Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన చివరి ప్రసంగం 623 C.E వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలో...

 దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం చేసిన చివరి ప్రసంగం

623 C.E వ సంవత్సరం, మక్కా నగరం దగ్గర ఉన్న అరాఫాత్ మైదానంలో చేసిన ప్రసంగంలోని భాగం

అల్లాహ్ ను ప్రశంసించి, కృతజ్ఞతలు తెలిపిన తర్వాత, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సంబోధించారు (ప్రపంచం నలుమూల నుండి వచ్చిన దాదాపు లక్షన్నర స్త్రీ పురుషుల సమూహానికి చేసిన ఉపదేశం):

"ఓ ప్రజలారా ! శ్రద్ధగా వినే చెవిని నాకు అప్పుగా అప్పగించండి, ఎందుకంటే నేను ఈ సంవత్సరం తర్వాత మీ మధ్యన జీవించి ఉంటానో లేదో నాకు తెలియదు. కాబట్టి, నేను మీకు చెబుతున్న దానిని చాలా జాగ్రత్తగా వినండి మరియు ఈ పదాలను (సందేశాన్ని) నేడు ఇక్కడ హాజరు కాలేకపోయిన వారికి కూడా చేర్చండి


ధన ప్రాణాలు చాలా విలువైనవి

ఓ ప్రజలారా ! మీరు ఈ నెలను, ఈ దినమును పవిత్రమైనదిగా పరిగణించినట్లే, ప్రతి ముస్లిం జీవితాన్ని (ప్రాణాన్ని) మరియు సంపదను(ఆస్తిని) పవిత్రమైన విశ్వాస నిక్షేపంగా (నమ్మికగా) పరిగణించవలెను. మీ వద్ద నమ్మకంతో ఉంచిన వస్తువుల్ని, వాటి అసలైన యజమానులకు తిరిగి వాపసు చెయ్యవలెను. మీరు ఎవ్వరికీ హాని కలిగించ కూడదు, దాని వలన మీకెవ్వరూ హాని కలిగించరు. ‘నిశ్చయంగా మీరు మీ రబ్ (ప్రభువు) ను కలుసుకోబోతున్నారు మరియు ఆయన నిశ్చయంగా మీ కర్మల లెక్క తీసుకోబోతున్నాడు’ అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవలెను. 


వడ్డీ నిషేధించబడింది

మీరు వడ్డీ తీసుకోవటాన్ని అల్లాహ్ నిషేధించాడు; కాబట్టి ఇక మీదట వడ్డీ వ్యాపారానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ, హక్కులన్నీ రద్దు చేయబడినవి. మీ యొక్క అసలు మూలధనం మాత్రం మీరు తీసుకోవచ్చును. మీరు అసమానత్వాన్ని (హెచ్చుతగ్గులను, భేదాలను, వైషమ్యాలను) బలవంతంగా రుద్దకూడదు మరియు సహించకూడదు. వడ్డీ నిషేధించబడినదని అల్లాహ్ తీర్పునిచ్చినాడు మరియు అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముత్తలిబ్ కు చెల్లించ వలసి ఉన్న మొత్తం వడ్డీ ఇక మీదట రద్దు చేయబడినది.


షైతాన్ మీ శత్రువు

షైతాన్ నుండి మీ ధర్మాన్ని కాపాడుకునేందుకు అప్రమత్తంగా (జాగ్రత్తగా) ఉండవలెను. అతడు పెద్ద పెద్ద విషయాలలో మిమ్ముల్ని తప్పు దారి పట్టించే శక్తి తనకు ఏ మాత్రం లేదని తెలుసుకుని,తన ఆశలన్నీ వదులుకున్నాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలలో కూడా అతడిని అనుసరించకుండా అప్రమత్తంగా ఉండవలెను.


స్త్రీల హక్కులు

ఓ ప్రజలారా ! మీ స్త్రీలపై మీకు కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నమాట వాస్తవమే కాని వారికి కూడా మీ పై హక్కులు ఉన్నాయి. జ్ఞాపకం ఉంచుకోండి, కేవలం అల్లాహ్ పై ఉన్న విశ్వాసం ఆధారంగానే మరియు అల్లాహ్ యొక్క అనుమతి మూలంగానే మీరు వారిని తమ తమ భార్యలుగా చేసుకున్నారు.

మీ స్త్రీలతో మంచిగా ప్రవర్తించండి మరియు దయాదాక్షిణ్యాలతో వ్యవహరించండి ఎందుకంటే వారు మీ జీవిత భాగస్వాములు మరియు శ్రద్ధాభక్తులతో, సేవానిరతితో సహాయ సహకారాలందించే అంకితమైన సహాయకులు. ఒకవేళ వారు స్థిరంగా మీ హక్కులను పూర్తిచేస్తున్నట్లయితే, మీ నుండి దయతో ఆహారం (అన్నపానీయాలు) మరియు దుస్తులు పొందే హక్కు వారి స్వంతమవుతుంది. ఇంకా మీరు అనుమతించని (ఇష్టపడని) వారితో, వారు స్నేహంగా మెలగకూడదనేది మరియు తమ శీలాన్ని అస్సలు కోల్పోకూడదనేది (వ్యభిచరించకూడదు, తుంటరిగా ప్రవర్తించకూడదు) వారిపై మీకున్న హక్కు.


ఇస్లాం మూల స్తంభాలు

ఓ ప్రజలారా ! అత్యావశ్యకంగా నా మాట వినండి. కేవలం అల్లాహ్ నే ఆరాధించండి, ప్రతి దినపు ఐదు తప్పని సరి నమాజులను పూర్తిచేయండి, రమజాన్ నెలలో తప్పనిసరిగా ఉపవాసం ఉండండి మరియు తప్పనిసరి అయిన విధిదానం (జకాత్) పేదలకు పంచిపెట్టండి. ఒకవేళ మీకు తగిన శక్తిసామర్ధ్యాలు ఉన్నట్లయితే, హజ్ యాత్ర పూర్తిచేయండి. 


న్యాయం, రుజుమార్గం

మొత్తం మానవజాతి ఆదం (అలైహిస్సలాం) సంతతి యే మరియు అరబ్ వాసులకు ఇతరులపై ఎటువంటి ఆధిక్యం లేదు మరియు ఇతరులకు అరబ్ వాసులపై ఎటువంటి ఆధిక్యం లేదు; అలాగే నల్లవారి పై తెల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు మరియు తెల్లవారి పై నల్లవారికి ఎటువంటి ఆధిక్యం లేదు, కేవలం దైవభక్తి మరియు మంచి నడవడికలో తప్ప.


సోదరభావం

ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క ఇతర ముస్లింకు సోదరుడని మరియు ముస్లింలు సోదర భావాన్ని తప్పక స్థాపించాలని గ్రహించవలెను. తోటి ముస్లింలకు చెందిన వాటిపై, మీకు ఎటువంటి అధీనం (వారసత్వం) లేదు, కాని స్వతంత్రంగా మరియు మనస్పూర్తిగా వారు ఇష్టపడి మీకిస్తే తప్ప. కాబట్టి, ఈ విధంగా మీకు మీరే (ఇతరుల హక్కును గౌరవించకుండా) అన్యాయం చేసుకోవద్దు.


సత్య మార్గాన్ని వీడకూడదు 

జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరోజు మీరు అల్లాహ్ ముందు హాజరవబోతున్నారు. మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి ఆచరణకు ఆ రోజున సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి, జాగ్రత్త ! నేను ఈ ప్రపంచం నుండి వెళ్ళిపోయిన తర్వాత మీరు సత్యమార్గానికి దూరం కావద్దు. 


ధర్మం మరియు ప్రవక్తల పరంపర పూర్తిచేయబడింది

ఓ ప్రజలారా ! నా తర్వాత వేరే ప్రవక్త లేక వేరే సందేశహరుడు రాడు, ఏ క్రొత్త ధర్మమూ పుట్టదు. కాబట్టి వివేకంతో, జ్ఞానంతో, బుద్ధితో సరిగ్గా వ్యవహరించండి.


ఖుర్ఆన్ మరియు సున్నత్

ఓ ప్రజలారా ! ఇంకా, నేను మీకు తెలియజేస్తున్న ఈ పదాలను మంచిగా అర్థం చేసుకోవలెను – నేను నా వెనుక (నా తర్వాత) రెండు విషయాలను వదిలి వెళ్ళుతున్నాను, ఒకటి దివ్యఖుర్ఆన్ మరియు రెండోది నా నిదర్శనం (దృష్టాంతం, ఉదాహరణ (సున్నత్)మరియు మీరు ఈ రెండింటినీ గనుక అనుసరిస్తే, ఎట్టి పరిస్థితిలోను నశించిపోరు.


ఇస్లాం సందేశాన్ని ఇతరులకు తెలియజేయండి

నా వాక్కులు వింటున్నమీరందరూ, వీటిని ఇతరులకు చేర్చవలెను, ఇంకా ఆ ఇతరులు వేరే ఇతరులకు చేర్చవలెను. అలా విన్నవారిలో చిట్టచివరి తరం వారు, ఇప్పుడు నా నుండి ప్రత్యక్షంగా వింటున్న మీకంటే ఇంకా మంచిగా అర్థం చేసుకోవటానికి కూడా ఆస్కారం ఉన్నది.


ఓ అల్లాహ్ (ఏకైక దైవారాధకుడు)నేను నా కివ్వబడిన దివ్యసందేశాన్ని నీ ప్రజలకు అందజేసానని దీనికి సాక్ష్యం నీవే.

  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఏమిటి అల్లాహ్ ను అమితంగా కీర్తిoచినవారు హా మీమ్‌. సుస్పష్టమైన(ఈ) గ్రంథంసాక్షిగా! మీరు అర్థం ...

 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సందేశం ఏమిటి


అల్లాహ్ ను అమితంగా కీర్తిoచినవారు

హా మీమ్‌. సుస్పష్టమైన(ఈ) గ్రంథంసాక్షిగా! మీరు అర్థం చేసుకోవటానికిగాను మేము దీనిని అరబీ ఖురానుగా చేశాము. నిశ్చయంగా ఇది మాతృగ్రంథం (లౌహెమహ్‌ఫూజ్‌)లో ఉన్నది. మా వద్ద అది ఎంతో ఉన్నతమైన, వివేకంతోనిండిన గ్రంథంగా ఉన్నది. ఏమిటి? మీరు హద్దుమీరిపోయే జనులైనందున మేము ఈ ఉపదేశాన్నిమీ నుంచి మళ్లించాలా? మేము పూర్వీకులలో కూడా ఎంతోమంది ప్రవక్తల్ని పంపించాము. తమ వద్దకు ఏ ప్రవక్త వచ్చినా వారు అతన్నిపరిహసించకుండా వదల్లేదు. మేము వీళ్ళ కన్నాఎక్కువ ఘటికులనే పట్టుకొని అంతమొందించాము. పూర్వీకుల దృష్టాంతాలు గడచి ఉన్నాయి. "కరుణామయుడు (అయిన అల్లాహ్‌) తలచి ఉంటే మేము వాళ్ళను పూజించేవారం కాము" అని (వీళ్లు కబుర్లు) చెబుతున్నారు. దీనికి సంబంధించి వీరికసలు ఏమీ తెలీదు. అవి కేవలం వీళ్ల ఊహాగానాలు మాత్రమే. సూరా అల్ జుఖ్ రుఫ్ 43:1-8,20; నీ ప్రభువు గొప్పతనాన్ని చాటి చెప్పు. సూరా అల్ ముద్దస్సిర్ 74:3


ఆయన్ని విశ్వసించాలని వాగ్దానం తీసుకోబడింది

అల్లాహ్‌ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ''నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి'' అని చెప్పాడు. తరువాత ఆయన, ''ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?'' అని ప్రశ్నించగా, ''మేము ఒప్పుకుంటున్నాము'' అని అందరూ అన్నారు. ''మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతో పాటు నేనూ సాక్షిగా ఉంటాను'' అని అల్లాహ్‌ అన్నాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3 :81


మృదువుగా వ్యవహరిస్తారు

 (ఓప్రవక్తా!) అల్లాహ్‌ దయవల్లనే నీవు వారి యెడల మృదుమనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారి పట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్యనిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్‌ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3: 159


విశ్వాసుల పాలిట గొప్ప కారుణ్యమూర్తి

అల్లాహ్‌ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథజ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు. సూరా ఆలి ఇమ్రాన్ 3:164


విశ్వాసుల కొరకు కారుణ్యం

ప్రవక్తను బాధించేవారు కూడా వారిలో కొందరున్నారు. ''ఈయన చెప్పుడు మాటలు వినేవాడు'' అని వారంటున్నారు. వారికి చెప్పు: ''ఆ వినేవాడు మీ మేలును కోరేవాడే. అతడు అల్లాహ్‌ను విశ్వసిస్తాడు. ముస్లింల మాటల్ని నమ్ముతాడు. మీలో విశ్వసించిన వారి యెడల అతడు కారుణ్యమూర్తి. దైవప్రవక్త (సఅసం)ను బాధించే వారికి బాధాకరమైన శిక్ష ఖాయం.''సూరా అత్ తౌబా 9:61


వివేకంతో , చక్కని హితబోధతో ఉత్తమోత్తమ విధానంలో వాదిస్తూ ధర్మమార్గం వైపు ఆహ్వానిస్తారు


నీ ప్రభువు మార్గం వైపు జనులను వివేకంతోనూ, చక్కని ఉపదేశంతోనూ పిలువు. అత్యుత్తమ రీతిలో వారితో సంభాషణ జరుపు. నిశ్చయంగా తన మార్గం నుంచి తప్పిన వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. సన్మార్గాన ఉన్నవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు. సూరా అన్ నహ్ల్ 16:125

  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు ఆయన సర్వలోకాల పాలిట కారుణ్యంగా పంపబడ్డారు ఓ ముహమ్మద్ (సఅసo) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్...

 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరు


ఆయన సర్వలోకాల పాలిట కారుణ్యంగా పంపబడ్డారు

ఓ ముహమ్మద్ (సఅసo) మేము నిన్ను సమస్త లోకవాసుల కోసం కారుణ్యoగా చేసి పoపాము. సూరె అల్ అంబియా 21:107


మానవులంత అనుసరించదగ్గ గొప్ప ఆదర్శవంతుడు

నిశ్చయంగా దైవప్రవక్త లో మీ కొరకు అత్యుత్తమ ఆదర్శం ఉంది,. అల్లాహ్ పట్ల అంతిమ దినం పట్ల ఆశ కలిగి ఉండి, అల్లాహ్ ను అత్యదికంగా స్మరించే ప్రతి ఒక్కరి కొరకు. ( సూరె అల్ ఆహజాబ్ 33:21)


ఆయన మొత్తం మానవాళి కోసం పంపబడినవారు

ఓ ముహమ్మద్ ! మేము నిన్ను సమస్త జనులకు సుభవార్త అందజేసేవానిగా , హెచ్చరించేవానిగా చేసి పంపాము , అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు. ( సూరె సబా 34:28)


మానవాళికంతటికి అల్లాహ్ తరపు నుంచి ప్రవక్తగా పంపబడ్డారు

ఓ ముస్లిములారా ! మీరు అల్లాహ్ ను ,ఆయన ప్రవక్తను విశ్వసిoచటానికి , అతనికి తోడ్పడటానికి ,అతనికి గౌరవిoచటానికి , ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము).( సూరె అల్ ఫతహ్ 48:9,29, సూరె అల్ ఆరాఫ్ 7:158)


అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు

అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను) చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేoదుకు ఒక ప్రవక్తను పంపాడు . మరెవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచారణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు . నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమ ఉపాధిని వొసగాడు. ( సూరె అత్ తలాఖ్ 65 :11 )


సత్య ధర్మానికి ఇతర ధర్మాలన్నిటిపై విజయం చేకూర్చటానికి ఏతెంచినవారు

ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్నిఇచ్చి పంపాడు- దాన్ని మతధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టంలేకపోయినా సరే. సూరా అస్ సఫ్ 61:9

అల్లాహ్ ను ప్రేమతో, భయంతో, ఆశతో ఆరాధించడం ఇస్లాంలో ఆరాధించే విధానం ఎంతో ప్రత్యేకమైనది. దాసుని మనసులో అల్లాహ్ ను ఆరాధించేటప్పుడు మూడు రకాలైన ...



అల్లాహ్ ను ప్రేమతో, భయంతో, ఆశతో ఆరాధించడం

ఇస్లాంలో ఆరాధించే విధానం ఎంతో ప్రత్యేకమైనది. దాసుని మనసులో అల్లాహ్ ను ఆరాధించేటప్పుడు మూడు రకాలైన భావనలు ఉంటాయి –ప్రేమ, భయం, ఆశ. ఈ మూడింటిని అల్లాహ్ ఆరాధనలో ఎలా కలపడం అనేది తెలుసుకోవడం ప్రతి ముస్లింకు అవశ్యం. లేనిచో ఇతరులవలె మార్గభ్రష్టతకు లోనయ్యే అవకాశం ఉంది.


ఇతర ధర్మాల్లో ఎలా ఆరాధిస్తున్నారో చూడండి: “అల్లాహ్ ను ప్రేమించండి, జీసస్ ను ప్రేమించండి” అని క్రైస్తవులు అంటారు. వారు అల్లాహ్ కు భయపడటాన్ని విలువనివ్వుటలేదు. యూదులు కేవలం ఆశపైనే ఆధారపడి ఉంటారు. వారికి నరకాగ్ని తాకదనే ఆశలో ఉన్నారు.


ఇస్లామీయ ఆరాధనలో ఈ మూడూ ఉండటం అవసరం. లేనిచో ఆరాధన పూర్తి కాదు. అల్లాహ్ పై ప్రేమ, ఆయన దయపై ఆశ, ఆయన శిక్ష గురించి భయం. దివ్య ఖుర్ఆన్ లోని మొదటి సూరా, సూరా ఫాతిహాలోని మొదటి మూడు ఆయతులు చూస్తే తెలుస్తుంది.


ఆయత్ 1 

: “ప్రశంసలు, పొగడ్తలన్నీ అల్లాహ్ కు మాత్రమే శోభిస్తాయి. ఆయన సమస్త లోకాలకు పోషకుడు”

ఖుర్ఆన్ లోని ఈ మొదటి ఆయతును చదివినప్పుడల్లా మేము అల్లాహ్ ను ప్రేమిస్తున్నాము అని సాక్ష్యమిస్తున్నాము. ఎలా అంటే – ఈ ఆయతులో అల్లాహ్ మా రబ్ (ప్రభువు), విశ్వాలన్నింటికి రబ్ (ప్రభువు) అని ధృవీకరిస్తున్నాము. సాధారణంగా రబ్ అంటే ప్రభువు అని అనువదిస్తాము, కాని ఈ పదానికి అది సరిఅయిన అనువాదం కాదు. వాస్తవానికి రబ్ అంటే అన్నింటినీ సృష్టించినవాడు; అన్నింటినీ నిర్వహించు మరియు పోషించువాడు; జననం మరణం ఆయన చేతిలోనే ఉంది; ఏదైనా మంచి జరిగితే అది ఆయన వల్లే జరుగుతుంది; ప్రతీదీ ఆయన పైనే ఆధారపడి ఉంది; ఆయన ఇష్టానుసారమే అన్నీ జరుగుతాయి.ముస్లింలను సత్యం వైపు నడిపించి, నైతిక విలువలు, మానమర్యాదలు నేర్పినవాడు ఆ రబ్(అల్లాహ్, ప్రభువు).

అల్లాహ్ మా రబ్ అని సాక్ష్యమిచ్చాక ఆయనే మాకు అన్ని రకాల దీవెనలు ఇచ్చాడని ఒప్పుకుంటున్నాము. ఆయన ప్రసాదించిన దీవెనలను మనము లెక్కించ దలిస్తే లెక్కించలేము. అలాంటి రబ్ (ప్రభువు)ను ప్రేమించకుండా మనం ఎలా ఉండగలం? ఎవరైనా మనకు చిన్న సహాయం చేస్తే మనం వారిని ఎంతగా ప్రేమిస్తాము మరియు కృతజ్ఞత చూపుతాము. మనకు అన్నీ(మంచి కుటుంబం, ఇల్లు, భద్రత, అన్నం, ఆరోగ్యం – అన్నిటికంటే ముఖ్యమైన ఇస్లాం మరియు సున్నత్ వైపు మార్గదర్శకం) ఇచ్చిన రబ్(ప్రభువు)కు మనం ఎంత ప్రేమ చూపాలి. మనం అల్లాహ్ ను కృతజ్ఞత చూపుతూ ‘ప్రశంసలన్నీ అల్లాహ్ కొరకే, రబ్బిల్ ఆలమీన్’ అనాలి.

ఆయత్ 2 

: “అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు”

సూరా ఫాతిహాలోని మొదటి ఆయతులో అల్లాహ్ రబ్ (ప్రభువు)అని సెలవీయబడింది. రెండో ఆయతులో ఆయన యొక్క మరో రెండు పేర్లు తెలుపబడ్డాయి: అర్రహ్మాన్ మరియు అర్రహీమ్. అర్ రహ్మాన్ అంటే అనంత కరుణామయుడు, ఆయన స్వభావంలోనే కరుణ ఉంది. అర్ రహీమ్ అంటే అపార కృపాశీలుడు. ఆయన చర్యలన్నీ కృపతో ,దయతో కూడినవి. ఆయన తన సృష్టినంతటిపై దయ, కృప చూపుతాడు.


ఈ రెండు పేర్లు ఉచ్ఛరించగానే మనకు ఆశ పుడుతుంది. ఆయన కరుణామయుడు అనగానే, మన తప్పులను మన్నిస్తాడు అనే ఆశ కలుగుతుంది. ఆ తప్పులు ఎన్నైనా సరే ఆయన మనల్ని క్షమిస్తాడు. మనము ఆయనపై ఆశ వదలుకోరాదు. ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిచ్చాడు: “తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ పాపాలన్నింటినీ (షిర్క్ తప్ప) క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.” ఖుర్ఆన్, సూరా అజ్ జుమర్ 39:53

మన ఆరాధనలో భయం కూడా ఉండాలని తరువాతి ఆయతులో తెలుపబడింది.

ఆయత్ 3

: “ప్రతిఫల దినానికి యజమాని / రారాజు”

ఈ ఆయతు చదవగానే మనకు అంతిమ దినం గుర్తుకు వస్తుంది. ఆ భయంకరమైన రోజున మనమందరం అల్లాహ్ ముందు నగ్నంగా, ఖాళి పాదాలతో నిలబడి ఉంటాము. కొందరికి ఎంత చెమట పడుతుందంటే అది భూమిలోకి డెభ్భై చేతులంత లోతుకు పోతుంది. ఆ రోజు ప్రజలు తాగి ఉండరు కాని తాగినట్లు కనిపిస్తారు. ఆ రోజు ప్రతి ఒక్కరు అల్లాహ్ ముందు నిలబడి తమ లెక్క ఇవ్వవలసి ఉంటుంది. తాము చేసిన ఏ చిన్న పని కూడా అల్లాహ్ కు తెలియకుండా లేదు అని అందరికీ తెలిసిపోతుంది.

“కనుక ఎవడు అణువంత సత్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు. మరెవడు అణువంత దుష్కార్యం చేసినా దాన్ని అతను చూసుకుంటాడు.” ఖుర్ఆన్, సూరా అజ్ జిల్ జాల్ 99:7,8

కావున సూరా ఫాతిహాలోని మూడవ ఆయతు చదివినప్పుడు తీర్పు, జవాబుదారితనం గురించి భయపడవలసి ఉంటుంది. మన చెడు కర్మలు ఎక్కువగా ఉంటే ఎలా అని భయమేస్తుంది. ఇలాంటి పరిస్థితి నుండి అల్లాహ్ మనందరినీ కాపాడుగాక!

తరువాతి ఆయతులో ఇలా ఉంది: “మేము కేవలం నిన్నే ఆరాధిస్తాము.” అనగా అల్లాహ్ తప్ప ఆరాధ్యుడు ఎవడూ లేడని చెబుతున్నాము. ఆయన్ని ఎలా ఆరాధిస్తున్నాము? ప్రేమతో, ఆశతో మరియు భయంతో. ఈ లక్షణాలు మన ఆరాధనలో రావాలంటే అల్లాహ్ సహాయం, మార్గదర్శకం అవసరం. అందుకే మనం ఇలా అంటాము: “సహాయం కోసం నిన్ను మాత్రమే అర్ధిస్తున్నాము.” ఖుర్ఆన్, సూరా ఫాతిహా 1:4

సమతుల్యం పాటించాలి

మన ఆరాధనలో ప్రేమ, భయం, ఆశ ఉండాలని తెలుసుకున్నాక ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది: ఆరాధనలో ప్రతీది ఎంత మోతాదులో ఉండాలి? దీని జవాబు కోసం ఖుర్ఆన్ వైపుకు మరలుదాం.


“భయపడుతూ, ఆశపడుతూ అల్లాహ్ ను ఆరాధించండి.” ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్ 7:56

“వారి ప్రక్కలు వారి పడకల నుంచి వేరుగా ఉంటాయి. వారు తమ ప్రభువును భయంతోనూ, ఆశతోనూ ప్రార్ధిస్తారు.” ఖుర్ఆన్, సూరా సజ్దహ్ 32:16


కావున భయం మరియు ఆశ మనసులో సమపాళ్లలో ఉండాలి. అనస్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం, దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఓ మరణించబోయే బాలుని వద్దకు వెళ్లారు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతన్ని అడిగారు, “నువ్వు ఎలా ఉన్నావు?” ఆ బాలుడు జవాబిచ్చాడు: “ఓ దైవప్రవక్తా!  నేను అల్లాహ్ పై ఆశ మరియు నా పాపాల భయం మధ్యలో ఉన్నాను.” దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ ను తలచిన దాసుని మనసులోనే ఇలాంటి మిశ్రమ భావన ఉత్పన్నమవుతుంది. అల్లాహ్ వారు ఆశపడింది ఇస్తాడు మరియు వారు భయపడ్డ దాని నుండి రక్షిస్తాడు.” అహ్కాముల్ జనాయిజ్ నెం 2 లో అల్బాని గారు ధృవీకరించారు.

అందువల్ల మనం మంచి పని చేసినప్పుడు అది స్వీకరించబడుతుంది అనే ఆశతో పాటు, దానికి స్వీకారయోగ్యం ఉందో లేదో అని భయపడుతూ కూడా ఉండాలి. అలాగే తప్పు చేసినప్పుడు తన పశ్చాత్తాపం స్వీకరించబడుతుంది అనే ఆశతో పాటు, ఎక్కడ దాని గురించి అడగబడుతుందో అని భయపడాలి.

ఈ సమతుల్యం మన దావా (దావా కూడా ఆరాధనే)లో కూడా కనిపించాలి. ఇతరులను సత్యం (ఇస్లాం)వైపు పిలిచినప్పుడు ‘భయపడాల్సిన అవసరం లేదు’ అని కూడా అనకూడదు, అలాగే ‘మీరు నాశనం అయిపోయారు’ అని కూడా అనకూడదు. వారికి హెచ్చరిస్తూ ప్రోత్సహించాలి. ఒక వైపు నరకాగ్ని గురించి భయపెడుతూ, స్వర్గవనాల ఆశ కూడా చూపించాలి. అల్లాహ్ ఖుర్ఆన్ లో సెలవిచ్చాడు: “నిస్సందేహంగా నీ ప్రభువు శిక్షించటంలో వడిగలవాడు. నిస్సందేహంగా ఆయన క్షమించేవాడు, కనికరించేవాడు కూడా.”ఖుర్ఆన్, సూరా అల్ ఆరాఫ్ 7:167

కనుక మనం ‘ఇతను నాశనం అయిపోయాడు’ లేదా‘ ఇది చాలా పెద్ద పాపం’ అని అనకూడదు.ఎవరినైనా శిక్షించాలో లేదా మన్నించాలో అల్లాహ్ చేతుల్లో ఉంది.

ఇబ్న్ అల్ ఖయ్యిం రహిముల్లాహ్ ఇలా అన్నారు: “అల్లాహ్ వద్దకు వెళుతూ ఓ విశ్వాసి మనసు పక్షిలా ఉంటుంది. ప్రేమ దాని తల, ఆశ మరియు భయం దాని రెక్కల లాంటివి. తల,రెక్కలు మంచిగా ఉన్నప్పుడు పక్షి బాగా ఎగురగలుగుతుంది. తల తెగినచో పక్షి మరణిస్తుంది. రెక్కలు లేనిచో అది ఎగురలేకపోతుంది.”


అల్లాహ్ దయ మానవులు తప్పు చేస్తారని, ఎక్కువమంది నరకంలో వెళ్తారని తెలిసి కూడా దయామయుడైన అల్లాహ్ మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? అని ఎందరో, ప్రత్...



అల్లాహ్ దయ

మానవులు తప్పు చేస్తారని, ఎక్కువమంది నరకంలో వెళ్తారని తెలిసి కూడా దయామయుడైన అల్లాహ్ మానవుణ్ణి ఎందుకు సృష్టించాడు? అని ఎందరో, ప్రత్యేకంగా ముస్లిమేతరులు ప్రశ్నిస్తారు. మానవులు నరకంలో కాలటం అల్లాహ్ ఎలా చూడగలడు? ప్రస్తుతం మనం భూమి మీద ఉన్నాము కాబట్టి, ఇలాంటి విషయాలు చర్చించడం అవివేకం. ఎందుకంటే ఇప్పుడు ఏది మారదు. మానవునికి ఉత్సుకత ఎక్కువ, కావున ముందుగా అల్లాహ్ ఈ సృష్టిని సృష్టించిన కారణం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం.

తర్కం, వాదన ప్రకారం

అసలు వాదం ఏమనగా: మానవుల్లో ఎక్కువమంది నరకానికి వెళుతారు కాబట్టి, అల్లాహ్ మానవుడిని ఎందుకు సృష్టించాడు.

ఇదే తర్కం ప్రకారం అల్లాహ్ జంతువుల్ని ఎందుకు సృష్టించాడు. ఒకటి మరోదానిని చంపి తింటుంది కదా.

ఉదాహరణకు: జింకను పులి చంపుతుంది, ఎలుకను పిల్లి చంపుతుంది, మొక్కలను ఆవులు, మేకలు తింటాయి.

మీ తర్కం ప్రకారం జంతువులు, చెట్లు ఉండకూడదు. అసలు అల్లాహ్ ఏ జీవసృష్టిని సృష్టించాల్సింది కాదు. ఎందుకంటే ఒకటి ఇంకోదానిపై ఆధారపడి చంపుకు తింటున్నాయి.

జీవరాశులే లేనప్పుడు ఇంత పెద్ద సృష్టి ఎందుకు సృష్టించబడింది?

అల్లాహ్ కు రక్త దాహం లేదు

అల్లాహ్ కు రక్త దాహం లేదు మరియు మానవులను నరకంలో శిక్షించడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు అని అర్ధమయ్యాక అసలు నరకంలో ఎవరు వెళ్తారు అనేది తెలుసుకోవడం అవసరం.

“దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు.” ఖుర్ఆన్, సూరా లైల్ 92:15

హజ్రత్ అబుహురైరా రజియల్లాహ్ అన్హు కధనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: నన్ను తిరస్కరించినవారు తప్ప, నా సమాజంలో ప్రతి ఒక్కరూ స్వర్గంలోకి వెళతారు. ఆయన (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు. ఎవరైతే నన్ను అనుసరిస్తారో వారు స్వర్గం లోకి ప్రవేశిస్తారు. సహీహ్ బుఖారీ vol 9:384

పైన తెలిపిన ఖుర్ ఆన్ మరియు హదీస్ వాక్యాల ప్రకారంగా అవిశ్వాసులు వారి పాప కర్మల ప్రకారమే నరకంలోకి పడవేయబడతారు.


అల్లాహ్ తరపున హెచ్చరిక

“ఆ రోజు వారి ముఖాలు అగ్నిలో అటూ ఇటూ పొర్లింపబడతాయి. అప్పుడువారు, "అయ్యో! మేము అల్లాహ్‌కు, ప్రవక్తకు విధేయత చూపిఉంటే ఎంతబావుండేది?" అని అంటారు. ఇంకా ఇలా అంటారు: "ప్రభూ! మేము మా సర్దారులు, పెద్దలు చెప్పినట్లు విన్నాము. వారు మమ్మల్ని పెడత్రోవ పట్టించారు. "ప్రభూ! నీవు వారికి రెండింతల శిక్షను విధించు. వారిపై పెద్ద శాపాన్ని అవతరింపజెయ్యి. "ఖుర్ఆన్, సూరా అహ్జాబ్ 33:66-68

తమ ప్రభువును తిరస్కరించిన వారికి నరకయాతన తథ్యం. అదెంత చెడ్డ గమ్య స్థలం. వారు అందులో పడవేయబడినప్పుడు దాని వికృత గర్జనను వారు వింటారు. అది ఉద్రేకంతో ఉడికి పోతూ ఉంటుంది. ఆగ్రహంతో బ్రద్దలైపోయినట్లే ఉంటుంది. అందులో ఏదైనా ఒక సమూహం పడవేయబడినప్పుడల్లా, దాని రక్షకులు వారినుద్దేశించి, “ఏమిటి, మీ వద్దకు హెచ్చరించే వారెవరూ రాలేదా?” అని అడుగుతారు. “ఎందుకు రాలేదు? హెచ్చరించే వాడొకడు వచ్చాడు. కాని మేమే అతణ్ణి ధిక్కరించాము. ‘అల్లాహ్ దేనినీ అవతరింపజేయలేదు. మీరే పెద్ద అపమార్గానికి లోనై ఉన్నార’ని (సూటిగా) చెప్పేశాము” అని వారు ఒప్పుకుంటారు. వారు ఇంకా ఇలా అంటారు : “మేము విని ఉంటే లేదా బుద్ధిపెట్టి ఆలోచించి ఉంటే నరకాగ్నికి ఆహుతి అయిన వాళ్లతో చేరేవాళ్ళం కాము.” ఆ విధంగా వారు తమ తప్పును (పాపాన్ని) ఒప్పుకుంటారు. కనుక ఈ నరకవాసులు (దైవకారుణ్యానికి) దూరమవుదురుగాక! ఖుర్ఆన్, సూరా ముల్క్ 67:6-11

పైన తెలిపిన వాక్యాల ప్రకారం మనకు ఖుర్ ఆన్ లో చాలా వాక్యాలు అవిశ్వాసులు వారి తిరస్కార వైఖరి కారణంగా వారు నరకంలోకి పడవేయబడతారు అని స్పష్టంగా తెలియజేయబడింది.

న్యాయపరమైన విచారణ


“ఆ రోజు ప్రతివ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ – తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్ తన గురించి మిమ్మల్నిహెచ్చరిస్తున్నాడు. అల్లాహ్ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు.” ఖుర్ఆన్, సూరా ఆలి ఇమ్రాన్ 3:30

 పైన తెలిపిన వాక్యం ప్రకారం ప్రతి వ్యక్తి పాపానికి దూరంగా ఉండమని తెలియ జేస్తుంది. ఎవరైతే పాపాలు చేస్తారో ఆ వ్యక్తి తనకు తాను నష్టానికి గురి అవుతాడు.

అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్నిరెట్టింపుచేస్తాడు. అంతేకాదు, తన వద్ద నున్నదానిలోనుంచి గొప్పప్రతిఫలాన్నివొసగుతాడు. ఖుర్ఆన్, సూరా నిసా 4:40

కర్మలపత్రాలు (వారి) ముందు ఉంచబడతాయి. నేరస్తులు ఆ పత్రాల్లో రాయబడి ఉన్నదాన్ని చూసి భీతిల్లుతూ,"అయ్యో! మా దౌర్భాగ్యం! ఇదేమి పత్రం? ఇది ఏ చిన్న విషయాన్నీ,ఏ పెద్ద విషయాన్నీవదలకుండా నమోదు చేసిందే?!" అని వాపోవటం నువ్వు చూస్తావు. తాము చేసినదంతా వారు ప్రత్యక్షంగా చూసుకుంటారు. నీ ప్రభువు ఎవరికీ అన్యాయం చేయడు. ఖుర్ఆన్, సూరా కహఫ్ 18:49

సన్మార్గాన్ని పొందే వాడు తన మేలు కోసమే సన్మార్గాన్నిపొందుతాడు. పెడదారి పట్టేవాడు తన కీడుకు తానే కారకుడౌతాడు. బరువు మోసే వాడెవడూ ఇంకొకరి బరువును తనపై వేసుకోడు.ఒక ప్రవక్తను పంపనంత వరకూ ఎవరినయినా శిక్షించటం మా సంప్రదాయం కాదు. ఖుర్ఆన్, సూరా ఇస్రా 17:15

 పైన తెలిపిన ఖుర్ ఆన్ వాక్యం ప్రకారం మనకు తెలిసినదేమిటంటే అల్లాహ్ ఎవరికీ అన్యాయం చేయడు. ప్రతి వ్యక్తికి తన కర్మల ప్రకారమే ఫ్రతిఫలాన్ని అందిస్తాడు.


అల్లాహ్ దయ

అల్లాహ్ సుబుహానహు వత’ఆల చాలా దయామయుడు. అల్లాహ్ కావాలని ఏ వ్యక్తిని కూడా నరకం లోనికి పడవేయడు. ఎందుకంటే అల్లాహ్ కరుణ ఈ సృష్టి అంతటిని ఆవరించి వుంది. అల్లాహ్ మన పుణ్యాలను చాలా రెట్లు పెంచుతాడు. మరియు చాలా సార్లు క్షమిస్తాడు.

అల్లాహ్ ఎవరికీ రవ్వంత అన్యాయం చేయడనేది నిశ్చయం. సత్కార్యం ఉంటే ఆయన దాన్నిరెట్టింపు చేస్తాడు. అంతేకాదు, తన వద్దనున్న దానిలో నుంచి గొప్ప ప్రతిఫలాన్ని వొసగుతాడు.ఖుర్ఆన్, సూరా నిసా 4:40

సత్కార్యం చేసిన వాని సత్కార్యానికి పదిరెట్లు లభిస్తాయి.దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్షమాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు.ఖుర్ఆన్, సూరా అనామ్ 6:160

ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు కధనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: మానవుడు ఏదైనా ఒక చిన్న పుణ్యం చేయాలని నిశ్చయించుకొని ఆ పుణ్యాన్ని చేయకపోతే అల్లాహ్ ఆ వ్యక్తి ఖాతాలో ఒక పుణ్యాన్ని వ్రాస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పుణ్యాన్ని చేస్తే అల్లాహ్ అతని ఖాతాలో 10 నుండి 700రెట్లు వరకు మరియు అంత కంటే ఎక్కువ గల పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఒక పాపం చేయాలని నిశ్చయించుకొని ఆ పాపం చేయకపోతే అల్లాహ్ ఆ వ్యక్తి ఖాతాలో ఒక పుణ్యాన్ని వ్రాస్తాడు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పాపానికి ఒడిగడితే అల్లాహ్ ఆ వ్యక్తికి ఆ పాపానికి సరిపోయేటట్లు ఒక పాపాన్ని అతని ఖాతాలో వ్రాస్తాడు. సహీహ్ ముస్లిం 237

 పైన తెలిపిన ఖుర్ ఆన్ వాక్యం మరియు హదీస్ ప్రకారం మానవులు చేసే ప్రతి చిన్న పుణ్యం పై అల్లాహ్ కరుణ ఉంటుంది.

 ఒకవేళ  ఓ వ్యక్తి ఒక పుణ్యం చేస్తే అల్లాహ్ ఆ వ్యక్తికి ఆ పుణ్యానికి బదులు 10నుండి 700రెట్లు పుణ్యాలను ప్రసాదిస్తాడు.

 ఒకవేళ ఓ వ్యక్తి ఒక పుణ్యం చేయాలనుకొని కూడా ఆ పుణ్యం చేయకుంటే, ఆ వ్యక్తికి ఒక పుణ్యం వ్రాయబడుతుంది.

ఒకవేళ ఓ వ్యక్తి పాపం చేయాలని నిశ్చయించుకొని ఆ పాపం చేయకపోతే, ఆ వ్యక్తికి ఒక పుణ్యం వ్రాయబడుతుంది.

ఒక వ్యక్తి కేవలం ఒకే పాపం చేస్తే అతనికి ఆ చేసిన పాపాన్ని మాత్రమే కర్మల పత్రం లో నమోదు చేస్తారు.

 “వీళ్లు అల్లాహ్ స్థాయికి అనుగుణంగా ఆయన గొప్పదనాన్ని గుర్తించనేలేదు. అల్లాహ్ మహాశక్తిశాలి,ప్రాబల్యం కలవాడు.” ఖుర్ఆన్, సూరా హజ్ 22:74

అల్లాహ్ క్షమాశీలి

అయినప్పటికీ మానవుడు పాపాలు చేస్తున్నాడు.


(ఓ ప్రవక్తా! నా తరఫున వారికి ఇలా) చెప్పు: "తమ ఆత్మలపై అన్యాయానికి ఒడి గట్టిన ఓ నా దాసులారా! మీరు అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్‌ పాపాలన్నింటినీ క్షమిస్తాడు. నిజంగా ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కరుణించేవాడు.” ఖుర్ఆన్, సూరా జుమర్ 39:53


ఎవరయినా దుష్కార్యానికి పాల్పడితే లేదా తనకు తాను అన్యాయం చేసుకుని, ఆ తరువాత క్షమాపణకై అల్లాహ్ను అర్థిస్తే,అతడు అల్లాహ్ను క్షమాశీలిగా, కృపాశీలిగా పొందుతాడు. ఖుర్ఆన్, సూరా నిసా 4:110

“నేనిలా అన్నాను: క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.”ఖుర్ఆన్, సూరా నూహ్ 71:10

 సృష్టికర్త అల్లాహ్ ఉన్నాడనే విషయం తెలిసిన ప్రతి వ్యక్తికి వారి పాప క్షమాపణ మన్నింపు కై అల్లాహ్ కరుణపై చాలా నమ్మకం ఉంటుంది.

ఎవరైనా వ్యక్తి తనను తానూ నరాకగ్ని నుంచి రక్షించుకోకపోతే, ఆ వ్యక్తికి తెలుసు నరకానికి పోవడానికి కారణం ఏమిటో, ఈ తప్పు ఆ వ్యక్తిదా లేదా అల్లాహ్ కు సంబందించినదా ?

ముగింపు

పైన తెలిసిన విషయాల ఆధారంగా మనకు తెలిసినదేమిటంటే :

అల్లాహ్ దాసులకు చెడు పరిణామాల గురించి క్లుప్తంగా హెచ్చరించాడు.

ఎవరైతే పుణ్యాలు చేయడం లో నిమగ్నం అవుతారో అల్లాహ్ వారికి రెట్టింపు ఫలితాలను అందిస్తాడు మరియు అల్లాహ్ అపారంగా క్షమించేవాడు.

విచారణ చాలా న్యాయబద్ధంగా జరుగుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.

ప్రజలు నరకంలోకి వెళితే వారి సొంత ఎంపిక ప్రకారమే వెళతారు.

ఏ ప్రజలైతే నరకంలోకి ప్రవేశిస్తారో వారు పాపాలను ఒప్పుకున్నట్లే.

“దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు.” ఖుర్ఆన్, సూరా లైల్ 92:15

కాబట్టి మనమంతా నరకాగ్ని గురించి ఆలోచించేకంటే, స్వర్గం గురించి ఎందుకు ఆలోచించకూడదు. మన ధ్యేయం స్వర్గం పొందాలనే తపన ఎందుకు కాకూడదు, ప్రతి వ్యక్తి తనకు కావాలసిన వాటి కోసం కష్టపడి తన గమ్యానికి చేరుకుంటాడు. కాబట్టి మనం కూడా త్వరగా అల్లాహ్ ముందు మనస్పూర్తిగా పశ్చాత్తాపం కోరుకుంటే అల్లాహ్ కూడా మన పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు.


  అల్లాహ్ పేర్లు మరియు గుణాలు అల్లాహ్ 99 పేర్లు మరియు గుణాలు, అల్లాహ్ పై విశ్వాసం (తౌహీద్)లోని ముఖ్యమైన మూలస్థంభాల్లో ఒకటి. ఎందుకంటే ఇస్లామీ...

 


అల్లాహ్ పేర్లు మరియు గుణాలు


అల్లాహ్ 99 పేర్లు మరియు గుణాలు, అల్లాహ్ పై విశ్వాసం (తౌహీద్)లోని ముఖ్యమైన మూలస్థంభాల్లో ఒకటి. ఎందుకంటే ఇస్లామీయ చట్ట ప్రకారం ఇవి ప్రతి ముస్లిం తెలుసుకోవలసిన విషయాలు. ఇవి అఖీదా (విశ్వాసం) మరియు ఇబాదహ్ (ఆరాధన) లోని భాగాలు.

 

ఖుర్ఆన్ 

“అల్లాహ్ కు మంచి మంచి పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదలి పెట్టండి. వారు చేస్తూ ఉండినదానికి వారు తప్పకుండా శిక్షించబడతారు.” ఖుర్ఆన్ సూరా అల్ ఆరాఫ్ 7:180


ఈ ఆయతు వలన మనకు తెలిసిందేమిటంటే :

  1. అల్లాహ్ కు వున్న మంచి పేర్ల ద్వారా అల్లాహ్ ను ఆరాధించడం తప్పనిసరి.
  2. తప్పుడు విశ్వాసాలు, ఆచారాలు కలిగిన వారిని త్యజించడం తప్పనిసరి.

 వారు:తహ్రీఫ్ (అల్లాహ్ పేరు లేదా గుణాన్ని మార్చడం)


తంథీల్/ తష్బీహ్ (అల్లాహ్ గుణాలను సృష్టితాల గుణాలతో కలపడం)


తాతీల్ (అల్లాహ్ గుణాలను నిరాకరించడం)


తావీల్ (అల్లాహ్ గుణాలను రూపాంతరం ఇవ్వడం)


హదీస్

అనేక ధృవీకరించిన హదీసులలో అల్లాహ్ మంచి పేర్ల, సంఖ్యల ప్రాముఖ్యత తెలుస్తుంది. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా సెలవిచ్చారు: “అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, ఒక్కటి తక్కువ వంద. వాటి భావాలపై విశ్వసించి దాని ప్రకారం నడిచేవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు.” సహీహ్ బుఖారీ 6410 (భాగం  8:419)

 

మరో ఉల్లేఖనంలో: “అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి, ఒక్కటి తక్కువ వంద. వీటిని కంఠస్థం చేసుకున్నవ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు.” సహీహ్ బుఖారీ 7392(భాగం 9:489)

 

అల్లాహ్ పేర్ల సంఖ్య(99) తెలిసింది, వాటి ప్రాముఖ్యత తెలిసింది, వాటిని కంఠస్థం చేసుకున్నచో స్వర్గంలో ప్రవేశించవచ్చు.

అల్లాహ్ 99 పేర్లు

క్రమ సంఖ్య

అరబీ పేరు

తెలుగు పేరు

అర్థం

ఆధారాలు

1

الرَّحْمَنُ

అర్ రహ్మాన్

అనంత కరుణామయుడు

అపారకరుణామయుడు, పరమకృపాశీలుడు.[అల్ ఫాతిహా:2]

2

الرَّحِيمُ

అర్ రహీమ్

అపార కృపాశీలుడు

(ఇది) అపారకరుణామయుడు,   పరమకృపాశీలుడైన వాని తరఫు నుంచి అవతరింపజేయబడినది. [ఫుస్సిలత్:2]

3

المَلِكُ

అల్మలిక్

రారాజు

ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు.ఆయనే రాజాధిరాజు, (పరమపవిత్రుడు),  లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు,  బలపరాక్రమాలుగలవాడు, పెద్దరికంగలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. [అల్ హషర్:23]
 

4

القُدُّوسُ

అల్ ఖుద్దూస్

గొప్పపవిత్రుడు

భూమ్యాకాశాలలో ఉన్న వస్తువులన్నీ సార్వభౌముడు, పరిశుద్ధుడు, శక్తిశాలి, వివేచనాశీలి అయిన అల్లాహ్‌ పవిత్రతను కొనియాడుతున్నాయి. [అల్ జుమా:1]
 

5

السَّلامُ

అస్ సలాం

శాంతిగలవాడు

ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమపవిత్రుడు),  లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు,  బలపరాక్రమాలుగలవాడు, పెద్దరికంగలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. [అల్ హషర్:23]
 

6

المُؤْمِنُ

అల్ మోమిన్

శాంతి ప్రదాత

ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు.ఆయనే రాజాధిరాజు, (పరమపవిత్రుడు),  లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు,  బలపరాక్రమాలుగలవాడు, పెద్దరికంగలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. [అల్ హషర్:23]
 

7

 
 
المُهَيْمِنُ

అల్ ముహైమిన్

పర్యవేక్షకుడు

ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు.ఆయనే రాజాధిరాజు, (పరమపవిత్రుడు),  లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు,  బలపరాక్రమాలుగలవాడు, పెద్దరికంగలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. [అల్ హషర్:23]
 

8

العَزِيزُ

అల్ అజీజ్

శక్తి సంపన్నుడు

ఆయనే తాను కోరిన విధంగా మాతృగర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు.ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తిసంపన్నుడు, వివేకసంపన్నుడు కూడాను. [అల్ ఇమ్రాన్ : 6]
 

9

الجَبَّارُ

అల్ జబ్బార్

బలపరాక్రమాలు గలవాడు

ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు.ఆయనే రాజాధిరాజు, (పరమపవిత్రుడు),  లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు,  బలపరాక్రమాలుగలవాడు, పెద్దరికంగలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. [అల్ హషర్:23]
 

10

المُتَكَبِّرُ

అల్ ముతకబ్బిర్

పెద్దరికం గలవాడు

ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయనే రాజాధిరాజు, (పరమపవిత్రుడు),  లోపాలన్నింటికీ అతీతుడు, శాంతి (భద్రతల) ప్రదాత, పర్యవేక్షకుడు, సర్వశక్తుడు,  బలపరాక్రమాలు గలవాడు, పెద్దరికం గలవాడు. ప్రజలు ఆయనకు కల్పించే భాగస్వామ్యాల నుండి అల్లాహ్‌ పవిత్రంగా ఉన్నాడు. [అల్ హషర్:23]

11

الخَالِ

అల్ ఖాలిఖ్

సృష్టికర్త

ఆయనే అల్లాహ్‌- సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పన చేసేవాడు. అత్యుత్తమమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో వున్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది.  ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. [అల్ హషర్ : 24]
 

12

البَارِئُ

అల్ బారి

ఉనికిని ప్రసాదించేవాడు

ఆయనే అల్లాహ్‌- సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పనచేసేవాడు.   అత్యుత్తమమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో వున్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది.  ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. [అల్ హషర్ : 24]

13

المُصَوِّرُ

అల్ ముసవ్విర్

రూపకల్పన చేసేవాడు

ఆయనే అల్లాహ్‌- సృష్టికర్త, ఉనికిని ప్రసాదించేవాడు, రూపకల్పనచేసేవాడు.   అత్యుత్తమమైన పేర్లు ఆయనకు ఉన్నాయి. భూమ్యాకాశాలలో వున్న ప్రతి వస్తువూ ఆయన పవిత్రతను కొనియాడుతోంది.  ఆయనే సర్వాధికుడు, వివేకవంతుడు. [అల్ హషర్ : 24]

14

الأَوَّلُ

అల్ అవ్వలు

మొదటివాడు

ఆయనే మొదటివాడు, చివరివాడు.  ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. [అల్ హదీద్:3]

15

الآخِر

అల్ ఆఖిర్

చివరివాడు

ఆయనే మొదటివాడు, చివరివాడు.  ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. [అల్ హదీద్:3]

16

الظَّاهِرُ

అజ్ జాహిరు

బాహ్యం

ఆయనే మొదటివాడు, చివరివాడు.  ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. [అల్ హదీద్:3]

17

البَاطِنُ

అల్బాతిను

నిగూడం

ఆయనే మొదటివాడు, చివరివాడు.  ఆయనే బాహ్యం. ఆయనే నిగూఢం. ఆయన ప్రతిదీ తెలిసినవాడు. [అల్ హదీద్:3]

18

السَّمِيعُ

అస్ సమీ

వినేవాడు

ఆయన్ని పోలిన వస్తువేదీ లేదు. ఆయన వినేవాడు, చూచేవాడు. [అష్ షూరా : 11]
 

19

البَصِير

అల్ బసీర్

చూసేవాడు

తన దాసుణ్ణి రాత్రికి రాత్రే మస్జిదె హరామ్‌ నుండి మస్జిదె అక్సా వరకు తీసుకుపోయిన అల్లాహ్‌ పరిశుద్ధుడు.  దాని పరిసరాలను మేము శుభవంతం చేశాము.   ఎందుకంటే;  మేమతనికి మా  (శక్తిసామర్థ్యాలకు సంబంధించిన)   కొన్ని సూచనలను చూపదలిచాము.   నిశ్చయంగా అల్లాహ్‌ మాత్రమే బాగా వినేవాడు, చూసేవాడు. [అల్ ఇస్రా :1]

20

الْمَوْلَى

అల్ మౌలా

సంరక్షకుడు

ఒకవేళ వారు  (దారికి రాకుండా) తిరిగిపోతే అల్లాహ్‌యే మీ రక్షకుడని నమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడూను. [అల్ అన్ఫాల్ :40]
 

21

النَّصِيرُ

అన్ నసీర్

ఉత్తమ సహాయకుడు

ఒకవేళ వారు  (దారికి రాకుండా) తిరిగిపోతే అల్లాహ్‌యే మీ రక్షకుడని నమ్మండి. ఆయన ఉత్తమ సంరక్షకుడు, ఉత్తమ సహాయకుడూను. [అల్ అన్ఫాల్ :40]

22

العَفُوُّ

అల్ అఫువ్వు

అమితంగా మన్నించేవాడు

మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా, గుట్టుగా చేసినా లేక ఏదైనా చెడుగును మన్నించి వదలిపెట్టినా అల్లాహ్‌ అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడూ (అని తెలుసుకోండి.) [అన్ నిసా : 149]
 

23

القَدِيرُ

అల్ ఖదీర్

అధికారం కలవాడు

ఆయన అన్నీ తెలిసినవాడు,  అన్నింటిపై అధికారం కలవాడు. [ఆర్ రూమ్ :54]
 

24

اللَّطِيفُ

అల్ లతీఫ్

సూక్ష్మగ్రాహి

ఏమిటి,  పుట్టించిన ఆయనే ఎరుగకుండా ఉంటాడా? ఆయనైతే సూక్ష్మగ్రాహి, సర్వాన్నీకనిపెట్టుకుని ఉన్నవాడు. [అల్ ముల్క్ : 14]

25

الخَبِيرُ

అల్ ఖబీర్

తెలిసినవాడు

తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం,అధికారం గలవాడు ఆయనే.  ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు. [అల్ అనామ్ : 18]

26

الوِتْرُ

అల్ విత్ర్

అల్లాహ్ ఒక్కడు

ఈ పేరు ఖుర్ఆన్ లో లేదు, కాని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీని గురించి చెప్పారు: సహీహ్ బుఖారీలో అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు. “అల్లాహ్ కు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నాయి. ఒక్కటి తక్కువ వంద. ఎవరైతే ఈ పేర్లను కంఠస్థం చేస్తారో(వాటి భావాలపై విశ్వసించి, దాని ప్రకారం అమలుచేస్తాడో) స్వర్గంలో ప్రవేశిస్తాడు; అల్లాహ్ (విత్ర్) ఒక్కడే మరియు విత్ర్ నే (బేసి సంఖ్యలనే) ప్రేమిస్తాడు.” [అల్ బుఖారీ :6047]
 

27

الجَمِيلُ

అల్ జమీల్

అందమైనవాడు

సహీహ్ ముస్లింలోని హదీసులో ఇబ్న్ మసూద్ ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “ఎవరి మనసులోనైనా ఆవగింజంత అహంకారం ఉన్నా, అతను స్వర్గంలో ప్రవేశించజాలడు.” అప్పుడు, “ప్రతి మనిషి తన బట్టలు, పాదరక్షలు అందంగా ఉండాలని కోరుకుంటాడు కదా” అని అడిగాడు. దానికి దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ అందగాడు, అందాన్ని ప్రేమిస్తాడు. అహంకారం సత్యానికి దూరం తీసుకెళుతుంది మరియు ఇతరులను నిర్లక్ష్యం చేయిస్తుంది.” [ముస్లిం: 91]
 

28

الحَيِيُّ

అల్ హయ్యు

నిరాడంబరుడు

ఈ పేరు ఖుర్ఆన్ లో లేదు, కాని సహీహ్ అబూ దావూద్ లో యాలా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఒకతణ్ణి మర్మాంగాలపై ఏమీ కప్పుకోకుండా అందరూ ఉండే ప్రదేశంలో స్నానం చేయడం చూశారు. అప్పుడు ఓ విశాలమైన కొండపై ఎక్కి  ఇలా అన్నారు: “అల్లాహ్ (అల్ హయ్యు) పవిత్రుడు, పవిత్ర లక్షణాలు గలవాడు. కావున మీరు స్నానం చేసేటప్పుడు మీ శరీరాన్ని (మర్మాంగాలను) కప్పుకోండి.” [సహీహ్ అబూ దావూద్ : 3387]
 

29

السِّتيرُ

అస్ సిత్తీర్

కప్పివుంచేవాడు

ఎందరో ఈ పేరు అస్ సిత్తీర్ ను అస్ సత్తార్ గా పేర్కొన్నారు. ఇది తప్పు. ఎందుకంటే అస్ సత్తార్ ఖుర్ఆన్ మరియు హదీసుల ద్వారా నిరూపించబడలేదు.
 
 
 
ఈ పేరు ఖుర్ఆన్ లో లేదు, కాని సహీహ్ అబూదావూద్ లో యాలా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఒకతణ్ణి మర్మాంగాలపై ఏమీ కప్పుకోకుండా అందరూ ఉండే ప్రదేశంలో స్నానం చేయడం చూశారు. అప్పుడు ఓ విశాలమైన కొండపై ఎక్కి ఇలా అన్నారు: “అల్లాహ్ (అల్ హయ్యు) పవిత్రుడు, పవిత్ర లక్షణాలు గలవాడు. కావున మీరు స్నానం చేసేటప్పుడు మీ శరీరాన్ని (మర్మాంగాలను) కప్పుకోండి.” [సహీహ్ అబూదావూద్ : 3387]
 

30

الكَبِيرُ

అల్ కబీర్

అందరికంటే గొప్పవాడు

ఆయన గోప్యంగా ఉన్న దానినీ,  బహిర్గతమై ఉన్న దానినీ ఎరిగినవాడు, అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు. [ఆర్ రాద్ :9]
 

31

المُتَعَال

అల్ ముతఆల్

సర్వోన్నతుడు

ఆయన గోప్యంగా ఉన్న దానినీ,  బహిర్గతమై ఉన్న దానినీ ఎరిగినవాడు, అందరికంటే గొప్పవాడు, సర్వోన్నతుడు. [ఆర్ రాద్ :9]

32

الوَاحِد ُ

అల్ వాహిద్

ఎకైకుడు

''అల్లాహ్‌యే అన్నింటినీ సృష్టించినవాడు.   ఆయన ఒక్కడే.   ఆయన సర్వాధిక్యుడు'' అని వారికి స్పష్టంగా చెప్పు. [ఆర్ రాద్ : 16]
 

33

القَهَّارُ

అల్ ఖహ్హార్

సర్వాధిక్యుడు

''అల్లాహ్‌యే అన్నింటినీ సృష్టించినవాడు.   ఆయన ఒక్కడే.   ఆయన సర్వాధిక్యుడు'' అని వారికి స్పష్టంగా చెప్పు. [ఆర్ రాద్ : 16]

34

الحَقُّ

అల్ హఖ్

సత్యం

అల్లాహ్‌యే సత్యం గనక,  మృతులను తిరిగి బ్రతికించేవాడు ఆయనే గనక, అన్నింటిపై ఆయనే అధికారం కలవాడు గనక ఇదంతా జరుగుతోంది సుమా! [అల్ హజ్ : 6]

35

المُبِينُ
 

అల్ ముబీన్

సత్యాన్ని స్పష్టపరిచేవాడు

ఆ రోజు అల్లాహ్‌ వారికి న్యాయబద్ధంగా పూర్తి ప్రతిఫలాన్ని  (శిక్షను) ఇస్తాడు.  అప్పుడు అల్లాహ్‌యే సత్యమనీ, (ఆయనే సత్యాన్ని) స్పష్టపరచేవాడనీ వారు తెలుసుకుంటారు. [నూర్:25]
 

36

القَوِيُّ

అల్ ఖవీ

బలవంతుడు

 
నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు, ఆధిక్యతగలవాడు. [హూద్: 66]
 

37

المَتِينُ

అల్ మతీన్

మహాబలుడు

అల్లాహ్‌యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు. [అద్ ధారియాత్ : 58]
 

38

الحَيُّ

అల్ హయ్యు

నిత్యసజీవుడు

ఎన్నటికీ మరణించనివాడూ, నిత్యుడూ అయిన అల్లాహ్‌ను నమ్ముకో. స్తోత్రసమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు.  తన దాసుల పాపాలను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు. [అల్ ఫుర్ఖాన్ : 58]

39

القَيُّومُ

అల్ ఖయ్యూం

గొప్పస్థిరంగావుంచేవాడు

(ఆనాడు) అందరి ముఖాలు సజీవుడు,  నిత్యుడు అయిన అల్లాహ్‌ ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి.  నిశ్చయంగా దుర్మార్గం (బరువు)  మోసేవాడు నాశనమవుతాడు. [తాహా: 111]
 

40

العَلِيُّ

అల్ అలియ్యు

మహోన్నతుడు

ఆకాశాలలో, భూమిలో ఉన్నవన్నీ ఆయనవే. ఆయన మహోన్నతుడు, చాలా గొప్పవాడు. [అష్ షూరా : 4]
 

41

العَظِيمُ

అల్ అజీమ్

మహోన్నతుడు

''వాడు మహోన్నతుడైన అల్లాహ్‌ను విశ్వసించేవాడూ కాదు,[అల్ హాఖ్ఖ : 33]

42

الشَّكُورُ
 

అష్ షుకూర్

సన్మానించేవాడు

వారికి వారి ప్రతిఫలాలు (అల్లాహ్‌) పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికిగాను (వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు). నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు. [ఫాతిర్: 30]
 

43

الحَلِيمُ

అల్ హలీమ్

సహనశీలి

 
 
అల్లాహ్‌ క్షమాశీలి, సహనశీలి కూడా. [అల్ బఖర : 225]
 

44

الوَاسِعُ

అల్ వాసి

విస్తృతి కలవాడు

తూర్పు పడమరలకు అధిపతి అల్లాహ్‌యే.   మీరు మీ ముఖాన్ని ఏవైపుకు త్రిప్పినా,   అటు అల్లాహ్‌ సమ్ముఖం లభిస్తుంది.  నిస్సందేహంగా అల్లాహ్‌ విస్తృతికలవాడు, సర్వమూ తెలిసినవాడు. [అల్ బఖర : 115]
 

45

العَلِيمُ

అల్ అలీమ్

అన్నీ తెలిసినవాడు

వారి బారి నుండి  (రక్షించటానికి) నీకు అల్లాహ్‌ చాలు. ఆయన అంతావినేవాడు, అన్నీతెలిసినవాడు. [అల్ బఖర : 137]
 

46

التَّوابُ
 

అత్ తవ్వాబు

పశ్చాత్తాపాన్నిస్వీకరించేవాడు

అప్పుడు ఆదం (అలైహిస్సలాం) తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని  (పశ్చాత్తాపం చెందారు.)  అల్లాహ్‌ ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడుకూడాను. [అల్ బఖర : 37]
 

47

الحَكِيمُ

అల్ హకీమ్

వివేకవంతుడు

''మా ప్రభూ!  నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞతా వివేచనలను విడమరచి చెప్పే, వారిని పరిశుద్ధ పరచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండే వారిలో ప్రభవింపజెయ్యి.  నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు.''[అల్ బఖర : 129]
 

48

الغَنِيُّ
 

అల్ ఘనియ్యు

ఏ అక్కరా లేనివాడు

ఇంకా నీ ప్రభువు ఏ అక్కరా లేనివాడు, కనికరించేవాడు. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుదముట్టించి, మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే, మీ స్థానంలో తాను కోరినవారిని వసింపజేస్తాడు. [అల్ అనామ్ : 133]
 

49

الكَريمُ

అల్ కరీమ్

ఉదాత్తుడు

ఓ మానవుడా! ఉదాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్నుమోసంలో పడవేసింది? [అల్ ఇన్ఫితార్ :6]
 

50

الأَحَدُ

అల్ అహద్

ఒక్కడు

(ఓ ముహమ్మద్‌-స!) వారికి ఇలా చెప్పు:  ఆయన అల్లాహ్‌   (నిజమైన ఆరాధ్యుడు) ఒక్కడు. [అల్ ఇఖ్లాస్ : 1]

51

الصَُّمَدُ

అస్ సమద్

నిరపేక్షాపరుడు

(ఓ ముహమ్మద్‌-స!) వారికి ఇలా చెప్పు:  ఆయన అల్లాహ్‌   (నిజమైన ఆరాధ్యుడు) ఒక్కడు.
 
అల్లాహ్‌ నిరపేక్షాపరుడు.(ఏ అక్కరా లేని వాడు). [అల్ ఇఖ్లాస్ : 1-2]
 

52

القَرِيبُ

అల్ ఖరీబ్

సమీపంలో ఉన్నాడు

....కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి (పశ్చాత్తాపం చెందండి). నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు.  ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు''  అని చెప్పాడు. [హూద్: 61]
 

53

المُجيبُ
 

అల్ ముజీబ్

ఆలకించేవాడు/ ఆమోదించేవాడు

....కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి (పశ్చాత్తాపం చెందండి). నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు.  ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు''  అని చెప్పాడు. [హూద్: 61]
 

54

الغَفُورُ

అల్ ఘఫూర్

అమితంగా క్షమించేవాడు

(ఓ ప్రవక్తా!) నేను అమితంగా క్షమించేవాడిననీ, అపారంగా కరుణించేవాడిననీ,  నా దాసులకు తెలియజేయి. [అల్ హిజ్ర్ : 49]
 

55

الوَدُودُ

అల్ వదూద్

అమితంగా ప్రేమించేవాడు

ఆయనే అపారంగా క్షమించేవాడు,  అమితంగా ప్రేమించేవాడు.
 
పీఠాధిపతి, ఘనతగలవాడు. [అల్ బురూజ్ : 14-15]
 

56

الوَلِيُّ

అల్ వలీ

కార్యసాధకుడు

ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట (ఆకాశం నుంచి) వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు.  ఆయనే కార్యసాధకుడు,   ప్రశంసనీయుడు. [అష్ షూరా : 28]
 

57

الحَميدُ
 
 

అల్ హమీద్

ప్రశంసనీయుడు

ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట (ఆకాశం నుంచి) వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయనే తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు.  ఆయనే కార్యసాధకుడు,   ప్రశంసనీయుడు. [అష్ షూరా : 28]
 

58

الحَفيظُ

అల్ హఫీజ్

కనిపెట్టుకుని ఉండేవాడు

నీ ప్రభువు ప్రతి విషయాన్నీ కనిపెట్టుకుని ఉన్నాడు. [సబా: 21]
 

59

الْمَجِيد

అల్ మజీద్

మహా ఘనత కలవాడు

దానికి దైవదూతలు, ''నువ్వు దైవశక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా?! (ఇబ్రాహీము) ఇంటివారలారా!  మీపై అల్లాహ్‌ కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక! నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, మహాఘనతకలవాడు''  అని చెప్పారు. [హూద్: 73]
 

60

الفَتَّاحُ
 

అల్ ఫత్తాహ్

తీర్పులు చేసేవాడు

"మన ప్రభువు మనందరినీ సమావేశపరచి ఆ తరువాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పు చేస్తాడు.ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు" అని చెప్పు. [సబా: 26]
 

61

الشَّهيدُ

అష్ షహీద్

సాక్షి

(ఇంకా ఈ విధంగా) చెప్పు: "ఒకవేళ నేను మీ నుండి ఏదన్నా ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఉంటే, దాన్ని మీరే ఉంచుకోండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాహ్‌ది. ఆయన ప్రతి దానికీ సాక్షిగా ఉన్నాడు." [సబా: 47]
 

62

المُقَدِّمُ

అల్ ముఖద్దిమ్

ముందుకు తెచ్చేవాడు

 
ఈ పేరు ఖుర్ఆన్ లో లేదు, కాని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చెప్పారని బుఖారీ, ముస్లిం హదీసులలో ఇబ్న్ అబ్బాస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: “ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీ కొరకే, నీవే భూమ్యాకాశాలను పట్టుకుని ఉన్నావు....ఇలా అన్నప్పుడు: ..... గతించిన, జరగబోయే నా పాపాలను మన్నించు; నేను దాచినవి బయటపెట్టినవి ముందుకు తెచ్చేవాడివి నువ్వే, వెనుకకు నేట్టేవాడివి నువ్వే, నీవు తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు లేదా నిజమైన అల్లాహ్ నువ్వు తప్ప ఎవ్వరూ లేరు.” [బుఖారీ: 1069]
 

63

المُؤِّخرُ

అల్ ముఅఖ్ఖిరు

వెనుకకునెట్టేవాడు

ఈ పేరు ఖుర్ఆన్ లో లేదుకాని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం చెప్పారని బుఖారీముస్లిం హదీసులలో ఇబ్న్ అబ్బాస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీ కొరకే, నీవే భూమ్యాకాశాలను పట్టుకుని ఉన్నావు....ఇలా అన్నప్పుడు: ..... గతించినజరగబోయే నా పాపాలను మన్నించునేను దాచినవి బయటపెట్టినవి ముందుకు తెచ్చేవాడివి నువ్వేవెనుకకు నేట్టేవాడివి నువ్వేనీవు తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు లేదా నిజమైన అల్లాహ్ నువ్వు తప్ప ఎవ్వరూ లేరు.” [బుఖారీ: 1069]

64

المَلِي

అల్ మలికు

రాజాధిరాజు

సర్వశక్తుడు అయిన రాజాధిరాజు  (అల్లాహ్‌)  దగ్గర సత్యంతో కూడిన, గౌరవప్రదమైన సదస్సులో ఉంటారు. [అల్ ఖమర్ : 55]
 

65

المَقْتَدِرُ

అల్ ముఖ్ తదిర్

అన్నింటిపై అధికారం కలవాడు

అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలిగి ఉన్నాడు. [అల్ కహఫ్ : 45]
 

66

 
المُسَعِّر

అల్ ముసయ్యిర్

పెంచేవాడు మరియు తగ్గించేవాడు (తన ఇష్టానుసారం)

ఈ పేరు ఖుర్ఆన్ లో లేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీని గురించి చెప్పారు: ఇది సున్నత్ ప్రకారం నిరూపించబడింది. ఈ పేరు అత్ తిర్మిజి, అబూ దావూద్, ఇబ్న్ మాజా, అహ్మద్ లలో ఉంది. వీటన్నింటిని షేక్ అల్బాని ధృవీకరించారు. అనస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం: “ప్రజలు అన్నారు: ‘ఓ దైవప్రవక్తా! ధరలు పెరిగిపోయాయి, కావున మీరు ధరలను నిర్ణయించండి.’ దానికి దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: ‘పెంచడం, దించడం అల్లాహ్ చేతుల్లో ఉంది. (అతని ఇష్టప్రకారం, ఉదాహరణకు: ధరలు, సామగ్రులు, ఆయుషు), అతనే ఆపుతాడు, అతనే ఇస్తాడు, అతనే పోషిస్తాడు, నేను అల్లాహ్ ను కలిసినప్పుడు , మీకు మీ రక్తంలో లేదా ధనంలో అన్యాయం జరిగిందని నాపై ఆరోపణ చేసే అవకాశమే ఉండదని భావిస్తున్నాను.” [అబూ దావూద్ : 3451, అత్ తిర్మిజి : 1314, ఇబ్న్ మాజా : 2200]
 

67

 
 
الْقَابِضُ

అల్ ఖాబిజ్

ఆపేవాడు

ఈ పేరు ఖుర్ఆన్ లో లేదు. దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీని గురించి చెప్పారు: ఇది సున్నత్ ప్రకారం నిరూపించబడింది. ఈ పేరు అత్ తిర్మిజి, అబూ దావూద్, ఇబ్న్ మాజా, అహ్మద్ లలో ఉంది. వీటన్నింటిని షేక్ అల్బాని ధృవీకరించారు. అనస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం: “ప్రజలు అన్నారు: ‘ఓ దైవప్రవక్తా! ధరలు పెరిగిపోయాయి, కావున మీరు ధరలను నిర్ణయించండి.’ దానికి దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: ‘పెంచడం, దించడం అల్లాహ్ చేతుల్లో ఉంది. (అతని ఇష్టప్రకారం, ఉదాహరణకు: ధరలు, సామగ్రులు, ఆయుషు), అతనే ఆపుతాడు, అతనే ఇస్తాడు, అతనే పోషిస్తాడు, నేను అల్లాహ్ ను కలిసినప్పుడు , మీకు మీ రక్తంలో లేదా ధనంలో అన్యాయం జరిగిందని నాపై ఆరోపణ చేసే అవకాశమే ఉండదని భావిస్తున్నాను.” [అబూ దావూద్ : 3451, అత్ తిర్మిజి : 1314, ఇబ్న్ మాజా : 2200]

68

 
الْبَاسِطُ

అల్ బాసిత్

ఎక్కువగా ఇచ్చేవాడు

ఈ పేరు కూడా మునుపటి అల్లాహ్ పేర్లతో : అల్ ముసయ్యిర్ మరియు అల్ ఖాబిజ్ లతో పాటు పైన పేర్కొన్న సహీహ్ (ధృవీకరించబడిన) హదీసులలో ఉంది.
 

69

 
الرَّازِق

ఆర్ రాజిఖ్

శ్రేష్ఠమైన ఆహార ప్రదాతవు

 
అప్పుడు మర్యమ్‌ కుమారుడగు ఈసా ఇలా వేడుకున్నాడు : ''ఓ అల్లాహ్‌! మా ప్రభూ!   ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్లాన్ని దించు. అది మా కొరకు,  అనగా మాలోని తొలివారు,  తుదివారందరికీ సంతోషకరమైన విషయం (పండుగ) కావాలి. ఇంకా నీ తరఫున అది ఒక సూచన కాగలగాలి. నీవు మాకు ఆహారం ప్రసాదించు. నీవు అందరికన్నా శ్రేష్ఠమైన ఆహారప్రదాతవు.''[ అల్ మాయిదా : 114]
 

70

القَاهِرُ

అల్ ఖాహిర్

తిరుగులేని ఆధిపత్యం గలవాడు

తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం, అధికారం గలవాడు ఆయనే.  ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీతెలిసినవాడు. [అల్ అనామ్ : 18]

71

 
 
الديَّانُ

అద్ దయ్యాన్

ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడు
 

 
ఈ పేరు ఖుర్ఆన్ లో లేదు. కాని దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం సెలవిచ్చారు: అల్ బుఖారీలోని హదీసులో జబీర్ ఉటంకించారు, అబ్దుల్లా ఇబ్న్ ఉనైస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: నేను దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అనగా విన్నాను: “అల్లాహ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తాడు. దగ్గర ఉన్న వారు కూడా వింటారు, దూరం ఉన్న వారు కూడా వింటారు; ‘నేను అల్ మాలిక్ (రాజాధిరాజు), నేను అద్ దయ్యాన్ (ప్రజల మధ్య న్యాయం చేసేవాడు, వారి కర్మల ప్రకారం).” [బుఖారీ: 6/2719]
 

72

 
الشَّاكِرُ

అష్ షాకిర్

ఆదరించేవాడు

నిస్సందేహంగా సఫా మర్వాలు అల్లాహ్‌ చిహ్నాల లోనివి. కనుక కాబా గృహాన్ని (సందర్శించి) హజ్‌ ఉమ్రహ్‌లు చేసేవారు వాటి మధ్య ప్రదక్షిణ చేస్తే అందులో ఏమాత్రం తప్పులేదు. స్వచ్ఛందంగా ఎవరైనా ఏదైనా సత్కార్యం చేస్తే అల్లాహ్‌ ఆదరించేవాడు,  తెలుసుకునేవాడు. [అల్ బఖర : 158]
 

73

الْمَنَّانُ

అల్ మన్నాన్

ఉపకారము చేసేవాడు

ఈ పేరు ఖుర్ఆన్ లో రాలేదు, కాని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం దీని గురించి చెప్పారు: ఈ హదీసు అబూ దావూద్ లోనిది. దీన్ని షేక్ అల్బాని ధృవీకరించారు. అనస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: మేము దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లంతో పాటు కూర్చుని ఉన్నాము. ఓ వ్యక్తి ప్రార్ధిస్తూ ఇలా దుఆ చేశాడు: “ఓ అల్లాహ్! ప్రశంసలన్నీ నీకే కావున నేను నీకు అర్ధిస్తున్నాను; నీవు తప్ప ఆరాధ్యానికి అర్హుడు ఎవ్వడూ లేడు, [నీవు ఒక్కడివే, నీకు భాగస్వాములు లేరు]; మాపై ఉపకారం చేసేవాడవా; భూమ్యాకాశాలను సృష్టించిన వాడవా; చాలా ఘనత, గౌరవం కలవాడవా; ఓ సజీవుడా, ఓ ఎప్పటికీ ఉండేవాడవా; నేను నీకు అర్ధిస్తున్నాను – నాకు స్వర్గ వనాలు ప్రసాదించు, నరకాగ్ని నుంచి కాపాడు.]”
అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తన అనుచరులతో ఇలా అన్నారు, ‘అతడు దేనితో ప్రార్ధించాడో తెలుసా?’ “అల్లాహ్ కు , అతని ప్రవక్తకు బాగా తెలుసు” అని అనుచరులు జవాబిచ్చారు. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు, ‘ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉందో (అల్లాహ్) అతని ప్రమాణంగా, ఈ వ్యక్తి అల్లాహ్ శక్తివంతమైన పేరుతొ ప్రార్ధించాడు. ఈ పేరుతొ ప్రార్ధిస్తే అల్లాహ్ జవాబిస్తాడు, అడిగితే ఇస్తాడు.” [సహీహ్ అబూ దావూద్ : 1325]
 

74

 
 
القَادِرُ

అల్ ఖాదిర్

ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవాడు

 
మేము తగు రీతిలో లెక్కవేశాము .ఆహా!  మేము ఎంత ఖచ్చితంగా లెక్కించే శక్తిగలవారమో! [అల్ ముర్సలాత్ : 23]
 

75

 
الخَلاَّقُ

అల్ ఖల్లాఖ్

సృష్టికర్త

భూమ్యాకాశాలనే పుట్టించినవాడు వీరిలాంటి వారిని (తిరిగి) పుట్టించలేడా?ఎందుకు పుట్టించలేడు? ఆయనే అన్నీ తెలిసిన సృష్టికర్త. [యాసీన్: 81]
 

76

 
 
المَالِكُ

అల్ మాలికు

విశ్వరాజ్యాధిపతి

(ఓ ముహమ్మద్‌!) ఈ విధంగా పలుకు: ''ఓ అల్లాహ్‌!   విశ్వరాజ్యాధిపతీ!  నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవమొసగుతావు.  నీవు కోరినవారిని పరాభవానికి గురిచేస్తావు.  సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపైన అధికారం కలవాడవు. [అల్ ఇమ్రాన్ : 26]
 

77

 
الرَّزَّاقُ

అర్ రజ్జాఖ్

అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు

 
 
అల్లాహ్‌యే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. ఆయన మహాశక్తిశాలి, మహాబలుడు. [అద్ ధారియాత్ : 58]
 

78

 
 
الوَكيلُ

అల్ వకీల్

చాలా మంచి కార్యసాధకుడు

''అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి'' అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ''మాకు అల్లాహ్‌ చాలు. ఆయన చాలా మంచి కార్యసాధకుడు'' అని వారన్నారు. [అల్ ఇమ్రాన్ : 173]
 

79

الرَّقيبُ

అర్ రఖీబ్

కనిపెట్టుకుని ఉండేవాడు

.....నీవు నన్ను పైకిలేపుకున్న తరువాత నువ్వే వారిని కనిపెట్టుకుని ఉన్నావు. వాస్తవానికి అన్ని విషయాలను కనిపెట్టుకుని ఉండేవాడవు నువ్వే. [మాయిదా: 117]
 

80

 
 
المُحْسِنُ

అల్ ముహ్సిన్

పేర్లు, లక్షణాలు, మంచితనంలో సంపూర్ణుడు

ఈ హదీసును అత్ తబరాని ఉల్లేఖించారు మరియు అల్ అల్బాని దీన్ని ధృవీకరించారు. అనస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు న్యాయం చేయండి, మంచి విధంగా జిబహ్ చేయండి, నిశ్చయంగా అల్లాహ్ మంచి పనుల్లో సంపూర్ణుడు మరియు మంచిని ప్రేమిస్తాడు.” [తబరాని మజ్ముఅ కబీర్ లో : హదీస్ 7114 నుండి 7123, ముసన్నఫ్ అబ్దుర్ రజ్జాఖ్ 4/492]
 

81

الحَسِيبُ

అల్ హసీబ్

ప్రతి దానికీ లెక్క తీసుకునేవాడు

ఎవరయినా మీకు 'సలాం' చేసినప్పుడు మీరు అంతకంటే ఉత్తమరీతిలో జవాబు ఇవ్వండి లేదా కనీసం అదే విధంగానైనా చెప్పండి. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదానికీ లెక్కతీసుకుంటాడు. [అన్ నిసా : 86]
 

82

الشَّافِي

అష్ షాఫి

వైద్యుడు/ తగ్గించువాడు

ఆయిషా రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖనం: దైవప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం దగ్గరకు రోగగ్రస్తున్ని తీసుకు వచ్చినా లేదా దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం రోగానికి గురి అయినా ఇలా చెప్పేవారు: “ఓ అల్లాహ్! మానవుల ప్రభువు! రోగాన్ని దూరం చెయ్యి, రోగికి ఆరోగ్యాన్ని ప్రసాదించు, నీవే వైద్యుడివి, నీ వైద్యము తప్ప ఎలాంటి వైద్యము  పనికిరాదు; నీ వైద్యము ఎలాంటి రోగాన్ని మిగల్చదు.” [బుఖారీ: వైద్య భాగం: 5/2147]
 

83

 
الرَّفِيقُ

అర్ రఫీఖ్

వాత్సల్యుడు/ ఔదార్యుడు

ఆయిషా రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు : “ఓ ఆయిషా, అల్లాహ్ చాలా వాత్సల్యుడు మరియు వాత్సల్యాన్ని ప్రేమిస్తాడు. వాత్సల్యానికి, ఔదార్యానికి ఇచ్చే ప్రతిఫలం ఇతర మంచి పనులకు ఇచ్చే ప్రతిఫలం కన్నా ఎక్కువగా ఉంటుంది.” [ముస్లిం: 4/2003]
 

84

المُعْطِي

అల్ ముతీ

ఇచ్చేవాడు/ ప్రసాదించేవాడు

ముఆవియా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా ప్రవచించారు: “అల్లాహ్ ఎవరినైనా మంచి చేయాలనుకుంటే అతణ్ణి ఇస్లాం వైపుకు తీసుకువస్తాడు, అల్లాహ్ ఇచ్చేవాడు, నేను అల్ ఖాసింను (పంచేవాడిని), అల్లాహ్ తలచే అంతిమ దినం వచ్చేవరకు ఈ(ముస్లిం) రాజ్యం ఇతరులపై విజయం సాధిస్తూ ఉంటుంది.” [బుఖారీ: 3/1143]
 

85

المُقِيتُ

అల్ ముఖీత్

అన్నింటిపై అదుపు అజమాయిషీ కలవాడు

ఎవరయినా ఒక మంచి పనికోసం సిఫారసు చేస్తే, అతనికి అందులో కొంత భాగం లభిస్తుంది. మరెవరయినా ఒక చెడు పనికోసం సిఫారసు చేస్తే,  ఆ పాపంలో అతనికీ వాటా ఉంటుంది. అల్లాహ్‌ అన్నింటిపై అదుపు అజమాయిషీ కలవాడు. [అన్ నిసా : 85]
 

86

السَّيدُ

అస్ సైదు

యజమాని

అబ్దుల్లా ఇబ్న్ శిఖ్ఖీర్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖించారు: “నేను బనూ ఆమిర్ ప్రతినిధి బృందంతోపాటు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం వద్దకు వెళ్లి, ‘మీరు మా సయ్యిద్ (యజమాని)’ అని అన్నాము. దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా జవాబిచ్చారు: “అస్ సయ్యిద్ (యజమాని) అల్లాహ్.” మేము అన్నాము: “మీరు మా అందరిలో ఉత్తములు.” అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “మీరు చెప్పదలచింది విడమరచి చెప్పండి, లేకుంటే షైతాను మమ్మల్నిఆవహిస్తాడు.” [సహీహ్ అబూ దావూద్ : 4021]
 

87

الطَّيِّبُ

అత్ తయ్యిబ్

పరిశుద్ధుడు

 
అబూ హురైరా రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “ఓ ప్రజలారా, అల్లాహ్ పరిశుద్ధుడు, పరిశుద్ధతనే స్వీకరిస్తాడు.” [సహీహ్ ముస్లిం : 2/703 : 1015]
 

88

الحَكَمُ

అల్ హకం

నిర్ణయాధికారి

హాని ఇబ్న్ యాజిద్ రజిఅల్లాహుఅన్హు గారి కొడుకు షురైహ్ ఉల్లేఖించారు: హాని తనవారితో కలసి దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు వెళ్లారు. అప్పుడు ప్రజలు అతణ్ణి (హాని) అతని మారుపేరు అబుల్ హకం అని పిలిచారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం అతణ్ణి పిలిచి అతనితో ఇలా అన్నారు: “అల్లాహ్ నిర్ణయాధికారి, నిర్ణయం తీసుకునే హక్కు అల్లాహ్ కే ఉంది. నీకు అబుల్ హకం అని ఎందుకు పిలుస్తున్నారు?” “నా ప్రజల్లో ఏదైనా వివాదం తలెత్తితే వారు నా దగ్గరకు వస్తారు. నేను వారి మధ్య పరిష్కారం చేస్తాను. ఇరువురూ నా నిర్ణయాన్ని ఆమోదిస్తారు” అని అయన అన్నారు. అప్పుడు దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “ఇది చాలా మంచి విషయం. నీకు ఎంతమంది పిల్లలు?” దానికి అతను ‘నాకు షురై, ముస్లిం, అబ్దుల్లా’ ఉన్నారు అని అన్నాడు. ‘అందులో పెద్దవారు ఎవరు?’ అని అడిగారు దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం. ‘షురై’ అని నేను అన్నాను. దానికి దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: ‘నీవు అబూ షురై అవుతావు.” [సహీహ్ అబూ దావూద్ : 4145]
 

89

الأكْرَمُ

అల్ అక్రం

దయాశీలి

 
నువ్వు చదువుతూ పో.  నీ ప్రభువు దయాశీలి. [అల్ అలఖ్ : 3]
 

90

البَرٌّ

అల్ బర్ర్

సద్వ్యవహారంచేసేవాడు

"మేము ఇది వరకే ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారం. నిశ్చయంగా ఆయన సద్వ్యవహారం చేసేవాడు, దయాకరుడు."[అత్తూర్ : 28]
 

91

الغَفَّارُ

అల్ ఘఫ్ఫార్

క్షమాశీలి

"ఆయన భూమ్యాకాశాలకు,  వాటి మధ్యనున్న సమస్తానికీ ప్రభువు.  ఆయన శక్తిశాలి, క్షమాశీలి." [స్వాద్: 66]
 

92

 
الرَّءُوفُ

అర్ రవూఫ్

ప్రేమమయుడు

అల్లాహ్‌ దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే (మీ నిర్వాకానికి గాను ఇప్పటికే శిక్ష అవతరించేది). అల్లాహ్‌ ప్రేమమయుడు,  కనికరంకలవాడు  (కాబట్టి సరిపోయింది). [అన్ నూర్ : 20]
 

93

 
الوَهَّابُ

అల్ వహ్హాబ్

గొప్పదాత

(వారు ఇలా వేడుకుంటూ ఉంటారు:) ''మా ప్రభూ!  సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు.  నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్పదాతవు.''[అల్ ఇమ్రాన్ : 8]
 

94

 
الجوَادُ

అల్ జవాద్

మంచిని ప్రసాదించేవాడు

ఇబ్న్ అబ్బాస్ రజిఅల్లాహుఅన్హు మరియు సాద్ ఇబ్న్ అబీ వఖ్ఖాస్ రజిఅల్లాహుఅన్హు ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు: “నిశ్చయంగా అల్లాహ్ మంచిని ప్రసాదించేవాడు (చాలా ఔదార్యం గలవాడు), ఔదార్యాన్ని ఇష్టపడతాడు, ఉత్తమ ప్రవర్తనను ప్రేమిస్తాడు మరియు చెడ్డ ప్రవర్తనను ద్వేషిస్తాడు.” [సిల్సిలా అస్ సహీహా: 1378]
 

95

السُّبُّوحُ

అస్ సుబ్బూహ్

పవిత్రుడు

ఆయిషా రజిఅల్లాహుఅన్హా ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం రుకూ మరియు సజ్దాలలో ఇలా అనేవారు:
“పరిపూర్ణ, దీవించబడిన, దూతల మరియు ఆత్మల ప్రభువు”
[సహీహ్ ముస్లిం :1/353 : 487]
 

96

 
الوَارِثُ

అల్ వారిస్

వారసుడు

ప్రాణం పోసేదీ, ప్రాణం తీసేది కూడా మేమే. (ఎట్టకేలకు)  వారసులం కూడా మేమే. [అల్ హిజ్ర్ : 23]
 

97

 
الرَّبُّ

అర్ రబ్

ప్రభువు

కృపాశీలుడైన ప్రభువు తరఫున వారికి 'సలామ్‌' చెప్పబడుతుంది. [యాసీన్: 58]
 

98

الأَعْلى

అల్ ఆలా

సర్వోన్నతుడు

(ఓ ప్రవక్తా!) సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు. [అల్ ఆలా : 1]
 

99

الإلهُ

అల్ ఇలాహ్

దైవం

మీ అందరి ఆరాధ్యదైవం ఒకే ఆరాధ్యదైవం. ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేనేలేడు. ఆయన అపార కరుణామయుడు,  పరమకృపాశీలుడు. [అల్ బఖర : 163]

 


Popular Posts