Facebook




ASSALAMUALAIKUM WELCOME TO HUMAN SHORT LIFE




Advertisement

 

مَن قَتَلَ نَفْسًا بِغَيْرِ نَفْسٍ أَوْ فَسَادٍ فِي الْأَرْضِ فَكَأَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيعًا وَمَنْ أَحْيَاهَا فَكَأَنَّمَا أَحْيَا النَّاسَ جَمِيعًا

“ఎవరయినా ఒకరి హత్యకు ప్రతీ కారంగా కాకుండా, భూమిలో కల్లోలాన్ని రేకెత్తించినందుకు కాకుండా, అకారణంగా ఎవరినయినా చంపినట్లయితే అతడు సమస్త మానవులను చంపినవాడవుతాడు. అలాగే ఎవరయినా ఒకరి ప్రాణాన్ని రక్షిస్తే అతడు సమస్త మానవుల ప్రాణాలను రక్షించిన వాడవుతాడు.”సూరా అల్ మాయిద 5:32


  హజ్జ్ చరిత్ర సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమ్ మరియు ఇతరుల హదీసుల ఆధారంగా ‘అల్ల...

 

హజ్జ్ చరిత్ర


సహీహ్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీస్ గ్రంథాలలో నమోదు చేయబడిన ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమ్ మరియు ఇతరుల హదీసుల ఆధారంగా ‘అల్లాహ్ పవిత్ర గృహానికి చేసే హజ్జ్ యాత్ర’ అనేది ఇస్లాం యొక్క ఐదు మూలస్థంభాలలోని (మూలసిద్ధాంతాలలోని) ఒక మూలస్థంభమనే విషయంలో ప్రాచీన-ఆధునిక,పూర్వ-ప్రస్తుతపండితులు ఏకీభవిస్తున్నారనేది ముస్లింలందరికీ తెలుసు.

 


ప్రఖ్యాత హజ్జ్ ఆచరణలు 

ఇతర ఆరాధనలలో మాదిరిగా హజ్ లో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆచరణలు  ఉన్నాయి. అల్లాహ్ నిర్దేశించిన విధంగానే వీటిని ఆచరించవలసి ఉంది. ఉదాహరణకు–మీఖాత్ నుండి ఇహ్రామ్ స్థితిలోనికి ప్రవేశించటం, తవాఫ్(కాబా ప్రదక్షిణ), సఫా మరియు మర్వాల మధ్య సయీ చేయటం, అరఫా మైదానంలో నిలబడటం, ముజ్దలిఫా మైదానంలో రాత్రి గడపటం, జమరాత్ లో రాళ్ళు విసరటం, పశుబలి(ఖుర్బానీ) చేయటం మొదలైన ప్రఖ్యాత హజ్జ్ ఆచరణలు. వీటన్నింటినీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం బోధనల ప్రకారమే  ఆచరించవలసి ఉన్నది. ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క హజ్ యాత్రను వివరించే హదీసులు అనేకం ఉన్నాయి; ‘జాద్అల్మాద్’ అనే గ్రంథంలో ఇమాం ఇబ్నెఅల్ఖయ్యిమ్ మరియు‘అల్బిదాయహ్వల్నిహాయహ్’  అనే గ్రంథంలో అల్హాఫిజ్ ఇబ్నెకథీర్ ఈ హదీథులను సంకలనం చేసియున్నారు; అంతేకాక ఈ హదీసుల నుండి ఉద్భవించే హజ్ నియమ నిబంధనలను కూడా ఈ ఇద్దరు పండితులు వివరించినారు. ఈ నియమ నిబంధనలను నేర్చుకోవటంలో మరియు వాటిని ఆచరించటంలో ప్రతి ముస్లిం తప్పకుండా శ్రద్ధ చూపవలెను.

 

 

అల్లాహ్ను స్మరించడం

అల్లాహ్  స్మరణాన్ని, ధ్యానాన్నిస్థాపించటమే హజ్జ్ ఆచరణల యొక్క ప్రధాన ఉద్దేశ్యమని మనం గుర్తుంచుకోవలెను. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా తెలుపుతున్నాడు.(ఖుర్ఆన్ వచనాల భావం యొక్క అనువాదం): 

 

(హజ్ కాలంలో)మీ ప్రభువు అనుగ్రహాలను (వ్యాపారం ద్వారా) అన్వేషిస్తే మీపై దోషమేమీ లేదు. అరఫా నుండి తరలిపోయినప్పుడు, ‘మష్అరిల్హరాం’(ముజ్దలిఫా) వద్ద అల్లాహ్ ను స్మరించండి. ఆయన మీకు నేర్పిన విధంగా ఆయనను స్మరించండి. నిశ్చయంగా, పూర్వం మీరు మార్గభ్రష్టులలోని వారిగా ఉండేవారు. ఆ తరువాత ప్రజలు ఎక్కడి నుండైతే తరలిపోతారో, అక్కడి నుండి మీరూ తరలిపొండి మరియు అల్లాహ్ యొక్క క్షమాభిక్షను వేడుకోండి. నిశ్చయంగా, అల్లాహ్ అమితంగా క్షమించేవాడూ, అపారకృపాశీలుడు. ఎప్పుడైతే మీరు మీ‘మనాసిక్’లు పూర్తి చేసుకుంటారో, అల్లాహ్ ను స్మరించండి- మీరు మీ పూర్వీకులను స్మరించినట్లుగా లేదా అంతకన్నా అధికంగా స్మరించండి. మరియు ప్రజలలో ఎవరైతే “ఓ మా ప్రభూ!మాకు ఈ లోకంలోనే ప్రసాదించు”అని అంటారో, వారికి పరలోకంలో ఎలాంటి భాగమూ ఉండదు. మరియు వారిలో మరికొందరు “ఓ మా ప్రభూ!మాకు ఇహలోకంలో మంచిని ప్రసాదించు మరియు పరలోకంలోనూ మంచిని ప్రసాదించు. మరియు మమ్మల్నినరకాగ్ని శిక్ష నుండి కాపాడు.” అని అంటారో,అటువంటి వారికే తాము సంపాదించుకున్న దాని నుండి భాగం ఉంటుంది. మరియు అల్లాహ్ లెక్క తీసుకోవటంలో అతిశీఘ్రమైనవాడు. మరియు లెక్కించదగిన ఆ దినములలో అల్లాహ్ ను స్మరించండి. ఎవరైతే రెండు రోజులలోనే వెళ్ళడానికి త్వరపడతారో, అతనిపై ఎటువంటి దోషమూ లేదు మరియు ఎవరైతే ఆలస్యం చేస్తారో, అతనిపై కూడా ఎటువంటి దోషమూ లేదు– ఇది భయభక్తులు కలవారి కొరకు. అల్లాహ్ కు భయపడుతూ ఉండండి మరియు తెలుసుకోండి- మీరంతా ఆయన వైపునకే సమీకరించబడతారు. [అల్ బఖరహ్ 2:198-203]

 

ఒక హదీసులో ఆయెషా రజియల్లాహుఅన్హా ఇలా ఉల్లేఖించినారు: “కేవలం అల్లాహ్  నామస్మరణాన్ని స్థాపించటం కొరకే కాబా గృహం చుట్టూ తవాఫ్(ప్రదక్షిణం) చేయటం, అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య సయీ(తిరగటం), జమరాత్లో రాళ్ళు విసరటం మొదలైనవి నిర్దేశింపబడినవి.” అల్బైహఖీ(5/145) దీనిని ‘ముల్లఖ్హదీసు’గా వర్గీకరించినారు మరియు ఇందులో కొంత బలహీనత ఉన్నప్పటికీ, ఈ హదీసును‘మర్ఫూహదీసు’గా ఉల్లేఖించినారు.

 

దైవభీతి

హజ్జ్ ఆచరణలను గౌరవించమనే అల్లాహ్ ఆజ్ఞలను ముస్లింలు మనస్పూర్తిగా పాటిస్తారు. దీని గురించి ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: 

 

“అలాగే నిశ్చయంగా హృదయాలలో ఉన్న దైవభీతి వల్లనే అల్లాహ్ నియమించిన చిహ్నాలను గౌరవిస్తారు.” [అల్హజ్22:32] 

 

హజ్రే  అస్వద్

 బుఖారీ హదీసు గ్రంథంలోని ఒక హదీసులో ఇలా నమోదు చేయబడినది: ఉమర్ ఇబ్నెఖత్తాబ్ రజియల్లాహుఅన్హు దివ్యశిలను ముద్దాడి, దానితో ఇలా పలికినారు, “ప్రవక్త ముహమ్మద్ 

సల్లల్లాహుఅలైహివసల్లం నిన్ను ముద్దాడటాన్ని నేను గనుక చూసి ఉండకపోతే, నేను నిన్ను అస్సలు ముద్దు పెట్టుకునే వాడినే కాను.” 

 

హజ్జ్ ఆచరణలను చర్చిస్తూ మరియు వివరిస్తూ ఇబ్నెఅల్జౌజీ ఇలా అన్నారు:  

“ఈ ఆచరణల వెనుకనున్న చరిత్ర కనుమరుగయిపోయినది, కానీ వాటి నియమాలు మాత్రం అలాగే వాడుకలో నిలిచిపోయాయి. ఈ ఆచరణలు కొందరు దర్శకులను తికమకపెట్టవచ్చు. దీనికి కారణం వారికి ఆ ఆచరణల వెనుకనున్న కారణం తెలియకపోవటమే. అందువలన వారు హజ్ లోని కొన్ని ఆచరణల గురించి‘ దీనిలో అర్థంపర్థం లేదు.’అని పలుకుతుంటారు. హదీసు ఉల్లేఖనలు లభ్యమైనంత వరకు వాటికి గల కారణాలను నేను వివరించాను. ఇప్పుడు వాటి సరైన అర్థాలను వివరిస్తాను. 

 

సమర్ధించుకోదగ్గ మరియు తేలికగా అర్థం చేసుకోదగ్గ సరైన కారణంపైనే ఆరాధనల యొక్క అసలు పునాది ఆధారపడి ఉంటుందనేది ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం. అదేమిటంటే, దాసుడు తన యజమానికి సమర్పించుకోవటం మరియు సంపూర్ణ విధేయత చూపటం. ఆతని ప్రార్థనలలో ఇబాదహ్(ఆరాధన) అనే పదం యొక్క భావాన్ని ప్రదర్శించే వినమ్రత, వినయం మరియు సంపూర్ణ సమర్పణ ఉంటుంది. 

 

జకాహ్ దానం

జకాహ్ దానంలో(విధి దానంలో) బీదలపై చూపే దయ మరియు సహాయం ఇమిడి ఉన్నాయి. కాబట్టి దానర్థం తేటతెల్లంగా స్పష్టమవుతున్నది. 

 

ఉపవాసం

ఉపవాసం అంటే తను దాస్యం చేయవలసిన ఆ ఏకైక ఆరాధ్యునికి మాత్రమే విధేయత చూపటానికి వీలుగా తన స్వంత కోరికలను, వాంఛలను, అభిలాషను, ఇచ్ఛను అణచి వేసుకోవటం. 

 

కాబా గృహం

కాబాగృహాన్నిగౌరవించటం, దానిని దర్శించటం మరియు దాని చుట్టుప్రక్కల ప్రాంతాల పవిత్రతను స్థాపించటం మొదలైనవి ఉత్తమ ఆచరణలు. చిత్తశుద్ధితో పరిశుభ్రంగా అక్కడకు చేరటమనేది ఒక దాసుడు సంపూర్ణ వినయవిధేయతలతో, వినమ్రతగా, అణుకువగా, నిరాడంబరంగా, నిగర్వంగా తన ప్రభువు వైపు మరలటాన్ని స్పష్టం చేస్తుంది. తను అర్థం చేసుకున్న మరియు తనను ప్రేరేవించిన ఆరాధనలను మానవుడు సునాయాసంగా ఆచరిస్తాడు. కాని పరిపూర్ణ సమర్పణ సాధించటం కొరకు మనం అర్థం చేసుకోలేని కొన్ని ఆరాధనలు పాటించవలసి ఉంటుంది. వాటి ఆచరణ మానవుడికి అంత సులభతరం కాకపోవచ్చు మరియు వాటిని అతను గ్రహించలేకపోవచ్చు. ఈ పరిస్థితిలో అల్లాహ్ ఆజ్ఞలకు విధేయత చూపటమనేది మాత్రమే మనల్ని అటుంవంటి ఆరాధనలు చేయటానికి ప్రేరేపిస్తుంది. ఇది అత్యుత్తమమైన వినమ్రత, అణుకువ మరియు సమర్పణ విధానం.” 

 

హజ్ ఆచరణలు

ఇది అర్థం అయినట్లయితే, ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం కంటే పూర్వపు హజ్ ఆచారాల చరిత్ర గురించి మనకు ఎక్కువగా తెలియదనే విషయంలో అంత ప్రాధాన్యత లేదనేది మనం అర్థం చేసుకోగలం. కొన్ని హజ్ ఆచరణల గురించి వివిధ గ్రంథాలలో తెలుపబడిన కొన్ని ఉల్లేఖనలను క్రింద తెలుపుచున్నాము: 

 

హజ్ ఎప్పుడు విధిగా చేయబడినదిహజ్ ఎప్పుడు ఆరంభమైనది?  

అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు : “మరియు ప్రజలకు హజ్ యాత్రను గురించి ప్రకటించు: వారు పాదాచారులుగా మరియు ప్రతి బలహీనమైన ఒంటె(సవారీ) మీద, విశాల(దూర) ప్రాంతాల నుండి మరియు కనుమల నుండి నీ వైపుకు వస్తారు.” [అల్హజ్జ్22:27]

 

పవిత్ర యాత్ర

ఇబ్నెకసీర్ ఈ వచనాన్నివివరిస్తూ ఇలా తెలిపినారు(3/221)

దీని అర్థం ఏమిటంటే: “ ‘(ఓ ఇబ్రాహీం) ప్రజలకు హజ్ గురించి ప్రకటన చేయి, మేము నిన్ను ఆజ్ఞాపించి నిర్మింపజేసిన ఈ గృహం వైపునకు పవిత్ర యాత్ర చేయమని ప్రజలకు పిలుపు నివ్వు.’అనే అల్లాహ్ ఆదేశం విని, ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా అంటారు ‘ఓ ప్రభు!నా పిలుపు అంత బిగ్గరగా లేదే. మరి అది ప్రజలకు ఎలా చేరగలదు?’ అల్లాహ్ ఇలా పలుకుతాడు “ప్రకటించు మరియు మేము దానిని ప్రజలకు చేర్చుతాము.” అప్పుడు ఆయన తన స్థానంలో నిలుచుని లేదా ఒక గుట్టపై నిలుచుని లేదా అస్సఫా అనే చిన్న కొండపై నిలుచుని లేదా కాబాకు అతి దగ్గరలోనున్న అబుఖుబైస్ అనే ఎతైన పర్వతంపై నిలుచుని గొంతెత్తి ఇలా ప్రకటించినాడు: “ఓ ప్రజలారా, మీ ప్రభువు ఒక గృహాన్ని ఎన్నుకున్నాడు, కాబట్టి దానిని దర్శించటానికై రండి.”

అప్పుడు అతని పిలుపును భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలకు చేరుకోవటానికి వీలుగా పర్వతాలు క్రిందకు వంగినాయి. ఆ పిలుపును ఆ సమయంలో భూమిపై ప్రాణంతో ఉన్న మానవులందరూ వినటమే కాక, ఇంకా జన్మించని తల్లి గర్భంలోని శిశువులు మరియు పురుషుని నడుములోని వీర్యబిందువులు కూడా విన్నాయని తెలుపబడినది. అతని పిలుపు విన్న మరియు అల్లాహ్ ఎన్నుకున్న ప్రతి ఒక్కరూ–వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, ఏ పట్టణంలో నివసిస్తున్నా, చెట్లనీడలలో లేదా గుడారాలలో నివసించే దేశదిమ్మరులైనా ‘లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్ (హాజరయ్యాను, ఓ అల్లాహ్, హాజరయ్యాను)’అని పలుకుతూ ప్రళయ దినం వరకు తప్పక హజ్ యాత్ర చేయవలెను.”ఇబ్నెఅబ్బాస్, ముజాహిద్, ఇక్రిమాహ్, సయీద్ఇబ్నెజుబైర్ మరియు ఇతర ముందుతరం పండిత ముస్లిం ఉల్లేఖనల యొక్క సారాంశమిది.  మరియు అసలు విషయం అల్లాహ్ కే తెలుసు. 

 

హజ్ మాసం

ఇబ్నెఅల్జౌజీ తన పుస్తకం ‘ముథీర్ అల్ అజమ్ అల్సాకిన్(1/354)’లో పైన తెలిపిన విషయాలనే చాలా క్లుప్తంగా ఉల్లేఖించి, వాటిని ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం చరిత్ర(సీరత్) తెలిపిన ఉల్లేఖకులవిగా నమోదు చేసినారు.  

 

ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లంను ఈ భూమిపై పంపక ముందు హజ్ విధిగావించటం గురించిన చరిత్రకు సంబంధించిన విషయమిది. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం కాలంలో హజ్ విధిగావింపబడిన సంవత్సరం గురించి పండితులలో విభిన్నఅభిప్రాయాలు ఉన్నాయి. కొందరు పండితులు 6వ హిజ్రీ సంవత్సరంలో అని, కొందరు, 7వ హిజ్రీ సంవత్సరంలో అని, కొందరు 9వ హిజ్రీ సంవత్సరంలో అని, మరికొందరు 10వ హిజ్రీ సంవత్సరంలో అని అంటారు. అయితే ఖచ్చితంగా ‘9వ లేదా10వ సంవత్సరంలో హజ్ విధిగావింపబడినది ’అని ఇమాం ఇబ్నె అల్ఖయ్యిమ్ అభిప్రాయపడుతున్నారు. తన ‘జాద్అల్మఆద్’ అనే పుస్తకంలో ఆయన ఇలా తెలిపినారు:  

 

“ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం మదీనాకు వలస వెళ్ళిన తరువాత, ‘వీడుకోలు హజ్’గా ప్రఖ్యాతి చెందిన హజ్ తప్ప ఇంకే హజ్ యాత్రా చేయలేదు మరియు అది10వ హిజ్రీ సంవత్సరంలో జరిగినది అనే విషయంలో పండితుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయం లేదు. హజ్ ఆదేశం అవతరించిన తరువాత, ఎలాంటి ఆలస్యం చేయకుండా హజ్ చేయటానికి ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం త్వరపడినారు. అయితే హజ్ ఆదేశం ఆయన చివరి దశలో అంటే 9 లేదా10 వ హిజ్రీ సంవత్సరంలో అవతరించినది. మరి అటువంటప్పుడు, ఆ ఆదేశం ముందుగానే అవతరించినా, దాని ఆచరణ మాత్రం9 లేదా10వ హిజ్రీ సంవత్సరం వరకు వాయిదా వేయబడినదని ఎవరైనా ఎలా నిరూపించగలరు? ఖుర్ఆన్ లోని మూడవ అధ్యాయమైన సూరహ్ ఆలె ఇమ్రాన్ యొక్క మొదటి భాగం రాయబార బృందాల(ఆమ్అల్ఉఫూద్) సంవత్సరంలో అవతరించినదని తెలుపుతున్నాము.

 

జిజియా పన్ను

ఆ సంవత్సరంలో నజరా ప్రాంతం నుండి ఒక రాయబార బృందం ప్రవక్త ముహమ్మద్  సల్లల్లాహుఅలైహివసల్లం వద్దకు వచ్చినది.

వారు జిజియా పన్ను చెల్లించే విధంగా ఆయన వారితో ఒడంబడిక చేసుకున్నారు మరియు జిజియా పన్నుగురించిన ఆదేశాలు తబూకు యుద్ధం జరిగిన 9వ హిజ్రీ సంవత్సరంలో సూరహ్ ఆలె ఇమ్రాన్ మొదటిభాగం అవతరించినప్పుడు అవతరించినవి. …” 

 

జాద్అల్మఆద్(3/595)లో ఇలా తెలుపబడినది- ఖుర్ఆన్ (3:97)

సూరహ్ ఆలె ఇమ్రాన్ లోని 97వ వచనంలో హజ్ విధిగావించపబడిన ఆదేశం ఇలా ఉన్నది : “మరియు అక్కడికి పోవటానికి, శక్తిగలవారికి ఆ గృహయాత్ర అల్లాహ్ కొరకు చేయటం విధిగావింపబడినది.”హజ్ యాత్ర విధిగావించబడినదనే ఆజ్ఞను ఈ వచనం తెలుపుతున్నది.

ఇది 9వ సంవత్సరం చివరి భాగంలో రాయబారబృందాల సంవత్సరంలో అవతరించినది. కాబట్టి హిజ్రీ 9వ సంవత్సరం చివరిలో హజ్ యాత్ర విధిగావించబడినది.

 

ప్రజలపై హజ్ విధిగావించబడినది

తన తఫ్సీర్లో(ఖుర్ఆన్ వివరణ గ్రంథం, 2/4/92భాగంలో) అల్ఖుర్తుబి ఇలా తెలిపినారు: హజ్ గురించి అరబ్బు ప్రజలకు ముందు నుండీ తెలుసు. ఇస్లాం వచ్చిన తరువాత, వారికి ముందు నుండీ తెలిసియున్న‘ప్రజలపై హజ్ విధిగావించబడినదే’ అనే విషయమే మరల వారికి తెలుపబడినది.” 

 

కాబా గృహం చుట్టూ తవాఫ్ (ఏడు సార్లు ప్రదక్షిణ) చేయటం: 

అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు: “ఇబ్రాహీము మరియు ఇస్మాయీలులను ఇలా ఆదేశించాము “నా గృహాన్ని పరిశుద్ధపరచండి; దాని ప్రదక్షిణలు చేసేవారి కొరకు, ఏతేకాఫ్ పాటించేవారి కొరకు (ప్రార్థనలు మరియు ఆరాధనల నిమిత్తం తమను తాము ఏకాంతపరచుకునే వారి కొరకు), ఇంకా రుకూ- సజ్దాలు చేసేవారి కొరకు.”” [అల్ బఖరహ్ 2:125] 

 

కాబా గృహం చుట్టూ చేసే తవాఫ్- ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో తెలిసిన విషయమేనని ఈ వచనం సూచిస్తున్నది. 

 

రమల్

రమల్ అంటే దగ్గర దగ్గరగా అడుగులు వేస్తూ, త్వరత్వరగా, వడివడిగా నడిచే నడక. తవాఫ్ అల్ఖుదూమ్(ఆగమ తవాఫ్- మక్కా చేరగానే ప్రారంభంలో చేసేది) లో  ఇది పురుషుల కొరకు సున్నత్(ఉత్తమం), కానీ స్త్రీలకు కాదు. 

 

రమల్ ఎలా ప్రారంభమైనది

బుఖారీ హదీస్ గ్రంథంలో(2/469-470, 1602) మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో (2/991-992, 1262) ఇబ్నె ఉమర్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖించిన హదీసులు ఇలా నమోదు చేయబడినాయి: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం తన సహచరులతో రాగా, “యత్రిబ్ (మదీనా నగరం) జ్వరంతో బలహీన పడిపోయిన ప్రజలు వచ్చారు చూడండి.”అని ముష్రికులు (కాబా వద్దనున్నబహుదైవారాధకులు) అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహుఅలైహివసల్లం తవాఫ్

లోని మొదటి మూడు ప్రదక్షిణలలో వడివడిగా నడవమని (రమల్ చేయమని) ఆదేశించినారు.… ఇంకో ఉల్లేఖనంలో ఆయన ఇలా ఆదేశించారని నమోదు చేయబడినది, “మీ బలాన్ని ముష్రికులు చూసే (తెలుసుకునే) విధంగా వడివడిగా నడవండి.” 

 

జమ్ జమ్ పవిత్ర జలం మరియు అస్సఫా మరియు అల్ మర్వాల మధ్య చేసే సయీ నడక

ఇబ్నెఅబ్బాస్ రజియల్లాహుఅన్హు ఉల్లేఖించిన హదీసు సహీహ్ బుఖారీలో ఇలా నమోదు చేయబడినది:  

కాబా మస్జిద్ వద్ద నేటి జమ్ జమ్ బావి సమీపంలోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఒక చెట్టు క్రింద ఇబ్రాహీమ్ అలైహిస్సలాం తన భార్య హాజిరాను మరియు ఆవిడ కుమారుడు ఇస్మాయీలును తీసుకువచ్చినారు. అప్పుడు ఇస్మాయీలు ఇంకా తల్లి పాలు త్రాగే పసికందు వయస్సులో ఉన్నారు. ఆ రోజులలో మక్కాలో నివసించే వారు కాదు మరియు అక్కడ నీరు కూడా లేకుండెను. ఒక తోలు సంచిలో కొన్ని ఖర్జురపు పళ్ళు మరియు ఒక తోలు సంచిలో కొంత నీరు వారికిచ్చి, అక్కడ వారిని వదిలిపెట్టి, ఆయన తిరుగుప్రయాణం మొదలుపెట్టినారు. ఇస్మాయీలు తల్లి ఆయన వెంటబడి, ఇలా పలికినిది, “ఓ ఇబ్రాహీమ్! ఏ మానవుడూ, ఏ వస్తువూ లేని ఈ లోయలో మమ్మల్ని వదిలి, నీవెక్కడికి వెళ్ళుతున్నావు?” ఇలా ఆవిడ అనేక సార్లు ఆయనను ప్రశ్నించినది. కానీ, ఆయన ఆవిడ వైపు అస్సలు చూడలేదు. ఇక చివరగా ఆవిడ ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలామును ఇలా ప్రశ్నించినది, “ఇలా చేయమని అల్లాహ్ నిన్ను ఆజ్ఞాపించినాడా?” దానికి ఆయన, “అవును.”అని జవాబిచ్చినారు. అప్పుడు ఆవిడ, “అలా అయితే, అల్లాహ్ మమ్మల్ని(కాపాడకుండా) వదిలివేయడు,”అని పలికి, వెనుదిరిగినది. ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం ముందుకు ప్రయాణం సాగించినారు. వారు కనిపించనంత దూరంలో ఉన్న అల్థానియహ్ అనే ప్రాంతానికి చేరుకున్న తరువాత ఆయన కాబా వైపునకు తిరిగి, రెండు చేతులెత్తి, దీనంగా అల్లాహ్ తో ఇలా వేడుకున్నాడు:  

“ఓ మా ప్రభూ! వాస్తవానికి నేను నా సంతానంలో కొందరిని నీ పవిత్ర కాబా గృహం దగ్గర పైరుపండని, ఎండిపోయిన కొండలోయలో నివసింపజేశాను. ఓ మా ప్రభూ!వారిని అక్కడ నమాజు స్థాపించటానికి ఉంచాను. కనుక నీవు ప్రజల హృదయాలను, వారివైపుకు ఆకర్షింపజేయి మరియు వారు కృతజ్ఞులై ఉండటానికి వారికి జీవనోపాధిగా ఫలాలను సమకూర్చుము..[ఇబ్రాహీమ్14:37]

 

ఇస్మాయిలు తల్లి ఇస్మాయిలుకు పాలుపడుతూ, తానేమో తన వద్దనున్ననీరు త్రాగుతూ ఉండినది. కొన్నాళ్ళలోనే తోలుసంచిలోని నీరు మొత్తం ఖర్చయిపోయినవి. అప్పుడు ఆవిడకు మరియు ఆవిడ బిడ్డకూ దాహం వేయగా, ఆవిడ తన బిడ్డవైపు దీనంగా చూడసాగినది. ఇక బిడ్డ పరిస్థితి చూడలేక, అతడిని అక్కడే నేలపై పడుకోబెట్టి, దగ్గరలోని అస్సఫా కొండపైకి ఎక్కి, ఎవరైనా కనబడతారేమోనని లోయవైపునకు చూడసాగినది. కానీ, ఆవిడకు ఎవరూ కనబడలేదు. అప్పుడు అస్సఫా కొండ దిగి, లోయలోనికి వచ్చి, ఆపదలో మరియు కష్టంలో ఉన్న వ్యక్తివలే పరుగెత్తుతూ, లోయదాటి, అల్ మర్వా కొండపైకెక్కి, నలుదిక్కులా ఎవరైనా కనబడతారేమోనని చూడసాగింది. కానీ ఆవిడకు అక్కడ కూడా ఎవరూ కనబడలేదు. అలా ఆవిడ ఏడు సార్లు తిరిగినది(అస్సఫా మరియు అల్ మర్వాకొండల మధ్య ఏడు సార్లు పరుగెత్తినది). 

 

ఇబ్నెఅబ్బాస్రజియల్లాహుఅన్హు ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా తెలిపినారు, “ఇదియే వాటి మధ్య (అస్సఫా మరియు అల్ మర్వా కొండల మధ్య) ప్రజల సయీ (నడకకు ఆరంభం).” ఆవిడ చివరిసారిగా (ఏడవసారి) అల్ మర్వా పైకి చేరగానే, ఒక దివ్యవాణి విన్నది. తనకు తానే “ష్..ష్!”  అనుకుంటూ, ఏకాగ్రతతో దానిని ఆలకించటానికి ప్రయత్నించినది. ఆవిడకు మరల ఆ శబ్దం వినబడగానే, ఆ శబ్దం వచ్చిన దిశవైపునకు తిరిగి ఆవిడ ఇలా అన్నది, “ఓ, (నీవెవరివయినాగానీ)! నీవు నీ శబ్దాన్ని నాకు వినిపించావు; నాకు సహాయం చేసేదేమైనా నీ వద్ద ఉన్నదా?” అప్పుడు ఒక దైవదూత జమ్ జమ్ స్థలంలో నీటిధార ఉబికివచ్చే వరకు తన మడమతో(లేదా తన రెక్కతో) త్రవ్వటాన్నిఆవిడ చూసినది. వెంటనే ఆవిడ ఆ నీటిధార చుట్టూ తన చేతులతో అడ్డుకట్ట కట్టి, తోలుసంచిని నింపుకోవటం మొదలుపెట్టినది. ఆవిడ కొంత నీటిని నింపుకున్న తరువాత, ఆ ధార ఇంకా ముందుకు ప్రవహించసాగినది.

 

ఇబ్నెఅబ్బాస్ ఇలా అన్నారు: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా తెలిపారు, “ఇస్మాయీలు తల్లిపై అల్లాహ్ అనుగ్రహం చూపు గాక! ఒకవేళ ఆవిడ జంీజం నీటిధారను ఆపటానికి ప్రయత్నించకుండా అలాగే వదిలి వేసినట్లయితే(ఆ నీటిని తన తోలుసంచిలో నింపుకోనట్లయితే) , అది భూమి ఉపరితలంపై ఒక నదివలే ప్రవహించి ఉండేది.” ఆయన మరల ఇలా పలికారు: “ఆ దైవదూత ఆవిడతో ఇలా అన్నాడు, ‘నిర్లక్ష్యంగా వదిలివేయబడతానేమోనని భయపడకు. ఎందుకంటే ఈ బాలుడు మరియు అతడి తండ్రిచే నిర్మింపబడే అల్లాహ్ యొక్క గృహం ఇది. మరియు అల్లాహ్ తన ప్రజలను ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యడు’…” 

 

ఇబ్నెఅల్జౌజీ తన పుస్తకం అల్అజమ్అల్సాకిన్(2/47)లో ఇలా తెలిపినారు: “ఇది ఎందుకు జమ్జమ్ అని పిలవబడుతున్నదనే కారణాన్నిఈ హదీసు వివరిస్తున్నది. ఎందుకంటే నీటి ధార ప్రవహించటం మొదలుపెట్టగానే, హాజిరా  దానిని నియంత్రించడానికి (అరబీలోజమ్మత్-గా) ప్రయత్నించినది. భాషా పండితుడైన ఇబ్నె ఫారిస్ ఇలా తెలిపినారు: జమమ్తుఅల్నాఖహ్ (నేను ఒంటెకు కళ్ళెం, పగ్గం వేశాను) అనే పదాల నుండి జమ్జమ్ వచ్చును. 

 

అరఫహ్ మైదానంలో నిలబడటం

యజీద్ ఇబ్నె షైబాన్ ఉల్లేఖనను అబూదావూద్ మరియు అత్తిర్మిజీ హదీసు గ్రంథాలు ఇలా నమోదు చేసాయి: అరఫ మైదానంలోని మౌఖిఫ్ (ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం నిలబడిన చోటు) అనే స్థలానికి దూరంగా మేము నిలబడి ఉండగా, ఇబ్నెమిర్బాఅల్ అన్సారీ మా వద్దకు వచ్చి, ఇలా పలికినారు, “నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం యొక్క వార్తాహరుడిని. ఆయన మీకు ఇలా తెలుపమన్నారు: ‘మీరున్న చోటునే నిలబడండి. (ఇది కూడా నిలబడే స్థలమే), ఇక్కడనే మీ పితామహుడైన ఇబ్రాహీమ్ నిలబడినారు.’” తన సహీహ్ అబి దావూద్ లో అల్బానీ దీనిని సహీహ్ హదీసుగా వర్గీకరించినారు. 

 

హజ్ యొక్క అనేక ఆచరణలు ప్రవక్త ఇబ్రాహీమ్ అలైహిస్సలాం కాలంలో బోధించబడినవే. కానీ, మక్కా ముష్రికులు(బహుదైవారాధకులు) నిర్దేశింపబడని కొన్ని నూతన కల్పితాచారాలను హజ్ యాత్రకు  జతపరచినారు. ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ప్రవక్తగా పంపబడిన తరువాత, ఆయన వాటిని ఖండించి, అల్లాహ్ నిర్దేశించిన హజ్ ఆచరణలను వాటి అసలు రూపంలో మరల బోధించినారు. 

 

ఇది హజ్ చరిత్ర మరియు వాటి కొన్ని ఆచరణల చరిత్ర గురించిన సంక్షిప్త సమాచారం. మరికొన్ని వివరాలకు అల్హాఫిజ్అల్జౌజీ వ్రాసిన ‘ముథీర్ అల్ అజమ్అల్సాకిన్ఇలాఅష్రఫ్అల్అమాకిన్’ గ్రంథంలోని మొత్తం మొదటి భాగం మరియు రెండవ భాగం లోని ఆరంభపు అధ్యాయాలు చదవండి. 

 

అల్లాహ్ యే సర్వజ్ఞుడు.

  జకాత్ (విధి దానము) నిర్ణీత సమయంలో, నిర్ణీత ధనము నుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది. జకాత్ ఆవశ్యకత ఇస్లాం మూలస్థంభాలలో జకాత్ ఒ...

 

జకాత్ (విధి దానము)


నిర్ణీత సమయంలో, నిర్ణీత ధనము నుండి, నిర్ణీత ప్రజల కొరకు ఒక విధిగా ఇవ్వబడునది.

జకాత్ ఆవశ్యకత

ఇస్లాం మూలస్థంభాలలో జకాత్ ఒక ముఖ్య మూలస్థంభము. ఖుర్’ఆన్ లో చాలా చోట్ల అల్లాహ్ “సలాహ్” తో పాటు “జకాత్” ని కూడ విధిగా పేర్కొన్నాడు.

 

“సలాహ్ ను స్థాపించండి మరియు జకాత్ ను చెల్లించండి, మరియు రుకూ చేసే వారితో రుకూ చేయండి. (అల్లాహు తఆలా ముందు వంగే వారితో మీరూ వంగిపోండి)” (2:43)

 

బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బొధించారు:

“ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది

 

1). ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక్క అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సత్యమైన ప్రవక్త అని సాక్ష్యమిచ్చుట,

 

2) సలాహ్ (నమాజ్)ని స్థాపించుట,

 

3) జకాత్ (విధి దానం) చెల్లించుట,

 

4) హజ్ చేయుట,

 

5) రమదాన్ నెల ఉపవాసములు ఉండుట.”

 

2వ హిజ్రీ సంవత్సరములో జకాత్ విధిగా చేయబడినది

ఎవరైతే జకాత్ విధిని నిరాకరించారో వారు అవిశ్వాసానికి పాల్బడినట్లు. వారు జకాత్ చెల్లించినప్పటికీ లేదా చెల్లించకపోయినా. మరియు ఎవరైతే జకాత్ విధి అని నమ్మి సాక్ష్యమిచ్చి, చెల్లించుటలో సోమరితనం ప్రవర్తించిన ఎడల అతను దుర్మార్గుడు. మరియు ఎవరైనా జకాత్ చెల్లించుట నిరాకరించిన యెడల వారికి విరుధ్ధంగా ధర్మ యుధ్ధం చేయడం జరుగును.

 

జకాత్ ప్రాముఖ్యతలు

1.     హృదయాన్ని మరియు ధర్మాన్నిశుభ్రపరచును. జకాత్ పన్నుకాదు. జకాత్ చెల్లించుటవలన ఆ ధనంలో శుభం మరియు అభివృధ్ధి కలుగును.
 

2.     తోటి మానవులపై దయ కలుగును, మరియు సమాజంలో ఏకత్వం పెంపొందును.
 
3.  ఎవరిపై అయితే జకాత్ విధిచేయబడినదో అతనికి పరీక్ష. అతను జకాత్ చెల్లించుట ద్వారా అల్లాహ్ కు సమీపమవుతాడు. మరియు అల్లాహ్ ఆజ్ఞను శిరసావహించిన వాడవుతాడు.

 

జకాత్ ఎప్పుడు విధి అగును

 1.     ముస్లిం జకాత్ ఇవ్వడం వలన శుభ్రత మరియు శుభం   ప్రాప్తమగును. అవిశ్వాసి అశుభృడు.
 2.     స్వతంత్రుడై ఉండాలి. వేరే వారిపై ఆధారపడి ఉండరాదు.
 3.     జకాతు చెల్లించడానికి కావలసిన నిర్ణీత పరిమితి (నిసాబ్) – పూర్తి అయి ఉండాలి.
 4.     సమాజంలో శాంతిబధ్రతలు ఉండాలి మరియు ఆ ధనంలో వేరేవారి హక్కు ఉండరాదు.
5.     ఒక సంవత్సరము పూర్తి కావాలి.

  ఉపవాసము – దాని ప్రాముఖ్యత వేకువ ఝాము నుండి (ఫజ్ర్ అజాన్ కు కొంచెం ముందు నుండి) సూర్యుడు అస్తమించే వరకు (మగ్రిబ్ అజాన్ వరకు) తినడం, త్రాగడం...

 

ఉపవాసము – దాని ప్రాముఖ్యత


వేకువ ఝాము నుండి (ఫజ్ర్ అజాన్ కు కొంచెం ముందు నుండి) సూర్యుడు అస్తమించే వరకు (మగ్రిబ్ అజాన్ వరకు) తినడం, త్రాగడం మరియు భార్యతో సంభోగము నుండి ఆగి ఉండుట.


          సియాం :ధార్మికపరమైన అర్థము

వేకువ ఝాము నుండి (ఫజ్ర్ అజాన్ కు కొంచెం ముందు నుండి) సూర్యుడు అస్తమించేవరకు (మగ్రిబ్ అజాన్ వరకు) తినడం, త్రాగడం మరియు భార్యతో సంభోగము నుండి ఆగి ఉండుట.

 

అల్లాహ్ సియాంని విధిగావించెను

 “ఓ విశ్వసించిన ప్రజలారా ఉపవాసాలు (సియామ్) మీ కొరకు విధిగా నిర్ణయించబడింది. ఏవిధంగా నైతే మీకు పూర్వం వారిపై కూడా విధించబడిందో. దీనివల్ల మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది.” (2: 183)

 
“ఖుర్’ఆన్ రమదాన్ నెలలో అవతరించబడింది.మానవులందరికీ మార్గదర్శకం, ఋజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్ఠమైన ఉపదేశాలు అందులో ఉన్నాయి. కనుక ఇకనుండి రమదాన్ నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా ఉపవాసం ఉండాలి.” (2:185)

 

ఇస్లాంలో మూలస్థంబాలు

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు:

”ఇస్లాం యొక్క పునాది 5 స్థంభాలపై ఉంచబడినది 1). ఎవ్వరూ ఆరాధనకు అర్హులు లేరు ఒకే ఒక అల్లాహ్ తప్ప, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, 2) సలాహ్ ని స్థాపించుట, 3) జకాహ్ (విధిదానం) చెల్లించుట, 4) హజ్ చేయుట, 5) రమదాన్ నెల ఉపవాసములు ఉండుట.”బుఖారీ– ముస్లింహదీస్ గ్రంథాలు

 

ఉపవాసము ఉండుట వలన కలిగే లాభములు

ఎన్నో విశ్వాసపు లాభములు మరియు ఆరోగ్య లాభములు కలవు.

1.     చెడు అలవాట్ల నుండి దూరం కాగలము. దైవ భక్తి పెంపొందును.

2.     పరలోక భీతి

3.     సహనం ఓపిక పెంపొందుట

4.     బీదలపై కరుణాకటాక్షాలు పెరిగి, మానవత్వ ఏకీభావం పెంపొందుట.

5.     అతిగా భుజించడాన్ని తగ్గించి, జీర్ణశక్తి పెంపొందును.

6.     అల్లాహ్ యొక్క భయభక్తులు పెంపొందును.


“ఉపవాసము నరకము నుండి రక్షించు ఢాలు.”బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

 

అల్లాహ్ ప్రసన్నత కోసమే  ఉపవాసాలు


అబూ హురైరా రజి యల్లాహు అన్హు గారి ఉల్లేఖనం “ఎవరైతే రమదాన్ యొక్క ఉపవాసాలు అల్లాహ్ స్వీకరణ కొరకు మాత్రమే పాటించారో అతని మునుపటి పాపాలన్నీ క్షమించబడును” అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఉద్బొధించారు” బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

 

తరావీహ్,తహజ్జుద్

అబూ హురైరా రజి యల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బొధించారు: “ఎవరైతే రమదాన్ నెలలో ఖియాం చేసారో (అంటే తరావీహ్ గానీ తహజ్జుద్ గాని చదివారో) అల్లాహ్ యొక్క స్వీకరణ యొక్క సంకల్పంతోనే వారి మునుపటి పాపములు క్షమించబడును.”బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

 

ఉపవాసపు ప్రతిఫలం

అబూ హురైరా రజి యల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఇలా ఉద్బోధించారు: “అల్లాహ్ ఈ విధముగా ఉపదేశించాడు: “ఆదం సంతతి యొక్క ప్రతి కార్యము తన కొరకు. కాని ‘సౌమ్’ (ఉపవాసము) నా కొరకు. నేను దాని ప్రతిఫలం నొసగుతాను.” ఉపవాసము ఒక ఢాలు. మీలో ఎవరైనా ఉపవాసం ఉన్న యెడల అతను భార్యతో కలువరాదు, తప్పుడు మాటలు పలుకరాదు, ఎవరైన వచ్చి అతనిని తిట్టినా, పోట్లాడినా అతనితో “నేను ఉపవాసము ఉన్నాను” అని చెప్పి తప్పించుకోవాలి.ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రాణం ఎవరి చేతిలో ఉందో, ఆయన(అల్లాహ్) సాక్షిగా, ఉపవాసి యొక్క నోటి వాసన అల్లాహ్ దగ్గర కస్తూరి సువాసన కంటే ఎంతో ఉత్తమమైనది. ఉపవాసి రెండు సౌఖ్యాలు పొందుతాడు. ఒక సౌఖ్యం ఇఫ్తార్ సమయంలో పొందుతాడు, రెండవది తన ప్రభువును కలుసుకున్నపుడు.”బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

 

స్వర్గద్వారములు 

అబూ హురైరా రజి యల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఇలా ఉద్బోధించారు: “రమదాన్ మాసపు ప్రారంభముతో స్వర్గ ద్వారములన్నీతెరువబడును.”బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

 

రమదాన్ నెల ప్రారంభమును తెలుసుకునే విధానము

రమదాన్ మాసపు క్రొత్త నెలవంకను చూడటం, లేదా ఎవరైనా చూసిన వ్యక్తి సాక్ష్యం పలకటం ద్వారా రమదాన్ మాసము ప్రారంభమగును.  (సూరా 2:185)

 

 “ఎవరైతే రమదాన్ మాసాన్ని పొందుతారో, వారు ఉపవాసం ఉండాలి.” (2:185)

 

నెలవంక

అబూ హురైరా రజి యల్లాహు అన్హు ఇలా ఉల్లేఖించారు: “ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఇలా ఉద్బోధించారు: “రమదాన్ మాసపు ఉపవాసములు నెలవంకను చూసి ప్రారంభించండి, మరియు వేరే మాసపు నెలవంకను చూసిన తరువాత విరమించుకండి.”బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలు

 

30 రోజుల ఉపవాసం

ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ఉద్బోధించారు: “ఆకాశములో మేఘాలు కమ్ముకుని ఉండి మీకు నెలవంక కానరాని యెడల మాసపు 30 రోజులు పూర్తిచేయండి.”(ఇది షాబాన్ మరియు రమదాన్ నెలలకు వర్తిస్తుంది)

 

రమదాన్ మాసము పూర్తి అగుటకు 30 రోజులైనా పూర్తి అవ్వాలి లేదా 29 రోజుల తరువాత కొత్తనెలవంకనైనా చూడాలి, లేదా కనీసం ఇద్దరు సత్యవంతులైన ముస్లింలు నెలవంకని స్పష్టంగా చూచినట్లు సాక్ష్యం అయినా ఇవ్వాలి. ముస్లిం హదీసు గ్రంథం

  సాక్ష్యం షహాదహ్ అంటే అరబీ వచనమైన لا إلــه إلاالله محمد رسول الله - అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం ఏదీ లేదు, ముహమ్మద్ (పై అల్లాహ్ శాంతి కలుగుగ...

 సాక్ష్యం

షహాదహ్ అంటే అరబీ వచనమైన لا إلــه إلاالله محمد رسول الله - అల్లాహ్ తప్ప ఆరాధ్యదైవం ఏదీ లేదు, ముహమ్మద్ (పై అల్లాహ్ శాంతి కలుగుగాక) ఆయన దైవప్రవక్త అని సాక్షమివ్వడం.


దీనినే ఇస్లాం ధర్మ ధృవీకరణ, స్వికరణ వచనం కూడ అంటారు.


షహాదహ్ నిర్వచనం

అష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్ హదు అన్నముహమ్మదర్రసూలుల్లాహ్”అని అర్ధం.అంటే “నేను సాక్షం ఇస్తున్నాను - అల్లాహ్ తప్ప ఆరాధ్య దైవం ఎవరూ లేరు మరియు నేను సాక్షం ఇస్తున్నాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశహరులు."


షహాదహ్ వివరణ

“అష్ హదు= నేను సాక్ష్యమిస్తున్నాను, అల్లా ఇలాహ= (వాస్తవమైన) ఆరాధ్యుడు ఎవడూ లేడు, ఇల్లల్లాహు= కేవలం ఒక్క అల్లాహ్ తప్ప, వ= మరియు, అష్ హదు అన్న= నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మదుర్రసూలుల్లాహ్= ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లం) అల్లాహ్ యొక్క సందేశహరులు.

ప్రపంచంలో ఏ ప్రాంతం వారైనా, పెద్ద చిన్న తేడా లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా, బీద గొప్ప తారతమ్యం లేకుండా, ఏ మతం,కులం లేక ఏ జాతి వారైనా సరే“ వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు ఒక్క అల్లాహ్ తప్ప మరియు ముహమ్మద్(సల్లల్లాహుఅలైహివసల్లం) అల్లాహ్ యొక్క సందేశహరులు” అని సాక్ష్యమిచ్చినట్లైతే వారు ఇస్లాం ధర్మం స్వీకరించినట్లు, అంటే సర్వలోక సృష్టికర్త అయిన అల్లాహ్ కు స్వయంగా సమర్పించుకున్నట్లుగా పరిగణింపబడుతారు.

షహాదహ్ ప్రాముఖ్యత

అనేకమంది ప్రజలు ఇస్లాం మొట్టమొదటి మూలస్థంభమైన – లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్రసూలుల్లాహ్ అసలు భావం గ్రహించటం లేదని తెలుస్తున్నది. కాబట్టి ఈ మహోన్నత వచన భావాన్ని స్పష్టంగా తెలుసుకోవటం చాలా అవసరం. షహాదహ్ ఒక వ్యక్తి జీవితాన్ని మంచి దారిలోనికి ఎలా మళ్ళిస్తుందో, ఇహపరలోకాల సాఫల్యపు జీవనమార్గంపై ఎలా నడిపిస్తుందో, ఇస్లాం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన వచనమిది.

                                                                        

షహాదహ్ నిబంధనలు

మొదటి నిబంధన: జ్ఞానము(అల్ ఇల్మ్)

ప్రతీ ముస్లిం షహాదహ్ అంటే ఏమిటో కనీసపు ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా కలిగి ఉండాలి. షహాదహ్ ఏ విషయాన్నిధ్రువపరుస్తున్నదో, దేనిని ఖండిస్తున్నదో మరియు దేనిని నిరాకరిస్తున్నదో బాగా అర్థం చేసుకోవాలి.


రెండవనిబంధన: విశ్వాసము(అల్ యఖీన్)

ఇది“సందేహం” లేదా“లోపభూయిష్టమైన విశ్వాసం” అనే దానికి పూర్తిగా వ్యతిరేకం.


నిజానికి ఇస్లాంలోఖుర్ఆన్ మరియు సున్నతులలో అభిప్రాయ బేధాలు లేకుండా ధృవపర్చబడిన ఏ ఒక్క విషయంలోనైనా సందేహించడం“కుఫ్ర్” (దైవవిశ్వాసాన్నితిరస్కరించడం)తో సమానం. ప్రతి ముస్లిం తన మనసులో షహాదహ్ యొక్క వాస్తవం మరియు యదార్థం పట్ల, సంపూర్ణంగా, బేషరతుగా, కల్తీలేని విశ్వాసం కలిగి ఉండాలి. “అల్లాహ్ తప్ప ఆరాధనలకు వేరేవారెవ్వరు అర్హులు కారు” అని సాక్ష్యమిచ్చే విషయంలో మనసు నిలకడగా ఉండాలి. అల్లాహ్ నిజమైన విశ్వాసుల పట్ల సూరా హుజురాత్ 49:15 లో ప్రస్తావించాడు “ఎవరైతే అల్లాహ్ ను విశ్వసిస్తారో, వారి హృదయాలు ధృడంగా ఉంటాయి” అని అభివర్ణించాడు. 


మూడవనిబంధన: స్వీకారం( అల్ఖబూల్)

ఒక వ్యక్తి షహాదహ్ యొక్క పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉండి, షహాదపై తన యొక్క విశ్వాసంలో నిశ్చలత్వాన్ని కలిగి ఉంటే, అటువంటి పరిపూర్ణ సుస్థిర విశ్వాసంతో అతను షహాదాను నాలుకతో ఉఛ్ఛరించి షహాద సూచించే, బోధించే ప్రతి దానిని మనస్పూర్తిగా స్వీకరించాలి. ఎవరైతే షహాదను మరియు షహాద సూచించే, బోధించే వాటన్నిటినీ స్వీకరంచడానికి నిరాకరిస్తారో, వారు షహాదహ్ యొక్క పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ షహాదహ్ యొక్క సత్యత పట్ల పరిపూర్ణ సుస్థిర విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, వారు అవిశ్వాసులు(అవిశ్వాసులుగానే పరిగణింపబడతారు). ఈ విధంగా నిరాకరించడానికి గర్వం, అహంకారం, అసూయ లాంటివి ఏవైనా కారణాలు కావచ్చు. కానీ ఎటువంటి సందేహ సంశయాలు లేకుండా నిరభ్యంతరంగా, స్వీకరించనంతవరకు షహాదహ్(ఎన్ని సార్లు ఉఛ్ఛరించినా) నిజమైన షహాదగా పరిగణించబడదు.


నాలుగవనిబంధన : విధేయత(అల్ఇన్ఖియాద్):

ఈ నాలుగవ నిబంధన, వాస్తవంగా ఒక ముస్లిం తన పనుల ద్వారా, చేతల ద్వారా తాను ఉఛ్ఛరించిన షహాద పట్ల నిర్వహించవలసిన పాత్రను సూచిస్తాడు. “ఇస్లాం” అనే పదానికి ఉన్న ముఖ్యమైన అర్థాలలో ఇది కూడా ఒకటి “అల్లాహ్ యొక్క అభీష్ఠానికి, సంకల్పానికి, ఆజ్ఞలకు, అధికారానికి తన ఇష్టాయిష్టాలను సమర్పించుకోవడం”. ఈ విషయాన్ని ఖుర్ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు. “వ అనీబూ ఇలా రబ్బికుమ్ వ అస్లిమూలహూ” సూరా జుమర్ 39:54


ఐదవ నిబంధన : సత్యసంధత( అస్సిద్ఖ్)

సత్యసంధత అంటే “మోసం, వంచన, దగా, కపటత్వం, నిజాయితీ లేకపోవడం”అనే వాటికి వ్యతిరేకం అని అర్థం. అంటే ఒక వ్యక్తి షహాదా ఉఛ్ఛరిస్తున్నాడు అంటే, అలా ఉఛ్ఛరించడంలో వాస్తవంగా అతని నిజాయితీ, సంకల్పం, నిర్ణయం సమ్మిళితమై ఉండాలి. షహాదహ్(విశ్వాసపు ప్రకటన) ను ఉఛ్ఛరించడం సరదాకో, ఎవరినో మోసం చేయడానికో, కేవలం నటన కొరకో లేదా ఆట పట్టించడానికో కానిదై ఉండాలి.


ఆరవ నిబంధన : చిత్తశుధ్ధి (అల్ఇఖ్లాస్)

ఎవరైనా షహాదా(విశ్వాసపు ప్రకటన) ను బహిరంగంగా స్వీకరించడం లేదా ప్రకటించడం అనేది జరిగితే, అలా ప్రకటించడం యొక్క ఏకైక లక్ష్యం కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే అయి ఉండాలి. అంతేకాని వేరే ఏ కారణం కోసమో, లేక ఇంకెవరినైనా సంతోషపర్చడం కోసమో అయి ఉండకూడదు. ఈ విధంగా షహాదా కు సంబంధించినంత వరకు“పవిత్రత”లేక “స్వఛ్ఛత”అంటే షిర్క్ కు వ్యతిరేకం లేదా “అల్లాహ్ యొక్క ఏకత్వం లో మరొకరికి సాటి కల్పించడం”అనేదానికి వ్యతిరేకం అని అర్థం. ఎవరైనా ముస్లింగా మారడం, ముస్లింగానే మిగిలి పోవడం అనేది కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే. ఆయనను ఆరాధించడం, ఆయనను సేవించడం కోసం, ఆయన ఆగ్రహానికి, ఆయన విధించే శిక్షకు గురి కాకుండా ఉండడం కోసం, కేవలం ఆయన యొక్క కరుణ పొందడం కోసం, ఆయన అందజేసే బహుమతులను పొందడం కోసం మాత్రమే అయి ఉండాలి.

ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా ప్రకటిస్తున్నాడు “ఫ'బుదిల్లాహ ముఖ్లిసన్ లహుద్దీన్” సూరా జుమర్ 39:2


ఏడవ నిబంధన : ప్రేమ(అల్ ముహాబ్బహ్)

ప్రేమాభిమానాలు అంటే విశ్వాసి షహాదను ప్రేమిస్తున్న వాడై ఉండాలి. అతని ప్రేమ షహాదాతో సంబధ్ధత కలిగి ఉండాలి (అసంబధ్ధమైనదై ఉండకూడదు). షహాదా సూచించే, ధ్వనింపజేసే నిర్దేశాలను ప్రేమిస్తున్న వాడై ఉండాలి. అంతే కాకుండా ఎవరైతే షహాదహ్ ఉఛ్ఛరించి దాని ప్రకారం తమ జీవితాన్ని గడుపుతున్నారో, షహాదహ్ ఆధారంగా (అల్లాహ్ మార్గంలో) శ్రమిస్తున్నారో వారందరినీ ప్రేమించాలి వారందరి పట్ల స్నేహం, వాత్సల్యం, మక్కువ కలిగి ఉండాలి. ఇది షహాదా కు సంబంధిచిన అత్యవసరమైన నిబంధన. ఒక వ్యక్తి షహాదాను ఉఛ్ఛరించి కూడా, అతనిలో షహాదా పట్ల, షహాదా ప్రాతినిధ్యం వహించే విషయాల పట్ల ప్రేమ, అభిమానం, మక్కువ లేనట్లైతే, నిజానికి అతని విశ్వాసం సంపూర్ణమైన విశ్వాసం కాజాలదు. ఒక నిజమైన విశ్వాసిలో ఉండవలసిన విశ్వాసం కాజాలదు. ఒకవేళ అతనిలో షహాదా పట్ల ప్రేమ లేనట్లయితే, ఇంకా ఒకవేళ అతనిలో షహాదా పట్ల ద్వేషభావం గానీ ఉన్నట్లైతే, అతను షహాదాను వ్యతిరేకించినట్లే.

నిజమైన విశ్వాసి తన ప్రేమలో ఎవరినీ అల్లాహ్ కు సాటిగా నిలబెట్టడు. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడు “వమినన్నాసి మఁయత్తఖిజూ మిన్ దూనిల్లాహి అన్ దాదఁయుహిబ్బూనహుం కహుబ్బిల్లాహి వల్లజీన ఆమనూ అషద్దు హుబ్బల్లిల్లాహ్”సూరా బఖరా 2:165


ఎనిమిదవ నిబంధన: మిధ్యా దైవాలను నిరాకరించుట(అల్ బరాఆహ్)

షహాదహ్ ఉఛ్ఛరించి, ఇస్లాంను తన ధర్మంగా స్వీకరించిన వ్యక్తి అల్లాహ్ తప్ప వేరే దైవం లేడని భావించి తాను అంతవరకూ పూజిస్తూ, ఆరాధనలను అర్పిస్తూ వచ్చిన ప్రతి దేవీ దేవతా వస్తువు, ప్రతిమ, వ్యక్తి, ఆకృతి, అన్నింటినీ తిరస్కరిచాలి.

షహాదా సాక్ష్యపు వాక్యంలోనే “అల్లాహ్ తప్ప వేరే ఎవ్వరూ ఏ విధమైన ఆరాధనలకు అర్హులు కారు” అనే విషయం విశదమవుతున్నప్పటికీ,షహాదాను ఉఛ్ఛరించే చాలామందికి ఈ విషయంలో స్పష్టత లేదు అనే విషయం వాస్తవం. 

సూరా అల్ బఖరా లో అల్లాహ్ –ప్రతి ముస్లిం అత్యంత ముఖ్యమైన ఈ దృక్పథాన్ని కలిగి ఉండడాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. షహాదహ్ అంటే కేవలం “అంగీకారం” మాత్రమే కాదు


“అంగీకారం” తో పాటు “తిరస్కారం” కూడా. అల్లాహ్ ఈ విధంగా అంటున్నాడుః

కనుక ఇక నుండి మిథ్యాదైవాలను నిరాకరించి కేవలం అల్లాహ్ ను మాత్రమే విశ్వసించినవాడు ఎన్నటికీ ఏమాత్రం చెక్కుచెదరని దృఢమైన ఆశ్రయం పొందినట్లే. అల్లాహ్ సర్వం వినేవాడు, సమస్తం తెలిసినవాడు. సూరా బఖరా 2:256


తొమ్మిదవ నిబంధన: చివరి శ్వాస వరకు షహాదహ్ను విడవక పోవడం

ప్రతి ముస్లిం తన ప్రాణం పోయేంత వరకు షహాదాపై నిలకడగా ఉండడం తీర్పుదినం నాడు సాఫల్యం పొందడానికి ఒక తప్పనిసరి అంశం. ఈ ప్రపంచంలో అతను ఎన్ని మంచి పనులు చేశాడు, ఎంతగా కీర్తిప్రతిష్టలు సంపాదించాడు అనే అంశాలు అక్కడ ప్రాధమిక స్థాయికి చెందినవి కావు. నిజానికి ప్రతి ముస్లిం తన జీవితాన్నంతా ఈ జెండా (ఈ ధ్వజం) క్రిందనే గడపడం, తన జీవితమంతా ఈ ధ్వజాన్ని మాత్రమే చెబుతూ గడపడం ముఖ్యం. ఖుర్'ఆన్ లో అల్లాహ్ ఈ విధంగా ప్రకటిస్తున్నాడుః “యా అయ్యుహల్లజీన ఆమనుత్తఖుల్లాహ హఖ్ఖతుఖాతిహి –వలా తమూతున్న ఇల్లా వ అన్తుమ్ ముస్లిమూన్” అనగా “విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా భయపడండి. అల్లాహ్ కు పూర్తిగా అంకితమై ముస్లింలుగా ఉన్న స్థితిలో తప్ప (అవిశ్వాసులుగా) మరణించకండి” సూరా ఆలి ఇమ్రాన్ 3:102


 

  ప్రముఖ ముస్లిమేతరులు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమన్నారు మైఖేల్ హె చ్ ఆర్ట్ నేను ప్రపంచంలోని అత్యంత ప్రభావ శీల వ...

 ప్రముఖ ముస్లిమేతరులు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఏమన్నారు


మైఖేల్ హె చ్ ఆర్ట్

నేను ప్రపంచంలోని అత్యంత ప్రభావ శీల వ్యక్తుల్లో ముహమ్మద్ ప్రవక్త కు మొట్టమొదటి ప్రాధాన్యత నివ్వడం కొంత మంది పాఠకులకు కొంత ఆశ్చర్యమూ, మరికొంతమందికి ప్రశ్నార్తకము కావచ్చు. కాని చరిత్ర మొత్తంలో ఈ ఒక్క వ్యక్తీ మాత్రమే ఆధ్యాత్మికంగాను,లౌకికంగాను మహోన్నతమైన,అపూర్వమైనా విజయాలు సాధించారు. ఆయన వ్యక్తిత్వం చరిత్రలో ఎవరికి సరిపోలనిది కావడం మూలంగానే ఆయన్ని నేను అత్యంత ప్రభావశీల ఏకైక వ్యక్తిగా భావిస్తున్నాను


 


అనిబిసెంట్ (ది లైఫ్ టీచింగ్స్ అఫ్ ముహమ్మద్)

ఆరేబియాకు చెందిన ఆ గొప్ప ప్రవక్త గురించి అధ్యయనం చేసిన వారికి , ఆయన ఎలా భోధించారో ఎలా జీవించారో,తెలిసిన వారికి ఆయన పట్ల ఆదరభావం తప్ప మరో భావం కలగడం ఆసాధ్యం. ఆయన మహోన్నత ప్రవక్త. ప్రభువు పంపిన గొప్ప సందేశహరులలో ఒకరు . నేను మీ ముందు ఉంచుతున్న వాటిలో చాలా విషయాలు మీకు తెలిసే ఉంటాయని నేను అనుకుంటాను. అయినా నా అనుభవం ఏమిటంటే ఆ విషయాలను నేను పునరధ్యాయనం చేసినప్పుడల్లా మహానీయుడైనా ఆ అరబ్బు భోదకుని పట్ల ఓ క్రొత్త ప్రశంసా భావం ఓ క్రొత్త ఆదరభావం ఏర్పడుతుంది నాలో.  


 


ప్రో రామకృష్ణ రావు మైసూర్ (యూనివర్సిటిలో తత్వశాస్త్రంలో రిటైర్డ్ ప్రొఫెస్సర్)

ముహమ్మద్ ప్రకటించిన విశ్వజనీన సోదరత్వ సిద్దాంతం, మానవ ఏకత్వపు భావన, మానవాళి సామాజిక ప్రగతి కొరకు ఆయన అందజేసిన గొప్ప వర ప్రసాదాలు. ఈ ధర్మాలను ప్రపంచంలోని గొప్ప మతాలన్నీ భోధించాయి. కాని,ఇస్లాం ప్రవక్త ఈ సిద్దాంతాలను వాస్తవ ఆచరణలో పెట్టారు. అయితే దాని విలువను మానవాళి బహుశ ఇకపైనే గుర్తించగల్గుతుంది. అంతర్జాతీయతా స్ఫూర్తి జాగృత మయినప్పుడు, పటిష్టమయిన మానవ సౌబ్రాత్రభావన ఉనికిలోనికి వచ్చినప్పుడు, దీనికి గుర్తింపు లభిస్తుంది.


 


లా మార్టిన్ హిస్టోరి డి లా టర్కీ ఫారిస్ 1854 vol.II PP 276-77

ఈ సిద్దాంతంలో రెండు అంశాలున్నాయి. దేవుని ఏకత్వం, దేవుడు నిరాకారుడన్న భావం. మొదటిది దైవమేంటో తెల్పుతుంది. రెండవది దేవుడు ఏమికాడో తెల్పుతుంది. ఒకటేమో మిధ్యా దేవుళ్ళను పడదోస్తే రెండవది మాటలతో భావాన్ని నిర్మిస్తుంది. తత్వవేత్త ఉపన్యాసకుడు, మత ప్రచారకుడు, శాసనకర్త, యుద్దవీరుడు, భావాల విజేత హేతుబద్ధ సిద్దాంతాలు, విగ్ర రహిత మత విధానాల నిర్మాత, ఇరవై ఇహలోక సామ్రాజ్యాలు, ఓ ఆధ్యాత్మిక సామ్రాజ్య ఆవిష్కర్త ఆయనే ముహమ్మద్, మానవుని ఔన్నాత్యానికి సంబంధించిన అన్ని ప్రమాణాలతో కొలిచి, ఆయన్ను మించిన వారెవరన్నా ఉన్నారా? అని మనం ఆశ్చర్యపోతాం!


 


మేధావి అన్నాదోరై (మద్రాసు నగరంలో మహానగర తీరాన)

మన సమాజంలో వివేకాన్ని మేలుకొలువ వలెనని మాలాంటి వారు హెచ్చరించినపుడు, మమ్మల్ని తరిమి తరిమి కొట్టి దూరంగా పొమ్మంటున్నారు. అయితే పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం , రకరకాల దేముళ్లను, పలు దేవతా విగ్రహాలను పూజించే టటు వంటి ప్రజలకి-“నువ్వు మొక్కవలసినది ఈ విగ్రహానికి కాదు, నువ్వు వెల్ల వలసింది ఈ కోవెలకు కాదు “అని చెప్పగల గుండె ధైర్యంతో, అందులోనూ అటువంటి మోటు మనుషులకి తమ సందేశాన్ని, ఆత్మస్థైర్యంతో సిద్దాంత పూర్వకంగా చెప్పగలిగారు. అందుకనే ఆయనని మహోన్నత వ్యక్తీ అని గౌరవించి , అభిమానిస్తున్నాను. ఆనాడు మహా ప్రవక్త ప్రేరణ వల్ల కలిగిన ఆత్మ బలం, ఇప్పుడు, ఈనాడు ఆ మార్గం స్వీకరించిన వారికి కూడా వున్నదీ అంటే- అందుకు ఆశ్చర్యపడనక్కర లేదు

  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు పూర్వం ప్రపంచం ఎలా ఉండేది   అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక...

 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు పూర్వం ప్రపంచం ఎలా ఉండేది
 

అంధకారం నుంచి వెలుగు వైపుకు తీసుకువస్తారు

అనగా అల్లాహ్ యొక్క స్పష్టమైన వాక్యాలను (ఆదేశాలను)చదివి వినిపించి, విశ్వసించి సత్కార్యాలు చేసినవారిని ఆయన కారు చీకట్లలో నుండి వెలుగులోనికి తీసుకువచ్చేoదుకు ఒక ప్రవక్తను పంపాడు . మరేవరైతే అల్లాహ్ ను విశ్వసించి సదాచారణ చేస్తారో వారిని అల్లాహ్ క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ)వనాలలో ప్రవేశింపజేస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు . నిశ్చయంగా అల్లాహ్ అతనికి అత్యుత్తమ ఉపాధిని వొసాగాడు. ( సూరె అత్ తలాఖ్ 65 :11 )


 

  ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎందుకు అనుసరించాలి అవతరించినదాన్నే అనుసరించమని ఆయనకు ఆజ్ఞ వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి ...

 ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎందుకు అనుసరించాలి


అవతరించినదాన్నే అనుసరించమని ఆయనకు ఆజ్ఞ

వారి ముందు స్పష్టమైన మా వాక్యాలను చదివి వినిపించినప్పుడు, మమ్మల్నికలిసే నమ్మకం లేనివారు ''ఇది తప్ప వేరొక ఖుర్‌ఆన్‌ను తీసుకురా లేదా ఇందులో కొంత సవరణ చెయ్యి'' అంటారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ''నా తరఫున ఇందులో సవరణ చేసే అధికారం నాకే మాత్రం లేదు. నా వద్దకు 'వహీ' ద్వారా పంపబడే దానిని నేను(యధాతథంగా) అనుసరించేవాణ్ణి మాత్రమే. ఒకవేళ నేను గనక నా ప్రభువు పట్ల అవిధేయతకు పాల్పడినట్లయితే ఒక మహాదినమున విధించబడే శిక్షకు భయపడుతున్నాను.'' ''అల్లాహ్‌ కోరితే దీన్నినేను మీకు చదివి వినిపించటంగానీ, అల్లాహ్‌ దాని గురించి మీకు తెలియజేయటంగానీ జరిగి ఉండేదే కాదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను నా జీవితకాలంలో ఓ పెద్దభాగం మీ మధ్యనే గడిపాను. అసలు మీరు బుద్ధిని ఉపయోగించరా?'' అని అడుగు.

సూరా యూనుస్ 10:15 ,16



(ఓ ప్రవక్తా!) బహుశా నీ వద్దకు పంపబడే వహీలో ఏదైనా భాగాన్నివదలివేస్తావేమో! ''ఇతనిపై ధనాగారం ఎందుకు అవతరించలేదు? పోనీ, ఇతనితోపాటు దైవదూత అయినా ఎందుకు రాలేదు?'' అని వారు చెప్పే మాటలు నీకు మనస్తాపం కలిగించినట్లున్నాయి.చూడు! నువ్వు భయపెట్టే వాడివి మాత్రమే. అన్ని విషయాలకు బాధ్యుడు అల్లాహ్‌. 

 ఏమిటీ, అతనే (ప్రవక్తే) ఈ ఖురానును కల్పించుకున్నాడని వాళ్ళంటున్నారా? ''మరైతే మీరు కూడా ఇలాంటి పది సూరాలు కల్పించి తీసుకురండి. మీరు సత్యవంతులే అయితే, అల్లాహ్‌ను తప్ప మీరు పిలువగలిగితే దీని సహాయం కోసం ఎవరినైనా పిలుచుకోండి'' అని(ఓప్రవక్తా!) వారికి చెప్పు.

 మరి వారు గనక మీ సవాలును స్వీకరించకపోతే, ఈ ఖుర్‌ఆన్‌ దైవజ్ఞానంతో అవతరింపజేయబడిందనీ, ఆయన తప్ప మరో ఆరాధ్యదైవం లేనేలేడని తెలుసుకోండి. మరి ఇప్పుడైనా మీరు ముస్లింలవుతారా?

సూరా హూద్ 11:12-14



 వారికి చెప్పు: "నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (రేపు) నా పట్లా, మీ పట్లా జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని(వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే." సూరా ఆహఖాఫ్ 46:9

ఆయన్ని విశ్వసించాలని ఆజ్ఞ

అల్లాహ్‌ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ''నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి'' అని చెప్పాడు. తరువాత ఆయన, ''ఈ విషయాన్నిమీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?'' అని ప్రశ్నించగా, ''మేము ఒప్పుకుంటున్నాము'' అని అందరూ అన్నారు. ''మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతో పాటు నేనూ సాక్షిగా ఉంటాను'' అని అల్లాహ్‌ అన్నాడు. సూరా ఆలి ఇమ్రాన్ 3:81

సాక్షిగా, శుభావార్తాహరునిగా, హెచ్చరికచేసేవారుగా పంపబడ్డారు

అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించరాదు (అని వాటిలో చెప్పబడింది). నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని. సూరా హూద్ 11:2

''నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే'' అని వారికి చెప్పు. సూరా అల్ హిజ్ర్ 15:89


(ఓ ముహమ్మద్‌ - సఅసం!) నువ్వు హెచ్చరించే వారిలోని వాడవుకావటానికి ఇది నీ హృదయంపై అవతరించింది. సూరా ఆష్ షుఅరా 26:194


 ఓ ప్రవక్తా! నిశ్చయంగా మేమే నిన్ను (ప్రవక్తగా ఎన్నుకుని) సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తలు వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. సూరా అల్ ఆహ్ జాబ్ 33:45


(ఓ ముహమ్మద్‌!) మేము నిన్ను సమస్త జనులకు శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. అయితే జనులలో అధికులకు ఈ విషయం తెలియదు. సూరా నబా 34:28


(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. సూరా అల్ ఫత హ్ 48:8

విశ్వాసుల సాక్షి

అదే విధంగా మేము మిమ్మల్ని ఒక ''న్యాయశీల సమాజం'' (ఉమ్మతె వసత్‌)గా చేశాము- మీరు ప్రజలపై సాక్షులుగా, ప్రవక్త(సల్లల్లాహుఅలైహివసల్లం) మీపై సాక్షిగా ఉండటం కోసం (మేమిలా చేశాము.) ప్రవక్తకు విధేయత చూపటంలోఎవరు నిజాయితీపరులో, మరెవరు వెనుతిరిగిపోయేవారో తెలుసుకునే(పరీక్షించే) నిమిత్తమే మేము, పూర్వం నీవు అభిముఖుడవై ఉండిన దిశను మీ 'ఖిబ్లా'గా నిర్ధారించాము. ఇదెంతో కష్టమైన విషయమే అయినప్పటికీ అల్లాహ్‌ సన్మార్గం చూపిన వారికి (ఏ మాత్రం కష్టతరం కాదు). అల్లాహ్‌ మీ విశ్వాసాన్ని వృధా కానివ్వడు. నిశ్చయంగా అల్లాహ్‌ (తన దాసులైన) మానవుల యెడల అమితమైన వాత్సల్యం కలవాడు! పరమకృపాశీలుడు. సూరా అల్ బఖర 2:143


 


కేవలం హెచ్చరించేవారు మాత్రమే

ఏమిటీ, తమ సహవాసిపై ఏమాత్రం ఉన్మాద ప్రభావం లేదన్నవిషయాన్ని గురించి వారు ఆలోచించలేదా? అతను స్పష్టంగా హెచ్చరించేవాడు మాత్రమే (అతను ఎంత మాత్రం ఉన్మాది కాడు).

సూరా అల్ ఆరాఫ్ 7:184  


(ఓ ప్రవక్తా! వారికి) చెప్పు: ''అల్లాహ్‌ తలచినంత మాత్రమే తప్ప నేను సయితం నా కోసం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చుకునే అధికారం నాకు లేదు. నాకే గనక అగోచర విషయాలు తెలిసివుంటే నేనెన్నో ప్రయోజనాలు పొంది ఉండేవాణ్ణి. ఏ నష్టమూ నాకు వాటిల్లేది కాదు. నిజానికి నేను విశ్వసించేవారికి హెచ్చరించేవాణ్ణి, శుభవార్తలు అందజేసేవాణ్ణి మాత్రమే.'' సూరా అల్ ఆరాఫ్ 7:188


అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించరాదు (అని వాటిలో చెప్పబడింది). నేను ఆయన తరఫున మిమ్మల్ని భయపెట్టేవాడిని, మీకు శుభవార్తను వినిపించేవాడిని. సూరా హూద్ 11:2


''నేను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే'' అని వారికి చెప్పు. సూరా హిజ్ర్ 15:89


ఈయన పూర్వం హెచ్చరించిన ప్రవక్తల మాదిరిగానే హెచ్చరించే ప్రవక్త. సూరా అన్ నజ్మ్ 53:56


మఖామమ్ మహముదా (కీర్తించబడిన స్థానం) గలవారు

రాత్రిపూట కొంత భాగం తహజ్జుద్‌ (నమాజు)లో ఖుర్‌ఆన్‌ పఠనం చెయ్యి. ఇది నీ కొరకు అదనం. త్వరలోనే నీ ప్రభువు నిన్ను''మఖామె మహ్‌మూద్‌''కు (ప్రశంసాత్మకమైన స్థానానికి) చేరుస్తాడు. సూరా బనీ ఇస్రాయీల్17:79

Popular Posts