారు. ఆ తరువాత ముజ్దలిఫాకు బయలుదేరుతారు. అరఫాలో సరిఅయిన విధంగా నిలబడరు. ఇది చాలా పెద్ద తప్పు. ఇలా చేయడం వల్ల హజ్ నెరవేరదు. ఎందుకంటే, అరఫాలో నిలబడటం హజ్ లోని ముఖ్యమైన అంశాలలో ఒకటి. అందుచేత అరఫా హద్దుల్లో ఉండడం తప్పనిసరి. దాని బయట కాదు. అలా చేయడం కుదరనిచో కనీసం సూర్యాస్తమయంకు ముందు అరఫాలో ప్రవేశించి, సూర్యాస్తమయం వరకు అక్కడ గడిపినను సరిపోతుంది. ప్రత్యేకంగా జంతు బలి ఇచ్చే రాత్రి అరఫాలో నిలబడటం కూడా ఆమోదించదగినదే.
     
  2. అరఫా నుండి సూర్యుడు అస్తమించక ముందే బయలుదేరడం నిషేధం. ఎందుకంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సూర్యుడు పూర్తిగా అస్తమించే వరకు అరఫాలోనే ఉన్నారు.
     
  3. ప్రజలను త్రోసుకుంటూ అరఫా పర్వతాన్ని ఎక్కడం మంచిది కాదు. దీని వల్ల ఇతరులకు హాని కలుగుతుంది. మొత్తం అరఫా మైదానంలో ఎక్కడ నిలబడినా పరవాలేదు. అరఫా పర్వతాన్ని ఎక్కడం గానీ, అక్కడ నమాజ్ చేయడం గానీ ఆమోదయోగ్యం కాదు.
     
  4. దుఆ చేస్తున్నప్పుడు అరఫా పర్వతం వైపు ముఖం చేయకూడదు. సున్నత్ ప్రకారం దుఆ చేస్తున్నప్పుడు ఖిబ్లా (కాబా) వైపు ముఖం చేయాలి.
     
  5. అరఫా రోజున ఒక చోట ఎక్కువగా గులకరాళ్ళను పోగు చేయడం ఉత్తమం కాదు. అల్లాహ్ షరియా (చట్టం)లో ఇలాంటి వాటికి చోటు లేదు. 

  మినా - MINA మినా, సౌదీ అరేబియాలోని మక్కా మరియు ముజ్దలిఫా పట్టణాల మధ్యలో ఉంది. దీన్ని గుడారాల పట్టణం అని కూడా అంటారు. షైతానులను సూచించే తెల...

 

మినా - MINA


మినా, సౌదీ అరేబియాలోని మక్కా మరియు ముజ్దలిఫా పట్టణాల మధ్యలో ఉంది. దీన్ని గుడారాల పట్టణం అని కూడా అంటారు. షైతానులను సూచించే తెల్ల స్థూపాలు ఇక్కడే ఉన్నాయి. హజ్ చేసేవారు దానిపై రాళ్లు కొట్టడానికి ముజ్దలిఫాలో గుమిగూడుతారు. [1]

 

హజ్ మొదటి రోజు హాజీలు మక్కా నుండి మినాకు వెళ్తారు. మినా మక్కాకు తూర్పు దిక్కున ఉంది. భక్తులు అక్కడ (మినాలో) ఒక రోజు (పగలు, రాత్రి) నమాజ్ చదువుతూ, దుఆ చేస్తూ, ఖుర్ఆన్ చదువుతూ, మరుసటి రోజు కోసం విశ్రాంతి తీసుకుంటూ గడుపుతారు.  


తర్వియ రోజు మినాకు వెళ్ళడం

తర్వియ దినం జిల్ హజ్జా మాసపు 8వ రోజు మరియు హజ్ యొక్క మొదటి రోజు. హజ్జె తమత్తు చేసే వారు 8వ జిల్ హజ్జా (తర్వియ దినం) నాడు తాము ఉన్న ప్రదేశం నుంచే ఇహ్రామ్ ధరించి, ఉదయం మినాకు బయలుదేరాలి. 8వ జిల్ హజ్జా నాడు జుహర్, అసర్, మఘ్రిబ్, ఇషా నమాజులు హాజీలు మినాలోనే చదవాలి. మరుసటి రోజు అంటే, 9వ జిల్ హజ్జా రోజు ఫజర్ నమాజ్ కూడా అక్కడే (మినాలో) చదవాలి. హాజీలు మినాలో 9వ జిల్ హజ్జా రోజు సూర్యోదయం వరకు ఉండి, ఆ తరువాత అరఫాకు బయలుదేరాలి. 10వ జిల్ హజ్జా నాడు సూర్యోదయం కాక ముందే, హాజీలు మినాకు తిరిగిరావాలి. [2]

 

మినాలో రాత్రి గడపడం

11 మరియు 12 జిల్ హజ్జా ముందటి రాత్రులు మినాలో గడపడం తప్పనిసరి (విధి) అని అధిక శాతం విద్వాంసుల అభిప్రాయం. ఎవరైతే ఎలాంటి కారణం లేకుండా ఇలా చేయరో వారు పరిహారంగా మక్కాలో ఒక మేకను బలి ఇచ్చి, దాని మాంసాన్ని అక్కడి బిదవారికి పంచాలి.    

 

ఎవరికైనా మినాలో ఉండడానికి చోటు దొరకని పక్షంలో, అలాంటి వారు గుడారాలు అంతమయ్యే చోట ఉండవచ్చు. ఆ చోటు ముజ్దలిఫాలోకి వచ్చినా పరవాలేదు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “కాబట్టి శాయశక్తులా  మీరు అల్లాహ్ కు భయపడుతూ ఉండండి. (ఆజ్ఞలను) వినండి, విధేయత చూపండి. (దైవమార్గంలో) ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు.” (ఖుర్ఆన్ సూరా తఘాబున్ 64:16)

 

తష్రీఖ్ రోజుల రాత్రులు మినాలో గడపకూడదు  

తష్రీఖ్ దినాలలో మినాలో రాత్రులు గడపడం తప్పనిసరి అని అధిక శాతం విద్వాంసులు అన్నారు. ఎక్కువ శాతం రాత్రి మినాలో గడపాలి. తష్రీఖ్ రాత్రుల్లో మినాలో ఆగకపోవడం :

 

మొదటి సందర్భం: ఏదైనా బలమైన కారణంగా ఒకతను మినాలో గడపలేకపోతే: షేక్ బిన్ బాజ్ (రహి) గారికి ఈ ప్రశ్న అడగబడింది. ఆయన ఇలా అన్నారు: “అతనికి/ ఆమెకు ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదు. ఉదా – అనారోగ్యం, మినాలో చోటు దొరకకపోవడం, హాజీల కోసం నీళ్ళు తెచ్చేవారు, గొర్రెల కాపరులు మొదలైనవారు.

 

రెండో సందర్భం: ఎలాంటి కారణం లేకుండా తష్రీఖ్ రోజులలో రాత్రిళ్ళు మినాలో గడపకపోవడం. షేక్ బిన్ బాజ్ (రహి) ఇలా అన్నారు: ఎవరైతే ఎలాంటి కారణం లేకుండా తష్రీఖ్ రోజుల్లోని రాత్రిళ్ళు మినాలో గడపరో, వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఆజ్ఞను ఉల్లంఘించిన వారవుతారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం గొర్రె కాపరులను మరియు హాజీల కోసం నీళ్ళు తెచ్చేవారికి మినహాయింపు ఇచ్చారు. తష్రీఖ్ రోజుల్లో రాత్రిళ్ళు మినాలో ఆగడం తప్పనిసరి. ఏ కారణం లేకుండా ఇలా చేయనివారు పరిహారంగా జంతు బలి ఇవ్వాలి. ఇబ్న్ అబ్బాస్ (రజి) ఉల్లేఖనం ప్రకారం: “హజ్ ఆచరణల్లో ఏదైనా వదలిపెట్టినా, మరచిపోయినా, అతడు/ఆమె పరిహారంగా జంతు బలి ఇవ్వాలి.” తష్రీఖ్ దినాలలో రాత్రిళ్ళు మినాలో గడపని పక్షంలో ఒక మేక బలి ఇచ్చినా సరిపోతుంది. (ఫతావా అల్ షేక్ ఇబ్న్ బాజ్ vol 5)

 

బలి ఇచ్చిన జంతువు మాంసాన్ని హరంలోని పేదవారికి పంచాలి. బలి ఇచ్చిన వారు అందులో నుంచి తినకూడదు.

 

తష్రీఖ్ రోజుల్లో ఉదయం మినా నుండి బయటకు వెళ్ళడం, రాత్రిళ్ళు తిరిగి రావడం మరియు మినాలో ఉండడం యొక్క ప్రాముఖ్యత  

మొదట:

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ ప్రకారం హాజీ (హజ్ చేసేవారు) మొత్తం దినం మినాలో గడపాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం కేవలం తవాఫ్ అల్ ఇఫాదా కోసం మినా వదిలారు. రాత్రిలో ఎక్కువ భాగం మినాలోనే గడపాలి. మినాలో ఉండడానికి స్థలం లేని పక్షంలో, ఎవరైనా ఉదయం వేళ మినా నుండి మక్కాకు లేదా ఇతర ప్రదేశానికి వెళితే ఎలాంటి దోషం లేదు.

 

షేక్ ఇబ్న్ బాజ్ (రహి)ను ఇలా అడగడం జరిగింది: ఒకతను అరఫా నుండి వెళ్లి మొదటి జమరాత్ పై రాళ్లు కొట్టి, ఆ తరువాత తవాఫ్, సయీ చేసి, అసర్ నమాజ్ వరకు మక్కాలో ఉండి, ఆ తరువాత మినాకు వెళ్లి జంతు బలి ఇచ్చాడు. దీని కోసం అతను ఏమైనా చేయాలా?     

 

షేక్ జవాబు:

అతను ఎలాంటి పాపం చేయలేదు. ఈద్ రోజు లేదా తష్రీఖ్ దినాలలో మక్కాలో ఉండడం పాపం కాదు. కాని, వీలయితే ఆ దినాలలో మినాలో ఉంటే మంచిది. దీనివల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరియు ఆయన అనుచరుల సున్నత్ పై అమలు చేసినట్లు అవుతుంది. ఎవరికైనా మినాలో ఆగడం కష్టంగా ఉంటే, అతను ఉదయం పూట మక్కాలో గడిపి, రాత్రి వేళ మినాలో గడిపితే, ఎలాంటి తప్పు లేదు. (మజ్మూ ఫతావా అల్ షేక్ ఇబ్న్ బాజ్ 17/365)  

 

హాజీలు ఎవరైతే అల్ అజీజియాలో ఉంటారో, వారు తష్రీఖ్ దినాలలో తమ ఇండ్లలో ఉండడం గురించి షేక్ ఇబ్న్ ఉసైమిన్ (రహి)ను అడగడం జరిగింది.    

 

దానికి ఆయన ఇలా జవాబిచ్చారు: నా అభిప్రాయం ప్రకారం అల్ అజీజియా లో ఉండేవారు ఉదయం పూట తమ ఇండ్లలో ఉండకూడదు. నిస్సంకోచంగా మినాలోని గుడారాలలో ఉండడం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్. హజ్ అల్లాహ్ కోసం చేసే జిహాద్ లాంటిది. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను ఆయిషా (రజి) ఇలా అడిగారు: “స్త్రీలకు జిహాద్ (అల్లాహ్ దారిలో పోరాడడం) ఉందా?” దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “అవును, ఆ జిహాద్ లో పోరాటం ఉండదు- అది హజ్ మరియు ఉమ్రా.” కావున హాజీ పగలు, రాత్రి మినాలో ఉండడం అభిలషణీయం.     

 

షేక్ ఉసైమిన్ (రహి) ను ఇలా అడిగారు- తష్రీఖ్ దినాలలో మక్కాకు, దాని సమీప ప్రదేశాలు జిద్దా వగైరాకు వెళ్ళడం వల్ల హజ్ పై ప్రభావం పడుతుందా?

షేక్ ఇలా జవాబిచ్చారు: దీని వల్ల హజ్ పై ప్రభావం పడదు. కాని, ఆ రోజులు (తష్రీఖ్ రోజులు) మినాలో గడపడం వల్ల దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం సున్నత్ పై అమలు చేసినట్లు అవుతుంది. (మజ్మూ ఫతావా అల్ షేక్ ఇబ్న్ ఉసైమిన్ 23/241, 242)

 

రెండో విషయం:

మినాలో ఆగే విషయమై, మార్గదర్శకం ఏమిటంటే, హాజీ మినాలో సగ భాగం కంటే ఎక్కువ రాత్రి గడపాలి. రాత్రి సమయాన్ని సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు తీసుకోవాలి. దీని ప్రకారం ఎన్ని గంటలవుతుందో లెక్క కట్టాలి. ఒకవేళ మీరు మినాలో ఆరు గంటలు గడిపితే, అది సగం రాత్రి కంటే ఎక్కువే అవుతుంది.  

 

షేక్ ఇబ్న్ ఉసైమిన్ ను ఇలా అడిగారు: తష్రీఖ్ రోజుల్లో మక్కాలో ఎంత సమయం ఉండవచ్చు?

షేక్ ఇలా జవాబిచ్చారు: రాత్రిలో ఎక్కువ భాగం మినాలో గడపాలని విద్వాంసుల అభిప్రాయం. ఒకవేళ రాత్రి 10 గంటలుంటే, 5 ½ గంటలు మినాలో గడపాలి. (ఫతావా అల్ షేక్ ఇబ్న్ ఉసైమిన్ 23/244)

 

మినాలో ఉన్న రోజుల్లో హాజీ ఐదు పూటల నమాజులను అందరితో కలిసి సమూహంగా చదవడం ఉత్తమం. అది కూడా మస్జిద్ ఖైఫ్ లో చదవడం మంచిది. ఎందుకంటే, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మస్జిద్ ఖైఫ్ లో డెభ్భై ప్రవక్తలు నమాజ్ చేశారు.” [3]

  హజ్జ్ హజ్జ్ పారిభాషాకమైన అర్థం ఒకరి శబ్దాన్ని పెంచడం.షరియహ్ ప్రకారం హ జ్జ్ అనగా తల్బియా పలకడం కోసం ఎక్కువ శబ్దంతో పలకడం.    హదీస్  తల్బియా...

 

హజ్జ్


హజ్జ్ పారిభాషాకమైన అర్థం ఒకరి శబ్దాన్ని పెంచడం.షరియహ్ ప్రకారం హ జ్జ్ అనగా తల్బియా పలకడం కోసం ఎక్కువ శబ్దంతో పలకడం.

  

హదీస్

 తల్బియా యొక్క ప్రత్యేకత ఏమిటంటేఇది హాజ్ సూచనలలోని ఒక భాగాన్ని సూచిస్తుంది. ఉత్తమమైన హజ్జ్ ఎవరిదంటే వారి తల్బియా చాలా పెద్ద శబ్దం తో ఉండడం . అబూ బకర్ ర.జి ఉల్లేఖనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు: ఎవరిహజ్జ్ ఉత్తమమైనది?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: “ పెద్ద శబ్దం (అల్-అజ్జ్ ) చేయడం మరియు రక్తం ప్రవహింపజేయడం(కుర్బాని లేదా జంతుబలి ద్వారా) (అత్-తాజ్జ్). షేక్ అల్బాని ఈ హదీస్ ను సహీహ్ గా పరిగణించారు. జామి అత్-తిర్మిజి 827 [1]

 

ఇవి కూడా చూడండి

హజ్జ్; ఉమ్రా;

  ముస్లిమేతరులపై ముస్లింలకు గల బాధ్యతలు ప్రతిహోదాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి.ఎవరైతే రాజ్యానికో,దేశానికో పాలకుడు అవుతాడో అతనిపై బాధ్యతలు కూడా ఉ...

 

ముస్లిమేతరులపై ముస్లింలకు గల బాధ్యతలు


ప్రతిహోదాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి.ఎవరైతే రాజ్యానికో,దేశానికో పాలకుడు అవుతాడో అతనిపై బాధ్యతలు కూడా ఉంటాయి.అలాగే ఓ ముస్లింపై కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి.అల్లాహ్ దైవప్రవక్తల మీద వేసిన బాధ్యత ఇప్పుడు ముస్లింలపై ఉంది.సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడం,మంచిని ప్రేరేపించడం,ఇతరులకు సహాయపడటం,సామాజిక జీవితంలో ఇస్లామీయ విలువలపై జీవితాన్ని గడపడం –ఇవన్నీ ముస్లింలపై ఉన్న బాధ్యతలు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తన 40ఏళ్ల జీవితాన్ని సత్యంపైనే గడిపారు.అల్ అమీన్(సత్యవంతుడు) పేరుతో ప్రసిద్ధి గాంచారు.ఆ తరువాతే సత్యాన్ని ప్రవచించడం ప్రారంభించారు.

 

ముస్లింల జీవితం ఇతరులకు ఓ ఆదర్శంగా ఉండాలి.ఇతరులు ముస్లింల జీవిత విధానాన్ని చూసి ప్రభావితం అవ్వాలి.ముస్లింల జీవితం ఇంత బావుండటానికి కారణం ఏమిటి అని ఇతరులు ఆలోచించేలా చేయాలి.ఈ విధంగా మీరు ముస్లిమేతరుల సమాజంపై ప్రభావం చూపవచ్చు.



 

ఖుర్ఆన్

అల్లాహ్ అనేక చోట్ల ఖుర్ఆన్ లో ఇస్లాం సందేశం చాటండి అని ముస్లింలకు పిలుపునిచ్చాడు.

 

“నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ,చక్కని ఉపదేశంతోనూ పిలువు.అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు.నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు.సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.” ఖుర్ఆన్,సూరా అన్ నహ్ల్ 16:125

 

“అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు, పరస్పరం సత్యం గురించి ఉపదేశించినవారు, ఒండోకరికి సహనం(స్థైర్యం)గురించి తాకీదు చేసినవారు మాత్రం నష్టపోరు.” ఖుర్ఆన్సూరా అల్ అస్ర్ 103:3

 

(ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ళకు చెప్పేయి : “నా మార్గమైతే ఇదే. నేనూ,నా అనుయాయులూ పూర్తి అవగాహనతో, దృఢ నమ్మకంతో అల్లాహ్ వైపుకు పిలుస్తున్నాము.అల్లాహ్ పరమ పవిత్రుడు.నేను,అల్లాహ్ కు భాగస్వాముల్ని కల్పించే (షిర్క్ చేసే)వారిలోని వాణ్ణికాను.” ఖుర్ఆన్,సూరా యూసుఫ్ 12:108

 

“మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు.మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు,చెడు నుంచి ఆపుతారు,ఇంకా మీరు అల్లాహ్ ను విశ్వసిస్తారు.” ఖుర్ఆన్,సూరా ఆలి ఇమ్రాన్ 3:110

 

మేము ముస్లింలము,కేవలం అల్లాహ్ నే విశ్వసించాము,ఇస్లాం మా ధర్మమని స్వీకరించాము అని చెప్తే సరిపోదు.కేవలం అల్లాహ్ యే మా ఆరాధ్యుడు,అయన చూపిన విధానమే సరిఅయిన జీవన విధానం అని నమ్మిన వెంటనే మనపై కొన్ని విధులు,బాధ్యతలు తప్పనిసరి అయిపోతాయి.

 

హదీస్

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “నా ద్వారా తెలుసుకున్నది ఒక్క ఆయతు అయినా సరే అది ఇతరులకు చేరవేయండి.” సహీహ్ బుఖరీ 3461లేదాvol 4:667

 

అల్లాహ్ వైపు పిలవడం చాల పెద్ద పని, అలాగే దాని ప్రతిఫలం కూడా చాలా గొప్పగా ఉంటుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “ఎవరైతే ఇంకొకరిని పుణ్య కార్యం వైపు పిలుస్తారో అతనికి కూడా ఆ పుణ్యం చేసేవాడితోపాటు పుణ్యం లభిస్తుంది. అలాగే ఎవరైతే ఇంకొకరిని పాప కార్యం వైపు పిలుస్తారో అతనికి కూడా ఆ పాపం చేసేవాడితోపాటు పాపం లభిస్తుంది.” సహీహ్ ముస్లిం 2674

 

ధార్మిక జ్ఞానం

ఏ పని అయినా చేయడానికి ఆ పని గురించి కాస్త తెలిసి ఉండాలి. అలాగే ఇస్లాం గురించి ఇతరులకు చెప్పాలంటే ముందుగా ఇస్లాం గురించి మనకు కొంత తెలిసుండాలి. ఇతరులను అల్లాహ్ వైపు పిలిచేవారికి తాము పిలిచేదారి గురించి పూర్తిగా కాకున్నా కాస్త అయినా జ్ఞానం ఉండాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “నా ద్వారా తెలుసుకున్నది ఒక్క ఆయతు అయినా సరే అది ఇతరులకు చేరవేయండి.” సహీహ్ బుఖరీ vol4:667

 

అల్లాహ్ అప్పగించిన బాధ్యతలు

ముస్లిమేతరున్ని అల్లాహ్ వైపు పిలవడం ప్రతి ముస్లింపై అల్లాహ్ విధించిన బాధ్యత. ఇస్లాం యొక్క సత్యాన్ని ఏ విధంగా చెప్పగలిగితే ఆ విధంగా ముస్లిమేతరులకు (యూదులు,క్రైస్తవులు, బహుదైవారాధకులు) నచ్చజెప్పాలి. ఇది మానవాళికి చేయగలిగే అతి పెద్ద పుణ్యం.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు : “ఇతరులను మంచి వైపు పిలిచేవానికి, ఆ మంచి పని చేసే వారితో సమానంగా పుణ్యం లభిస్తుంది.”అబూ దావూద్ 5110

 

దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అలి రజిఅల్లాహుఅన్హును ‘ఖైబర్’అనే ప్రదేశానికి పంపించారు. అక్కడ యూదులను, క్రైస్తవులను ఇస్లాం వైపు పిలవమని ఆదేశిస్తూ ఇలా అన్నారు: “నీ ద్వారా ఒక్క మనిషి ఇస్లాం వైపుకు వచ్చినా, అది నీకు ఎర్ర ఒంటెలు (మంచి రకానివి) ఉండడం కన్నా చాలా ఉత్తమమైనది.”

 

ముస్లిమేతరులను ఇస్లాం వైపు పిలవడం, ఇస్లాం గురించి చెప్పడం, వారితో ఉత్తమంగా మెలగడం మనల్ని అల్లాహ్ కు దగ్గరగా తీసుకుపోతుంది.

 

ముస్లిమేతరుల ధనప్రాణాల రక్షణ

ముస్లిమేతరులను శారీరకంగా ఎలాంటి హాని కలిగించకూడదు. వారి ధనమానాన్ని గౌరవించాలి. అతను ధిమ్మి (ఇస్లామీయ పాలనలో నివసించే ముస్లిమేతరుడు), ముస్తామన్(ముస్లిం ప్రదేశంలో భద్రత కల్పించబడినవాడు), ముఆహిద్ (శాంతి ఒప్పందం కుదుర్చుకున్న ముస్లిమేతర దేశస్థుడు) అయిన పక్షంలో అతనికి అతని హక్కులన్నీ ఇవ్వాలి. అతన్ని మోసగించడం, ధనాన్ని దొంగిలించడం చేయకూడదు. అతని దేహానికి, ప్రాణానికి ఎలాంటి హాని కలిగించకూడదు. అతను ధిమ్మి,ముస్తామన్, ముఆహిద్ అయిన కారణంగా, ఇస్లామీయ చట్టం ప్రకారం అతణ్ణి సురక్షితంగా ఉంచడం ముస్లింల బాధ్యత.

 

ముస్లిమేతరులతో ప్రవర్తన

ముస్లిమేతరులతో (క్రయవిక్రయాలు) కొనడం, అమ్మడం, తీసుకోవడం, ఇవ్వడం చేయటంలో ఎలాంటి తప్పు లేదు.ఆధారాలు గల సమాచారం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అవిశ్వాసులు, విగ్రహారాధకులు, యూదులతో క్రయ విక్రయాలు చేసేవారు.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చనిపోయినప్పుడు ఆయన ఖడ్గం హామీ క్రింద ఓ యూదుని దగ్గర ఉంది. అయన సల్లల్లాహు అలైహివ సల్లం తన ఇంటివారి కోసం కొంత ధాన్యం అతని వద్ద అప్పుగా తీసుకున్నారు.

 

ముస్లిమేతరులపై హక్కులు 

ముస్లిములు మరియు ముస్లిమేతరుల మధ్య కొన్ని హక్కులు ఉన్నాయి.

 

అతనితో ఓ మంచి పొరుగువానిగా మెలగాలి. అతనితో వినయంగా ఉండాలి. అతన్నిబాధించకూడదు. అతను బీదవాడు అయిన పక్షంలో అతనికి ధన సహాయం చేయాలి. కానుకలు, మంచి సలహాలు ఇవ్వాలి. ఇలా చేసినచో అతను ఇస్లాం వైపు ఆకర్షించబడి ముస్లిం అయ్యే అవకాశం ఉంటుంది.పొరుగువాని హక్కు కూడా నెరవేరుతుంది.దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “జిబ్రయీల్ అలైహిస్సలాం నన్ను పొరుగువానితో చాలా వినయంగా ఉండమని చెప్పేవారు. ఎన్ని సార్లు చెప్పేవారంటే పొరుగువాడిని మన వారసత్వంలో భాగం కలపిస్తారేమో అని భయము కలిగేది. సహీహ్

 

పొరుగువాడు ముస్లిమేతరుడు అయిననూ, అతనికి పొరుగువాని హక్కు ఉంటుంది. అతను సంబంధీకుడు, ముస్లిమేతరుడు అయిన పక్షంలో అతనికి రెండు హక్కులు ఉంటాయి. ఒకటి సంబంధం మూలంగా, మరొకటి పొరుగువాని మూలంగా. అతను బీదవాడు అయిన పక్షంలో అతనికి స్వచ్చందంగా ధన సహాయం చేయవచ్చు, కాని జకాత్ నుంచి మాత్రం ఇవ్వకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “ధర్మం విషయంలో మీ పై కాలుదువ్వకుండా, మిమ్మల్ని మీ ఇల్లూ, వాకిలి నుండి వెళ్ళగొట్టకుండా ఉన్న వారితో మీరు సద్వ్యవహారం చేయటాన్ని, వారికి న్యాయం చేయటాన్ని అల్లాహ్ ఎంత మాత్రం నిరోధించడు. పైగా అల్లాహ్ న్యాయం చేసే వారిని ప్రేమిస్తాడు.సూరా,ముమ్ తహినహ్ 60:8

 

సహీహ్ హదీస్ ప్రకారం అస్మా బిన్తె అబీ బకర్ రజిఅల్లాహుఅన్హా ఇలా ఉల్లేఖించారు: బహుదైవారాధకులు అయిన ఆమె (అస్మా బిన్తె అబీ బకర్ రజిఅల్లాహుఅన్హా) తల్లి ఆమె వద్దకు సహాయం కోసం వచ్చారు. అది దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మరియు మక్కా వాసుల మధ్య శాంతి ఒప్పందo అమలు అవుతున్న సమయం. ‘తన తల్లితో బంధుత్వం కొనసాగించాలా’ అని అస్మా బిన్తె అబీ బకర్ రజిఅల్లాహుఅన్హా, దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లంను అడిగారు. “నీ బంధుత్వ హక్కు నెరవేర్చు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు.

 

విద్వాంసుల కోణం

అబ్దుల్ అజీజ్ బిన్బాజ్ ఇలా అన్నారు: ముస్లిమేతరుల పండుగల్లో ముస్లిములు పాలుపంచుకోకూడదు. కాని వారి దగ్గరివారిలో ఎవరైనా చనిపోతే వారికి ‘అల్లాహ్ మీ నష్టాన్ని పూడ్చుగాక’ అనే పదాలతో సంతాపం తెలియజేయవచ్చు. సంతాపం తెలియజేసేటప్పుడు ‘అల్లాహ్ అతన్ని క్షమించుగాక’ లేదా‘అల్లాహ్ అతనిపై దయ చూపు గాక’ అని మాత్రం అనకూడదు.మరణించిన మనిషి ముస్లిమేతరుడు అయినచో అతని కోసం దుఆ చేయకూడదు. కాని బ్రతికున్న ముస్లిమేతరుని కోసం ‘ఇతను మార్గదర్శకత్వం పొందుగాక’ అని దుఆ చేయవచ్చు.ఫతావా నూరున్ అలద్దర్బ, 1/289-291

 

షేక్ ఇబ్న్ ఉసైమీన్ రహిముల్లాహ్ ఇలా అన్నారు: ఇస్లాం మరియు అల్లాహ్ వైపు పిలిచేవాడు పెద్ద విద్వాంసుడా, లేక మాములు మనిషా అనేది పెద్ద విషయం కాదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు:“నా ద్వారా తెలుసుకున్నది ఒక్క ఆయతు అయినా సరే అది ఇతరులకు చేరవేయండి.”ఇస్లాం వైపు పిలిచేవానికి చాలా జ్ఞానం ఉండాలి అనే షరతు ఏదీ లేదు. కాని దేని వైపు (ఇస్లాం వైపు) పిలుస్తున్నాడో దాని గురించి కాస్త జ్ఞానం ఉండాలి. కొంచెం కూడా జ్ఞానం లేకుండా లేదా భావోద్వేగాలతో ఇస్లాం వైపు పిలవడం సమంజసం కాదు.ఫతావా ఉలమా అల్ బలదుల్ హరాం పేజి 329

Popular Posts