Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  అల్లాహ్ హక్కులు అల్లాహ్ హక్కులు ఆయన సృష్టి అంతా వ్యాపించి వున్నాయి. అల్లాహ్ యే  సర్వ సృష్టికర్త, ఆయనే ఈ సర్వాన్ని పరిపాలించేవాడు. ఆయన సంపూ...

 


అల్లాహ్ హక్కులు


అల్లాహ్ హక్కులు ఆయన సృష్టి అంతా వ్యాపించి వున్నాయి. అల్లాహ్ యే  సర్వ సృష్టికర్త, ఆయనే ఈ సర్వాన్ని పరిపాలించేవాడు. ఆయన సంపూర్ణ వివేకంతో ప్రతి దానిని ఈ విశ్వంలో సృష్టించాడు. అల్లాహ్ యే శూన్యం నుంచి ఈ సృష్టిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అలాగే తల్లి గర్భంలో ఉండే పిల్లల పరిస్థితి  సైతం ఆయన ఎరుగును. అలాగే అల్లాహ్ యే అందరికి ఆహారంను ఇచ్చేవాడు మరియు జీవిత సదుపాయంను కల్పించేవాడు.

 


ఖుర్ఆన్ 


అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు.

 

అల్లాహ్ మిమ్మల్ని  మీ మాతృ గర్భాల నుండి – మీకేమీ తెలీని స్థితిలో బయటికి తీశాడు. మీ కొరకు చెవులను, కళ్ళను, హృదయాలను తయారుచేసినది ఆయనే - మీరు కృతజ్ఞులుగా వ్యవహరిస్తారని! ఖుర్ఆన్ సూరా అన్  నహల్ 16 :78

 

అల్లాహ్ ఎవరికైనా జీవనోపాధిని నిలిపి వేస్తే అతను సర్వనాశనం అవుతాడు. అల్లాహ్ యొక్క  కరుణ వల్లనే సర్వ మానవులు మరియు జీవరాసులన్నీ ఈ ప్రపంచంలో ప్రశాంతంగా జీవించగలుగుతున్నాయి.

 

హదీస్


దైవప్రవక్త సల్లల్లాహు అలైహి  వసల్లం ఇలా ప్రవచించారు : అప్పుడు ఆయన ఇలా సెలవిచ్చారు, పాపాలలోకెల్లా అతి పెద్ద పాపం అల్లాహ్ కు వేరొకరిని సహవర్తులుగా చేయడం”. సహీహ్ అల్ బుఖారి భాగం:8 :8

 

అల్లాహ్ కు మానవులపైన ఉండే  హక్కు ఏమిటంటే వారు అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల కు  వేరొకరిని సహవర్తులుగా చేయకుండా వుండాలి.

 

సదుపాయాలన్నీ అల్లాహ్ దగ్గర నుంచే లేదా అల్లాహ్ తరపునే, ఆన్ని అల్లాహ్ నుంచే కేటాయించబడినవి లేదా సదుపాయాల్ని అల్లాహ్ దగ్గరనుంచే.

 

అల్లాహ్ తన దాసులను  కనిపెట్టుకుని వున్నాడు. ఎందుకంటే ఆయన కరుణ ఈ సర్వత్ర మానవాళి పై వ్యాపించి వుంది. ఇది ఆయనకున్న హక్కు. అల్లాహ్ కు తన దాసుల అవసరం ఏమి లేదు.

 

మీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సైతం దానిపై స్థిరంగా వుండు. మేము నీ  నుంచి ఉపాధిని అడగటం లేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే . ఖుర్ ఆన్ సూరా తాహా : 20 :132

 

సృష్టించడం గల కారణం


అల్లాహ్ తన దాసులనుండి కోరేదేమిటంటే : నేను జిన్నాతులను, మానవులను సృష్టించినది వారు నన్ను ఆరాధించటానికి మాత్రమే. నేను వారి నుండి జీవనోపాధిని కోరటం లేదు. వారు నాకు అన్నం పెట్టాలని కూడా నేను కోరటం లేదు. అల్లాహ్ యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహా శక్తిశాలి, మహబలుడు. ఖుర్ఆన్ సూరా అజ్ జారియాత్ 51 : 56 - 58

 

ప్రతి ముస్లిం విధి,అల్లాహ్ ను విశ్వసించడం ఆయనకు ఆరాధనలో ఎవరిని సాటి చేయకూడదు. తనకు తాను అల్లాహ్ కు సమర్పించుకోవాలి  అనగా ప్రతి ముస్లిం తన జీవితాన్ని(ఇస్లాం జీవితం) మొత్తం ఆయనకు నిబంధనల తోనే గడపాలి.

 

దీవేనలన్ని అల్లాహ్ దగ్గర నుంచే


అల్లాహ్ ఆరాధించడం తో పాటు సర్వత్రా  కృతఙ్ఞతలు చెల్లిస్తూ వుండాలి. మీ దగ్గరున్న భాగ్యాలన్నీ అల్లాహ్ ప్రసాధించినవే. ఇప్పటికీ మీకేదైనా కష్టం వస్తే మీరు ఆయనకే మొరపెట్టుకుంటారు. సూరా అన్ నహల్ 16 :53

 

మన:స్పూర్తిగా కష్టపడటం


అల్లాహ్ తన దాసులకు ఆరాధన విషయంలో సులభతరాన్ని నేర్పాడు, కాని వారిని  ఇబ్బందికి  గురి చేయాలనుకోవడం లేడు.  అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు:అల్లాహ్ (ప్రసన్నత) కోసం పాటుపడవలసిన విధంగా పాటుపడండి. ఆయన మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ధర్మం విషయంలో ఆయన మీపై ఎలాంటి ఇబ్బందిని ఉంచలేదు. మీ పితామహుడైన ఇబ్రహీము (అలైహిస్సలాం) ధర్మానికి కట్టుబడి ఉండండి. ఈ ఖుర్ఆన్ కు  పూర్వం కూడా ఆయన (అల్లాహ్ మిమ్మల్ని ‘ముస్లింలు’గానే నామకరణం చేశాడు. మరి ఇందులో కూడా(మీ పేరు అదే). దైవప్రవక్త మీపై సాక్షిగా, మీరు మానవాలి పై సాక్షులుగా ఉండటానికి (ఈ విధంగా చేయబడింది). కనుక మీరు నమాజును నెలకొల్పండి, జకాతును చెల్లించండి, అల్లాహ్ ను స్థిరంగా ఆశ్రయించండి. ఆయనే మీ సంరక్షకుడు! (ఆయన) ఎంత చక్కని సంరక్షకుడు! మరెంత చక్కని సహాయకుడు. ఖుర్ఆన్ సూరా అల్ హజ్ 22:78

 

మన:స్పూర్తిగా ఆరాధించడం


అల్లాహ్ తన దాసుల నుండి కోరేదిమిటంటే  అల్లాహ్ ను మన:స్పూర్తిగా ఆరాధించడం, మరియు మంచి పనులు చేయడం, అలాగే 5 పూటలు నమాజు చేస్తూ పశ్చాత్తాపం చెందుతూ వుండడం. ముస్లిం లు ప్రవక్త సంప్రదాయం ప్రకారం ఉత్తమంగా నమాజ్  చేయడం.

 

కాబట్టి ఎల్లవేళలా మీరు అల్లాహ్ కు భయపడుతూ  ఉండండి. (ఆజ్ఞలను) వినండి, విధేయత చూపండి. (దైవ మార్గంలో) ఖర్చు చేస్తూ ఉండండి. ఇది స్వయంగా మీకే శ్రేయస్కరం. ఎవరైతే తమ ఆత్మ లోభత్వం నుండి రక్షించబడ్డారో వారే సాఫల్య భాగ్యం పొందినవారు. ఖుర్ఆన్ సూరా అత్ తగాబున్ : 64 :16

 

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు : నమాజు చేసేటప్పుడు నిలబడం చేత కాకపోతే కూర్చోని నమాజు చదవండి. అది కూడా కాకపోతే పడుకోని నమాజు చేయండి. సహీహ్ అల్ బుఖారి భాగం 2 : 218

 

అల్లాహ్ తన దాసులకు ఇలా సెలవిస్తున్నాడు. అత్యవసర స్థితిలో వున్నా ముస్లింలైన వారికి దానం చేయడం. మరియు ఎవరైతే జకాతు తీసుకోవడానికి అర్హులైన వారికి ఆ జకాతు ను అందజేయడం. జకాతు ను ఇవ్వడం వలన ధనవంతులకు ఎటువంటి నష్టం లేదు. పేదవారు వీటి నుండి చాల లాభాలను పొందుతారు. అల్లాహ్ తన దాసులకు రమజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండమని కోరుతున్నాడు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు.

 

రమజాన్ నెల – ఖుర్ఆన్ అవతరింపజేయబడిన నెల. అది మానవులందరికి మార్గదర్శకం. అందులో సన్మార్గం తో పాటు, సత్య అసత్యాలను వేరు పరిచే స్పష్టమైన నిదర్శనాలు ఉన్నాయి. కనుక మీలో ఎవరు ఈ నెలను చూస్తారో వారు ఉపవాసాలుండాలి. అయితే రోగగ్రస్తుని గానో, ప్రయాణికినిగానో ఉన్న వారు ఇతర దినాలలో ఈ లెక్కను పూర్తి చేయాలి. అల్లాహ్ మీకు సౌలభ్యాన్ని సమకూర్చదలుస్తున్నాడేగాని మిమ్మల్ని కష్ట పెట్టదలచటం లేదు. మీరు (ఉపవాసాల) నిర్ణీత సంఖ్యను పూర్తి చేసుకోవాలన్నదీ, తాను అనుగ్రహించిన సన్మార్గ భాగ్యానికి ప్రతిగా ఆయన గొప్పదనాన్ని కీర్తించి, తగురీతిలో మీరు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవాలన్నది అల్లాహ్ అభిలాష!  ఖుర్ ఆన్ సూరా అల్ బఖర 2 :185

 

హజ్ చేయడం


ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైనా కాబా (మస్జిదె  హరాం)  ను సందర్శించి హజ్ యాత్ర చేయడం, అలాగే అల్లాహ్ భోధించిన వాటిని పాటించడం మరియు నిషేదించిన వాటిని వదిలి వేయడం ముస్లిం ల విధి.

 

పైన పేర్కొన్న విషయాలలో  అల్లాహ్ నిభందనలను  పాటించడం ముస్లింల విధి.  అల్లాహ్ కు భయపడేవారికి ఇది కష్టమైన  పని కాదు,  ఇది వారి కోసం ప్రత్యేకంగా చేసుకుంటున్న పుణ్యాలు. ఈ విషయాన్ని అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిస్తున్నాడు: ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయవస్తువు తప్ప మరేమీ కాదు. ఖుర్ఆన్ సూరా అలి ఇమ్రాన్ 3 :185

  షహాదహ్  –  సత్యధర్మ ధృవీకరణ   వచనం భావం : షహాదహ్ అంటే సత్యధర్మ ధృవీకరణ వచనం. ఈ “కలిమ”( వచనం) ఎలా ఒకవ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళ...

 


షహాదహ్ – సత్యధర్మ ధృవీకరణ వచనం


భావం : షహాదహ్ అంటే సత్యధర్మ ధృవీకరణ వచనం. ఈ “కలిమ”( వచనం) ఎలా ఒకవ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవనమార్గం పై నడిపిస్తుందో, ఈ వ్యాసంలో స్పష్టంగా వివరించబడింది. ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవ వలసిన వ్యాసమిది.

 


మూల స్తంభం 

లా ఇలాహ ఇల్లల్లాహ్ముహమ్మదుర్రసూలుల్లాహ్ : (అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఆరాధ్య దేవుడు లేడు,  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ సల్లం “రసూలుల్లాహ్”, అనగా అల్లాహ్ యొక్క సందేశహరులు)

 

ఇస్లాం స్వీకరించిన అనేక మంది ప్రజలు ఇస్లాం యొక్క మొట్టమొదటి మూలస్తంభం.– “లా ఇలాహ ఇల్లల్లాహు ముహమ్మదుర్రసూలుల్లాహ్” యొక్క అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ మహోన్నత “కలిమ” వచనం యొక్క భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం.

 

“లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్” అనే పవిత్ర వాక్యాన్ని నాల్గు భాగాలలో అర్థం చేసుకోవచ్చును:  (మొదటి భాగం, రెండవ భాగం, మూడవ భాగం, నాలుగవ భాగం),

 

క్రింద తెలిపిన నాలుగు భాగాలుపై సర్వలోకాల సృష్టికర్త, ఉనికిలో ఉన్న ప్రతిదానికి ప్రభువు, ఏకైక మహోన్నతుడు మరియు తీర్పుదినాన న్యాయాధిపతి అయిన అల్లాహ్ కు మీరు వాగ్దానం చేయవలసి ఉన్నది.

 

మొదటిభాగం

అల్లాహ్ యొక్క చేతల్లో ఏకత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్“కేవలం అల్లాహ్ మాత్రమే ప్రతిదాన్ని సృష్టించిన సృష్టికర్త” అని హృదయపూర్వకంగా అంగీకరించటం. A confession with your heart that the Creator (of everything) is Allah; దీని కోసం మీరు ఇలా ధృవీకరించవలసి ఉంటుంది: “నక్షత్రాలు, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, స్వర్గలోకాలు, ప్రపంచానికి తెలిసిన మరియు తెలియని అన్ని రకాల జీవరాశులతో నిండి ఉన్న భూలోకం మొదలైన సకలలోకాలను సృష్టించిన, సర్వలోక సమర్థుడు కేవలం అల్లాహ్ మాత్రమే” అని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనే ఈ విశాల విశ్వము యొక్క  ప్రతిదానిని నడిపేవాడు మరియు ప్లానింగ్ చేసేవాడు. ఆయనే జీవితాన్ని మరియు మరణాన్ని ఇస్తాడు, మరి కేవలం ఆయనే పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు” దీనినే “అల్లాహ్ యొక్క చేతల్లో ఏకత్వం” – తౌహీదుర్రుబూబియ్యహ్ అని అంటారు.

 

రెండవ భాగం

అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఏకత్వం” – తౌహీదుల్ఉలూహియ్యహ్: “ఇతరులెవ్వరూ ఆరాధ్యులు కారు, కాని ఒక్క అల్లాహ్ తప్ప” అని హృదయపూర్వకంగా సాక్ష్యమివ్వటం: ఇస్లామీయ భాషలో ఆరాధన అనే పదం అనేక విసృతార్థాలను ఇస్తుంది: అన్ని రకాల ఆరాధనలు కేవలం అల్లాహ్ కే చెందును అనే విషయాన్ని ఇది నొక్కి చెబుతున్నది. (అంటే ఇతరులెవ్వరూ – వారు దైవదూతలైనా, ప్రవక్తలైనా, సందేశహరులైనా, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా-జీసస్ అలైహిస్సలాం అయినా, ఉజైర్, ముహమ్మద్, సూర్యుడు, చంద్రుడు, విగ్రహాలు, సన్యాసులు అయినా, ఇంకావేరే ఇతర దైవాలైనా ఆరాధించటానికి అస్సలు అర్హులు కారు) కాబట్టి కేవలం అల్లాహ్ నే ఆరాధించవలెను, అల్లాహ్ ను కాకుండా వేరే ఇతరులెవ్వరినీ వేడుకోరాదు, అల్లాహ్ పేరు మీద కాకుండా ఇతరులెవ్వరి పేరు మీదా పశువులను బలివ్వరాదు, … etc, అర్థం ఏమిటంటే – ఖుర్ఆన్ లో మరియు సున్నహ్ (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉపదేశా)లలో వేటినైతే ఆచరించమని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఆదేశించారో వాటిని మనం తప్పక ఆచరించవలెను. మరియు ఏదైతే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేయవద్దని నిషేధించారో, వాటిని మనం అస్సలు చేయకూడదు. దీనినే “అల్లాహ్ యొక్క ఆరాధనలలో ఏకత్వం” – తౌహీదుల్ఉలూహియ్యహ్ అని అంటారు. కాబట్టి మనం అల్లాహ్ తో పాటు లేదా అల్లాహ్ ను వదిలి ఇతరులెవ్వరినీ ఆరాధించరాదు.

 

మూడవ భాగం

తౌహీద్ అస్మా వ సిఫాత్ అత్యుత్తమైన నామాలుమహోన్నతమైన సుగుణాలు మరియు విశిష్ఠ లక్షణాలలో ఏకత్వం : “అత్యుత్తమైన నామాలు, మహోన్నతమైన సుగుణాలు మరియు విశిష్ఠ లక్షణాలు కేవలం అల్లాహ్ కే చెందును” అని హృదయపూర్వకంగా ధృవీకరించటం : “ఓ అల్లాహ్! నీ గ్రంథం(ఖుర్ఆన్) లో స్వయంగా నీకు నీవే పెట్టుకున్న లేక యోగ్యుడిగా ప్రకటించుకున్న అత్యుత్తమమైన పేర్లన్నీ మరియు మహోన్నతమైన సుగుణాలు, లక్షణాలన్నీ లేదా నీ ప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రకటనలలో తెలిపిన నీ యొక్క అత్యుత్తమ పేర్లు, మహోన్నతమై లక్షణాలన్నింటినీ నేను ధృవీకరిస్తున్నాను. ఇంకా అవన్నీ అసలు రూపంలో వాటి అర్థాలు లేక భావాలలో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండా, వాటిని నిర్లక్ష్యానికి గురిచేయకుండా, వేరే వాటితో పోల్చకుండా కేవలం ఆయనకే శోభిస్తాయని నేను నమ్ముతున్నాను.” ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఆయనను పోలినదేదీ లేదు మరియు ఆయన అన్నీ వినేవాడూ, అన్నీ చూచేవాడూను” (సూరా ఆష్ షూరా 42:11)

 

సృష్టితాలతో అస్సలు పోల్చలేని ఆయన స్వరూపం, వినికిడి శక్తి మరియు దృష్టి యొక్క ప్రత్యేకతలను పై ఆయత్ ధృవీకరిస్తున్నది. అంతే కాక ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఎవరినైతే నా రెండు చేతులతో సృష్టించానో, (సూరా సాద్ 38:75)

 

మరియు ఖుర్ఆన్ లో మరో చోట అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “అల్లాహ్ చేయి, వారి చేతుల పై ఉన్నది.” (సూరా అల్ ఫతహ్  :48:10).

 

అల్లాహ్ కు రెండు చేతులు ఉన్నాయని ఈ పవిత్ర ఆయత్ లు ధృవీకరిస్తున్నాయి. కాని, ఆ చేతులను పోలిన చేతులను మానవుడి పరిమిత జ్ఞానం ఊహించలేదు.  అలాగే ఖుర్ఆన్ లో తెలిపిన “అల్లాహ్ తన సింహాసనం పై అధిష్టించి ఉన్నాడు” అనే దాన్ని మనకు తెలిసిన ప్రాపంచిక సింహాసనంతో పోల్చటం గాని, కూర్చోవటం అనే పనిని భూలోక జీవులు కూర్చునే విధంగా ఊహించటం గాని చేయకూడదు. (సూరా తాహా 20:5)

 

అల్లాహ్ సింహాసనం

అమిత దయగలవాడైన అల్లాహ్ సప్తాకాశాలపై  తన సింహాసనం పై తనకు శోభనిచ్చే విధంగా అధిష్టించినాడు. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  ఒక బానిస స్త్రీని ‘అల్లాహ్ ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రశ్నించగా, ఆవిడ ఆకాశం వైపునకు వేలెత్తి చూపినది. జిల్ హజ్ నెల 9వ తేదీన వచ్చే అరాఫాత్ దినమున మరియు ప్రతి రాత్రి మూడవ భాగములో ఆయన భూలోకానికి అతి దగ్గరలోని మొదటి ఆకాశానికి వస్తాడు. కాని ఆయన అపరిమితమైన దివ్యజ్ఞానం సర్వలోకాలలో వ్యాపించియున్నది, అనంత విశ్వాన్ని పరివేష్టించి ఉంది. అంతేకాని భౌతికంగా ఆయనే స్వయంగా లోకమంతా వ్యాపించిలేడు.  (బి-జాతిహి) అల్లాహ్ ఇక్కడ, అక్కడ, ప్రతి చోటా, ఇంకా మనుషుల హృదయాలలో వ్యాపించి ఉన్నాడనే భావన ఎంత మాత్రమూ వాస్తవం కాదు. మనం చేసే ప్రతి పనిని ఆయన చూస్తూ వున్నాడు మరియు పలికే ప్రతి పలుకును ఆయన వింటూవున్నాడు. దీనినే శుభమైన పేర్లు మరియు  విశిష్ఠ సుగుణాలు, మహోన్నత లక్షణాలు అంటారు. ఇటువంటి అల్లాహ్ యొక్క ఏకత్వాన్నే; తౌహీద్ అస్మా వ సిఫాత్:అంటారు. వీటినీ దైవవిశ్వాసులు “ఈమాన్” అంటారు, ఇంకా ఇదే నూహ్ అలైహిస్సలాం, ఇబ్రాహీం అలైహిస్సలాం, మూసా అలైహిస్సలాం మరియు ఈసా అలైహిస్సలాం నుండి చిట్టచివరి దైవప్రవక్త అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం వరకూ ధృవీకరించబడిన విశ్వాసం.

 

నాలుగవ భాగం

షహాదహ్ “ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)ని రసూలుల్లాహ్ అంటే అల్లాహ్  యొక్క సందేశహరుడని” అర్థం. వారి పట్ల హృదయపూర్వకంగా సాక్ష్యమిచ్చుట: “ఓ అల్లాహ్! ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీ యొక్క సందేశహరుడని నేను సాక్ష్యమిస్తున్నాను.” అల్లాహ్ ఆదేశం ప్రకారం అనుసరించటానికి అవసరమైన అర్హతలు, యోగ్యతలు ఆయనకు తప్ప ఇంకెవ్వరికీ లేవు, ఎందుకంటే ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు ఇంకా వారిలో చిట్టచివరి వారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ముహమ్మద్ తండ్రి కాడు ఎవ్వరికీ మీ పురుషుల్లో నుంచి. కాని ఆయన అల్లాహ్ యొక్క సందేశహరుడు ఇంకా ప్రవక్తలలో చివరివాడు. మరియు అల్లాహ్ యే ప్రతి విషయపు జ్ఞానం కలవాడు.” (సూరా అల్ అహ్జాబ్ : 33:40)

 

“మరియు ప్రవక్త మీకు ఇచ్చిన దానిని తీసుకోండి మరియు ఆయన మీకు నిషేధించిన దానికి దూరంగా ఉండండి.” (సూరా అల్ హష్ర్ : 59:7).

 

“(ఓ ప్రవక్తా!) ఇలా ప్రకటించు, ‘మీకు అల్లాహ్ పట్ల (నిజంగా) ప్రేమ ఉంటే, మీరు నన్ను అనుసరించండి.(అప్పుడు) అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు మరియు మీ పాపాలను క్షమిస్తాడు మరియు అల్లాహ్ అమితమైన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత” (సూరా ఆలి ఇమ్రాన్ :3:31)

 

ఈసా అలైహిస్సలాం రాక

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహి వసల్లం కాకుండా ఇతరుల పలుకులను అల్లాహ్ యొక్క అంతిమ సందేశం (ఖుర్ఆన్ మరియు సున్నహ్) మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించిన ఇస్లామీయ ధర్మశాస్త్రంతో ఏకీభవిస్తున్నాయా లేదా అనే ప్రామాణికత ఆధారంగా స్వీకరించవచ్చును లేదా తిరస్కరించవచ్చును. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత దివ్యవాణి అవతరణ ఆగిపోయినది. మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా (జీసస్) అలైహిస్సలాం ఈ భూలోకానికి తిరిగి వచ్చే వరకు ఇది మరల ప్రారంభం కాదు. ఇంకా సహీహ్ బుఖారీ సంకలనపు మూడో గ్రంథంలోని 425వ హదీస్ లో తెలుపబడినట్లుగా -  ఈ ప్రపంచపు అంతిమ కాలంలో, ఈసా-జీసస్ అలైహిస్సలాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఇస్లామీయ ధర్మోపదేశాల ప్రకారం నడుచుకుంటారు.

 

సాక్ష్యం

అష్హదు అన్ – లా ఇలాహఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను” అనే పలుకులను తప్పనిసరిగా ఉచ్ఛరించవలెను. దీనికి ఆధారం తన పినతండ్రి అయిన అబూ తాలిబ్ మరణశయ్య పై, చివరి ఘడియలలో ఉండగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో పలికిన పలుకులు: “ఓ బాబాయి, నీవు గనుక అష్హదు అన్ – లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ అని సాక్ష్యమిచ్చినట్లయితే, తీర్పు దినమున నేను అల్లాహ్ దగ్గర నీ కోసం ప్రార్థించగలను.” అలాగే, అబు జర్ గఫ్ఫారీ రజియల్లాహు అన్హు అనే అతను ఇస్లాం స్వీకరించిన తర్వాత మస్జిద్ అల్ హరాం దగ్గరకు వెళ్ళి, ఖురైషీయుల ఎదుట బిగ్గరగా షహాదా పవిత్ర వచనాన్ని ప్రకటించగా, వారు అతడిని విపరీతంగా కొట్టి, గాయపరచినారు.

 

పెదవులతో పాటు శరీరాంగములన్నీ ఆ పవిత్ర వచనానికి సాక్ష్యం పలికి, ధృవీకరించటం తప్పని సరి. దాని భావాన్ని(“అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధింపబడే అర్హత లేదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను, ధృవీకరిస్తున్నాను”) మొత్తం శరీరాంగాలు పూర్తిగా అర్ధం చేసుకోవటం చాలా ఆవశ్యకమైన ముఖ్య విషయం. కాబట్టి దీనికి సమ్మతించిన వారెవరైనా సరే దోపిడి, దొంగతనం, హత్య, వ్యభిచారం, అక్రమసంబంధం, పంది మాంసం తినటం, మత్తుపానీయాలు సేవించటం, అక్రమ పద్ధతులలో సంపాదించటం, అనాధల ఆస్తిపాస్తులను అన్యాయంగా ఆక్రమించటం, వ్యాపార లావాదేవీలలో మోసం చేయటం, లంచాలు ఇవ్వటం, అబద్ధాలు చెప్పటం వంటివి చేయకూడదు. ఒకవేళ పవిత్ర వచనంపై సాక్ష్యం పలికీ, అటువంటి పాపపు పనులు చేసినట్లయితే, తీర్పు దినమున స్వంత శరీరావయవములే అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. అంటే పవిత్ర వచనం పలకటం ద్వారా ఏదైతే అల్లాహ్ కు ప్రమాణం చేసాడో దానికి వ్యతిరేకంగా చేసేవాడని సాక్ష్యమిస్తాయి. ఒకవేళ అతడు పైన తెలిపిన పాపపు పనులలో ఏదైనా చేసినట్లయితే, అతడు  దానిని పాపపు పనిగా గ్రహించి, వెంటనే  అల్లాహ్ దగ్గర పశ్చాత్తాపపడి, మన్నింపమని వేడుకోవలెను. చేసిన పాపపు పనులకు తన స్వంత శరీరావయువాలైన చర్మం, రహస్యాంగాలు, చేతులు, నాలుక, చెవులు తీర్పుదినాన స్వయంగా తనకే వ్యతిరేకంగా సాక్ష్యం పలుకుతాయనే విషయం తెలుసుకోవలెను. ఎవరైనా సరే, ఈ పవిత్ర వచనాన్ని ధృవీకరించటంతోనే ఇస్లాం ధర్మంలో ప్రవేశిస్తారు. అప్పుడు అల్లాహ్ యొక్క ప్రవక్తలందరినీ విశ్వసించటం మరియు వారి మధ్య ఎటువంటి భేదాలుచూపకుండ నమ్మడం అతడి పై తప్పని సరి అయిపోతుంది. ఖుర్ఆన్  లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఏమీ? ఈ సత్యతిరస్కారులు నన్ను వదిలి, నా దాసులను (అంటే దైవదూతలను, అల్లాహ్ యొక్క సందేశహరులను, మర్యం కుమారుడైన ప్రవక్త ఈసా అలైహిస్సలాం, పుణ్యపురుషులు..) తమ స్నేహితులుగా (సంరక్షకులుగా) చేసుకోగలరని భావించారా? నిశ్చయంగా మేము సత్యతిరస్కారుల ఆతిథ్యం కొరకు నరకాన్ని సిద్ధపరచి ఉంచాము.”

 

కర్మల పత్రం

“ప్రకటించు: ‘కర్మలను బట్టి అందరి కంటే ఎక్కువగా నష్టపడేవారు ఎవరో మీకు తెలుపాలా?’ “ఎవరైతే ఇహలోక జీవితంలో చేసే కర్మలన్నీ వ్యర్థమైనా, తాము చేసేవన్నీ సత్కార్యాలే అని భావిస్తారో!” “వీరే తమ ప్రభువు సూచనలను మరియు ఆయనను కలుసుకోవలసి ఉన్నదనే విషయాన్ని తిరస్కరించిన వారు. కావున వారి కర్మలన్నీ వ్యర్థమయ్యాయి. కాబట్టి మేము తుది దినమున వారి కర్మలకు ఎలాంటి విలువ (తూకము) నివ్వము. “వారి ప్రతిఫలం నరకం; ఎందుకంటే వారు సత్యాన్ని తిరస్కరించారు మరియు నా సూచనలను మరియు నా సందేశహరులను పరిహసించారు. “నిశ్చయంగా! ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, వారి ఆతిథ్యం కొరకు ఫిర్దౌస్ స్వర్గవనాలు (అత్యున్నత స్వర్గపు తోటలు) ఉంటాయి. వారందులో శాశ్వతంగా ఉంటారు. వారు అక్కడి నుండి వేరగుటకు ఇష్టపడరు. వారితో అను: “నా ప్రభువు మాటలు వ్రాయటానికి సముద్రమంతా సిరాగా మారిపోయినా – నా ప్రభువు మాటలు పూర్తి కాకముందే – దానికి తోడుగా దాని వంటి మరొక సముద్రాన్ని తెచ్చినా అది కూడా తరిగి పోతుంది.” (ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అను: నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడినే. నాపై దివ్యజ్ఞానం అవతరింపజేయబడినది. నిశ్చయంగా మీ ఆరాథ్యుడు ఆ ఏకైక ఆరాధ్య దైవం (అల్లాహ్) మాత్రమే. కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి. మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెవ్వరినీ భాగస్వాములు (షరీక్) గా కల్పించుకోరాదు.” (సూరా అల్ కహఫ్ 18:102-110)

 

ఇస్లాం మూల స్తంభాలు

ఎవరైనా ఇస్లాం స్వీకరించాలనుకుంటే, క్లుప్తంగా పైన తెలిపిన కనీస ఇస్లాం పరిచయ విషయాలు తప్పక చదవుకోవలెను. షహాదా పవిత్ర వచనాలపై సాక్ష్యం పలికిన తర్వాత, ఇస్లామీయ పద్ధతిలో సంపూర్ణ తలస్నానం – గుసుల్ చేసి, రెండు రకాతుల నమాజు చేసి, ఆ తర్వాత ఇస్లాం యొక్క ఐదు మూల స్థంభాల ఆధారంగా జీవించటం మొదలు పెట్టవలెను.ఇంకా సహీహ్ బుఖారీ హదీస్ సంకలనంలోని మొదటి హదీస్ గ్రంథం 7వ హదీస్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  చేసిన బోధనను ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించినారు – ఇస్లాం ఐదింటిపై ఆధారపడి ఉన్నది:

 

1) లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అంటే “అల్లాహ్ కు తప్ప ఇతరులెవ్వరికీ ఆరాధించకూడదు మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు” అని నేను సాక్ష్యమివ్వటం, ధృవీకరించటం.

2) నమాజు స్థాపించటం.

3) జకాతు– తప్పని సరి విధిదానం చెల్లించటం.

4) రమజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండటం.

5) హజ్ చేయటం (i.e.మక్కా యాత్ర).

 

ఈమాన్ మూల స్థంబాలు

ఇంకా అర్కాన్ అల్ ఈమాన్ అంటే విశ్వాసపు ఆరు సిద్ధాంతాలను కూడా నమ్మవలసి ఉంటుంది. అవి:

  1. అల్లాహ్ పై విశ్వాసం
     
  2. అల్లాహ్ యొక్క దైవదూతలపై విశ్వాసం
     
  3. అల్లాహ్ యొక్క సందేశహరులపై విశ్వాసం
     
  4. అల్లాహ్ యొక్క గ్రంథాలపై విశ్వాసం
     
  5. తుది దినం పై విశ్వాసం
     
  6. అల్ ఖదర్ (విధిరాత)– జీవితంలో జరగబోయే మంచిచెడులను అల్లాహ్ ముందుగానే లిఖించి ఉంచాడనే నమ్మకం పై విశ్వాసం.

 

పుణ్య స్వీకారాలు

మనం చేసే మంచి పనులు, పుణ్యకార్యాలు క్రింద తెలిపిన రెండు షరతుల ప్రకారం ఉంటేనే అల్లాహ్ దగ్గర స్వీకరించబడతాయి.:

  1. మంచి పనులు, పుణ్యకార్యాలు కేవలం అల్లాహ్ స్వీకరణ కొరకు మాత్రమే చేస్తున్నట్లు దృఢ సంకల్పం చేసుకోవలెను. అందులో ఎటువంటి ప్రదర్శనా బుద్ధి, కీర్తి ప్రఖ్యాతల తాపత్రయం గాని, ఎవరినైనా మెప్పించటం కోసం చేసే ప్రయత్నం గాని, ఇంకా స్వార్థం వంటివి ఉండకూడదు.
     
  2. మంచి పనులు, పుణ్యకార్యాలు అల్లాహ్ యొక్క అంతిమ సందేశహరుడు మరియు దాసుడు అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం  యొక్క సున్నహ్ (ఇస్లామీయ ధర్మాదేశాల, ఆచరణల, అనుమతుల) ప్రకారం ఉండవలెను.

అల్లాహ్ ఎవరు అల్లాహ్ భూమ్యాకాశాలకు  మరియు సర్వానికి సృష్టికర్త.  మీ సృష్టికర్త ను గురించి తెలుసుకొని, ఆతని ఆజ్ఞకు లోబడి ఎందుకు  ఇస్లాం స్వీక...



అల్లాహ్ ఎవరు


అల్లాహ్ భూమ్యాకాశాలకు  మరియు సర్వానికి సృష్టికర్త.  మీ సృష్టికర్త ను గురించి తెలుసుకొని, ఆతని ఆజ్ఞకు లోబడి ఎందుకు  ఇస్లాం స్వీకరించాలో తెలుసుకొనండి. “దైవం గురించి  మానవజాతి యెక్క తప్పుడు నమ్మకాలను, సిద్దాంతాలను సరిదిద్దడమే ఇస్లాం యెక్క ప్రధాన కర్తవ్యమని స్పష్టంగా అర్ధం చేసుకోండి”


 

విశ్వప్రభువుకు  అన్ని విధాలా  శోభాయమానమైన  పదం ‘అల్లాహ్’


“అల్లాహ్” అనేది అరబీ భాషాపదం. ఇది “అల్” మరియు “ఇలాహ్” అనే రెండు పదాలు కలిసి ఏర్పడింది. అల్ అనేది ఇంగ్లీషులో వాడబడే THE వంటి ఉపపదం  –  ఆర్టికల్. దీని అర్ధం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన, ఇంతకూ ముందు ప్రస్తావించబడిన, ఏకైక మరియు వాస్తవమైన అని.  అల్ (The) + ఇలాహ్ (God) = అల్లాహ్ (The God). ఇప్పుడు ఈ రెండు పదాలను (అల్ + ఇలాహ్)ను కలిపితే  “అల్లాహ్” అనే పదం  ఏర్పడింది. అదే విధంగా దాని ప్రత్యేక అర్ధం కూడా ఉనికిలోకి వచ్చింది. అనగా నిజ ఆరాధ్యుడు, ఏకైక ఆరాధ్యుడు, సాటిలేని ఆరాధ్యుడు, అసలైన ఆరాధ్యుడు, అందరికి తెలిసిన ఆరాధ్యుడు. ఇస్లాం దృష్టిలో సర్వలోకాల సృష్టికర్త మాత్రమే ఆరాధనలకు అర్హుడు. మిగతా  జీవరాశులు, ఇతర సృష్టి రాశులు ఆరాధనలకు అనర్హమైనవి. ఎందుకంటే అవి కూడా తమ సృష్టికర్త ద్వారా ఉనికిలోకి  వచ్చినవే. అవన్నీ అల్లాహ్ ఆజ్ఞ మేరకు తమ కాలం వెల్లబుచ్చుతున్నవి మాత్రమే. అంతిమ లక్ష్యం వైపు పయనిస్తున్నవి మాత్రమే.  తెలుగులో మనం ‘దేవుడు’ అంటాం. అరబీలో“అల్లాహ్” అంటారు. ఇంగ్లీషులో గాడ్ (God) అని అంటారు. ఇలా మానవుల ఆరాధ్యదైవాన్ని ఒక్కో భాషలో ఒక్కో పేరుతో పిలుస్తుండవచ్చు. కాని ఇన్నిపదాల్లోకెల్లా “అల్లాహ్” అనేది ఎంతో విలక్షణమైన పదం. విశ్వప్రభువుకు అది అన్ని విధాలా శోభాయమానమైన పదం.  అరబ్బీ మాట్లాడే క్రైస్తవులు మరియు యూదులు“దేవుడు” అనే పదానికి  బదులుగా “అల్లాహ్” అనే పదాన్ని వాడుతారు. ఇంగ్లిష్ Bible లో God అని వాడిన చోటల్లా అరబిక్  Bible  లో “అల్లాహ్” అనే పదం  కనపడుతుంది.


అపోహ

ముస్లిమేతరులకు ఇస్లాం గురించి ఉన్న అనేక పెద్ద అపోహల్లో “అల్లాహ్” అనే పదానికి సంబంధించిన అపోహ కూడా ఒకటి. ముస్లింలు, క్రైస్తవుల  యూదుల దేవుణ్ణి కాకుండా వేరెవరో దేవుణ్ణి ఆరాధిస్తారని చాలామంది అనుకుంటారు. కాని నిజానికి ఇదంతా ఓ అపోహ మాత్రమే. ఎందుకంటే “అల్లాహ్” అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయపదం. దేవుడు అందరికీ ఒక్కడే. దేవుడు ఎవరు? ఆయన అస్తిత్వం ఏమిటి? అనే విషయాల్లో యూదులు-క్రైస్తవులు-ముస్లింల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఉదా: క్రైస్తవుల్లో ఉన్న త్రిత్వ భావన (Trinity) ను  యూదులు తిరస్కరిస్తారు. ముస్లింలు కూడా దాన్ని తిరస్కరిస్తారు. అంతమాత్రం చేత ఆ మూడు మతాలకు వేర్వేరు దేవుళ్ళు ఉన్నారని అర్ధం కాదు. ఎందుకంటే - విశ్వమంతటికి నిజదేవుడు ఒక్కడే. ఇస్లాం చెప్పేది ఏమిటంటే - ఇతర మతాల వాళ్ళు కూడా అల్లాహ్ నే విశ్వసిస్తున్నారు. కాని అల్లాహ్ ను ఏ విధంగా విశ్వసించాలో ఆవిధంగా విశ్వసించటం లేదు. దేవుడు ఫలానా విధంగా ఉంటాడని స్వయంగా కల్పనలు చేసుకుని విశ్వసిస్తున్నారు.


అల్లాహ్ ముస్లింల దేవుడు మాత్రమే కాదు

అల్లాహ్ అంటే ముస్లిముల దైవం, ఇంకో పేరున మరోజాతి వారి దైవం అని జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇది కూడా పొరపాటే. ఇస్లాం సర్వమానవాళిని ఒకే తల్లిదండ్రుల సంతానంగా పరిగణిస్తుంది. వారందరి దైవం కూడా ఒక్కడే. ఆ దైవం మరియు ఆరాధ్యుని వివరణ మరియు విశ్లేషణ దివ్య ఖుర్ఆన్ లో ఇలా ఉన్నది.


“మీరు చెప్పండి! ఆయన, అల్లాహ్ అద్వితీయుడు(ఒక్కడే). అల్లాహ్ నిరపేక్షాపరుడు (ఎవరి ఆధారము, అక్కరా లేనివాడు, అందరూ ఆయనపై ఆధారపడేవారే). ఆయనకు సంతానము ఎవరూ లేరు మరియు ఆయన ఎవరి సంతానమూ కాదు. ఆయనకు సరిసమానులెవరూ లేరు.”  సూరా అల్ ఇఖ్లాస్ 112:1 -  4

నీ ప్రభువు పుట్టుపూర్వోత్తరాలను, అయన వంశపరంపరను గురించి కాస్త వివరించమని బహుదైవారాధకులు మహాప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ను డిమాండు చేసిన నేపధ్యంలో ఈ  ఖుర్ఆన్ అధ్యాయం  అవతరించింది.


అల్లాహ్ ఒక్కడే నిజమైన ఆరాధ్యుడు. ఆయనకు ఎవరి అవసరమూ లేదూ. ఆయన ఎవరిపైనా ఆధారపడిన వాడు కాడు. అందరికీ ఆయన అవసరం ఉంది. అందరూ ఆయన పైనే ఆధారపడి ఉన్నారు. అల్లాహ్ అందరికన్నా వేరైనవాడు, నిరపేక్షాపరుడు.  ఆయనకు సంతానం లేదు. ఆయనకు తల్లిదండ్రులు సైతం లేరు. ఆయన ఎవ్వరినీ కూడా కుమారులుగా కాని, కుమార్తెలుగా గాని చేసుకోలేదు. ఆయన ఉనికిలో గాని, ఆయన గుణగణాలలో కానీ, ఆయన అధికారాలలో  కానీ ఆయనకు భాగస్వాములు లేరు. ఆయనకు సరిజోడీ కూడా లేరు.

“ఆయన లాంటిది సృష్టిలో ఏదీ లేదు”. సూరా ఆష్ షురా 42 : 11   

హదీస్ ఖుద్సీలో అల్లాహ్ సుబ్ హానహు వత’ఆల ఈ విధంగా సెలవిచ్చాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించారు:

“మానవుడు నన్ను దూషిస్తున్నాడు. అంటే నాకు సంతానాన్ని ఆపాదిస్తున్నాడు. వాస్తవానికి నేను ఒక్కడినే. నేను నిరుపేక్షాపరున్ని. నేనెవరినీ కనలేదు. నేనెవరి

కీ పుట్టనూలేదు. నాకు సరిజోడీ కూడా ఎవరూ లేరు. ఈ విధంగా బహుధైవారాధకుల మూడనమ్మకాలు, అల్లాహ్ కు కుమారులను ఆపాదించే వారి మిధ్యా వాదాలు, దైవానికి భాగస్వాములను కల్పించేవారి యెక్క కాల్పనిక సిద్ధాంతాలు అన్నీ నిర్ద్వంద్వంగా ఖండించబడ్డాయి.

Popular Posts